*1806*
*కం*
ధనములు మనుషుల మధ్యన
ఘనముగ దూరములు పెంచు గమనించంగా(గమనించుమయా).
ధనమార్జించగ ధరణియు
ధనదానంబుల సురపురి దరియగు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధనములు మనుషుల మధ్య దూరాలను గొప్పగా పెంచగలవు. ధనార్జన చేస్తే భూలోకము, ధనములు దానం చేస్తే స్వర్గం (సురపురి) దగ్గర అవుతాయి.అంటే
ధనములు భూలోకంలోనూ,ధర్మాలు స్వర్గలోకంలో నూ మనుషుల ను బలపరుస్తాయి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి