శ్రీ కాశీ రహస్యము
మొదటి అధ్యాయము
ముని సూత సంవాద వర్ణనము:
దీనిలో సూత శౌనకాది మునుల సంవాదరూపంలో సృష్టిక్రమ వర్ణనం, బ్రహ్మ సత్యయుగాల సంవాదం కృత - త్రేతా - ద్వాపర - కలియుగాల స్వరూప వర్ణనం, కలిదోష పరిహారానికి ఆవలంబించదగిన ఉపాయ వర్ణనం ఉన్నాయి. తరువాత గురు మహిమ శాస్త్ర మహిమ ఉగ్గడింపబడ్డాయి. గురుతత్త్వ నిరూపణ జరిగింది. వేదధర్ముడు అనే ఋషికీ అతని శిష్యుడు దీవకుడికీ మధ్య జరిగిన సంవాదం వర్ణింపబడింది దీపకుని గురుభక్తికి మెచ్చుకొని కాశీవతి విశ్వేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరాలు ప్రసాదించడం ప్రశంసింపబడింది. గురుభక్తుడైన దీపకుడి విషయంలో శివ విష్ణుపుల మధ్య జరిగిన సంవాదం - తర్వాత విష్ణు దీపకుల మధ్య జరిగిన సంవాద వర్ణన - వీటితో ఈ ఆధ్యాయం ముగిసింది. దీనిలో ముఖ్యంగా గురుభక్తివల్ల సాధించలేనిది ఏమీ లేదు అనే ఆంశం సమర్థించబడింది.
1 ఒకప్పుడు నై మిళారణ్యంలోని ఋషులు నూత మహర్షిని కలి యుగ స్వరూపాన్ని వర్ణించవలసిందని అడుగుట
ఋషులు : 'సనాతనం అయిన యుగాలూ యుగమానమూ - ధర్మాలూ - యుగాలలోని ప్రజల చరిత్రలూ ఇంతకు పూర్వము నువ్వు వర్ణించగా మేము విన్నాం ఇంక కలియుగ స్వరూపాన్ని వర్ణింన కోరుతున్నాము. కలిపురుషుడు సజ్జన వంచకుడూ అధర్మ మిత్రుడున్నూ.
2. ఋషులు అడిగిన దానికి సమాధానంగా సూతుల వారు మొదట సృష్టిక్రమాన్ని వర్ణించుట :
అద్వయుడూ, అవ్యయుడూ అయిన హరి సమస్త సృష్టిని తనలో లీనం చేసుకొని జలశయనుడు అయ్యాడు. హరి తన యోగనిద్రనుండి మేల్కొన గానే బుధజనసేవ్యుడు అయిన బ్రహ్మ అతని నాభికమలం నుండి ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ తాను ఎవరో, తన జన్మకు కారణభూతుడూ, మహానుభావుడూ అయిన హరి ఎవరో తెలిసికోలేని అజ్ఞానస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఓ సత్తముడు అయిన బ్రహ్మా! నువ్వు నన్ను భజించు' అన్న హరి వాక్యాలు వినవచ్చాయి.
హరి వాక్యాల్ని విన్న వెంటనే బ్రహ్మ హరికి సాష్టాంగదండ ప్రణామం చేసి ఇలా అన్నాడు: "దేవా! జగన్నాథా! నీకు జయమగుగాక! తత్త్వతః నువ్వు ఎవరో నేను తెలుసుకోలేను. ఓ వరదా! ప్రసన్నుడవు కమ్ము. నేను ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు."
హరి - 'ఓ బ్రహ్మా! నువ్వు చింతించవద్దు. నువ్వు సృష్టిని ప్రారంభించు. మహ త్వయుతమూ శుభప్రదమూ స్థావర జంగమరూపమూ, అండజమూ స్వేదజమూ- జరాయుజమూ-ఉద్భిజ్జమూ అయిన చతుర్విధ సృష్టినీ కావించుము.'
బ్రహ్మ : ఓ సర్వేశ్వరా! ఆల్పజ్ఞుణ్ణి అయిన నాకు సృష్టిని కావించే శక్తి ఎక్కడిది? ప్రవర్ధమానం అయిన సృష్టిని కావించడానికి కావలసిన గొప్ప సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు.'
విష్ణువు : “ఓ బ్రహ్మదేవుడా! సుదుర్లభములు అయిన వేదాల్ని శక్తితో సహా నా వద్ద నుండి స్వీకరించు. వేదాల్ని తెలుసుకొని నువ్వు సృష్టిస్తే, నీకు ఎప్పుడూ పరాభవం అనేది ఉండదు."
సూతుడు బ్రహ్మ విష్ణుభగవానుడి దగ్గరనుండి వేద ప్రాప్తిని పొంది స్థావర జంగమాల్నీ, అండజమూ స్వేదజమూ జరాయుజమూ ఉద్భిజమూ అయిన చతుర్విధ సృష్టినీ, వివిధ ప్రజల్నీ సృష్టించాడు. భగవానుడు ప్రసాదించిన శక్తి వలనా వేద సహాయత వలననూ స్మరణమాత్రం చేతనే బ్రహ్మ అనాయాసంగా మూడు లోకాల్నీ ఆవిర్భవింప చేశాడు.
ఓ ఋషులారా...బ్రహ్మ ఎలా సృష్టించాడో, ఆ సృష్టి క్రమాన్ని నేను విన్న విధంగానూ, అర్థం చేసుకొన్న విధంగానూ మీకు వినిపిస్తాను వినండి. ఈ సృష్టి క్రమాన్ని సాక్షాత్తు వ్యాసభగపానుల వారి వద్ద నుండి నేనూ, జైమినీ, వైశం పాయనుడూ,పైలాది ఋషులూ విడివిడిగా విన్నాము. బ్రహ్మదేవుడు బ్రహ్మనిష్ఠు లైన సనకాదులనూ, కర్మనిష్ఠులైన మరీచ్యాది ఋషులనూ సృష్టించి, వారి ద్వారా దేవదైత్యుల్ని సృష్టించాడు. బ్రహ్మ సత్య, త్రేతా, ద్వావర యుగాల్నీ, ఆ యుగాల ఆదిలోనూ, మధ్యలోనూ ఉండే ధర్మాల్నీ, ప్రత్యేకించి కలియుగాన్నీ - ఆ యుగధర్మాల్నీ సృష్టించాడు.
3. బ్రహ్మ - సత్య యుగాల సంవాదము :
ఆ విధంగా యుగాల్నీ, యుగ ధర్మాల్నీ విభజన చేసిన తరువాత లోకాను గ్రహ కామి అయిన బ్రహ్మ సత్యయుగ పురుషుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: "నువ్వు ఏ పని లేకుండా నిర్వ్యాపారివిగా ఎందుకు ఉన్నావో శీఘ్రంగా చెప్పు. చెప్పడానికి నీకు సమయం ఉంది.'
సత్యయుగ పురుషుడు : 'నా యుగంలో ప్రజలందరూ విషయ సుఖముల పట్ల విముఖులు, అందరూ నివృత్తి ధర్మపరాయణులే. అందరూ శాంత చిత్తులే.. అందరూ హరిభక్తి పరాయణులే. అందరూ శుద్దమనస్కులే. అందరూ దేహ, ప్రాణ, ఇంద్రియ పరాజ్ముఖులే. ప్రజలందరూ వారి వారి ధర్మాల్ని తుచ తప్ప కుండా ఆచరిస్తున్నప్పుడు వారిని నియంత్రణ చేయడానికి, శాసించడానికి ఆవశ్యకత లేనేలేదు కదా! అస్మదాదులం దాదులం నీ ఆజ్ఞ పాటించే వారమే కాని స్వంతంత్రించి వ్యవహరించే వారము కాము ప్రజలు కాంతులూ నివృత్తి ధర్మపరాయణులూ -భగవత్పరాయణులున్నూ. ప్రజలు కర్మ కాలము గుణాల్నీ వ్యతిరేకించేవారు కారు ఆశాస్తులూ - ఆర్తులూ భగవత్ పరాజ్మాఖ్ములూ నిందింపదగిన వారు."
బ్రహ్మ : "నువ్వు శీఘ్రంగా మృత్యులోకానికి వెళ్ళి నీ యుగధర్మాల్ని అక్కడ వ్యాపింపచెయ్యి. ఎప్పుడూ కాలమే మెల్ల మెల్లగా ధర్మాన్ని ప్రవర్తింపచేస్తుంది. అన్ని యుగాల్లోనూ సర్వదా పుణ్యాత్ములూ, పాపాత్ములూ ఉంటూనే ఉంటారు.
4. సూతుడు ఋషులకు యుగాల స్వరూపాన్ని వివరించుట
సూతుడు. ఓ ద్విజులారా! నాలుగు యుగపురుషుల యొక్క స్వరూపమూ - ఆకృతీ - కర్మాది గుణాల్ని వినిపిస్తాను వినండి.'
సత్య యుగ స్వరూపము ' సత్య యుగంలో వైరాగ్యం అధికంగా ఉంటుంది. సత్య యుగపురుషుడు సంపూర్ణ జ్ఞాన విగ్రహుడుగా ఉంటాడు. అతడు యజ్ఞోపవీత ధారి, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. అతడు బ్రాహ్మణ ప్రియుడు. ఇటువంటి స్వరూప లక్షణాలు కలిగిన సత్య యుగ పురుషుణ్ణి బ్రహ్మ సృష్టించాడు. ఈ ప్రకారమే త్రేతాయుగమూ - ద్వాపర యుగమూ - కలియుగమూ ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉంటాయి.
త్రేతాయుగ స్వరూపము : త్రేతాయుగ పురుషుడు స్వధర్మ పరాయణుడు. యజ్ఞయాగాది వైదిక క్రతువులను చేయడానికి చిహ్నంగా త్రేతాయుగ పురుషుడు చేతిలో స్రువాన్ని ధరించి ఉంటాడు. అతడు ధర్మ ప్రియుడుగా ఉండి ప్రజలలో ధర్మ వ్యాప్తిని చేసేవాడుగా ఉంటాడు.
ద్వాపర యుగపురుషుడు : ద్వాపర యుగపురుషుడు ఖడ్గమూ - ఖట్వాంగమూ - ధనుర్బాణాల్నీ చేతిలో ధరించి ఉంటాడు. అతడు ఆశాంతుడు. పుణ్య పౌవశీలి. కటువుగా ఉంటాడు.
కలియుగ స్వరూపము : ఓ విప్రులారా! కలియుగ స్వరూపాన్ని వినిపిస్తాను వినండి. వివేకవంతులకు కలిలో శీఘ్రంగా ఫలం లక్షిస్తుంది. కలిలోని ప్రజలు పరమార్థ విచారహీనులు. ఈ యుగంలోని ప్రజలకు దుష్టవిచారమే తప్ప శిష్టవిచారం ఉండదు. కలిపురుషుడు పిశాచ వదనంతో చూడడానికి అసహ్యంగానూ, భయంకరంగానూ ఉంటాడు. అతడు క్రూరుడు. కలహప్రియుడు. అతడు ఎడమ చేతితో శిశ్నాన్నీ, కుడిచేతితో జిహ్వని పట్టుకొని నాట్యం చేస్తున్నాడు. ఆ కలిపురుషుడు బ్రహ్మదేవుణ్ణి చూసి నవ్వుతూ, దుఃఖిస్తూ, రోదనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి స్వరూపమూ, లక్షణాలూ కలిగిన కలిపురుషుణ్ణి బ్రహ్మ నవ్వు మొగముతో ఇలా అంటాడు.
'ఓ కలీ! అంగాన్నీ, జిహ్వనీ గట్టిగా పట్టుకొని మాటి మాటికీ ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఆకతాయి వలె కనిపిస్తున్న నీవు వెళ్ళి స్వకార్య నిర్వహణ తత్పరుడవు కావలసింది.
కలి : ఓ సర్వేశా! నేను సర్వాన్నీ నాశనం చేసేవాణ్ణి, నిరంకుకుణ్ణి. ఆనంద రహితుణ్ణి. నిద్రాకలహాలు మక్కువగా కలవాణ్ణి. పర స్త్రీని, పరద్రవ్యాన్ని కోరే వాణ్ణి, పరులకు ద్రోహం తలపెట్టేవాణ్ణి వంచకుణ్ణి, దంభమూ - మాత్సర్యమూ-భేదమూ అంటే ఇష్టపడే జనుల్ని చూస్తే నాకు ఇష్టం. అటువంటి నన్ను భూలోకానికి పంపించవద్దు. ఏకాంతమూ - యోగ సాధనా-సన్యాసమూ అనే వేషాలతో ఉదరపూరణ చేసికొనే వాళ్ళు తమర్నీ, ఇతర్లనీ నా సంపర్కం వల్ల మోసగిస్తూ ఉంటారు.'
బ్రహ్మ : 'నీ ప్రభావం సోకిన వాళ్ళు పాపాత్ములు కాగా, నీ ప్రభావానికి లోబడని వాళ్ళు పుణ్యాత్ములుగా ఉంటారు. నువ్వు శీఘ్రఫలకారిని కావడం చేత పాపాత్ములు పెరిగినట్లే - పుణ్యఫలం శీఘ్రంగా లభిస్తుందన్న ఆశతో కొంతమందై నా పుణ్యాత్ములు ఉద్యమశీలురు అవుతారు. తమ పుణ్య ప్రభావం చేత కలి ప్రభావాన్ని తట్టుకొని అల్పాయుర్దాయం కలవాళ్ళం అని తెలుసుకొని తమ మంచి కోసం ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళకి నా ఆజ్ఞగా భావించి శీఘ్రఫలం కలిగేటట్లు సహాయం చెయ్యి' అని కలిని శాసించాడు.
కలి ! 'భరత ఖండంలో నా ఉనికి కష్టతరం చేసిన శత్రువులు ఉన్నారు. ఆ వర్గానికి నేను భయపడుతూ ఉంటాను అలాంటి చోటికి నేను ఎలా వెళ్ళగలను?'
బ్రహ్మ : "నీకు శత్రువులు ఎవరు? వారితో నీకు శత్రుత్వం ఎందుకు వచ్చింది? నువ్వు కాలస్వరూపుడవు ఇతరులకు లొంగని వాడపు ఇతరులకు తెలిరాని వాడవు, పండితుడవు.'
5. కలిదోష పరిహారోపాయ వర్ణనము
కలి : ఓ దేవదేవా! నా శత్రువర్గాన్ని గురించి చెబుతాను విను. నిర్దయులు అయినవారి వల్ల నాకు సుఖం లేకుండా పోతోంది. శివ నామ జపం-హరినామ సంకీర్తనం గంగానది - వారణాసి సత్సంగం దానధర్మాలు తీర్థాది 'సేవనం విష్ణుమూర్తి యొక్క పుణ్యకథలు- శివలీలలు ఇంకా ఇతరత్రా ఉన్న పుణ్యకార్యాలు నాకు క్షోథని కలిగిస్తాయి. నీ సన్నిధిలో వాటన్నిటిని గురించి ఏమని చెప్పమంటావు? ఒక క్షణకాలం ఎవడైనా శాంతచిత్తుడుగా ఉన్నా వికారం లేకుండా స్థిరంగాఉన్నా - ఎవడైనా అలా ఉన్నట్లు నటించినా నాకు చాలా భయం వేస్తుంది వ్యాకుల చిత్తులూ - వికార స్వభావం కలవాళ్ళూ, భార్యాబిడ్డలతో సతమతం అవుతున్న వాళ్ళూ, వేద ధర్మాల్ని ద్వేషించే వాళ్ళూ-ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది.
జితేంద్రియులూ, శివభక్తి పరాయణులూ, రాగద్వేష రహితులూ-ధీరులూ, సత్పురుషుల ధైర్యాన్ని పెంపొందించేవాళ్ళూ ఉంటే వారితో కలిసి నేను ఉండలేను. ఎందుచేతనంటే, వాళ్ళు నన్ను నామరూపాలు లేకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అంటే నాకు ఎప్పుడూ భయమే.
బ్రహ్మ : ఓ కలీ! నీ ప్రభావం వల్ల అటువంటి వారి ప్రచారం సాగదు.
అందుచేత సందేహించక భూలోకానికి వెళ్ళు'
కలి : "నా స్వభావం వారి స్వభావానికి విరుద్ధం, దానికి కారణం నాకు తెలియదు. నన్ను వారూ వారిని నేనూ నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటాము.
బ్రహ్మ: "నిన్ను కాలమలం అంటారు. మలినానికి శుద్దికి పొంతనం ఉండదు. నీ శత్రువులు నిర్మలంగా ఉంటారు కాబట్టి మీ ఇద్దరికీ విరోధం తప్పదు. ఎవడు బలవంతుడో వాడు విజయం పొందుతూ ఉంటాడు. వారి ప్రచారం బలహీన మైనది అవడంచేత నీవు బలశాలివి అవుతావు.
నీవు వివేకవంతుల్లో మిక్కిలి ప్రచారం కలిగినవాడవు శీఘ్రఫలదాయకం అవడంచేత భగవద్భక్తులు కలియుగంలో జన్మించాలని కోరుకొంటారు.”
కలి : ఏ గుణం చేత నేను తగినవాణ్ణి అని నీవు చెప్పావో, దాన్ని నీవు విశదంచేస్తే నీ ఆజ్ఞ ప్రకారం నేను భూలోకానికి వెళ్ళుతాను.'
6. గురుశాస్త్ర మహిమా వర్ణనము
బ్రహ్మ : 'దైర్యాన్ని అవలంబించి, ఏ జనులు ఆత్మశుద్ధిని పొందుతారో వారికీ - కాశీలో నివసించే వారికీ లోభాది గుణజనితమైన కలి దోషం అంటదు. ఇంకా మహాత్ముడైన శివుణ్ణి జనార్ధనుణ్ణి సేవించే వారికి నెమ్మది నెమ్మదిగా సర్వ సాధనలూ సమకూరి శీఘ్రఫలితాన్ని కలిగిస్తాయి.'
'నా (కలి) ప్రభావం వల్ల గురుసేవ లభించదు' అని నీవు అనవచ్చు. కాని వారి వారి సుకృత విశేషం చేత గురు సేవాదికం లభించి ఆత్మోద్ధరణ కలుగుతుంది. గురుసేవ వల్ల సారాసార వివేకమూ తత్త్వచింతనమూ, తెలిసో తెలియకో కాశీని సేవించడం వల్లనూ శాస్త్రజన్య జ్ఞానం లభించి వారికి క్రమముక్తి లభిస్తుంది అలాంటి సుకృతం లేని వారికి కలియుగంలో ఏలాంటి సుఖమూ లభించదు. కనుక కలియుగంలో అప్రమత్తుడై సుకృత సంపాదనానికి ప్రయత్నించాలి."
కలి : గురు శబ్దం యొక్క తాత్సర్యాన్నీ గురుపు ఎటువంటివాడో- అతని స్వరూపం ఎటువంటిదో తెలియచెప్పుము.
7. గురు తత్త్వనిరూపణము
బ్రహ్మ : 'గ' కారం సిద్ధిప్రదం అన 'రే'ఫం పాపదాహకం అని చెబు తారు. 'ఉ' కారం అవ్యక్తం అయిన విష్ణుస్వరూపం. గురువు పరమైన త్రిమూర్తి స్వరూపం అవుతున్నాడు.'గ'కార అధిదేవత అగు గణపతి ఆగు అగ్నితోను, విష్ణుస్వరూపం అయిన 'ఉ' కారంతోను కలిసి చాతుర్వర్గ ఫలదాయకం అయిన మంత్రం అవుతోంది. గురువే తండ్రి. గురువే తల్లి. గురువే పరమ శివుడు. శివుడు కోపిస్తే గురువు రక్షించకలడు కాని గురువు కోపిస్తే రక్షకుడు ఎవడూ ఉండడు. గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు.అట్టి గురువే పరతత్త్వము. కాబట్టి గురువునే ఆశ్రయించాలి.
విష్ణుమూర్తి ప్రసన్నుడై సాక్షాత్కరిస్తే వైష్ణవ జనులు అవ్యయమైన గురు భక్తినే వరంగా కోరుకుంటారు. గురువు సంతోషపెట్టబడితే సర్వసిద్ధుల్ని ప్రసాదించగల లోకనాయకుడు అయిన జనార్ధనుడు సంతోషిస్తాడు.
గురువును సేవిస్తే శాస్త్ర మార్గం అవగతం అవుతుంది. తీర్థమూ-వ్రతమూ-యోగమూ తపస్సూ మొదలైన ధర్మ విషయాలు అవగతం అవుతాయి. ఆచారమూ - ఆయా వర్ణాలకు యోగ్యమైన ధర్మాలూ వివేకమూ భక్తి వైరాగ్యాలతో కూడిన గొప్పదైన జ్ఞానమూ కూడా గురుభక్తి వల్ల లభిస్తాయి."
కలి : 'దేవాదిదేవా! గురువు సర్వ ధర్మమయుడు అనడం చాలా చిత్రంగా ఉంది. గురువే సకల ధర్మాలకు అధీశ్వరుడు ఎలా అవుతాడు?'
బ్రహ్మ : గురువు లేకుండా ఎవడికీ ఎక్కడా శ్రవణం లభించదు. శాస్త్ర శ్రవణం వల్ల నీ యొక్క (కలికృతమైన) భయాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇది నీకు తెలియడానికి సర్వార్థదాయకం అయిన కధ చెబుతాను. అది వింటే నీవు కూడా గురుభక్తి - ధర్మాసురక్తీ కలవాడవు అవుతావు.
8. వేదధర్మ - దీపక సంవాద వర్ణనం
'గోదావరీ తీరంలో ఆంగిరస మహర్షి ఆశ్రమం ఉంది. అది మిక్కిలి ప్రసిద్ధమైంది. ఆ ఆశ్రమంలో చక్కని వృక్ష సంతతీ, జంతుజాలం ఉన్నాయి. అక్కడ చాలామంది బ్రహ్మర్షులూ రాజర్షులూ తపస్సు చేసుకొంటూ ఉంటారు.వారిలో పైలముని కుమారుడు అయిన వేదధర్ముడు అను ఋషి మిక్కిలి ప్రసిద్ధి చెందాడు.
అతనివద్ద ఎందరో శిష్యులు శుక్రూషచేస్తూ, వేద వేదాంగ పారంగతులు అవుతూ ఉండేవారు. వాళ్ళలో సందీపకుడు అనే శిష్యుడు మిక్కిలి గురుభక్తి కలవాడు. అతడు నైష్ఠిక బ్రహ్మచారిగా ఉంటూ, గురువువద్ద శాస్త్రపురాణాలూ, వేదవేదాంగాలూ నేర్చుకొని కూడా గురువును సేవించుటయందు మిక్కిలి ఆసక్తి కలిగి అతని దగ్గరే ఉండిపోయాడు. ఒకనాడు అతడు గురువు పిలువగా వెంటనే పరుగెత్తి అతణ్ణి సమీపించాడు. గురువు సందీపకుణ్ణి చిరంజీవి అగుము అని అశీర్వదించాడు.
'వేదధర్ముడు : 'నాయనా! నా శిష్యుల్లో నీవు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడవు. అందుచేత నేను అడిగేది సావధానంగా ఆలోచించి సమాధానం చెప్పు. ఆచరించ గలిగితేనే అంగీకరించు.
అనేక వేల పూర్వజన్మల్లో నేను తెలిసో తెలియకో చేసిన పాపాలు నా తపోబలంచేత క్షాళితాలు అయ్యాయి. మోక్షానికి విఘ్న హేతువులు అయినవీ వాక్కాయమానస సంజనితాలూ అయిన కొన్ని పాపాలు మాత్రం అనుభవించడం వల్లనే పోగొట్టుకోదగినవి శేషించి ఉన్నాయి అని అనుభవిస్తేనే కాని క్షయం కావని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆ పాప ప్రాయశ్చిత్తం పాపహారిణి అయిన వారణాసిలో జరుపుకోదలచాను. ఎందుచేతనంటే, కాశీలో ఏ కర్మ అయినా శీఘ్ర ఫలకారిణి అవుతుంది ముఖ్యంగా రెండు పాప ఫలితాల్ని ఒకేసారి ఈ శరీరంతో అనుభవించ తలవాను అది పూర్తి అయ్యే వరకు నీవు సేవిస్తూ ఉండాలి. అలా ఉండలేకపోతే నిస్సంకోచంగా చెప్పు. నా సేవకోసం మరో శిష్యుణ్ణి అడుగుతాము."
దీవకుడు : "మహాత్మా! ఎలాంటి పాపాలు అయినా నిన్ను తలంచినంతనే దహించబడతాయి. అలాంటి మీరు సహింపవలసిన దుఃఖాలు ఎలా ఉంటాయి?
వేదధర్ముడు : “నాయనా! మానపుడు జీవించి ఉండగానే ప్రాయశ్చిత్తం చేసికొనకపోతే మరుజన్మలో నాకు ఇలాంటి శక్తి కలుగకపోవచ్చును అప్పుడు ఈ పాపాలు మనస్సును వక్రమార్గానికి మళ్ళించి ఇంకా బాధిస్తాయి కనుక వాటిని ఇప్పుడే నశింప చేసికోవాలి. దేవతలు అయినా, ఋషులు అయినా, మనుష్యులు అయినా చేసిన శుభాశుభ ఫలితాల్ని తప్పించుకోలేరు. కాబట్టి జ్ఞాని అయినవాడు యథాశీఘ్రం పాపక్షయం అయ్యేలాగున ప్రయత్నించాలి. '
దీపకుడు : 'ఓ గురుదేవా! విధివిధానంతో యధాశక్తి నీ సేవ చేస్తాను. నిస్సంకోచంగా ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి'.'
'వేదధర్ముడు : ఓ సుప్రజా! నేను ఆంధుణ్ణి - కుష్ఠువ్యాధి పీడికుణ్ణి అవుతాను. ఆ సమయంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నా శరీరాన్ని నువ్వు రక్షించాలి."
దీపకుడు : ఓ మహాత్మా! నా వంటి శిష్యుడు ఉండగా మీకు ఎటువంటి కష్టమూ, ఇబ్బందీ ఉండనేరదు. నీ పాపఫలితంగా వచ్చే కుష్ఠువ్యాధిని నాకు సంక్రమింపచెయ్యి- ఆ వ్యాధిని నేను అనుభవిస్తాను: నువ్వు సుఖంగా ఉండవచ్చు..
వేదధర్ముడు ; "నాయనా! పుత్రుడికి కాని, శిష్యుడికికాని ఎవ్వడూ తన పాపాన్ని సంక్రమింపచెయ్యరాదు. పాపభోగం కర్తకే చెందుతుంది కాని దాన్ని ఇతర్లు ఎవరూ సంక్రమింపచేసికొని అనుభవించడానికి వీలులేదు. అందుచేత దాన్ని నేనే అనుభవిస్తాను. నువ్వు మాత్రం నన్ను సేవిస్తూ ఉండు నిజానికి ఒకరి పాపాన్ని ఇంకొకరు సంక్రమింపచేసికొని, అనుభవించడంకంటే స్వయంకృత పాపఫలాన్ని అనుభవించేవారిని సేవించడమే మరీ కష్టతరం కాబట్టి నన్ను నువ్వు సాక్షాత్తు ఈశ్వరునికి ప్రియవాసమూ, పరిశుద్దమూ అయిన కాశీనగరానికి తీసికొని వెళ్ళు. ప్రారబ్ధాన్నంతటినీ అక్కడ అనుభవించి లయం చేసికొని అంతలో మోక్షాన్ని పొందుతాను.'
దీవకుడు : "అలాగే స్వామీ! తప్పకుండా మనం కాశీ క్షేత్రానికి వెడదాం మీ పాదపద్మాల సేవలో నేను నిమగ్నుడై ఉంటాను.
9. కాశీకి వచ్చిన గురుశిష్యుల వృత్తాంతాన్ని బ్రహ్మ కలికి చెప్పుట:
బ్రహ్మ : ఓ కలీ! ఆ తరువాత గురుశిష్యులు ఇద్దరూ కాశీ చేరుకొని మణికర్ణికా ఘట్టానికి ఉత్తరాన ఉన్న కంబలేశ్వరుని సన్నిధికి చేరుకొన్నారు. వేద ధర్ముడు గంగాస్నానం చేసి, ఉమాసహితుడు అయిన విశ్వేశ్వరుణ్ణి సేవించి హేయ మైన ఆ ప్రారబ్దాన్ని అనుభవించడానికి ఆయత్తం అయ్యారు. ఇతరుల దుఃఖాన్ని తన తపశ్శక్తిచే పోగొట్టగలిగిన ఆ వేదధర్ముడు కుష్టురోగాన్నీ - అంధత్వాన్నీ పొంది దుఃఖార్తుడు అయ్యాడు.
అలాంటి గురువు యొక్క మలమూత్రాదులూ, చీమునెత్తుర్లూ తీసివేసి శుభ్రం చేస్తూ, శిష్యుడు అయిన ఆ దీపకుడు మిక్కిలి శ్రద్దతో గురువుని సేవింపసాగాడు. కాశీపురిలో భిక్షాటనం చేసి అలా తెచ్చిన అన్నాన్ని గురువుకి నివేదించి పోషించ సాగాడు.
వేదధర్మ నిష్టుడూ జితేంద్రియుడు అయిన ఆ గురువు రోగవశం చేత మొదటి సాధుత్వాన్ని కోల్పోయి క్రూరుడుగా మారాడు. ఒక్కొక్కప్పుడు దీపకుడు తెచ్చిన భిక్షాన్నాన్నంతటినీ తానేతినేసేవాడు. ఒక్కొక్కప్పుడు నువ్వు తెచ్చిన అన్నం రుచిగా లేదంటూ కొంచెం మాత్రమే తినేవాడు ఒక్కొక్కప్పుడు దయతో నాయనా! అంటూ శిష్యుణ్ణి లాలించేవారు. మరొకప్పుడు అనుచితమైన కరోరవాక్కుల్ని పలికేవాడు. మహారోగగ్రస్తుడైన పాపాత్ముల వాక్కులు కఠినంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అలాంటి వారు దైన్యమూ, మాత్సర్యమూ కలిగి శుభాశుభ ఆలోచనావిరహితమూ, దుఃఖ దాయకమూ అయిన మాటలు అంటారు. నీలో (కలిలో) కనిపించే ఇతర దోషాలు ఆవాక్పారుష్యంలో పదహారవ వంతుకుకూడా చాలవు. ఈ విధంగా ధర్మ పరాయణుడు అయిన ఆ శిష్యుణ్ణి నిరంతరమూ వేధిస్తూ ఆ వేదధర్ముడు దైన్య గ్రస్తుడై మాటిమాటికీ నాకు ఆకలి, తినడానికి ఏదైనా పెట్టు అంటూ బాధించ సాగాడు.అయినా శ్రద్ధాళువు అయిన ఆ శిష్యుడు గురువును ఈశ్వరుణ్ణిగా భావించి అతడు పెట్టే బాధలన్నిటినీ సహిస్తూ గురువును సేవించేవాడు. గురువుగారి మనసు మృష్టాన్నాల మీదికి పోయినప్పుడెల్లా ఆ శిష్యుడు వెంటవెంటనే కాశీపురిలోనికి పరుగెత్తి భిక్షమెత్తి తీసికొని వచ్చి గురువుకు పెట్టేవాడు.తీర్థయాత్రల మీద కాని, దేవపూజనం మీద కాని, లౌకిక విషయాల మీద కాని, చివరకు తన దేహపోషణమీద కాని దీపకునకు శ్రద్ధ లేదు అహర్నిశలూ గురుపనే దైవంగా భావించి అన్య చింత లేకుండా ఆ గరువునే సేవిస్తూ ఉండే వాడు సుకృతి అయిన ఆ దీవకుడు తన గురువును సర్వ వ్యాపకుడు అయిన జనార్ధనుణ్ణిగా భావించేవాడు, వేదవేద్యుడు అయిన పార్వతీపతిని కూడా సాక్షాత్తు తన గురువునందే చూచేవాడు. భిక్షమెత్తి తెచ్చిన అన్నంలో అధిక భాగాన్ని గురువునకు సమర్పించి అతికొద్ది భాగంతో తన దేహయాత్ర జరుపుకొనేవాడు కంటికి నిద్ర లేకపోయినా సావధాన హృదయంతో గురువు ఏది కోరినా ఆయా వస్తువులను తీసికొనివచ్చి సమర్పించేవాడు, దీపకుడు ఏకాగ్రబద్ధితో, మిక్కిలి ఆదరంతో, భక్తిభావంతో గురు "సేవలో కాలం గడుపుతున్నాడు. ఒకప్పుడు కూడా దయారహితుడు కాకుండా, అసూయ చెందకుండా తాను కష్టపడుతున్నప్పటికీ, పరుషంగా మాట్లాడకుండా గురువు విషయంలో రెండో ఆలోచన లేకుండా, విరక్తిచెందకుండా తత్పరతతో గురు సేవలోనే దీపకుడు ప్రవృత్తుడై ఉన్నాడు.
ఏకాగ్ర చిత్తంతో ఆ దీవకుడు గురు సేవా పరుడై విసనకర్రతో విసురుతూ ఉండగా, ఒకనాడు హఠాత్తుగా విశ్వేశ్వరుడు తన ఎదుట సాక్షాత్కరించడం గమనించాడు.
10. విశ్వేశ్వరుడు దీపకునకు వరప్రదానం చేయుట :
విశ్వేశ్వరుడు : ఓ గురుభక్తా! మహాప్రాజ్ఞుడా! నీ గురుభక్తికి నేను మిక్కిలి ఆనందించాను. నీకు ఇష్టమైన వరం కోరుకోవలసింది.'
దీపకుడు: ఓ మృత్యుంజయా! మహాదేవా, పరమేశ్వరా! నా యెడల నీవు ప్రసన్నుడవు అయ్యావు నేను ఏమీ ఎరుగని వాణ్ణి మా గురువుగారిని అడిగి ఏమి కోరుకోవాలో చెబుతాను."
అని చెప్పి దీపకుడు గురువును ఇలా అడిగాడు 'ఓ గురువరా! అవి ముక్తేశ్వరుడు అయిన ఈశ్వరుడు ఉత్తమమైన వరాన్ని ఇస్తాను కోరుకోమన్నాడు. నీ ఆజ్ఞ తీసుకొని వరం కోరుకొంటాను అన్నాడు. మీ ఆజ్ఞతో మీ వ్యాధి సమూలంగా నాశనం అయ్యేటట్లు వరం కోరమంటారా? లేక మీకు ఏది ఇష్టమో చెబితే దాన్ని సమకూర్చేటట్లు ఈశ్వరుణ్ణి వరం కోరుతాను."
వేద ధర్ముడు అనఘా! దేవదేవుడు అయిన ఈశ్వరుణ్ణి రోగనాశనం చెయ్యమని వరంగా ఆడగరాదు. నేను స్వయంగా చేసిన పాపాన్ని స్వయంగా అనుభవించి శుద్ధుణ్ణి అవ్వాలి ఇతరత్రా మార్గం లేదు. భవరోగ నాశనమే కోరు కోవాలి కాని దేహరోగ నివృత్తిని కోరకూడదు.
అని గురువు చెప్పగా దీపకుడు ఈశ్వరని సన్నిదిని చేరి నమస్కరించి ఇలా అన్నాడు.
“దేవ దేవా. నేను ఏ వరమూ కోరను. నాకు ఏ వరము అక్కరలేదు" అన్నాడు దీపకుడు.
మాటిమాటికీ నీకు ఇష్టమైన వరం ఏదో ఒకటి కోరుకోమని శివుడు ఆన తిచ్చినా దీపకుడు ఒప్పుకోలేదు. అంతట శంకరుడు తన గణాలతోపాటు అదృశ్యం అయ్యాడు. అటు పిమ్మట నిర్వాణమండపంలో పార్వతీ సహితుడై ఆశీనుడై ఉన్నప్పుడు దేవతలందరూ వింటూ ఉండగా విష్ణుమూర్తితో ఇలా అన్నాడు:
'నారాయణా! అరవిందాక్షా! సదానందదాయకా! సంతోష కారణం అయిన విచిత్రమైన గురుభక్తిని నేను గమనించాను. '
11. గురుభక్తుడైన దీపకుని గూర్చిన శివవిష్ణు సంవాదము:
అని శివుడు అనగా విష్ణువు ఇలా ప్రశ్నించాడు:
"ఆ గురువు ఎవరు? ఆ శిష్యుడు ఎవరు? ఓ వృషభధ్వజా! అతని గురు భక్తి ఎట్టిదో సవిశేషంగా నాకు వివరించు' అని విష్ణువు అడగ్గా విశ్వనాధుడు ఇలా సమాధానం చెప్పాడు:
ఓ జనార్దనా! శ్రద్ధగా వినుము బాలుడైన దీపకుని గురుభక్తి చేత నేను ఆకర్షింపబడ్డాను. గోదావరీ తీర వాసీ మహాతపస్సంపన్నురూ కాశీ మాహాత్మ్యామును విశేషంగా తెలిసికొన్నవాడూ సర్వవస్తువులయందు విరక్తిభావం కలిగిన వాడూ శాంతుడూ అయిన వేదధర్ముడు అనే గురువు ఉన్నాడు.
అతనికి జితేంద్రియుడు అయిన దీపకుడు అనే శిష్యుడు ఉన్నాడు అటు వంటి గురుభక్తుణ్ణి ఇదివరకు నేను కనలేదు వినలేదు. అతనికి వరాలు ఇద్దామని నేను వెళ్ళాను ఎన్నివిధాల ప్రలోభ పెట్టినా చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన వరాలు ఏమి ఇస్తానన్నా అతడు ప్రలోభపడలేదు. గురువునందే నిశ్చలహృదయం కలవాడై గురుసేవకు తన దేహాన్ని అర్పించివేశాడు సకలశాస్త్ర సమ్మతమైన ఈ సేవను చూచి నీవూ నేనూ దేవతలూ పితృదేవతలూ సకల భూసురులూ అందరూ సంతోషింపవలసిందే. సర్వాత్మకుడు అయిన ఆ దీపకుడు గురువునందే సమస్తాన్నీ చూస్తూ సర్వదర్శకుడై ఉన్నాడు. నేను ఎంతని చెప్పను? నీవు ఆ దీపకుణ్ణి చూడడం యోగ్యంగా ఉంటుంది గురువే సర్వస్వం అని నమ్మే ఆ బాలుడు సంసార తమస్సును పోగొట్ట కలిగిన దీపం వంటివాడు. ధర్మ, జ్ఞానాది సకలవిషయాల్ని అతడు గురుమయంగా భావిస్తున్నాడు. గురుపాదాన్జాల్ని ధృఢంగా నమ్మి, అతడు వివిధ రూపాల్లో తన గురుభక్తిని ప్రదర్శిస్తూ ఆదర్శ మూర్తిగా ఉన్నాడు.
అని విశ్వేశ్వర ముఖం నుండి వెలువడిన దీపకుని ప్రశస్తిని సకల ధర్మ విదుడు అయిన విష్ణుమూర్తి విని గురుభక్తియందు ఏకాగ్రచిత్తం కలిగి ఉన్న ఆ దీసకుని వద్దకు వెళ్ళి సాక్షాత్కరించాడు. అప్పుడు విష్ణువు దీవకుని విషయంలో ఈశ్వరుడు చెప్పిన దానికంటే అధికంగానే గురుభక్తిని దర్శించి ముగ్ధుడు అయ్యాడు. దీపకుని పిలిచి 'నేను నీపట్ల ప్రసన్నుణ్ణి ఆయ్యాను. నీకు ఇష్టమైన వరాన్ని నిస్సంకోచంగా కోరుకో అని పలుకగా మూర్తీభవించిన గురుభక్తి అగు దీపకుడు విష్ణుమూర్తితో ఇలా అన్నాడు'
12. దీపక విష్ణు సంవాదము
'ఓ వాసుదేవా! శంఖచక్ర గదాధరా! నీకు సామస్కారము బాలుణ్ణి అయిన నాకు నువ్వు ఏ భక్తి విశేషం చేత ప్రసన్నుడవై సాక్షాత్కరించావో చెప్పు. మానవులు అనేక సాధన విశేషాలతో ఆత్మ స్వరూపుడవూ - జగదీశ్వరుడవూ అయిన నిన్ను భజిస్తూ ఉంటారు. ఓ హరీ! నిన్ను చూడలేకపోయినప్పటికీ సర్వవ్యాపివీ - అధోక్షజుడవూ - పరాత్పరుడవూ అయిన నిన్ను ఆత్మ రూపి నిగా భావిస్తాను, నేను బాలుణ్ణి, మూర్ఖుణీ,పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ కూడా నేను నీ నామస్మరణ కూడా చేసి ఎరుగను అయినప్పటికీ వరప్రదుడవు అయిన నీవు నాకు శ్రేష్ఠమైన వరాల్ని ఇవ్వడానికి దర్శనం ఇచ్చావు. ఇది నాకు చాలా విచిత్రంగా కనిపిస్తోంది."
విష్ణువు: 'ఓ దీపకా! నీకుగల శ్రద్ధ- ఇంద్రియనిగ్రహము, ముఖ్యంగా గురు భక్తి వలన నేను ప్రసన్నుణ్ణి అయ్యాను. గురుభక్తియుక్తులు అయిన వారు నాకు మిక్కిలి పూజ్యులు, వారిని నేను ప్రయత్నపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను.”