3, అక్టోబర్ 2020, శనివారం

*దు:ఖం నుండి శాంతి వైపుకు .....*

 సేకరణ 👇


*కథా ఫలే*



*ఒక రాజు*

 ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :


 ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.


 కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,


 నేనే ఎందుకయ్యాను ?

 ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 


' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 


అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 


ఆయనను కలవండి. 

జవాబు దొరుకుతుంది ''అన్నాడు. 


రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు


అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...

 తన ప్రశ్న ఆయన ముందు పెడితే....


 ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.


 అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''


 నిరాశపడినా , 

రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 


రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు


రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.


 కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.


 కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు



 రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 


వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,


 అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'


 రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. 


చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 


అపుడు ఆ అబ్బాయి అన్నాడు


 '' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. 


ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.


 తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 


*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*


*రెండవ వ్యక్తిని అడిగితే..*

 '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''


 అని వెటకారంగా అంటాడు.


 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? 


''అని నీచంగా మాట్లాడాడు. 


కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.


 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. 


 రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. 


అపుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు :


 '' రాజా , ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు.''


ఈ కథను బట్టి 

 మనం గతం లో చేసినదేదీ వృథాగా పోదు అని చెప్పడానికే.


 మరో కారణం ఏమంటే , 

కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం అనే అయిదు ఇంద్రియాల ద్వారా , 


అలాగే మన మనసు ద్వారా మనం ఎన్నో పనులు చేసివుంటాం. 


వాటిలో మంచివి వుంటాయి , చెడ్డవి కూడా వుంటాయి. 


అవేవో మనకు ఇపుడు తెలియవు.


 మనం ఇపుడు 

సంతోషంగా , 

అందంగా , 

*ధనవంతంగా ,*

 ప్రశాంతంగా వున్నామంటే గత జన్మల్లో చేసిన మంచి కర్మలు ఇపుడు ఫలితాలు ఇస్తున్నాయని , 


ఒక వేళ మనం ఆందోళనగా , భయంగా , ఎదురుదెబ్బలు తింటున్నామంటే అప్పటి చెడు కర్మలు ఫలితాలు ఇస్తున్నాయని తెలుసుకోవాలి.


 కానీ... 


ఈ జన్మ లో మనం ఏమైనా పాపాలు , తప్పులు చేసివుంటే వాటినుండి విముక్తి పొందడానికి ఏమైనా పరిష్కారాలున్నాయా ? 

అంటే '' 


ఖచ్చితంగా వున్నాయి ''

కామెంట్‌లు లేవు: