శ్రీమాత్రేనమః
✡️*"శుభోదయ సుభాషితమ్"*✡️
శ్లో𝕝𝕝
*సాధన్యా జననీ లోకే సా ధన్యో జనకః పితా౹*
*ధన్యస్స పతిర్యస్య గృహే దేవి పతివ్రతాః౹*
*పితృవంశ్యా మాతృ వంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః౹*
*పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే॥*
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
`నా అనువాదపద్యము`
చం॥
గృహమున సాధ్వి యున్న నట కిల్బిషమంతయు నష్టమైసనున్
సహచరబంధులెల్ల గను సద్గతులన్ నిజభర్తృవంశమున్
ఇహపరధన్యతం బడయు నెంతయు తల్లియు తండ్రివంశముల్
మహకపతివ్రతామణులు మత్సరహీనులు మాతృతుల్యలున్
=====================
మహకులు=పూజింపబడువారు
=====================
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి