*శ్లో:- కాకః కృష్ణ: పికః కృష్ణ: ౹*
*కో భేదః పిక కాకయో: ౹*
*వసంత కాలే ప్రాప్తే తు ౹*
*కాకః కాకః పికః పికః ౹౹*
" కా " యని గోల చే సెడియు
కాకము నుండును కాల వర్ణమున్
" కూ "యని పాట పాడెడియు
కోయిల వర్ణ.ము కాలమే సుమా !
కోయిల కాక మందునను
కూడిన బేధము దేలునెప్పుడున్ ?
హాయి నొసంగు యామని సు
భాగమమందున కంఠపోలికన్
కోయిల కోయిలే యగును
కూయని కాకిక కాకియే యగున్
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి