3, అక్టోబర్ 2020, శనివారం

: దసరాల్లో అమ్మవారిని పూజించిన పూలను ఏంఊచేయాలి?


తొమ్మిది రోజులు ముందురోజు పూజించిన పుష్పాలను మరునాడు తొలగించి వేయాలి. తీసివేసిన తరువాత ఆ పువ్వులు ను దోసిలి లో ఉంచుకొని వాసన చూసి శిరస్సు పై దాల్చి ఓం శక్తయే నమహ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి. వాటిని నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం ను ప్రవహించే నీటిలో వదిలి వేయాలి. సమీపంలో ప్రవహించే నీరు లేకపోతే ఎవరూ తొక్కనిచోట, చెట్లు మొదట్లో పువ్వులు ను వేయాలి.

[: నవరాత్రి పూజలను స్త్రీ లు చేయవచ్చా?

స్త్రీ లకు విధినియమాల విషయం లో అనేక సడలింపులు ఉన్నాయి. భర్త చేసే ప్రతి పుణ్య కార్యక్రమంలో భార్య కు వాటా దక్కుతుందని ధర్మశాస్త్రం. ఇంటి యజమాని చేసే దైవ విధులతోపాటు ప్రతి కార్యంలోనూ ఆమె ఎంతగానో సహకరిస్తుంది. మహిళలు ప్రత్యేకంగా భారీ కార్యక్రమములు చేపట్టిన లేకపోయినా పర్వాలేదు. వారికి కేటాయించిన వ్రతాలు చేస్తే చాలు. వారికి నవరాత్రి దీక్షలు వంటివి లేవు. వ్యక్తిగత అభివృద్ధి ని ఆశించేవారు ఒంటరిగా కూడా చేసుకోవచ్చును.

: దేవీ విగ్రహం దేనితో తయారు చేసుకోవాలి?

భగవంతుని మనం ఏ రూపంలో నైనా అర్చించుకోవచ్చును. అయితే అమ్మవారిని ఎనిమిది విధాలుగా తయారు చేసుకోవచ్చని దేవీ భాగవతము స్పష్టం చేస్తోంది. శిలారూపంలో చెక్కతో, గంథంతో, బంగారు వెండి వంటి లోహంతో చిత్రపటాలరూపంలో ఇసుక తో మట్టి తో అమ్మవారి అర్చామూర్తులను, తయారుచేసుకోవచ్చును. దసరా నవరాత్రులు లో అమ్మ వారిని కళశరూపంలో ఆరాధించడం ఒక సాంప్రదాయం. అలాగే, ప్రకృతి రూపం లో ఉండే అమ్మవారిని బతుకమ్మ పేరిట దసరా రోజుల్లో నే ఆరాధిస్తారు.

కామెంట్‌లు లేవు: