3, అక్టోబర్ 2020, శనివారం

110. ఓం కుండలిన్యై నమః.🙏

 

శా. దేవీ! *కుండలినీ!* కృపామృతఝరీ దేదీప్యమానోజ్వలా!


యావచ్ఛక్తికి మూలమైనదగు మూలాధారసంశోభితా!


నీవే ప్రాణము, ప్రీతిఁ గొల్చిన మదిన్ నిన్నే సదాసక్తితో


జీవబ్రహ్మ సమైక్యమబ్బును కదా! శ్రీరాజరాజేశ్వరీ!🙏


అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: