24, ఫిబ్రవరి 2026, మంగళవారం

దురాశ

 


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


' దురాశ ' మనిషిని కట్టుబానిసగా చేసి ఎలా ఆడిస్తుందో శ్రీ భర్తృహరి మహాయోగి ఇలా తెలియజేస్తున్నారు.


శ్లో// ఖలోల్లాపాః సోఢాః కధమపి తదారాధన పరై:/

నిగృహ్యాంతర్బాష్పం హసిత మపి శూన్యేన మనసా/

కృతో విత్త స్తంభ ప్రతిహత థియా మంజలి రపి/

త్వమాశే! మోఘాశే! కిమపరమతో నర్తయసి మామ్//


(నీచులకు సేవ చేస్తూ వారి దుర్భాషలన్నీ సహించాను. 

అవమానకరమైన వారి మాటలకు పొంగి పొంగి వస్తున్న కన్నీళ్లను లో లోపలే మ్రింగుకుంటూ శూన్యమైన మనస్సుతో పైకి వెడ నవ్వు నవ్వాను. 

అహంకారంతో మదించిన ధనవంతులకు(ఈ పదంతో అధికారంలో ఉన్నవారు కూడా సూచింపబడ్డారు) రెండుచేతులూ జోడించి నమస్కారాలు చేశాను.

ఓ పనికిమాలిన ఆశా!నాచేత ఇంకా ఏమి ఆటలు ఆడిస్తావు?).


చ// పలువలు పల్కుమాట లొకభంగి సహించితి, బాష్పవారి లో /

పలనె హరించి శూన్యమగు భావమునన్ వెడనవ్వు నవ్వితిన్ /

బొలుపఱి విత్తజాడ్య హత బుద్ధుల కంజలి చేసితిం గటా /

తలకక యింక నేపనికి దార్చెదు నన్ను దురాశ నీవిటన్ //

(ఏనుగు లక్ష్మణకవి)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-2-'26.

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - సప్తమి & అష్టమి - కృత్తిక -‌‌ ‌భౌమ వాసరే* (24.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

24ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

 *🌹24ఫిబ్రవరి2026🌹*    

   *దృగ్గణిత పంచాంగం* 

                       

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

  *ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి      : సప్తమి* ‌ఉ 07.01 *అష్టమి* రా.తె 04.51 ఉపరి *నవమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : కృత్తిక* మ 03.07 వరకు ఉపరి *రోహిణి*

*యోగం  : ఐంద్ర* ఉ 07.24 *వైధృతి* రా.తె 04.26 ఉపరి *విష్కుంబ*

*కరణం   : వణజి* ఉ 07.01 *భద్ర* సా 05.56 ఉపరి బవ రా.తె 04.51 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఉ 12.51 - 02.22*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*

*వర్జ్యం            : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.49 - 09.36 రా 11.07 - 11.56*

*రాహు కాలం  :మ03.17- 04.45*

గుళికకాళం      :*మ 12.21 - 01.49*

యమగండం    : *ఉ 09.25 - 10.53*

సూర్యరాశి : *కుంభం*                        

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.38*  

సూర్యాస్తమయం :*సా 06.21*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 06.29 - 08.49*

సంగవ కాలం       :*08.49 - 11.10*

మధ్యాహ్న కాలం    :*11.10 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31- 03.52*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ శుద్ధ అష్టమి*

సాయంకాలం      :*సా03.52 - 06.13*

ప్రదోష కాలం       :*సా 06.13 - 08.40*

రాత్రి కాలం       :*రా 08.40 -11.56*

నిశీధి కాలం      :*రా 11.56 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.50 - 05.39*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*రామరిణా కృతహృతౌ* 

*జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి* 

*సుశోధకారిన్*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచాంగం

 



23, ఫిబ్రవరి 2026, సోమవారం

మహాభారతము

🔯

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                1️⃣4️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

    

                    *144 వ రోజు*                    

*వన పర్వము షష్టమాశ్వాసము*


              *కబంధుడు*```


రామలక్ష్మణులు సీతను వెదుకుతూ దక్షిణ దిశగా వెళ్ళారు. దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు అది కూచున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కంబంధుడి పట్టు నుండి తప్పించుకో లేక పోయాడు. “అన్నా! శ్రీరామా! నన్ను రక్షించు. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా” అని అరిచాడు. 


రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడుగా మారి పోయాడు. 

“రామా! నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకు వెళ్ళి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋష్య మూక పర్వతం పై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నీవు సఖ్యం చేసిన నీ కార్యం సిద్ధిస్తుంది” అని చెప్పి గంధర్వుడు వెళ్ళి పోయాడు.```


                 *కిష్కింద*```


రామలక్ష్మణులు పంపా సరోవర తీరాన తమ పితరులకు తర్పణం విడిచారు. అక్కడి నుండి చాలా ఎత్తుగా కనపడు తున్న ఋష్యమూక పర్వతాన్ని చేరారు. ఋష్యమూక పర్వతం పైనున్న వానర రాజు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వారి వృత్తాంతం తెలుసుకు రమ్మని మంత్రి అయిన హనుమంతుని పంపాడు. 

హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించిన సకల వృత్తాంతం గ్రహించి సుగ్రీవునకు నివేదించాడు. రామలక్ష్మణులకు సుగ్రీనికి మైత్రి చేసాడు. సుగ్రీవుడు సీతాదేవి కిందకు జారవిడిచిన ఆభరణాలు చూపించాడు. రాముడు ఆ ఆభరణాలు గుర్తు పట్టాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన భార్యను అపహరించి తన మీద నిష్కారణ కక్ష పెంచుకుని తనను రాజ్యం నుండి వెడలగొట్టాడని తన అన్నను చంపి తనకు రాజ్యం ఇప్పించమని కోరాడు. బదులుగా సీతాన్వేషణలో తాను సాయం చేస్తానని చెప్పాడు. రాముడు అందుకు ఒప్పుకున్నాడు.```


              *వాలి వధ*```


అందరూ కిష్కిందకు బయల్దేరి నగరం వెలుపల నిలిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య తార “నాధా! సుగ్రీవుడికి ఏదో సాయం లభించినట్లు ఉంది. అయోధ్య రాజు దశరధుని కుమారులైన రామ లక్ష్మణులతో సుగ్రీవునకు మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుని సాయం కోరాడు. సుగ్రీవుడు అంగీకరించాడు. ప్రతిఫలంగా సుగ్రీవునకు సాయం చేస్తానని అన్నాడంట. మహా బలవంతులైన మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం ప్రమాదకరం” అని తార వాలిని వారించింది. 


కాని వాలి భార్యమాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. సుగ్రీవుని చూసి వాలి 

“ఓరీ! మంద బుద్ధీ నేను ఎన్నో మార్లు నిన్ను ఓడించి తరిమి వేసాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు. 


సుగ్రీవుడు “వాలీ! నేను భార్యను పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడనయ్యాను. నేను ఉండి చేసేదేముంది అందుకే యుద్ధానికి వచ్చాను” అని వాలితో అన్నాడు. 


వాలి సుగ్రీవులు చెట్లతోను, బండలతోను యుద్ధం చేసుకున్నారు. తరువాత ఒకరితోనొకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు. కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేక పోయాడు. సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్టూరంగా మాట్లాడాడు. రెండవ సారి రాముని సలహాతో గుర్తు కొరకు వనపుష్ప మాలను ధరించి సుగ్రీవుడు వాలితో యుద్ధంచేసాడు. రాముడు వేసిన బాణాలకు వాలి నేల కూలాడు. 

తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు. రాముడు చెప్పిన ధర్మసూక్ష్మాలను అంగీకరించి తనభార్యను సుగ్రీవునికి అప్పగించి కుమారుడైన అంగదుని యువ రాజుని చేసే బాధ్యత రామునికి అప్పచెప్పి వాలి ప్రాణాలు వదిలాడు. 


సుగ్రీవుడు రామునకు నమస్కరించి 

“రామా నీమాట నీవు నిలబెట్టు కున్నావు. ఇప్పుడు ఎండా కాలం తరువాత వర్షాకాలం సీతాన్వేషణకు ఇది తరుణం కాదు కనుక నేను వర్షాకాలం ముగియ గానే సీతాన్వేషణ ప్రారంభిస్తాను” అన్నాడు.```


            *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నక్షత్రం: ఉత్తరాభాద్ర

 


           *నక్షత్ర స్తోత్ర మాలిక*

                    

                 *26 వ రోజు* *నక్షత్రం: ఉత్తరాభాద్ర (Uttarabhadra)*


*అధిపతి: శని (Saturn)*

```

*ఆరాధించాల్సిన దైవం: అహిర్బుధ్న్యుడు(రుద్రుడు/శివుడు)


​*ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, మరియు శని దోష నివారణ, మానసిక ప్రశాంతత, మోక్షం కోరుకునే వారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం:


🙏శరభేశాష్టకం🙏


శ్రీ శివ ఉవాచ :


శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం.

శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః॥


ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్ .

ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే ॥


ధ్యానం:


జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం

నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహమ్ ।

శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం

ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజమ్ ॥


అథః స్తోత్రం:


దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ ।

శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥1॥


హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ।

మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥2॥


శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ।

జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥3॥


కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ।

భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥4॥


శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ।

ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥5॥


ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ ।

గుణాదిహీనాయ గుణత్రయాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥6॥


కాలాయ వేదామృతకందలాయ కల్యాణకౌతూహలకారణాయ ।

స్థూలాయ సూక్ష్మాయ స్వరూపగాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥7॥


పంచాననాయానిలభాస్కరాయ పంచాశదర్ణాద్యపరాక్షయాయ ।

పంచాక్షరేశాయ జగద్ధితాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ॥8॥

```

ఇతి శ్రీ శరభేశాష్టకమ్ ॥

--

```

*ఉత్తరాభాద్ర నక్షత్రం (Uttara Bhadrapada Nakshatra) జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాలలో 26వది, 

ఇది మీన రాశిలో 

3∘20′

3∘20′నుండి 

16∘40′

16∘40′

డిగ్రీల వరకు ఉంటుంది.

దీనికి అధిపతి శని, రాశ్యాధిపతి గురువు. 

*జ్ఞానం, దయ, స్థిరత్వం, మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి లక్షణాలు. 

ొ*ఈ నక్షత్ర జాతకులు ఉన్నత విద్యావంతులు, నిజాయితీపరులు మరియు హాస్యప్రియులు. 


*ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క ముఖ్య లక్షణాలు:


*అధిపతి: శని (Saturn).

*రాశి: మీన రాశి (Pisces).

*గణం: మనుష్య గణం.

*వృక్షం: వేప చెట్టు.

*చిహ్నం: శ్మశానంలో మంచం యొక్క వెనుక కాళ్లు లేదా కవలలు.

*దేవత: అహిర్ బుధ్న్య (అగ్ని దేవుడు/రుద్రుడు). 


*వ్యక్తిత్వ లక్షణాలు & జీవితం:

*స్వభావం: వీరు దయా గుణం, వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఇతరులను కించపరచరు మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు.

*జ్ఞానం: చాలా తెలివైనవారు, జ్ఞానాన్ని గౌరవిస్తారు, అలాగే మంచి వక్తలు (Speakers).

*కెరీర్: ఉన్నత స్థానాలను, అధికార పదవులను పొందుతారు. వీరికి వ్యాపారం, విదేశీ విద్య కలిసి వస్తుంది. సాధారణంగా 42 ఏళ్ల తర్వాత మంచి విజయం సాధిస్తారు.

*ఆర్థిక స్థితి: తెలివిగా డబ్బు ఆదా చేస్తారు, అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు.

*కుటుంబ జీవితం: అన్యోన్యమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు మరియు పిల్లలను బాగా ప్రేమిస్తారు. 


*అనుకూలమైన విషయాలు:

*నక్షత్రం: శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం రోజులలో, లేదా 8 అంకె కలిసివచ్చే తేదీలలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి.

*దానం: శనివారం నాడు నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి.

*మంత్రం: "ఓం అహిర్బుధ్న్యాయ నమః" అని జపించడం మంచిది. 

*ముఖ్య గమనిక: కోపం వీరిలో ఉన్నప్పటికీ, అది క్షణికమైనది మరియు వెంటనే తగ్గిపోతుంది. వీరు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ```


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఎలాంటి భోజనాన్ని చేయాలి?

 ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి...........!!

• , కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. 

• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు. 

• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు. 

• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 

• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.

• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం. 

• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 

• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.

• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది. 

• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి. 

• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.

• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.  

• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి. అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి.

• అప్పుడే బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది. 

• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.

• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.           

• రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది.

• భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.

• తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.  

• పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి. 

• ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.

• ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. 

• మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.

• భోజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.

• తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.

నాడి పరిజ్ఞానము

  నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట . 

 

 శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.

     

శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి 

   *  భూతనాడి .

   *  వాతనాడి .

   *  పిత్తనాడి .

   *  శ్లేష్మనాడి . 

   *  గురునాడి . 

       

       ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.

     

       ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .

       

      ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును . 


నాడి పరీక్షించు విధానం -

       

     వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను. 

పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను. 

 

వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి  - 

 

   వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను. 

  


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

        కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

       

                9885030034

గౌరీశంకర లను స్తుతిస్తూ

  🌸గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం🙏


సీ.  శ్రీపార్వతీవరా! శ్రితజన మందార !

      శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

      పాలించు సతతంబు భవుని రాణి!

వేద మంత్రాకార ! విశ్వ సంరక్షకా !

      శివకామసుందరీ చిత్తచోర !

అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

      ఆర్త జనోద్ధార ! యహి విభూష !


తే.గీ:

రమ్ము మముగావ పరమేశ రమ్యదేహ ! 

నిన్ను నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

పార్వతీ నాథ! శంకరా పరమపురుష!

శశిధరా ! యీశ ! గౌరీశ శరణు శరణు !


జయలక్ష్మి

కొత్త పథకం

  *ప్రభుత్వం కొత్త పథకం...*💥


ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు *"104"* ప్రత్యేక నంబర్ కానుంది. *"Blood_On_Call"* అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత,

*40 కిలోమీటర్ల* పరిధిలో, నాలుగు గంటల్లోపు,

రక్తం డెలివరీ అవుతుంది... 👍


బాటిల్ కు *రూ. 450/-* మరియు రవాణాకు *రూ.100/-* దయచేసి ఈ సందేశాన్ని మీరు సంప్రదించిన ఇతర స్నేహితులు, బంధువులు మరియు సమూహాలకు ఫార్వార్డ్ చేయండి.


Note --- *ఈ సౌకర్యం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది...*🤝🙏

ఆదిత్యుడే

 🙏🙏🙏

*శుభోదయం!*

*శుభ ఆదివారం!*

                °°°

*పితరో వసవస్సాధ్యా* 

*హ్యశ్వినౌ మరుతో మనుః* 

*వాయుర్వహ్నిః ప్రజాప్రాణ* 

*ఋతుకర్తా ప్రభాకరః ||*

   పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ఈ *ఆదిత్యుడే*. ప్రజలకు ప్రాణభూతమైనవాడు, వసంతాది ఋతువులకు కారణమైనవాడు ఈ *ఆదిత్యుడే!* 

(ఆదిత్య హృదయమ్)

                 °°° 

ౡనితాఖిలదైత్యాయ 

నిత్యానందస్వరూపిణే|

అపవర్గప్రదాయార్త- 

శరణ్యాయ నమో నమః||

(సూర్యాష్టోత్తర శతనామస్తోత్రమ్)

~~~~~~~~~~~~~~~~~~~

సేకరణ :-

గొట్టుముక్కుల రామకృష్ణ.

సోమవారం, ఫిబ్రవరి 23, 2026

 卐🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️卐

సోమవారం, ఫిబ్రవరి 23, 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి      : *షష్ఠి* ఉ10.03 వరకు

వారం   : *సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం : *భరణి* సా5.33 వరకు

యోగం : *బ్రహ్మం* ఉ11.30 వరకు

కరణం  : *తైతుల* ఉ10.03 వరకు

తదుపరి *గరజి* రా8.56 వరకు

వర్జ్యం  :  *తె4.44 - 6.14*

దుర్ముహూర్తము : *మ12.36 - 1.22*

మరల *మ2.55 - 3.41*

అమృతకాలం : *మ1.02 - 2.33*  

రాహుకాలం     : *ఉ7.30 - 9.00* 

యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం : 6.29 || సూర్యాస్తమయం: 5.59

ప్రదోష కాలం : 4.44-5.59pm

సర్వేజనా సుఖినోభవంతు 

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

********************************************************************************************

🙏🌷ఓం నమః శివాయ🌷🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మాడ వీధి అంటే ఏమిటి?*

 

తిరుమల…


        *మాడ వీధి అంటే ఏమిటి?*

                  ➖➖➖✍️


*తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు:*


*తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది.*


*ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు.*


*శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.*


 *తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.*


*1.తూర్పు మాడ వీధి:*

*ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.*


*ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు.*


*ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.*


*క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.*


*మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.*


*2. దక్షిణ మాడ వీధి:*

*ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట. ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది.*


*ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.*


*దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది. తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.*


*3. పడమర మాడ వీధి:*

*ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం,వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.*


*4. ఉత్తర మాడ వీధి:*

*ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.*


*ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది.*

*తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.*


 *ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.*


*ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.*


*ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.*


*తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా.. మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా.. ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

        *శ్రీ మహావిష్ణు పురాణం*

               ➖➖➖✍️ 

                  3 వ భాగం 

 

*పరాశర మహర్షి కథ:*```

వసిష్ట మహర్షికి అరుంధతిలకు నూరుగురు కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు శక్తి మహర్షి. అతనికి అదృశ్యంతి అర్ధాంగి అయ్యింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాకముందు ‘గాధిరాజు కుమారుడు కౌశికుడు’ అనే నామంతో రాజు అయ్యాడు. 


ఒకసారి సేనలతో వేటకు వెళ్లి అలసి వసిష్ట మహర్షి ఆశ్రమానికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు.


వసిష్టుడు కౌశికుని, అతని సేనలను ఆహ్వానించి ఆదరించి “విందుభోజనం ఏర్పాటు చేస్తాను, ఆరగించండి” అని అన్నాడు. 


రాజు అనే అహంకారం, గర్వం కలిగిన కౌశికుడు “నాకు,నా అపార సైన్యానికి విందుభోజనం అడవిలో ఎలా ఏర్పాటు చేయగలరు? చేయలేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను” అన్నాడు. 


సరేనన్న వసిష్ట మహర్షి “మీరు సమీపంలో గల నదిలో స్నానాదులు చేసి రండి. విందుభోజనం సిద్ధం అవుతుంది” అని వారిని నది వద్దకు పంపాడు.  


కౌశికుడు,అతని సైనికులు స్నానాదులు చేసి రాగానే షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అందరూ కడుపు నిండా తిని తృప్తి చెందారు.


కౌశికుడు ఆశ్చర్యం చెంది “కారడవిలో ఇంతమందికి విందు భోజనం ఎలా ఏర్పాటు చేయగలిగారు” అని వసిష్టుని అడిగాడు. 


తన వద్ద గల శబల అనే కామధేనువు కుమార్తె అయిన గోమాతను వసిష్టుడు చూపించి, “నా తపస్సుకి మెచ్చి దేవతలు ఈ గోవుని ఇచ్చారు. ఈ గోమాత కోరినవన్ని ప్రసాదిస్తుంది” అని చెప్పగానే కౌశికునికి అసూయ జనించింది. 


“ఇటువంటి గోవు రాజుల వద్ద ఉండాలి. సకల ప్రజలకు, రాజ్యానికి ఉపయోగపడుతుంది. నాకు ఇవ్వండి” అని అడిగాడు.


వసిష్టుడు నిరాకరిస్తూ “గోమాత తనంత తానుగా నా దగ్గర ఉంటోంది. తనకు నచ్చినవారి వద్దనే ఉంటుంది. బలవంతాన ఎవరూ తీసుకెళ్లలేరు” అనగానే అహంకారం, గర్వం కలిగిన కౌశికుడు “నేను ఈ దేశరాజుని. నా సేనలతో ఈ శబల గోవుని తీసుకెళ్లే అధికారం నాకుంది” అని సైనికులను గోవుని, దూడని తమ వెంట తీసుకు రమ్మని ఆదేశించాడు. 


వసిష్టుడు శబలకు నమస్కరించి మౌనంగా ఉన్నాడు.


శబల శరీరం నుండి అశేష సైన్యం పుట్టుకు వచ్చి కౌశికుని సేనలను క్షణాలలో నాశనం చేసింది. 


కౌశికుడు అవమానం పొంది అనేక అస్త్రశస్త్రాలను వసిష్టుడిపై ప్రయోగించాడు. 


అవి అన్ని వసిష్టుడి తేజస్సులో కలసిపోయాయి. వసిష్టుడి తపశక్తి ముందు తన రాజశక్తి పనికిరాదు అని కౌశికుడికి అర్ధం అయ్యింది. తాను వసిష్టుడి వలె బ్రహ్మర్షి అయ్యి తపశక్తి సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు.


రాజ్యం కుమారులకు అప్పగించి విశ్వామిత్రుడిగా మారి తపస్సుకి వెళ్లి పోయాడు. కానీ మనస్సులో వసిష్టుడి పై ద్వేషం, శత్రుత్వం పెంచుకున్నాడు. అవకాశం లభించినప్పుడల్లా వసిష్టుని ఓడించడానికి, పరాభవించడానికి ప్రయత్నించేవాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యేవాడు. ద్వేషం పెరిగి పెరిగి వసిష్టుడు, వసిష్టుడి కుటుంబాన్ని నాశనం చేయాలనే పంతం పెంచుకున్నాడు.


కొంతకాలానికి శక్తి మహర్షి భార్య అదృశ్యంతి గర్భవతి అయ్యింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరాశరుడు తండ్రి, తాతల నుండి వేదశాస్త్రాలు, పూర్వ కల్పాలలో జరిగిన పురాణ కథలు విని ఆకళింపు చేసుకున్నాడు. “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రం అనుక్షణం జపించడం ఆరంభించాడు.


ఇక్ష్వాకు వంశ రాజైన కల్మషపాదుడు వేటకు వచ్చి తనకు అడ్డంగా పాదచారియై నడుస్తున్న శక్తి మహర్షి దారి ఇవ్వలేదు అన్న కోపంతో “యాచక బ్రాహ్మణా! దారి ఇవ్వు” అని అశ్వాన్ని పట్టుకున్న కళ్ళెంతో కొట్టి అదిలించాడు. 


శక్తికి కోపం వచ్చి “రాజు అనే అహంకారంతో బ్రాహ్మణుని అవమానించావు. కనుక బ్రహ్మరాక్షసుడివి అవ్వు!” అని శపించాడు.(ఈ శాపం వసిష్ట మహర్షి ఇచ్చాడు అని భారతంలో ఉంది).


కల్మషపాదుడు బ్రహ్మరాక్షసుడై నరమాంస భక్షణ చేస్తూ జీవించసాగాడు. 


ఈ సంగతి తెలిసిన విశ్వామిత్రుడు తన తపఃశక్తితో కల్మషపాదుని వశం చేసుకుని, వసిష్టుడు, అతని కుమారులపై దాడికి పంపాడు. 


వసిష్టుడు తపస్సుకి వెళ్లడంతో కల్మషపాదుడు శక్తితో సహా వసిష్టుని నూరుగురు కుమారులను చంపివేశాడు.  


వసిష్టుడు పుత్రుల మరణం పై దుఃఖపడినా విశ్వామిత్రుడి పై ప్రతీకార చర్యలకు పాల్పడలేదు.


అదృశ్యంతి మాత్రం తన భర్త శక్తిని చంపిన రాక్షస దానవ జాతిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని పట్టు పట్టింది. 

జన్మించిన పరాశరుడు ఇవేమి పట్టించుకోకుండా నారాయణ స్మరణలో ఉండటం చూసి ఆగ్రహం చెంది “కుమారా! భర్తను కోల్పోయిన తల్లిని పట్టించుకోకుండా పరమాత్మ ధ్యానంలో కాలం గడుపుతున్నావు” అని దుఃఖించసాగింది.


తల్లి దుఃఖానికి చలించిన పరాశరుడు అదృశ్యంతిని “ఏమి చేస్తే నీ దుఃఖం తీరుతుంది?” అని అడిగాడు.  


“నీవు పుట్టక ముందే నీ తండ్రిని, పినతండ్రులను చంపి నిన్ను అనాథను చేసిన దానవ జాతిని నాశనం చేసి నా పగ తీర్చి దుఃఖము తొలగించుము” అని చెప్పింది. 


తల్లి కోరిక తీర్చడానికి పరాశరుడు ఆశ్రమ ధర్మం వదిలి శత్రు సంహారాలైన అధర్వణ మంత్రాలతో యాగం చేయడం ఆరంభించాడు.


మంత్రాల మహిమకు దానవులందరూ వచ్చి యాగకుండపు అగ్నిజ్వాలలలో పడి బూడిదైపోసాగారు. 


దానవులు పరుగు పరుగున వసిష్ట మహర్షి వద్దకు వెళ్లి మనవడు పరాశరుడు చేసే యాగం నుంచి రక్షించి ప్రాణాలు కాపాడమని శరణు వేడారు. 


వసిష్టుడు పరాశరుడు వద్దకు వచ్చి “పరాశరా! నారాయణ నామంతో పునీతమైన నీ మదిలో పగలు- ప్రతీకారాలు ఉండకూడదు. నీ తండ్రి, పినతండ్రులు దానవుల చేతిలో మరణించడం విధి లిఖితం. శాంతించి యాగం ఆపివేయి” అని ప్రబోధించాడు.


తాత మాటకు అంగీకరించి పరాశరుడు యాగం ఆపివేశాడు. 


దానవ, రాక్షస వంశ మూల పురుషుడు, బ్రహ్మపుత్రుడు అయిన పులస్త్య బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై పరాశరుని వరం కోరుకోమన్నాడు. 


పరాశరుడు నమస్కరించి “మహాత్మా! శబ్దబ్రహ్మ అయిన పరమాత్మ విష్ణువు మహిమను స్మరణమాత్రం చేత గ్రహాంచగల దివ్య జ్ఞానాన్ని, భగవంతుని లీలా పురాణాలను మధురంగా వినిపించగల ప్రతిభా పాండిత్యాలను ప్రసాదించండి” అని కోరాడు.


పులస్త్య బ్రహ్మ సంతోషించి “పరాశరా! తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రజపం చేశావు. నారాయణుని పరమ భక్తుడివి. నీవు కోరిన వరం ఇస్తున్నాను. జగదాధారుడైన విష్ణుమూర్తి లీలా విశేషాలను మొదట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి వివరించాడు. దక్ష ప్రజాపతి పురుకుత్సునికి, పురుకుత్సుడు నాకు ఉపదేశించాడు. ఈ పురాణ పాండిత్యం అంతా నీకు కరతలామలకం అవుతుంది.


నీవు ప్రవచనం, గానం ద్వారా లోక వ్యాప్తి చేసి కీర్తి పొందుతావు. నీ ఆరాధ్య దైవం విష్ణువు నీకు కుమారుడై జన్మించి కృష్ణద్వైపాయనుడు అనే నామం పొంది అష్టాదశ పురాణాలు గా రచించి లోకానికి అందిస్తాడు. నీకు అత్యంత ప్రీతిప్రాతమైన “మహావిష్ణు పురాణాన్ని” నీ గ్రాత మాధుర్యంతో, దివ్యజ్ఞానంతో లోకప్రచారం చేసి ధన్యత చెందుము” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో-


-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు

```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*658 వ రోజు*

సాంఖ్యము

పరమశివా ! యోగము గురించి చెప్పాను. ఇప్పుడు సాంఖ్యం గురించి చెప్తాను. సాంఖ్యయోగులు యోగము, సాంఖ్యము ఒకటే అని భావించి ఈ భవసాగరమును దాటి తరిస్తారు. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే అహంకారము, అహంకారము కంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి గొప్పవి. వీటన్నింటికీ అధికుడు పురుషుడు. పరమశివా ! పంచభూతములు ఐదు, వాటి గుణములు ఐదు, ఇంద్రియములు పది, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి నాలుగు. మొత్తము 24 తత్వములు. చేతనుడైన పురుషుని ఆశ్రయించుకుని అచేతనమైన ప్రకృతి కూడా చైతన్యవంతం ఔతుంది. మొత్తము 23 తత్వములు 24 వ తత్వమైన ప్రకృతి అనే మహాసముద్రపు అలల మీద తేలియాడుతూ ఉంటాయి. పురుషుడు గుణరహితుడైనా ప్రకృతితో చేరిన పురుషుడు గుణములు కలవాడుగా ఔతాడు. అందు వలన మిగిలిన 23 తత్వములు కూడా పురుషుడికి వాటి వాటి గుణములు ఆపాదిస్తాయి. తాను వేరు ఈ ప్రకృతి వేరు వేరు ఈ 23 తత్వములు వేరు అని తెలుసుకుని ప్రకృతిని ఉపేక్ష చేసి పొగలేని నిప్పులా ప్రకాశిస్తాడు. అలా కాక ఈ ప్రకృతే తానని అహంకరించి తానే ఈ సృష్టికి లయకు కర్త అని భావించిన పురుషుడు వికారమును పొంది ఈ ప్రకృతిని ఎదిరించ లేక దానికి వశుడై తమోగుణ ప్రధానములైన ఈ ప్రాపంచిక సుఖములలో మునిగి పోతాడు. 25వ తత్వమైన పురుషుడు ప్రకృతిని పట్టించుకొనక ఉపేక్షించిన 26వ తత్వమైన పరమానంద స్థితిని పొందుతాడు. కనుక పురుషుడు సత్యగుణమును ఆశ్రయించి తత్వజ్ఞానము అలవరచుకుంటే ప్రకృతిలో లీనంకాకుండా చిదానంద రూపుడౌతాడు. ఈ 26వ తత్వమే విద్య. కాని దానికి విద్య అవిద్య అనే గుణములు లేవు. దానికి ఆది అంతము లేదు, మార్పు లేదు, అజామరుడు, అనంతుడు, ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు

సాంఖ్యయోగుల గుణములు

మహాదేవా ! ఈ సాంఖ్యయోగమును అభ్యసించిన వారు చక్కని జ్ఞానసంపదతో ప్రకాశిస్తారు. రాబోయే అరిష్టములను ముందుగా కనిపెట్ట కలిగిన పాటవము కలిగిఉంటారు. కనుక రాబోయే అరిష్టములు అరికట్టగలుగుతారు. యోగాభ్యాసకులైన మునులు తమకు రాబోయే అరిష్టములనుముందే తెలుసుకుని సర్వాంగదారణతో అన్ని తత్వములను ఏకంచేసి మృత్యువును జయిస్తారు. నీటిలో చేప మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగే తాను కూడా ఈ లోకములో సంచరిస్తుంటానని తెలుసుకున్న సాధకుడు ఈ ప్రకృతి నుండి విడివడి అవ్యయత్వము పొందుతాడు. తామరాకు మీద నీటిబొట్టులా పురుషుడు ఈ లోకములో సంచరిస్తూ కూడా తత్సంబంధమైన వికృతికి లోను కాకుండా నిర్లిప్తంగా, నిశ్చలంగా, అజరామరంగా వెలుగొందుతాడు. ఈ ప్రకారంగా ప్రకృతిని వదిలి పెట్టిన 25వ తత్వమైన పురుషుడు 26వ తత్వమును పొంది విమల, శివ, నిరంజన స్వరూపుడై వెలుగొందుతాడు. పరమశివా ఈ జ్ఞానమును నాకు, లోకానికి పూర్వము నా గురువైన కపిలమహర్షి అనుగ్రహించాడు. ఆయన కింద శిక్షణపొందిన అనేక మంది శిష్యులు ఆయన బోధనతో జ్ఞానవంతులు అయ్యారు. నేను కూడా అనేక మంది శిష్యులకు ఈ జ్ఞానాన్ని బోధించాను. ఎందరో దివ్యమునులు దీనిని శ్లాఘించారు. గార్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైన మహా మునులు ఈ బోధనతో తమ తమ మనసులోని సందేహాలను తీర్చుకున్నారు. వారు ఈ ప్రకృతి సంపర్కము వదిలి దివ్యత్వము పొందారు. పరమశివా పురుషుడు ప్రకృతితో కలవడమే బంధము కలవకుండా ఉండడమే మోక్షము " అని చెప్పి సనత్కుమారుడు ఆకాశమార్గాన వెళ్ళి పోయాడు. శివుడు కూడా తన దివ్యమైన మనో పధంలో విహరించసాగాడు " అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ దేవనాథస్వామి ఆలయం

  🕉 మన గుడి : నెం 1395


⚜  తమిళనాడు : తిరువంతిపురం


⚜  శ్రీ దేవనాథస్వామి ఆలయం



💠 దేవనాథ హేమoభుజవల్లి ఆలయం ( తిరువంతిపురం కోయిల్ అని కూడా పిలుస్తారు )( తిరువాహీంద్రపురం ) తమిళనాడులోని కడలూరు శివార్లలోని తిరువంతిపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం , ఇది విష్ణువు మరియు లక్ష్మీ దేవతకు అంకితం చేయబడింది . 


💠 ఇది విష్ణువుకు అంకితం చేయబడిన 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలలో 72వ దివ్యదేశము 


💠 పురాణాల ప్రకారం, ఆదిశేషుని గౌరవార్థం ఈ ప్రాంతాన్ని తిరువహీంద్రపురం అని పిలిచేవారు, అతన్ని మొదట వహీంద్రుడు అని పిలుస్తారు. 


💠 వహీంద్రుడు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నాడని నమ్ముతారు. కాలక్రమేణా తిరువహీంద్రపురం తిరువహీంద్రపురంగా మారింది. 


💠 అహీందీరన్ ( ఆదిశేషన్) ఈ ఆలయ పెరుమాళ్‌ను పూజించినందున, ఈ ప్రదేశం "అహీందీరపురం" అని పిలువబడింది, తరువాత ఇది ప్రస్తుత (తిరు) వందిపురంగా మారింది. 


💠 ప్రధాన దేవత దేవనాథ మరియు హేమభుజవల్లి అయినప్పటికీ, ఈ ఆలయం హయగ్రీవుడికి ప్రసిద్ధి చెందింది . 


💠 దక్షిణ భారతదేశంలో కొండపై హయగ్రీవ మందిరం ఉన్న ఏకైక చారిత్రక ఆలయం ఈ ఆలయం.


💠 హయగ్రీవ అవతారం విష్ణువు యొక్క 10 అవతారాలలో ఒకటి కాదు . 

ఈ హయగ్రీవ అవతారంలో, మహా విష్ణువు వేదాలను తిరిగి పొందడానికి అవతారం ఎత్తి  సరస్వతి మరియు బ్రహ్మలను జ్ఞానానికి దేవతలుగా చేసాడు.


🌀 స్థలపురాణం 🌀


💠 ఒక సమయమున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ముఖమును ఆట పట్టించెను. అంతట ఆ దేవి కోపములో శ్రీ మహావిష్ణువు ముఖము గుర్రం మొహం లా మారిపోవునట్లు శపించెను.


💠 ఆ దంపతులు ఏమి ఆచరించినను సర్వము లోక కళ్యాణమునకే కదా.

జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు భవిష్యత్తును అంతరంగమున భావించియే ఈ సన్నివేశమును సృష్టించెను . 


💠 హయగ్రీవుడు అను రాక్షసుని వధించుటకై అవసరమగు రీతిని తన ముఖమును హయగ్రీవ మూర్తివలె మార్చుకొని ఆ రాక్షసుని వధించెను .


💠 హయగ్రీవ రాక్షసుడు వేయి సంవత్సరములు పరాశక్తి అనుగ్రహమునకై తపస్సు చేసి ప్రకృతి విరుద్ధముగా , తనకు మరణము అసంభవము అగునట్లు వరమును కోరుకొనెను . 

పరాశక్తి అది సృష్టి విరుద్ధము అని బోధించెను . అంతట ఆ రాక్షసుడు తప్పనిసరి అయినచో తనకు సరియగు తన రూపము గలవాని వలననే మరణము సంభవించునట్లు కోరగా పరాశక్తి ఆ వరమును అనుగ్రహించెను . 


 💠 ఆ హయగ్రీవ రాక్షసుడు దేవతలను జయించి సకల జగత్తును కల్లోల పరచుచూ , మునులను ప్రజలను నానావిధముగా హింసకు గురి చేయుచుండెను . 


💠 దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మను ఆదేశించి తనకు హయగ్రీవ రాక్షసుని వలె ముఖము , తల ఇమ్మని అడిగి అవి గ్రహించి ఆ రాక్షసుని వధించెను . 

ఆ విధముగ లక్ష్మీదేవి కోపమున నుడివిన మాటలు లోకకళ్యాణము కొరకే ఉపయోగపడినవి.


💠 ఆలయమునకు ప్రక్కన ఒక ఔషధగిరి కలదు . 

ఇది గొప్ప మహిమగల మూలికలకు నిలయము . 

రామాయణ కాలమున అంజనేయుడు సంజీవని పర్వతమును తీసికొని పోవుచున్నప్పుడు కొద్ది భాగము విరిగి ఈ స్థలమున పడి ఈ ఔషధగిరి వెలసినది అని చెప్పుదురు . 


💠 సాధారణముగా సర్పపూజలు చేసి సర్పముల మట్టి పుట్టలలో పాలు పోసి నివేదించుదురు . 

కాని ఈ స్థలమున ఆలయమున గల శేష తీర్థము అను బావిలో పాలు పోయుదురు . 

ఈ బావిలోని నీటితో వంటచేసి పెరుమాళ్ కు నైవేద్యము చేయుట , గరుడ తీర్థముతో తిరుమంజనము చేయుట ఇచ్చటి ఆచారము .

   

💠 పాండ్యనాడున గల వానమామలై దివ్యదేశము బావిలోని నీటిలో నుండు ఒక నూనె వలన సకల రోగములు నయమగు విధముగా ,ఈ దివ్య దేశముననూ పెరుమాళ్ సకల రోగములను నయము చేయును . 

వానమామలై మరియు ఈ తిరు వహీంద్రపురముననూ పెరుమాళ్ దేవనాయకన్ పేరున దర్శనమిచ్చును .


💠 ఈ ప్రదేశంలో మొదట శివాలయం ఉండేదని నమ్ముతారు . శైవాభిమాని అయిన చోళ పాలకుడు తన రాష్ట్రంలోని విష్ణు ఆలయాన్ని కూల్చివేసేందుకు అనుకున్నాడు. శివాలయాలలో కనిపించే వినాయగర్ మరియు దక్షిణామూర్తి చిత్రాలను చూసి , అతను ఆశ్చర్యపోయాడు. 


💠 శ్రీ మహావిష్ణువు అతనికి శివుని రూపమున త్రిశూలధారియై త్రినేత్రునిగా జటాధారిగా దర్శన మిచ్చి , శివ-విష్ణు రూపములు వేరైననూ భగవంతుని ఒక్కనిగానే భావించుకొనవలయునని ఉపదేశించి , వైరములు మహాదోషము అని బోధించెను .


💠 అందుచే ఈ స్థలమున దేవనాయక పెరుమాళ్ ఫాలనేత్రముతో త్రినేత్రునిగ జటాధారియై శంఖ చక్రములు , పద్మములు ధరించి దర్శనమిచ్చును . 

గరుడుడు , నర్పములు వైరులే అయినను ఈ దివ్య దేశమున శ్రీమన్నారాయణుని అర్చింతురు .


💠 గర్భగుడిలో కూర్చున్న భంగిమలో భార్య హేమభుజవల్లి, వైకుంఠ నయగి మరియు అమృతవర్షిణి అని కూడా పిలుస్తారు.


💠 సాధారణ పూజలతో పాటు, కృష్ణ జయంతి, రామ నవమి, వైకుంట ఏకాదశి, దీపావళి, ఆది పూరం, మరియు 10 రోజుల చితిరై పండుగను ఏప్రిల్ - మేలో రథోత్సవంతో జరుపుకుంటారు.


💠 తమిళనాడులోని ఇతర విష్ణు దేవాలయాలలో వలె, పూజారులు బ్రాహ్మణ ఉప-కులమైన శ్రీవైష్ణవ వర్గానికి చెందినవారు. 



💠 కడలూరు నుండి దాదాపు 5 కి.మీ , పాండిచ్చేరి నుండి 30 కి.మీ,


రచన

©️ Santosh Kumar

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝  *నాఽద్రవ్యే నిహితా కాచిత్*

           *క్రియా ఫలవతీ భవేత్* |

           *న వ్యాపారశతేనాఽపి*

           *శుకవత్ పాఠ్యతే బకః* ||


తా𝕝𝕝 *అయోగ్యమైన వస్తువు యెడల చేసిన క్రియ ఎంత ప్రయత్నవంతమైననూ ఫలవంతము కానేరదు*..... *ఎన్ని ప్రయత్నములు చేసినను కొంగను చిలుకవలే పలికింపవీలుకాదు కదా!*

*ఉపయోగం లేని పని విషయంలో... ఎంత ప్రయత్నం చేసిన ఫలితం ఉండదు అని భావన*... 🧘‍♂️💫


✍️🌹💐🌸🙏


.

గాయత్రి గురించి

  గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి............!!


వేదవ్యాస మహర్షి - గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో 

 ' బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ' అని చెప్పబడింది.


విశ్వామిత్రుడు - " బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.


దేవీభాగవతము - గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.' తత్ సవితుర్వరేణ్యం భర్గః ' 


కూర్మపురాణము - ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు 

🚩🚩🚩

యాజ్ఞవల్క్యుడు - ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.

🚩🚩🚩

ఆర్షసూక్తి - 'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం' 

🚩🚩🚩

భీష్మాచార్యులు - ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు

🚩🚩🚩

అత్రి మహర్షి భవిష్య పురాణం - సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు

🚩🚩🚩

లఘు అత్రి సంహితా - గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి

🚩🚩🚩

పద్మపురాణం పరాశర మహర్షి - గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి

🚩🚩🚩

అగ్నిపురాణం - ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు 

🚩🚩🚩

శంఖ స్మృతి - నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు

🚩🚩🚩

సూత సంహితా యజ్ఞవైభవ ఖండం - అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు

🚩🚩🚩

నారద మహర్షి - గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు 

🚩🚩🚩

వశిష్ట మహర్షి - మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.

🚩🚩🚩

మహాత్మాగాంధీ - నిత్యం గాయత్రిని జపించు వారికి ఆత్మోన్నతి మరియూ రోగనాశనం ఆపద నాశనం‌ జరుగును.

🚩🚩🚩

ఆదిశంకరులు - గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.


_అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది..._

ఓం తత్సత్...🙏

మత్తకోకిల

  *మత్తకోకిల*


*భాష తల్లిని గౌరవించిన పండితాలికి జీవమౌ*

*దోషమున్నను చూడబోకుము తోచినట్టివి వ్రాయగా*

*పోషణంబును చేయకున్నను బోసిపోవును నూహలే*

*భూషణంబుగ పద్యలేఖన పూనుకొమ్మిక పండితా*

కవితల ఆహ్వానం*

 *3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా – కవితల ఆహ్వానం*

అమలాపురంలో 2026 ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో చైతన్య రాజు గారు నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా

‘తెలుగు తల్లికి వేలాది కవితలతో నీరాజనం’ కార్యక్రమానికి

కవులు, రచయితలు, విద్యార్థులు మరియు తెలుగు భాషాభిమానులు తమ 4–6 పంక్తుల కవితలు / పద్యాలు / స్తోత్రాలు పంపవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

📅 చివరి తేదీ: *గడువు పెంచడం జరిగింది*

కవితలు పంపించడానికి: QR CODE SCAN చేయండి

📞 వివరాలకు : 77949 01609

*తెలుగు భాషా వైభవాన్ని కవితల ద్వారా చాటుదాం.*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe2n0Hh8BnVvDMxNcOuev8jx_HBV8sgcnFDPLofIjhfxkKlSQ/viewform

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*659 వ రోజు*

పవిత్ర తీర్ధము

ధర్మరాజు " పితామహా ! ఎన్నోతీర్ధాలు ఉన్నాయి కదా ! అందులో పరమ పవిత్రమైన తీర్ధము ఏది వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తీర్ధములు అన్నీ మేలైనవే. అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమి లేదు. అన్ని తీర్ధములలో మానసతీర్ధము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానము ధృతి అనే సరోవరము. ఎవరైతే రజస్సు, తమోగుణాలను పక్కననెట్టి సత్యాన్ని చేతధరించి ఆ సరోవరంలో స్నానము చేస్తాడో అతడు పరిశుద్ధుడౌతాడు. రాగద్వేషములను వదిలి ఇంద్రియనిగ్రహము పాటించు మహాత్ములందరూ పవిత్రతీర్ధముతో సమానులే. వారిని సేవించడం ద్వారా మానవుడికి పుణ్యతీర్ధసేవనఫలం దక్కుతుంది. తపస్సుచేయడం, ఇంద్రుయనిగ్రహము కలిగి ఉండడం, అహింసనుపాటించడం, మనస్సును నిగ్రహించడం, శుభ్రతకలిగి ఉండడం ఇవన్నీ పుణ్యతీర్ధనసేవతో సమానములే. పైగుణములు లేకుండా కేవలం నదీజలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్ధసేవన ఫలము దక్కదు. కేవలం శరీరము శుభ్రపడుతుంది కాని మనసు శుభ్రపడదు కదా ! దొరకని వాటి కొరకు ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడు తృప్తితో సంతృప్తితో ఉండడం, ఆశాపాశములు విడిచి పెట్టడం పాటించే నరులకు వేరు తీర్ధములు అవసరం లేదు " అని భీష్ముడు పలికాడు.

ఉత్తమ పదము

ధర్మరాజు " తాతగారు ! మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమపదము చేరుకుంటాడు. మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచి పెట్టి తనతో దేనిని సాయంగా తీసుకు వెడతాడు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు" ధర్మనందనా ! నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి మాత్రమే తగిన వాడు. ఆయన ఇక్కడకు వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి తెలుసుకో " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతడికి ఎదురేగి బృహస్పతికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనము మీద ఆసీనుడిని చేసి ధర్మరాజు తాను ముందు భీష్ముడిని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పుట్టే ముందు, చచ్చిన తరువాత, పుణ్య లోకములలోను, నరకంలోను జీవుడు ఉంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు స్నేహితులు శ్మశానం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి పోతారు. నరుడు చనిపోయిన తరువాత అతడి ధర్మమే అతడికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మకార్యములు చెయ్యాలి. అలా ధర్మకార్యములు చేయని వాడు, ధర్మము వదిలి ప్రవర్తించే వాడు, నరకానికి పోతాడు " అని పలికాడు బృహస్పతి.

జీవుడు ధర్మము

ధర్మరాజు " ఈ శరీరాన్ని వదిలపెట్టి వెళ్ళే జీవుడిని ధర్మము ఎలా అనుసరిస్తుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పంచభూతములు, వాటి గుణములు అయిన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులూ బుద్ధి, ధర్మము జీవుడిని అనుసరించి వెడతాయి " అని పలికాడు. ధర్మరాజు " మహాత్మా ! రేతస్సు ఎలా ఏర్పడుతుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! మానవుని శరీరము పంచభూతాత్మకము. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం దేహాన్ని పోషిస్తుంది. మానవుడిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భాశయము చేరిన రేతస్సు గర్భము ధరింపచేసి పిండరూపము పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలముగా సుఖములు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖములు అనుభవిస్తాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు ధర్మాధర్మములు అతడికి సుఖదుఃఖములు కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యములు చేయాలి. పాపకార్యములకు దూరంగాఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యములు చేసిన వారు మానవజన్మకు బదులు పశుపక్ష్యాదులుగా క్రిమి కీటకాలుగా జన్మిస్తాడు. అదే నరకము. నరకము అంటూ వేరీది లేదు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్ర*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*659 వ రోజు*

పవిత్ర తీర్ధము

ధర్మరాజు " పితామహా ! ఎన్నోతీర్ధాలు ఉన్నాయి కదా ! అందులో పరమ పవిత్రమైన తీర్ధము ఏది వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తీర్ధములు అన్నీ మేలైనవే. అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమి లేదు. అన్ని తీర్ధములలో మానసతీర్ధము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానము ధృతి అనే సరోవరము. ఎవరైతే రజస్సు, తమోగుణాలను పక్కననెట్టి సత్యాన్ని చేతధరించి ఆ సరోవరంలో స్నానము చేస్తాడో అతడు పరిశుద్ధుడౌతాడు. రాగద్వేషములను వదిలి ఇంద్రియనిగ్రహము పాటించు మహాత్ములందరూ పవిత్రతీర్ధముతో సమానులే. వారిని సేవించడం ద్వారా మానవుడికి పుణ్యతీర్ధసేవనఫలం దక్కుతుంది. తపస్సుచేయడం, ఇంద్రుయనిగ్రహము కలిగి ఉండడం, అహింసనుపాటించడం, మనస్సును నిగ్రహించడం, శుభ్రతకలిగి ఉండడం ఇవన్నీ పుణ్యతీర్ధనసేవతో సమానములే. పైగుణములు లేకుండా కేవలం నదీజలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్ధసేవన ఫలము దక్కదు. కేవలం శరీరము శుభ్రపడుతుంది కాని మనసు శుభ్రపడదు కదా ! దొరకని వాటి కొరకు ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడు తృప్తితో సంతృప్తితో ఉండడం, ఆశాపాశములు విడిచి పెట్టడం పాటించే నరులకు వేరు తీర్ధములు అవసరం లేదు " అని భీష్ముడు పలికాడు.

ఉత్తమ పదము

ధర్మరాజు " తాతగారు ! మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమపదము చేరుకుంటాడు. మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచి పెట్టి తనతో దేనిని సాయంగా తీసుకు వెడతాడు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు" ధర్మనందనా ! నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి మాత్రమే తగిన వాడు. ఆయన ఇక్కడకు వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి తెలుసుకో " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతడికి ఎదురేగి బృహస్పతికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనము మీద ఆసీనుడిని చేసి ధర్మరాజు తాను ముందు భీష్ముడిని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పుట్టే ముందు, చచ్చిన తరువాత, పుణ్య లోకములలోను, నరకంలోను జీవుడు ఉంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు స్నేహితులు శ్మశానం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి పోతారు. నరుడు చనిపోయిన తరువాత అతడి ధర్మమే అతడికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మకార్యములు చెయ్యాలి. అలా ధర్మకార్యములు చేయని వాడు, ధర్మము వదిలి ప్రవర్తించే వాడు, నరకానికి పోతాడు " అని పలికాడు బృహస్పతి.

జీవుడు ధర్మము

ధర్మరాజు " ఈ శరీరాన్ని వదిలపెట్టి వెళ్ళే జీవుడిని ధర్మము ఎలా అనుసరిస్తుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పంచభూతములు, వాటి గుణములు అయిన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులూ బుద్ధి, ధర్మము జీవుడిని అనుసరించి వెడతాయి " అని పలికాడు. ధర్మరాజు " మహాత్మా ! రేతస్సు ఎలా ఏర్పడుతుంది ? " అని అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! మానవుని శరీరము పంచభూతాత్మకము. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం దేహాన్ని పోషిస్తుంది. మానవుడిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భాశయము చేరిన రేతస్సు గర్భము ధరింపచేసి పిండరూపము పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలముగా సుఖములు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖములు అనుభవిస్తాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు ధర్మాధర్మములు అతడికి సుఖదుఃఖములు కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యములు చేయాలి. పాపకార్యములకు దూరంగాఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యములు చేసిన వారు మానవజన్మకు బదులు పశుపక్ష్యాదులుగా క్రిమి కీటకాలుగా జన్మిస్తాడు. అదే నరకము. నరకము అంటూ వేరీది లేదు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*హం పొందండి*

శ్రీ సెంజి సింగవరం రంగనాథ దేవాలయం

 🕉 మన గుడి : నెం 1396


⚜  తమిళనాడు : విల్లుపురం


⚜  శ్రీ సెంజి సింగవరం రంగనాథ దేవాలయం

 


💠 సెంజి సింగవరం రంగనాథ ఆలయం ( సింగవరం పెరుమాళ్ ఆలయం) భారతదేశంలోని ఒక గుహాలయం, ఇది రంగనాథ దేవుడు మరియు రంగనాయకి తాయార్ దేవికి అంకితం చేయబడింది. 


💠 ఈ ఆలయం పల్లవుల కాలం నాటి నిర్మాణం, మరియు తరువాతి పాలకులు దీనిని పోషించారు.


💠 ఇక్కడ శయన భంగిమలో ఉన్న రంగనాథ స్వామి విగ్రహం శ్రీరంగంలోని విగ్రహం కంటే పెద్దదిగా చెబుతారు. 


💠 తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి మాదిరిగానే, ఈ పెరుమాళ్ తల, ఛాతీ మరియు కాళ్ళ భాగాలను 3 ప్రత్యేక ద్వారాల ద్వారా పూజించాలి. మంగళశాసనం శ్రీ రామానుజర్ చేశారు.


💠 సజీవ శిల నుండి చెక్కబడిన 24 అడుగుల పొడవైన రంగనాథ విగ్రహం, అనంత అనే సర్పం చుట్టలపై పడుకున్న భంగిమలో ఉంది. 


💠 బ్రహ్మ విష్ణువు నాభి నుండి జన్మించాడు. 

గరుడతో పాటు, విష్ణువు చంపిన మధు మరియు కైటభ అనే రాక్షసులను చూడవచ్చు.

భూమిదేవి దేవత స్వామి పాదాలను అలంకరించగా, ప్రహ్లాదుడు అతని మోకాలి దగ్గర కూర్చున్నాడు.


💠 సింగవరంలోని రంగనాథ స్వామి ఆలయానికి మరియు శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి మధ్య ఆసక్తికరమైన సంబంధం ఉంది. 1323లో ఉలుగ్ ఖాన్ సైన్యం శ్రీరంగం ఆలయ పట్టణంపై దాడి చేసినప్పుడు, శ్రీరంగం ఉత్సవమూర్తి, అళగియమానవాళన్ లేదా నంపెరుమాళ్‌ను దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు భద్రత కోసం ఈ ఆలయం నుండి బయటకు తీసుకెళ్లారు.


💠 గింజీలో నివాసం ఉన్న విజయనగర అధికారి గోపన్న తిరుమలకు వెళ్లి, అళగియమానవాళన్ మరియు భార్యల చిత్రాలను పూజించి, వాటిని సింగపురం (సింగవరం) కు తీసుకెళ్లారు.  

ఆ తరువాత ఆయన ఆ విగ్రహాలను శ్రీరంగంకు తీసుకువచ్చి,1371లో తిరిగి ప్రతిష్టించారు.


⚜ స్థలపురాణం


💠 పల్లవ రాజు సింహవిష్ణువు తండ్రి అయిన మహేంద్రవర్మ రాజు పాలనలో, అతని రాజభవనం సమీపంలో ఒక అందమైన పూల తోట ఉండేది. 

అయితే, కొంతకాలం పాటు, తోటలోని పువ్వులు రాజభవనానికి చేరలేదు. 


💠 రాజు విచారించినప్పుడు, ఒక అడవి పంది తోటలోని అన్ని పువ్వులను తినేస్తున్నట్లు తెలిసింది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎవరూ పందిని పట్టుకోలేకపోయారు లేదా చంపలేకపోయారు.


💠 ఒక రోజు, సింహవిష్ణువు స్వయంగా పందిని పట్టుకోవాలని నిర్ణయించుకుని తోటలో దాక్కున్నాడు. 

పంది మేయడానికి వచ్చినప్పుడు, రాజు దాని ముందు దూకి దానిని ఈటెతో పొడిచేందుకు ప్రయత్నించాడు, కానీ పంది తప్పించుకుంది. 


💠 రాజు పందిని నిర్దాక్షిణ్యంగా వెంబడించాడు. కొంత సమయం తర్వాత, పంది ఒక పర్వతం ఎక్కింది, రాజు ఇంకా వెంబడిస్తూనే ఉన్నాడు. పర్వతం పైభాగంలో, పంది ఆగి, రాజు వైపు తిరిగి చూసి, అదృశ్యమైంది. 


💠 పంది అదృశ్యమైన ప్రదేశానికి రాజు చేరుకున్నప్పుడు, అతనికి రంగనాథుని భారీ విగ్రహం కనిపించింది.  

ఇది సాధారణ పంది కాదని గ్రహించిన రాజు ఆ విగ్రహాన్ని పూజించడం ప్రారంభించాడు.


💠 తరువాత, సింహవిష్ణువు కుమారుడు మహేంద్రవర్మన్ ఆ పర్వతంపై రంగనాథునికి ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు ఆ ప్రదేశం సింగవరం అని పిలువబడింది.


💠 మాసి మాగం రోజున (ఫిబ్రవరి-మార్చి) భక్తులను ఆశీర్వదించడానికి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని పుదుచ్చేరి బీచ్‌కు తీసుకువెళతారు. 

వైకుంఠ ఏకాదశి రోజున కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 60, 70 లేదా 80 సంవత్సరాలు నిండిన వారు ఈ ఆలయంలో తమ పుట్టినరోజులను జరుపుకోవాలని చూస్తారు.


💠 భక్తులు పెరుమాళ్ (దేవుడు) కు తిరుమంజనం (ప్రత్యేక ఆచారం) మరియు వస్త్రాలు సమర్పిస్తారు.


💠 ప్రారంభంలో, నాలుగు స్తంభాలతో కూడిన ఊంజల్ మండపం ఉంది, వాటిలో ఒకటి ఒకే రాతి అసలు స్తంభం, మరియు మూడు కాంక్రీటుతో ఉన్నాయి. 


💠 గుహ ఆలయం కొండపై ఉంది మరియు 165 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. 

మెట్ల ప్రారంభంలో, ఎడమ వైపున, రంగనాథర్ పాదముద్ర, శంఖం, చక్రం మరియు 5 హనుమంతులు విగ్రహాలు ఉన్నాయి. 


💠 ఈ సింగవరం పెరుమాళ్ ఆలయం తూర్పు వైపు మూడు అంతస్తుల రాజగోపురంతో ఉంది. ఇది పల్లవ శిలాఖండ మందిరానికి మంచి నమూనా.


💠 శ్రీ వరదరాజర్ ఆలయం 3 అంతస్తుల రాజగోపురం తర్వాత ఉంది, మరియు దీపస్తంభం, బలిపీఠం, ద్వజస్తంభం రంగనాథర్ ఆలయానికి తూర్పు వైపున ఉన్నాయి. 


💠 గర్భగుడిలో ముఖ మండపం, అర్ధ మండపం ఉన్నాయి. 

రాతితో చెక్కిన గుహల రెండు చివర్లలో ద్వారపాలకులు ఉన్నాయి. 


💠 భోగ శయనంలో 24 అడుగుల పొడవున్న రంగనాథర్‌గా విష్ణువు దక్షిణం వైపున తల మరియు ఉత్తరం వైపున కాళ్ళు ఉంచుతాడు. 


💠 త్రిభంగ భంగిమలో దుర్గ మహిషాసుర తలపై నిలబడి ఉంది.  మరియు తాయార్ రంగనాయకి సన్నధికి కుడి వైపున ఉన్న ద్వారం ద్వారా కనిపిస్తుంది. 

గర్భగుడి యొక్క కుడి వైపున రామానుజర్ సన్నిధి ఉంది.


రచన


©️ Santosh Kumar

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూ2224f;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూ2224f;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



         *శ్రీ మహావిష్ణు పురాణం* 

                 ➖➖➖✍️

                    4వ భాగం 


*ఆది సృష్టి-పరమాత్మ ఆవిర్భావం* 


```

సూత మహర్షి శౌనకాది మునులకు వ్యాస మహర్షి, పరాశర మహర్షి జన్మ వృత్తాంతాలు చెప్పిన తరువాత మునులను చూసి “మునులారా! ఇప్పుడు మనం మహావిష్ణు పురాణాన్ని ప్రారంభించుకుంటున్నాము.


ఈ మహావిష్ణు పురాణాన్ని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి వినిపించాడు. వ్యాసమహర్షి రచించాడు. పరాశర మహర్షి వద్ద మైత్రేయుడు శిష్యరికం చేస్తూ వేద శాస్త్రాలు అభ్యసించాడు. ఒకరోజు ప్రభాత సమయంలో గురువుగారికి శుశ్రూష చేస్తూ నమస్కరించి “గురుదేవా! మీ అనుగ్రహంతో వేదాలు, సకల శాస్త్రాలు చదివాను. అభ్యసించాను. చదివిన తరువాత నా మదిలో ఒక సందేహం కలిగింది. తమరు మాత్రమే నా సందేహం తీర్చగలరు.


లోకాలన్నింటికి ఆధారభూతుడు ఎవ్వరు? ఇంద్రాది దేవతలకు ప్రభువై దేవతలను అనుక్షణం రక్షించేది ఎవ్వరు? సామాన్యుల కష్టనష్టాలు తీరుస్తూ కాపాడేది ఎవ్వరు? తన లీలాకధలతో భక్తి పరవశం కలిగించి ముక్తి నిచ్చువాడు ఎవ్వరు? ఈ సకల సృష్టి కర్త, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి వివరంగా తెలుపండి!” అని ప్రార్ధించాడు.


పరాశర మహర్షి సంతోషించి “మా తల్లి కోరిక మేరకు దానవ సంహారం కోసం యాగం చేసాను. ఆ యాగంలో దానవులు మంత్ర బద్దులై ఎక్కడ దాగున్నా వచ్చి యాగకుండంలో పడి చనిపోసాగారు. దానవులు మా తాత వసిష్ట మహర్షిని శరణు వేడారు. తాతగారు నా వద్దకు వచ్చి దానవ సంహార యాగం ఆపమని చెప్పారు. తాతగారి మాట పాటించి యాగం ఆపాను. దానవ సంహారం ఆగిపోవడంతో దానవ రాక్షస వంశ మూల కర్త పులస్త్య బ్రహ్మ సంతోషంతో ప్రత్యక్షమై వరం ఇచ్చారు. నేను పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు దివ్య లీలలతో నిండిన పురాణాలు ప్రబోధించమని కోరాను. నా కోరిక మన్నించి పురాణాలన్ని బోధించారు.


మైత్రేయా! నీవడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఒక్కటే. అవ్యయము, ఆది తత్త్వము, ఆది పురుషుడు సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగాని “శ్రీ మహావిష్ణు పురాణం” వినాలనే కోరిక కలుగదు. దేవదేవుని అనుగ్రహంతో నీ మనస్సులో ఈ అభిలాష కలిగింది. నీవడిగిన ప్రశ్నలకు సమాధానాలన్ని మహావిష్ణు పురాణంలో లభిస్తాయి. నీకు వినిపిస్తాను. భక్తి శ్రద్థలతో సావధానంగా వినుము” అని మహావిష్ణు పురాణ ప్రవచనం ఆరంభించాడు.


మనం చూస్తున్న, చూడలేకుండా ఉన్న ఈ సమస్త విశ్వ జగత్తుకు మూలము పరమాత్మ తత్త్వము. సమస్త జగమలు ఆయనలో, ఆయన సమస్త జగములలో ఉండటం వలన ఆ పరమాత్మను వాసుదేవుడు అన్నారు. పరమాత్మ తత్త్వము నిరకారము. అనగా ఏ రూపము, ఆకారము లేనిది. కానీ తానే సకల రూపములు, ఆకారములు ధరిస్తాడు. సృష్టి చరాచరము పరమాత్మే! ఆ రూపాలు ఉపసంహరిస్తే అంతా శూన్య జగత్తు మాత్రమే ఉంటుంది.


అవ్యక్తము అయిన ఆ పరతత్త్వానికి విశ్వ సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. అందుకోసం నిరాకార రూపము వదలి ఆకారం ధరించాడు. ఆ రూపం మహాద్భుతంగా ఉంది. విశ్వానికి ఆత్మగా మారాడు. విశ్వమే ఆత్మగా కలిగి ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అధినాధుడై, తాను సృజించిన మహా విశ్వము తనలో ఉంచుకున్నాడు. కనుక మహా విష్ణువు అయ్యాడు


తేజోరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మము జగత్తు సృష్టి స్వయంగా చేయదలచుకోలేదు. తన తేజస్సు నుండి చతుర్భుజుడైన నీలమేఘ స్వరూపుని ఆవిర్భవింప చేశాడు. ఈ నీల వర్ణానికి "కృష్" అన్నది భక్తి వాచకం, "న" అన్నది దాస్య వాచకము. అలాగే కృష్ అన్న శబ్దం సర్వవాచకం. న అన్నది బీజ వాచకం. కనుక విశ్వానికి స్రష్ట అనగా సృష్టికర్త తానే, మూల బీజము తానే. కనుక ఆ చతుర్భుజుడు పరబ్రహ్మానికి ప్రతిరూపంగా కృష్ణుడు అయ్యాడు.


పరబ్రహ్మ, మూల పురుషుడు అయిన కృష్ణునికి తాను ఒక్కడే జగత్ సృష్టి చేయలేనని భావించాడు, శక్తి రూపమైన ప్రకృతి కూడా కావాలి అని అనిపించింది. తన నుంచి రెండు రూపాలను ఆవిర్భవింప చేశాడు. దక్షిణ భాగం పురుషుడిగా, వామ భాగం స్త్రీ రూపంగా అవతరించాడు. పురుష రూపం ద్విభుజ కృష్ణుడు అయితే, శక్తి స్వరూపిణి స్త్రీ కృష్టాదేవి అయ్యింది. 


కృష్ణుడు కృష్ణాదేవి కలయికతో సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక రోజు అయితే, మానవ కాలమానం ప్రకారం అనేక కల్పాలు గడచిపోయాయి. రాసక్రీడలో కృష్ణాదేవి అలసిపోయింది. కృష్ణుడి తేజస్సు వలన ఆమె శరీర నుండి స్రవించిన స్వేదజలం, ఆమె నిట్టూర్పుల నుండి ఉత్పన్నమైన గాలి తాకిడికి విశ్వమంతా జలరాశులూగా వ్యాపించాయి. ఈ జలరాశులే సప్త సముద్రాలుగా మారాయి. ఈ జలరాశులుకు అధినేత వరుణుడు అయ్యాడు.


కృష్ణాదేవి నిట్టూర్పుల నుండి వాయువు రూపం పొంది పురుషుడయ్యాడు. కృష్ణుడి వామభాగం నుండి "ప్రాణ వల్లభ" అనే పేరుతో స్త్రీ మూర్తి అవతరించింది. వాయువుతో జత అయ్యింది. వారిరువురికి "ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన" అనే పంచ ప్రాణాలు కుమారులుగా జన్మించారు. ఈ పంచ వాయు పుత్రులు సమస్త జీవుల మనుగడకు ఆధారంగా మారాయి.✍️

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.✍️

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

 -సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖డా నేర్పండి.

          ➖▪️➖డా నేర్పండి.

          ➖▪️➖

పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా

  


*గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:*

                  ➖➖➖✍️


```

స్త్రీ గర్భములోనే శేషన దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము...


*ఒక రోజుకు ఖలిలమౌతాడు.

*ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.

*పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.

*ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.

*రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.

*మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.

*నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.

*ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.

*ఆరు నెలలకు జఠాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకానుభవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.  

తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు(ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింపబడి ఉంటాడు. 


అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. 

అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుతూ ఉంటాడు. 


కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. 


అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో(మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు..


‘గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ’ అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు...

“ఓ శ్రీహరీ! నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు, పాపములు మాత్రం నా పాలు అయినది.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను. 

ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను.భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను!” అని ప్రార్థిస్తాడు జీవుడు.


మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? 


ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము.✍️                               

    - వలిశెట్టి లక్ష్మీశేఖర్                                                      

            9866035557.                                 

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

         🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```              

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

 222f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀M.A.181.

*మన ఆరోగ్యం…!


*కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

➖➖➖✍️

```

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఇది ఎటువంటి నేల‌లోనైనా సుల‌వుగా పెరుగుతుంది. రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ```


*ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..*```


1.కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది. అందుకే దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.


2.ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.


3.ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుందట.


4.కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుందట.


5.కళ్ళు ఉప్పు, పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుందట.


6.రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకం, నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి. విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది.

కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పని చేస్తుందట. 


7.కామెర్లకు కుడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు.

కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు, నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.✍️

*🅰️🅿️SRINU*```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

శ్రీ కిరణం*

 *శ్రీ కిరణం*


*నేర్చుకుంటే సరిపోదు నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి, చేయగలను అంటే సరిపోదు చేసి చూపించాలి.* 


*క్రాంతి కిరణాలు* 


*కం. అనుదినము నేర్చుకున్నది*

*ఘనమగు విషయంబు లెల్ల కనుమరుగయ్యెన్* 

*మనసున దాచిన చాలదు*

*ననువైనను చూపవలయు నాచరణములో*


*పద్య కవితా శిల్పకళానిధి. ‌‌ మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

కన్నీళ్లు… అవి అవుట్‌సోర్స్ చేయలేము.

  పుణేలోని ఒక పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:00 అయ్యింది.


అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రోహన్ (35), ఫ్లైట్‌ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు.


అతని తండ్రి సదాశివరావు (75) గత రాత్రి మరణించారు.


రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు. 

చెమటలు కారుస్తూ, తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు.


అక్కడ “మోక్ష ఈవెంట్ మేనేజ్‌మెంట్” అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు.

అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చబడ్డాయి, పూజారి వచ్చాడు, 

🙏సదాశివరావు గారి శరీరాన్ని స్నానం చేయించి సిద్ధం చేశారు.


రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. రెండు కన్నీళ్లు జారాయి.


అప్పుడు సుమిత్‌ను అడిగాడు:


“మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా?

నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది.

రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది.

దయచేసి త్వరగా ముగించండి.”


🙄 సుమిత్ షాక్ అయ్యాడు.

ఈ కొడుకును పెంచిన తండ్రికి మూడు గంటల సమయం కూడా దక్కదా? 🤷‍♂️


అతను మౌనంగా తల ఊపాడు.


క్రియలు జరిగాయి.

🔥 రోహన్ చితికి నిప్పు పెట్టాడు. 😢


పొగ ఆకాశంలోకి ఎగిసింది.


రోహన్ సుమిత్‌ను పక్కకు తీసుకెళ్లి చెక్‌బుక్ తీసాడు.


“సుమిత్, థ్యాంక్స్. మంచి ఏర్పాట్లు చేశావు.

ఎంత బిల్? 50,000నా? 1,00,000నా?

ఎంత చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను.


నేను మళ్లీ రావడం కుదరదు.

బూడిద నిమజ్జనం కూడా మీరు చూసుకోండి.”


😥 సుమిత్ విచిత్రంగా నవ్వాడు.


“సర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది.”


రోహన్ ఆశ్చర్యపోయాడు.

“ఎవరూ చెల్లించారు? నా మామయ్యా?”


సుమిత్ చెప్పాడు:


“లేదు సర్.

ఐదు సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు.

అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు.

నడవడమే కష్టంగా ఉంది.


అయన అడిగారు:

‘మీ ప్యాకేజ్ ఏమిటి?

నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా?’


మేము వివరాలు చెప్పాము.


అదే రోజు ఆయన ముందస్తుగా 50,000 రూపాయలు చెల్లించారు.


మరియు ఈ లేఖ ఇచ్చారు.

‘నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి.

అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరు చేయండి’ అన్నారు.”


సుమిత్ ఆ లేఖను రోహన్‌కు ఇచ్చాడు.


కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. 🫥


తండ్రి వణుకుతున్న చేతిరాతలో ఇలా ఉంది:



“ప్రియమైన రోహన్,


రోహి చిన్ను , నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు.

అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు.


నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు.


‘లీవ్ దొరుకుతుందా?

టికెట్ దొరుకుతుందా?

మీటింగ్ ఏం అవుతుంది?’

🤌ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి.


చిన్ను , నీ సమయం, నీ కెరీర్ చాలా ముఖ్యం.


నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను.


ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు, నష్టాలు పడొద్దు.


అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను.


ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్లు చూసుకుంటారు.


నువ్వు వస్తే మంచిది. రాకపోయినా నేను కోపపడను.


ఒకే ఒక్క అభ్యర్థన…


🤝 చిన్నప్పుడు నిన్ను స్కూల్‌కు తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదల్లేదు.


ఈ రోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు

నీ చెయ్యి వణకకూడదు. 🫰


త్వరగా వెళ్ళు. నీ భార్య ఎదురు చూస్తోంది.


నీ

నాన్న.”



లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్‌బుక్ క్రింద మట్టిలో పడిపోయింది.


చితి మంటలు వెలుగుతున్న, మోగుతున్న ఆ శ్మశానంలో…

రోహన్ కెరీర్‌పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి.


అతను మోకాళ్లపై పడిపోయాడు.


“నాన్నా… నన్ను క్షమించు నాన్నా!”


రోహన్ సుమిత్ కాళ్లను పట్టుకున్నాడు.


“సుమిత్, నాకు అమెరికాకు వెళ్లాలి అనిపించడం లేదు!

నాకు నా నాన్నతో ఉండాలి!😢

నేను కోట్ల సంపాదించాను కానీ ఇప్పుడు భిక్షగాడిగా అయ్యాను!


నా తండ్రి తన మరణ సమయానికీ నా మీటింగ్ గురించి ఆలోచించాడు…

నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను ?”

🙄😢

ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు.


రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు.


ఎందుకంటే చివరకు అతనికి అర్థమైంది—


🤢 “ప్రీపెయిడ్” సిమ్ కార్డుకి ఉండొచ్చు…

🙏 కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు.


💅తండ్రి ప్రేమ అనంతం —

దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేం.



ప్రపంచంలో ఎంత పెద్దవాళ్లైనా…

ఎంత డబ్బు సంపాదించినా…


మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు 👍👍

అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి.


ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు.


కానీ కన్నీళ్లు…

అవి అవుట్‌సోర్స్ చేయలేము.


అవి రక్తం నుంచే రావాలి.

సోమవారం,ఫిబ్రవరి.23,2026

  *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం,ఫిబ్రవరి.23,2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి ఉ10.03 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:భరణి సా5.33 వరకు

యోగం:బ్రహ్మం ఉ11.30 వరకు

కరణం:తైతుల ఉ10.03 వరకు తదుపరి గరజి రా8.56 వరకు

వర్జ్యం:తె4.44 - 6.14

దుర్ముహూర్తము:మ12.36 - 1.22 మరల మ2.55 - 3.41

అమృతకాలం:మ1.02 - 2.33

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి:మేషం

సూర్యోదయం:6.29

సూర్యాస్తమయం:5.59

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝 *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

            *తత్ర త్రీణి నకారయేత్*

            *వాగ్వాదం అర్థ సంబంధం*

            *పరోక్షే దారభాషణమ్||*


:తా𝕝𝕝: *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు* ... 

           *ఒకటి తల్లి పాలు తాగనివాడు*,

           *రెండు మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

           *స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో*

           *జాగ్రత్త వహించాలి....* 

              *ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*,

   *రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు,*

           *మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో*

           *మాట్లాడరాదు....* 

     *ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


     *సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో .........*



✍️💐🌹🌸🙏

పంచాంగం

 *-*-*-*-*-*-

*

పూర్వ పద్ధతి పంచాంగం. 

తేది.23.02.2026

సోమ వారం (ఇందు వాసరే)  

*************    

గమనిక:-

ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ ణసంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్ల పక్షే షష్ఠ్యాం 

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందువాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

________________________

*ఇతర పూజలకు*

 శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్ల పక్షే షష్ఠ్యౌపరి సప్తమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి. ________________________

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.29

సూ.అ.5.59

శాలివాహనశకం 1947 వ సంవత్సరం.    

విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5126 వ సంవత్సరం. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు 

ఫాల్గుణ మాసం

శుక్ల పక్షం షష్ఠి ఉ.10.03 వరకు.

సోమ వారం

నక్షత్రం భరణి సా.5.33 వరకు.

వర్జ్యం మ .3.13 ల 4.45 వరకు.

వర్జ్యం తె.4.45 ల 6.14 వరకు.

అమృతం మ.1.02 ల 2.33 వరకు.

దుర్ముహూర్తం ప.12.36 ల 1.22 వరకు.

దుర్ముహూర్తం మ.2.55 ల 3.41 వరకు.

యోగం బ్రహ్మం ప.11.30 వరకు.

కరణం తైతుల ఉ .10.03 వరకు.

కరణం గరజి రా.8.56 వరకు.

సూర్యోదయము 6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.7.30 ల 9.00 వరకు.

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

*******-**-*******    

పుణ్యతిథి ఫాల్గుణ శుద్ధ సప్తమి.

************

*ప్రభల విశ్వనాధం* 

*శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ*, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.

801-956-6579,

739-686-7592,

984-875-1577.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


*ఆత్మీయ బంధుమిత్రులకు *శుభోదయ* *శుభాకాంక్షలు*💐🌹 * మీరు మీ కుటుంబసభ్యులు *ఆయురారోగ్యాలతో* *అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు *ఆనందం* గా జీవించాలని కోరుకుంటూ... *ఈ రోజు జన్మదినోత్సవం మరియు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐💐🌹🌹🌹

 *మీ శ్రేయోభిలాషి*.

🙏🙏🙏

23-02-2026 సోమవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

23-02-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి.

---------------------------------------


వృషభం


నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది.

---------------------------------------


మిధునం


చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ధనపరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోనడం మంచిది. 

---------------------------------------


సింహం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్తులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. 

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


వృశ్చికం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

---------------------------------------


ధనస్సు


ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


మకరం


బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.

---------------------------------------


కుంభం


కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


మీనం


స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

---------------------------------------

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*660 వ రోజు*

కర్మ సిద్ధాంతము

ఇక నీకు కర్మ గురించి చెప్తాను విను. జననీ, జనకులు, గురువులకు మేలుచేస్తే సుఖము వారికి కీడుచేస్తే దుఃఖము కలుగుతాయి. వీరు కాక తక్కిన విషయములలో పాపముచేస్తే దానికి ప్రాయశ్చితము ఉంది కాని తల్లి, తండ్రి, గురువుల పట్ల చేసిన అపచారమునకు, పాపముకు పరిష్కారము లేదు. ఆహారధాన్యమును అపహరించిన వాడు మరుజన్మలో ఎలుకగాను, పందికొక్కుగాను, కుక్కగానూ జన్మిస్తాడు. పరులభార్యను కోరువాడు తోడేలుగాను, రాబందుగాను, కోతిగాను, గ్రద్దగానూ పుడతాడు. చివరకు పురుగుగాను పుడతాడు. అప్పటికి కాని ఆపాపముపోదు. ఎవరైతే తన కూతురును ఒకరికి ఇచ్చి పెళ్ళి చేసి మరలా మనసు మార్చుకుని ఆమెను వేరొకరికి అప్పగిస్తాడో అతడు పురుగుజన్మ ఎత్తుతాడు. దేవకార్యము చేసిన తరువాత పితరులకు నివేదనము చేయకుండా భోజనము చేయువాడు కాకిజన్మ ఎత్తుతాడు. అన్నగారిని తిట్టిన వాడు పక్షిజన్మ ఎత్తుతాడు. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని కోరిన అతడు పురుగుగా పుడతాడు. చేసిన మేలు మరచినవాడు నరకబాధలు అనుభవిస్తాడు. ధనము మీద వాంఛతో నిరాయుధుడిని చంపినవాడికి పక్షిజన్మ వస్తుంది. ఆ జన్మలో చావుదెబ్బలు తింటూ మారణాయుధాల వలన మరణిస్తాడు. స్త్రీని చంపినవాడు మరుజన్మలో అనేక రకములైన నరకబాధలు అనుభవిస్తాడు. అన్నము, పాలు దొంగిలించిన వాడు వాటిలో పురుగులుగా జన్మిస్తాడు. పండ్లను, ఇనుమును, వెండి, బంగారమును దొంగలించిన వాడు వరుసగా కోతి, కాకి, పక్షి, క్రిమిగా పుడతాడు. ఇతరుల దుస్తులు అపహరించిన వాడు కుందేలుగా పుడతాడు. ఇతరులు తన వద్ద ధనమును అపహరించి వంచించిన నమ్మక ద్రోహి చేప మొదలైన నీచ జన్మలు ఎత్తుతాడు. పైన చెప్పిన పాపాలు స్త్రీలు చేస్తే పురుషులు ఎత్తిన జన్మలలో వారికి భార్యలైపుట్టి వారితోచేరి నరకబాధలు అనుభ్యవిస్తారు .

పాపపరిహారము


బృహస్పతి " ధర్మనందనా ! చేసిన పాపములు దానధర్మము వలన నశిస్తుంది. అన్ని దానములలో అన్నదానము శ్రేష్టము. న్యాయముగా సంపాదించిన ధనముతో అన్నదానము చేసిన అది అన్ని పాపములను హరిస్తుంది. చివరకు తాను భిక్షగా తీసుకు వచ్చినది అయినా బ్రాహ్మణుడికి పెట్టి అతడి ఆకలి తీర్చిన అతడికి పుణ్యలోకములు కలుగుతాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసినందు వలన, తాను నేర్చుకున్నది పదిమందికి బోధించడం వలన, క్షత్రియుడు అటువంటి బ్రాహ్మణులను పోషించడం వలన ఉత్తమ లోకాలను పొందుతాడు. వైశ్యుడు ధర్మంగా చేసిన ఆర్జనతో అనన్నదానము చేసి పుణ్యం సంపాదించ వచ్చు. శూద్రుడు తాను శ్రమపడి తెచ్చిన ధనముతో అనన్నదానము చేసి పుణ్యలోకములకు పోతాడు. ఏ కులము వాడైనా తాను తినబోయే ముందు ఇతరులకు పెట్టి తినిన సద్గతి కలుగుతుంది. కనుక ధర్మనందనా అన్ని దానములలో అన్నదానము గొప్పది. దాని వలన సర్వ పాపములు నశిస్తాయి " అని అన్నాడు బృహస్పతి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*