29, జులై 2023, శనివారం

వ్యాసుడు చెప్పిన చాటువు.


. వ్యాసుడు చెప్పిన చాటువు.

 రూపం రూప విసర్జితస్య భవతా..... ఇత్యాది. భావం - పరమేశ్వరా నిర్గుణ నిర్వికారా సర్వఅంతర్యామీ! 

నేను మూడు విధములైన దోషములకు పాల్పడ్డాను. 

1 రూపములేని పరమాత్మునికి నామారుపాలు కల్పించాను. 

2 నిర్వచనములకి అందని వాచామగోచరుడు పరమాత్మ. అట్టి పరబ్రహ్మమునకు గుణ గుణములు కల్పించాను. 

3 సర్వఅంతర్యామి, సర్వవ్యాపియైన విశ్వేశ్వ రునికి తీర్థ క్షేత్రములు కల్పించాను. స్థలకాలాలలో కుదించాను.


సర్వజన మనోరంజకములైన పుణ్య కథల కల్పన కోసం ఈదోషాలకి పాల్పడ్డాను. అని వ్యాసుడు పురాణాల రచన అనంతరం పశ్చాత్తాపంతో


వేడుకొన్నాడట.(నా పురాణ వేదం పుస్తకం నుంచి)



కామెంట్‌లు లేవు: