*1805*
*కం*
ఏ జీవి కష్టసుఖములు
నాజీవిగ బతికినపుడు నవగతమయ్యున్.
ఈ జీవన చక్రంబున
యే జీవియు నితరజీవి నెరుగడు సుజనా!
*భావం*:-- ఓ సుజనా! ఏ జీవి కష్టసుఖాలైనా ఆ జీవిగా బతికినప్పుడే అర్థమవుతుంది. ఈ జీవనచక్రంలో ఏ జీవియునూ ఇతర జీవి గురించి యెరుగడు, అంటే ఇతరుల గూర్చి చెప్పేది అంతా ఊహయే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి