3, అక్టోబర్ 2020, శనివారం

మఖ నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు



    మఖ నక్షత్ర అధిపతి కేతువు. మేషరాశి అధిపతి కుజుడు. ఇది రాక్షసగణ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు. మఖ నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో మేష రాశి ఉంటుంది. రెండవ పాదములో వృషభ రాశి, మూడవ పాదములో మిధున రాశి, నాలుగవ పాదములో కర్కాటక రాశి ఉంటుంది.


మఖ నక్షత్ర మొదటి పాదము

కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అనుకున్నంత వేగంతోనే పూర్తిచే స్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి ఆద్యాత్మిక చింతన ఉంటుంది. ఏ కార్యమైనా దైవ నమ్మకంతో పూర్తి చేస్తారు. రాజ్యాంగ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


బాల్యంలోనే శుక్ర దశ రావడంతో వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసిన ఉంటుంది. 26 సంవత్సరాల వరకు జీవితం సుఖ సౌఖ్యాలతో సాగుతుంది. తరువాత కొంత సుఖం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాల రాహుదశ అనంతరం వచ్చే గురు దశ కారణంగా 67 సంవత్సరాల తరువాత జీవితం తిరిగి గాడిలోకి పడుతుంది. వృద్ధాప్యం ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుంది.

    

మఖ నక్షత్ర రెండవ పాదము

 వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. అలంకరణ వస్తువుల సేకరణ అంటే విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. బాల్యంలో వచ్చే శుక్రదశ కారణంగా కళారంగం అబ్బుతుంది. ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. కళా సంబంధిత వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.  


ఈ జన్మ నక్షత్రంలోని రెండవ పాదము వారికి 24 సంవత్సరాల వరకు సౌఖ్యవంతమైన జీవితం సాగుతుంది. ఆ తరువాత కొంత సుఖం కాస్త తగ్గినా 47 సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా 65 సంవత్సరాల తరువాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది.

  

మఖ నక్షత్ర మూడవ పాదము

  వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కనుక వీరు ఒక్కసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  


కేతు గ్రహ ప్రభావం వలన వీరు అత్యంత ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది. మూడవ పాదములో జన్మించిన వారికి కూడా చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ, సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది. 22 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కాస్త సౌఖ్యం తగ్గినా 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 


తరువాత 18 ఏళ్ల రాహుదశ కారణం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ 63 ఏళ్ల కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖసంతోషాలు మొదలవుతాయి. దీంతో వృద్ధాప్యం సాఫీగా సాగిపోతుంది.


మఖ నక్షత్ర నాలుగవ పాదము

వీరికి పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వీరికి పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ముత్యం, కాగితం, ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి.  


వీరికి 21 ఏళ్ల వరకు శుక్ర దశ ఉండటంతో జీవితం అప్పటి వరకు సాఫీగా సాగుతుంది. తరువాత కొంచెం సాఫీగా తగ్గినా 44 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ, 62 సంవత్సరాల సమయంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కనుక వృద్ధాప్యం సంతృప్తిగా జరిగిపోతుంది.


మఖ నక్షత్రము గుణగణాలు


ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక భావం అధికంగా ఉంటుంది. కేతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. వీరికి పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతా భావం ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము ఎక్కువే. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు. 


వీరు ఇతరుల సొమ్మును ఆశించే రకం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు అనుక్షణం శ్రమించే నైజం ఉంటుంది. అయితే.. నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిన పోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు వాటిని తలచుకుని బాధపడతారు. ఇక ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు.


ఈ నక్షత్ర జాతకులకు ఆదివారం కలిసి వస్తుంది. బుధవారం, శనివారం సామాన్య ఫలితాలు కలుగుతాయి. మంగళవారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించ వద్దు. వీరి అదృష్ణ సంఖ్యలు 1, 4. ఎరుపు రంగు ఈ జాతకులకు శుభ ఫలితాలను అందిస్తాయి....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: