29, జులై 2023, శనివారం

నాగ సాధువు సుప్రీం కోర్ట్ లాయర్

 


నాగ సాధువు నుండి సుప్రీం కోర్ట్ లాయర్ దాకా...రాబోయే తరాలకు సనాతన హిందూ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు సాధువుల అవసరం ఎంతైనా ఉంది. #నాగా_సాధువు నుండి సుప్రీం కోర్ట్ లాయర్ గా మారిన #కరుణేష్_శుక్ల.


ఇవాళ ఒక సుప్రీం కోర్ట్ లాయర్ గురించి తెలుసుకుందాము. ఆయనకి రామజన్మభూమి కేసులో కీలక పాత్ర ఉంది, ఆ కేసులో మహంత్ ధర్మదాస్ జి మహారాజ్ గారి వకీలు.


ఈ కరుణేష్ శుక్ల వకీల్ అయ్యేకంటే ముందు అయోధ్య  ప్రసిద్ధమైన హనుమాన్ గుడి లో ఓ నాగ సాధువు.పూజారిగా సేవలు చేస్తుండేవారు. గురువు గారి పరంపరానుసారామ్ ఉత్తరాధికారిగా గుడికి సంబంధించిన ఆస్తులన్నీ అతని చేతిలోనే ఉండేవి, కానీ హిందుత్వం కోసం హిందుత్వ రక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేసేందుకు గురువు గారి ఆజ్ఞ తో సుప్రీం కోర్ట్ లాయరైనాడు.


అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు లో విజయం సిద్ధించింది. ఇప్పుడు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి విషయమై పోరాటం సాగుతోంది. ఇంకోవైపు అతని బృందం ద్వారా కాశీవిశ్వనాధునికి చెందిన భూవిముక్తి కోసం కూడా పోరాటం మొదలైంది.


కరుణేష్ శుక్ల హిందూరాష్ట్రం చూడాలని ప్రాణాలకు తెగించి అన్ని విదాలా కృషిచేస్తున్నారు . ఖురాన్ లోని కొన్ని ఆయత్ లకు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టులో దావా వేశారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని కనుక వాటిని తొలగించాలనే లక్ష్యం తో పని చేస్తున్నారు.ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ప్రపంచాన్ని పెద్ద ముప్పు నుండి కాపాడినట్టే!


దాంతోపాటు దేశాన్ని ఉన్నతంగా మార్చేందుకు ఆటంకంగా ఉన్న సెక్యూలర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలని కూడా పిటిషన్ వేశారు.కారణం అవి అప్పట్లో అవసరార్ధం జోడించినవని.


అలాగే లవ్ జిహాద్ లో చిక్కుకున్న యువతులకోసం ఉచితంగా కోర్ట్ ద్వారా పోరాడుతున్నారు. వారికీ మనోస్థైర్యాన్ని కల్పించి నూతన జీవితాన్ని సాగించేందుకు కూడా తోడ్పాడుతున్నారు


అలాగే సోషల్ మీడియా ద్వారా హిందువులకు మేలుకొల్పులు, జాగ్రత్తలు తెలియజేస్తుంటారు. ఉపాధి కోసం చేసుకునే  చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికీ ఆర్ధికసాయం అందించే వ్యవస్థనుకూడా రూపొందించారు. మానవత్వం కొద్దీ మానవతావాదంకోసం  మిషన్ హ్యుమానిటీ అనే సంస్థ వ్యవస్థపాక జాతీయ అధ్యక్షుడు కూడా.


దేశంతోపాటు ప్రపంచం మొత్తం కూడా శాంతిగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కరుణేష్ శుక్ల గురించి ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం ఇది. 

పరాయి ఆధీనం లో ఉన్న ఆలయాలకు  విముక్తి కల్పిస్తున్న ఇటువంటి వారికీ అండగా నిలిచి ఇటువంటివారు మరికొందరు ముందుకు వచ్చేందుకు మనవంతు కృషి మనం కూడా చేయాల్సి ఉంది.

 #🙏మన సాంప్రదాయాలు #🇮🇳దేశం


కామెంట్‌లు లేవు: