11, మార్చి 2025, మంగళవారం

తప్పక చేసిననూ యది

 *2042*

*కం*

తప్పక చేసిననూ యది

తప్పేయని యొప్పుకొనెడి తత్వము తో నా

తప్పును మరి చేయనపుడు

తప్పక నుతులొందగలవు ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పనిసరి పరిస్థితుల్లో చేసి ననూ తన తప్పు ను తప్పే అని వొప్పుకునే తత్వం తో ఆ తప్పు ను మరలా చేయకుండా ఉన్నచో తప్పకుండా నీవు ఈ భూలోకంలో ప్రశంసలు అందుకొనగలవు.

*సందేశం*:-- ఒక వ్యవస్థ లో ఉన్నత శిఖరాలు చేరడం కోసం తప్పు లు చేసినప్పుడు ఖచ్చితంగా నాది తప్పే అని ఒప్పుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండటం వలన నువ్వు గొప్ప వాడిగా కీర్తించబడెదవు. ఉదాహరణకు సినిమా రంగంలో ఎదుగుదల కు తప్పు లు చేసి తరువాత ఉన్నత స్థాయి చేరి కూడా అవేతప్పులు చేసే వారు నీచులు,ఆ తప్పు లను మరలా చేయకుండా ఉండే వారు గొప్ప వారు. ఇలా ఏ రంగంలో అయినా సరే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: