3, అక్టోబర్ 2020, శనివారం

🌹 మూకపంచశతి🌹

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏




🌹 ఆర్యాశతకము🌹


🌹15.

శ్లోకం


అఙ్కితశఙ్కరదేహాం


అఙ్కురితోరజకఙ్కణాశ్లేషైః౹


అధికాఞ్చినిత్యతరుణీం


అద్రాక్షంకాఞ్చిదద్భుతాం బాలామ్౹౹


🌺భావం:


కామాక్షీ దేవి గాఢ ఆలింగనమువలన ఆ నిత్యతరుణి స్తనములయొక్క ,కంకణములయొక్క చిహ్నములతో ఉన్న శంకరుని దేహముతో కూడియున్న బాలాంబికను కాంచీపట్టణమందలి ఒకానొక అద్భుత ముగా చూచుచున్నాను.



🌼కాంచీనగరమున కామాక్షీదేవి పరమశివునికై తపమాచరించెను.మామిడి చెట్టు మూలమున సైకతలింగమును (ఇసుకతో లింగము)ప్రతిష్ఠించి ఆరాధించుచుండగా

ఆమెను పరీక్షించుటకై నది ఉవ్వెత్తున ఆదిశగా ప్రవహించసాగెను.ఆ నీటివడికి అడ్డుగా ఉండి ,పార్వతీ దేవి సైకతలింగమును కాపాడుకొనుటకును కౌగలించుకొనెనట.అంత లింగముపై ఆ చిహ్నములు ఏర్పడెనట .నేటికీ వాటిని ఏకామ్రేశ్వరలింగము పై చూడవచ్చును. అట్టి శంకరుని తో గూడిన ఆనిత్యయౌవ్వన అయిన కామాక్షీ దేవిని కాంచీనగరమందలి ఒకానొక అద్భుత ముగా కాంచుచున్నాను.🙏

             

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 

పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: