🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 128*
🔴 *రాజనీతి సూత్రాణి: షష్ఠాధ్యాయము* - (1)
1. అనుపద్రవం దేశమావసేత్
(ఉపద్రవాలు లేని దేశంలో నివసించాలి.)
2. సాధుజనబహులో దేశ ఆశ్రయనీణీయః
(ఎక్కువ మంది సత్పురుషులున్న దేశంలో నివసించాలి.)
3. రాజ్ఞో భేతవ్యం సర్వకాలమ్
(ఎల్లప్పుడూ రాజుకు భయపడాలి.)
4. న రాజ్ఞః పరం దైవతమ్
(రాజును మించిన దేవుడు లేడు.)
5. సుదూరమపి దహతి రాజవహ్నిః
(రాజు అనే అగ్ని ఎంత దూరంలో ఉన్నా కాలుస్తుంది.)
6. రిక్తహస్తో న రాజానమభిగచ్చేత్ గురుం దైవం చ (రాజు దగ్గరికీ, గురువు దగ్గరికీ, దేవుడి దగ్గరికీ రిక్తహస్తాలతో వెళ్ళకూడదు.)
7. కుటుమ్బినో భేతవ్మమ్
(పెద్ద కుటుంబం కలవారికి భయపడాలి.)
8. గంతవ్యం సదా రాజకులమ్
(ఎల్లప్పుడూ రాజగృహానికి వెడుతుండాలి.)
9. రాజపురుషైః సంబంధం కుర్యాత్ (రాజపురుషులతో సంబంధం పెట్టుకోవాలి.)
10. రాజదాసీ న సేవితవ్యా
(రాజదాసితో సంబంధం పెట్టుకోకూడదు.)
11. న చక్షుషాపి రాజానం వీక్షేత
(రాజువైపు కన్నెత్తి చూడకూడదు. వినయంగా తలవంచుకొని ఉండాలి.)
12. పుత్రే గుణవతి కుటుమ్బినః స్వర్గ
(పుత్రుడు గుణవంతుడైతే గృహస్థునికి అది స్వర్గమే.)
13. పుత్రా విద్యానాం పారం గమయతవ్యా (పుత్రులకి బాగా చదువు చెప్పించాలి.)
14. జనపదార్థం గ్రామం త్యజేత్
(దేశం కోసం గ్రామాన్ని పరిత్యజించాలి.)
15. గ్రామార్థం కుటుమ్బస్త్యజ్యతే
(గ్రామం కోసం కుటుంబాన్ని విడిచిపెట్టాలి.)
16. అతిలాభ పుత్రలాభ
(పుత్రలాభం అన్నింటినీ మించిన లాభం.)
17. దుర్గతేర్యః పితరౌ రక్షతి స పుత్రః
(తల్లిదండ్రుల్ని దుర్గతి పాలవకుండా రక్షించేవాడే పుత్రుడు.)
18. యః కులం ప్రఖ్యాపయతి స పుత్రః
(కులానికి ప్రతిష్ట తెచ్చేవాడే పుత్రుడు.)
19. నానపత్యస్య స్వర్గ
(సంతానం లేనివారికి స్వర్గం లేదు.)
20. యా ప్రసూతే సా భార్యా
(పిల్లలని కన్నదే భార్య.)
21. తీర్థసమవాయే పుత్రవతీ మనుగచ్చేత్
(ఒకే సమయంలో ఇద్దరు, ముగ్గురు భార్యలు ఋతుకాలంలో ఉన్నప్పుడు పుత్రులను కని ఉన్న భార్యను పొందాలి.)
22. న తీర్థాభిగమనాత్ బ్రహ్మచర్యం నశ్యతి (ఋతుమతీ సంబంధంవల్ల బ్రహ్మచర్యానికి విఘాతం కలగదు.)
23. న పరక్షేత్రే బీజం నిక్షిపేత్
(పరభార్యలయందు బీజం ఉంచకూడదు.)
24. పుత్రార్థా హి స్త్రియః
(వంశాభివృద్ధి కర్తవ్యం స్త్రీలదే.)
25. స్వదాసీ పరిగ్రహో హి స్వస్త్యైవ దాసత్యాపాదనమ్
(తన దాసితో సంబంధం పెట్టుకోవడం తాను దాసత్యాన్ని పొందడమే.)
26. ఉపస్థీతవినాశః పథ్యవాక్యం న శృణోతి
(వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు.)
27. నాస్తి దేహినాం సుఖదుఃఖాభావః
(ప్రాణులకు సుఖం లేకపోవడం గాని, దుఃఖం లేకపోవడంగాని ఉండదు.)
28. మాతరమివ వత్సాః సుఖదుఃఖాని కర్తారమేవానుగచ్చంతి
(లేగదూడలు తల్లి వెంట వెళ్లినట్టు సుఖదుఃఖాలు పుణ్యపాపకర్మలు చేసినవాళ్ళ దగ్గరికే వెడతాయి.)
29. తిలమాత్రమప్యుపకారం శైలమాత్రం మన్యతే సాధుః
(తనకు చేసిన నువ్వుగింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు.)
30. ఉపకారో నార్యేష్వకర్తవ్య
(చెడ్డవారికి ఉపకారం చెయ్యకూడదు.)
31. ప్రత్యుపకారభయాదనార్యః శత్రుర్భవతి
(ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసి వస్తుందో అన్న భయంచేత నీచుడు శత్రుత్వాన్ని వహిస్తాడు.)
32. స్వల్పోపకారకృతే - పి ప్రత్యుపకారం కర్తుమార్యో జాగర్తి
(ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు.)
33. న కదాపి దేవతా వమంతవ్యా
(దేవతను ఎన్నడూ అవమానించకూడదు.)
34. న చక్షుషః సమం జ్యోతిరస్తి
(కన్ను వంటి తేజస్సు లేదు.)
35. చక్షుర్హి శరీరిణాం నేతా
(ప్రాణుల్ని నడిపించేది నేత్రమే.)
36. అపచ్చక్షుషః కిం శరీరేణ
(కళ్ళు లేని వారికి శరీరం ఉండి ఏమి ప్రయోజనం ?)
37. నాప్సు మూత్రం కుర్యాత్
(నీళ్లలో మూత్రవిసర్జన చెయ్యకూడదు.)
38. న నగ్నో జలం ప్రవిశేత్
(నగ్నంగా నీటిలోకి దిగకూడదు.)
39. యథా శరీరం తథా జ్ఞానం
(శరీరం ఎలా ఉంటే జ్ఞానం అలాగే ఉంటుంది.)
40. యథా బుద్ధిస్తథా విభ
(బుద్ధి బలం ఎలా ఉంటే జ్ఞానంద అలాగే ఉంటుంది.)
41. అగ్నావగ్నిం న నిక్షేపేత్
(అగ్నిలో మరొక అగ్నిని వేయకూడదు.)
42. తపస్వినః పూజనీయాః
(తపఃశాలులను పూజించాలి.)
43. అన్నదానం భ్రూణహత్యామపి మర్ణీ
(అన్నదానం భ్రూణహత్యాదోషాన్ని కూడా తుడిచివేస్తుంది.)
44. న వేదబాహ్యో ధర్మః
(వేదవిరుద్ధమైనది ధర్మంకాదు.)
45. కథంచిదపి ధర్మం నిషేవేత్
(ఎంత శ్రమపడైనా ధర్మాన్ని సేవించాలి.)
46. స్వర్గం నయతి సూన్రతమ్
(సత్యమూ, హితమూ అయిన వాక్యం స్వర్గానికి తీసుకొని వెడుతుంది.)
47. నాస్తి సత్యాత్ పరం తపః
(సత్యాన్ని మించిన తపస్సు లేదు.)
48. సత్యం స్వర్గస్య సాధనమ్
(సత్యం స్వర్గానికి సాధనం.)
49. సత్యేన ధార్యతే లోకః
(సత్యమే లోకాన్ని నిలబెడుతున్నది.)
50. సత్యాద్దేవో వర్షతి
(సత్యం వల్లనే దేవుడు వర్షిస్తున్నాడు.)
51. అన్రుతాత్పాతకం పరమ్
(అసత్యాన్ని మించిన మరొక పాపం లేదు.)
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి