29, జులై 2023, శనివారం

అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠం

 హిందూ బంధువులకు ప్రత్యేక విన్నపం . ఆస్తిక మహాశయులకు విఙ్ఞప్తి-",, రాజమహేంద్రవరం గౌతమఘాట్ లో నెలవైన అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠంలో ప్రతిష్ఠించబడిన దేవీ దేవతా విగ్రహాలు-- మరియు ఆయా మూర్తులకు జరుగు పూజా కైంకర్యముల గురించి మీకందరికి తెలియజేయాలనే సంకల్పంతో ఈసమాచారాన్ని మీకు తెలియజేయు చున్నాము- ఆరు అంతస్తుల దేవాలయము- మరో ఆరు అంతస్తుల శిఖరం తో మొత్తం 12 అంతస్తులతో ప్రపంచంలోనే అత్యంతఎత్తైన , త్రిసంధ్యా మూర్తులు, 24అక్షర మాతృకలతో షట్ చక్రాకారంలో మహాయోగేశ్వరేశ్వరిగా ప్రతిష్ఠింపబడిన వేదమాత, ప్రాణశక్తి గాయత్రీ దేవాలయం ప్రపంచంలో మరెక్కడా లేదనడంలో అతిశయోక్తి కాదు. ఈ ఆలయాన్ని గాయత్రీ అమ్మవారే స్వయంగా సంకల్పించుకొని నిర్మింపజేసుకొన్నారు. ఈ ఆలయాన్ని దర్సించుకొని అమ్మవారిని కోలుచుకున్న వారికి కోరిన కోర్కెలను తీర్చినఋనిదర్శనములు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో గాయత్రీ మాత అవతారములతో పాటు మరి కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. అవి 1. ఆదిత్యాది నవగ్రహ ఆలయం'"-, అన్నపూర్ణ సమేత సహస్రలింగేశ్వర స్వామి, పంచముఖఆంజనేయస్వామి 24అడుగుల ఎత్తైన విగ్రహం, కార్తికేయస్వామి 24అడుగుల వి గ్రహం, యాగశాల లో దుర్గాదేవి, దత్తాత్రేయ స్వామి , నర్మదానదిలో మాకు స్వయంగా లభించిన అంగారకేశ్వర బాణలింగము, మూలాధారంలో ద్వాదశాదిత్య మండపము, మహోశ్రీచక్రము, శ్రీచక్రానికి నలువైపులా శ్రీ మహాగణపతి, మహాకిళి, మహాలక్ష్శీ, మహాసరస్వతి, మహాశ్రీచక్రంపై భక్తులు స్వయంగా ప్రతిష్ఠించుకొన్న పంచలోహ శ్రీచక్రాలు, స్వాధిష్ఠాన మండపంలో పంచాయతన దేవతలు గాయత్రి ,సావిత్రి, సరస్వతి, సమగ్ర గాయత్రీ మణిపూరక ,అనాహత, విశుధ్ధి చక్రాలలో త్రిపదా గాయత్రి యొక్క 24అక్షర మాతృకలు మరో మూడు అంతస్థులలోను ఆరవ అంతస్ఠు లో ధ్యాన మండపము నిర్మంచ బడినవి. ఈ దేవాలయములో కొలువైన దేవతలకు ప్రతినెల వారికి ప్రీతిపాత్రమైన విశేష దినములలో ఆయా దేవతలకు ప్రత్యేకంగా విశేష అర్ఛనలు చేయ సంకల్పించి ప్రత్యేకంచి ఈ విశేష కార్యక్రమములకు ఋత్విక్కులను ఏర్పాటు చేసి నిర్వహించు చున్నాము. ఈ దేవాలయమునకు ప్రత్యేక వాట్స్ప్ గ్రూపులను ఏర్పాటు చేసి ముందుగా సభ్యులకు సమాచారము తెలియజేసి కార్యక్రమం పూర్తి అయిన తరువాత వీలైనంత వరకు ఫొటోలు కూడా షేర్ చెయ్యడం జరుగుతోంది. అతి త్వరలో ఈ ఆలయంలో ప్రత్యంగిర అమ్మవారి ప్రతిష్ఠ కూడా సంకల్పించడం జరిగింది. అందుకు ఆలయం కూడా నిర్మించి సిద్దం చేసినాము. ఈ ఆలయంలో ప్రతీ పౌర్ణమికీ గాయత్రీ అమ్మవారికి, సీందరేశ్వరునికి అభిషేకం జరీగుతుంది. బహుళ చతుర్థికి గణపతికి సంకష్ఠహరచతుర్థశి సందర్బంగా అభిషేకం ,గరికపూజ, శుధ్ధ సష్ఠి కి సీబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకం అర్ఛన శుద్ద సప్తమినాడు సూర్య నారాయణ స్వామికి అభిషేకం అర్ఛన, శుధ్ధ ఏకాదశీ కి విష్ణు మూర్తికి తులసీ ఫూజ, త్రయోదశి నాడు నవగ్రహార్ఛన తైలాభిషేకం, ప్రతీ మంళ, శని వారాలలో ఆంనేయ స్వామికి సింధూరం తమలపాకులతో పూజ అష్ఠమిఐనాడు దుర్గా పూజ నిర్వహించ బడుతున్నాయి. మరియు విశేష పర్వదినాలలో సందర్భానుసారం ఆయా క్రతువులు ,పూజలు నిర్వహించబడు చున్నవి. దేవాలయం యొక్క వైభవం దినదిన ప్రవర్థమానమయ్యే ట్లు భక్తుల కోర్కెలు తీరేటట్లు ఏర్ఫాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను జనబాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళవలసిన బృహత్ బాథ్యతను భక్తులై మీ భుజస్కంథాలపై ఉంచవలసి వస్తోంది. మీరందరు ఈ గాయత్రీ పీఠాన్న్కి విశేష ప్రచారం కల్పించి మీ యొక్క బంధు వులకు,మితృలకు, గ్రూపు సభ్యులకు అందరికి మేము పంపుతున్న కార్యక్రమాలను ఫార్వాడ్ చేసి పీఠం అభివృద్దికి , భక్తజనుల శ్రేయస్సుకు ఇతోధికంగా సహాయపడగలరని విఙ్ఞప్తి చేయు చున్నాము. ఇట్లు            



వ్యవస్దాపకులు అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠం, ప్లాట్ నెంబర్ 4, గౌతమ ఘా, రిజమండ్రి.

కామెంట్‌లు లేవు: