3, అక్టోబర్ 2020, శనివారం

ఆయుర్వేదం లో జ్యోతిష్యం యొక్క పాత్ర

 -


 ఆయుర్వేదంలో జ్యోతిషం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదం అంటే కేవలం చెట్ల మందులు , పసర్లు అని మాత్రమే అనుకుంటారు . జ్యోతిష్యం కూడా ఒక భాగమే . అందుకే "వైద్యజ్యోతీష్యం " అనే పేరు కూడా ఉంది. నేను ఔషధాలు తయారీకి అవసరం అయిన మొక్కల్ని సేకరించేప్పుడు కాని , ఔషధం తయారుచేసేప్పుడు కాని ఈ జ్యోతిష్య సంబంధ నియమాలు తప్పకుండా ఆచరిస్తాను. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో జ్యోతీష్యం ప్రధానపాత్ర ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను.


 * అమృతగడియాల యందు క్రొత్తగా చేయు మందులు అనగా లేహ్యములు, చూర్ణములు , రోగిచే సేవించబడు ఔషధం అమృతతుల్యమై వాతపిత్త శ్లేష్మజ్వరాది రోగములను హరింపచేసి ఆరోగ్యంబును అవయవాలకు బలమును ఆయుర్వృద్దిని చేయును . అమృతఘడియల్లోనే నూతన ఔషధాలను తయారుచేయవలెను అని శ్రీ ధన్వంతరి తెలియచేశారు. మందు ఇచ్చినప్పుడు కూడా అమృత ఘటికలలోనే తయారుచేయవలెను.


 * "ఔషదారంభే గురుశ్రేష్ఠహా " అనే ఆర్యోక్తి ప్రకారం గురువారం నూతనౌషధములను అమృతగడియాలలో సేవించిన అది అమృతం వలే తప్పక పనిచేయును .


 * నవౌషధం బుధసోమాయోహ " అనగా బుధసోమవారాలు అమృతగడియాలలోనైనా మందు సేవించరాదు . అటుల సేవించిన గుణం ఇవ్వదు.


 * అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి ఈ నక్షత్రములు, అదివారం, సోమవారం, బుధవారం, గురువారం , శుక్రవారం లు వీటితో చేరిన శుభతిథుల యందు మిధున, కన్యా, ధనుస్సు , మీన లగ్నముల యందు ఏ గ్రహములు లేకుండా ఉండటం , ఆయుష్మన్నమ యోగము నందు మందులు సేవించుటకు , మందులు చేయుటకు యోగ్యముగా ఉండును. మంగళవారం, శుక్రవారం విరేచనములకు మందు తీసుకుంటా మంచిది .


 * అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణము, ధనిష్ట , శతబిషం, రేవతి ఈ నక్షత్రములు మరియు అదివారం , బుదవారం, శనివారం , తదియ , పంచమి, సప్తమి తిధుల యందు తైలములు సేవించుటకు చాలా మంచి సమయం.


 * అశ్వని, కృత్తికా, ఆరుద్ర, ఆశ్లేష, చిత్త, విశాఖ, జేష్ఠ, మూల , శతబిషం ఈ నక్షత్రాలతో కూడిన అదివారం, మంగళవారం యందు క్రూర లగ్నములు అగు మేష,వృశ్చిక , మకర, కుంభ లగ్నముల యందు శరీరమునకు రక్షా రేకులు అనగా తాయత్తులు కట్టించుకొనుట మంచిది . ఈ ముహుర్తాలు శస్త్ర చికిత్స చేయుటకు పాటించవలెను .


 * అశ్వని, మృగశిర, పునర్వసు , పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతబిషం , రేవతి నక్షత్రములు, అదివారం, మంగళవారం, గురువారములతో కలిసినపుడు పాదరసం , రసకర్పూరాది రసములు కలిసిన మందులు సేవించవలెను .


 * పంచాంగ శుద్ది నందు క్షేమతార గురువు మరియు చంద్రబలం కలిగి ఉండినప్పుడు రోగము శీఘ్రముగా నశించును.


        ఇంకా స్వప్నములను బట్టి ఏ వ్యాధి కలుగునో , మరణానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో కూడా వివరణ ఉంది .వాటిని తరువాతి పోస్టులలో వివరిస్తాను.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: