3, అక్టోబర్ 2020, శనివారం

పునర్జన్మ

 జీవునికి పునర్జన్మ వున్నదని జ్యోతిష శాస్త్రం మాత్రమే తెలుపు గలదు. దానికి మూలం కర్మరూపంలో తెలియనగునని అవి మంచివి కాని చెడువి కానీ. మామూలుగా దేహమునుండి ఆత్మ తనంత తానుగా వెడలుట మరో జన్మ ఎత్తుటకు. కానీ ఆత్మ మన ప్రమేయంతో ఎచ్చటను చేయవలెనో అన్న దానిని హఠయెూగ సాధన ప్రాణాయామం తో తెలియుట మెూక్షమని. దీనికి జ్యోతిష శాస్త్ర ప్రకారం శని హేతువులు మకరంలో గాని కుంభంలోకాని వున్నప్పుడు అదియును ఏకాదశమన గురునికి శుభర్గళమైనయెడల పునర్జన్మ వుండదని తెలియుచున్నది. అనగా అటువంటి గ్రహస్థితి వచ్చువరకు జన్మ ఎత్తుతూ నుండవలెనని. అందుకే యీ జన్మ లోనే అందుకు సరైన సాధన చేసిన మరో జన్మ లోనైనా అందుకు సరియగు దేహమును ఆశ్రయింతవలెను. వాసము పూర్తిగా అనుభవించిన గాని యిక ఏ విషయం పైనా ఆసక్తి లేకుండుటయు మెూక్షమని యుందురు అటువంటి గ్రహస్థితి వచ్చువరకు అవిరామంగా జన్మలు ఎత్తుతూ వుండ వలెను. మామూలుగా జీవుడు జనో లోకం వరకు అనగా భూ భువర్లోక, మహా లోక జనో లోకం వరకు మాత్రమే ప్రయాణం. అచ్చట నుండి తిరిగి పునరావృత్తి. తపో లోకమునకు కూడా కొన్ని కోరికలు మిగిలి యుండును. అనగా తపస్సు కోరికలు లేనివిధంగా చేయగా నామ గాన దాన యఙ్ఞం మెుదలగు కర్మలు ఫలితం ఆశించకుండా చేసిన సత్య లోకం చేరును. సత్య లోకం కూడా జన్మ పరంపర వచ్చును. దానికి నలుడు హరిశ్చంద్ర, ప్రహ్లాద మొదలగు వారు సత్య లోకం వరకు మాత్రమే చేరి తిరిగి జన్మించారు. పతివ్రత లు దైవ లక్షణములు గలిగిన వారఅనగా త్యాగరాజ అన్నమయ్య, వామదేవుడు, మార్కండేయ మొదలగు వారు మాత్రమే బ్రహ్మపథం చేయగలరు. జన్మ ఎత్తున దానికి సార్థకం భగవధ్యానమే. భగవంతినలో చేరు తపన వానితో రమించునట్టు లేక సఖుని వలె అనగా గోపికలవలె లేక రాధ వలె లేక వెంగమాంబ వలె యింటి జన్మలు రావలెనని కోరిక కలిగిన ఎన్నో జన్మలు ఆవిధమైన పూర్ణ భక్తితో కూడిన లభించి మెూక్షమని కలుగుటకు అవకాశం.

కామెంట్‌లు లేవు: