*సనాతన ధర్మానికి పొంచి ఉన్న అంతర్గత శత్రువులు*
వందేమాతరం
లౌకిక హిందువుల రూపంలో కొందరు ఆడుతున్న ప్రమాదకర ఆటల పట్ల సమాజం అప్రమత్తతగా ఉండాలి.
సనాతన ధర్మాన్ని గౌరవించే హిందువులందరికీ ఒక విజ్ఞప్తి. నిర్మలమైన మనసుతో ఒక్కసారి ఆలోచించండి.
మన దేశంలో కొందరికి తమకు తాము హిందువులమని చెప్పుకుంటూ, మన సనాతన హిందుత్వాన్ని అవహేళన చేయడం, వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటైపోయింది.
ఈమధ్య టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడిన విషయాలు వింటుంటే హృదయం రగిలిపోతుంది. నేను ఇస్లామును పూజిస్తాను, బైబిల్ చదువుతాను, యేసుని నమ్ముతాను, అల్లాని గౌరవిస్తాను అన్నారు. మంచిదే, ఎవరు ఎవరినైనా పూజించవచ్చు, గౌరవించవచ్చు. అది సనాతన ధర్మం నేర్పిన సంస్కారం. కానీ అలా అంటూనే, ముస్లింలు, క్రిస్టియన్ల పడుతున్న బాధలు చూడలేకపోతున్నానని కన్నీళ్లతో మాట్లాడారు. ఏసుక్రీస్తు పడ్డ బాధలు కన్నీళ్లు పెట్టిచ్చాయి అన్నారు. ఆయనను బాధ పెట్టింది ఎవరు? హిందువులా?, ఆయన బాధపడింది ఎక్కడ? సనాతన భారతదేశంలోనా?, కాదే, మరి ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు. ఆయన తన ఆక్రోశం ఎక్కడ బాధపడ్డాడో అక్కడి చూపించాలి, ఎవరు బాధపెట్టారో వాళ్ల మీద చూపించాలి. అలాకాక, ఆయన వారసులమని చెప్పుకుంటూ మనదేశంలో అకృత్యాలు చేస్తూ, మత విద్వేషాలు సృష్టిస్తూ, అమాయక హిందువులను రెచ్చగొట్టి, ప్రలోభపెట్టి మతం మారుస్తున్న నికృష్టులకు ఊతం కలిగించే విధంగా ఇక్కడ మాట్లాడటం నిజంగా ధర్మద్రోహమే.
శతాబ్దాలుగా మన దేశంపై దాడిచేసి ప్రజల ధన,మాన,ప్రాణాలను దోచుకుంటున్న ఎడారి మతాల విద్వేషాలు, వికృతి చేష్టలు ఇటువంటి వారికి కనిపించవు. అటువంటి రాక్షసులను ఎదిరించి చివరి రక్తపుబొట్టు వరకు, చివరి శ్వాస వరకు సనాతన హిందూ ధర్మ రక్షణకే పోరాడిన పృథ్వీరాజ్ చౌహాన్, చత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఇటువంటి వారు వీళ్ళ కంటికి కనిపించరు. ఈ సందర్భంగా తన తాత ముత్తాతలు చాలా ఘోరాలు చేశారని ఆయన ఒప్పుకున్నారు. ఇదేదో సానుభూతి కోసం చెప్పినట్లుగా ఉంది. నిజంగా అటువంటి వీరి తాత ముత్తాతల లాంటి నికృష్టుల వల్లనే హిందూ సమాజంపై చెరపరాని చెడు ముద్ర పడింది. అలాంటి చీడపురుగుల పేర్లు ప్రస్తావించి క్షమాపణలు కోరుకోవాల్సింది, ఆ వంశంలో పుట్టినందుకు సిగ్గుతో తలవంచుకోవాల్సింది. కానీ, ఆ పాపం అనుభవిస్తున్నది ఎవరు?. యావత్ హిందూ సమాజం.
ఎడారి మతాల దురాక్రమదారులు కోట్లాది హిందువులను చంపి, మాంసపిండాలు చేసిన చరిత్ర చరిత్ర వీరికి గుర్తుకు రాదు, టిప్పూ సుల్తాన్ రక్తపు ఆటలు వీరికి కనిపించవు, వారి ఆక్రమణలతో భూగర్భంలో కలిసిపోయిన వేలాది దేవాలయాలు, లక్షలాది ధర్మ గ్రంథాలు, తక్షశిల లాంటి అపూర్వమైన జ్ఞాన విద్యాలయాలు, తమ మానప్రాణాల కోసం పోరాడి, ఆ పాపాత్ముల స్పర్శ కూడా తగలకూడదని సజీవ దహనం చేసుకొన్న భారతీయ స్త్రీలు వీరికి కనిపించరు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇటువంటి కుహనా మేధావులే అసలైన ధర్మ ద్రోహులు.
అలాగే, అంబేద్కర్ గురించి కూడా కట్టుకథలు చెప్పుకొచ్చారు. దళితుడిగా ఆయన పడ్డ బాధలు అంటూ అత్యంత జుగుప్సాకరంగా కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు. హిందుత్వాన్ని కించపరచడం వీరికి అలవాటైపోయింది. అసలు సత్యం ఏమిటి? అంబేద్కర్ గారిని ఆదరించి, ఆశ్రయమిచ్చి, చదివించి, గౌరవించింది సనాతన ధర్మన్ని ఆచరించే హిందువులే. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే దానికి వీరే ఒప్పుకున్నట్టే వీరి పూర్వికులు లాంటి దుర్మార్గులే దానికి కారణం. కానీ ఇటువంటి కుహనా లౌకిక హిందువులు దాన్ని విషపు బాణాలుగా మలిచి, సమాజాన్ని మరింత విడదీస్తున్నారు.
నిజమైన ప్రమాదకారులు ఎవరు? "నేను టెర్రరిస్టుని, నేను ముస్లిమును, నేను క్రిస్టియన్ని, నేను హిందువులను ద్వేషిస్తాను అంటూ బాహుటంగా మాట్లాడేవారు కాదు, వారి కన్నా మరింత ప్రమాదకరులు మనతోనే ఉండి హిందువులమని చెప్పుకుంటూ, హిందుత్వాన్ని ద్వేషించే ఇటువంటి దుర్మార్గులే. వీళ్లు మన ధర్మాన్ని అంతర్గతంగా ద్వేషిస్తూ, సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారు.
మన తక్షణ కర్తవ్యం ఇతర మతాల ఆగడాలను ఎదుర్కొనే ముందు మనలోనే ఉన్న ఇటువంటి చెత్తను ఏరిపారేయడం. గుర్తుంచుకోండి, సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ ద్వేషించలేదు. "సర్వే భవంతు సుఖినః" అనే మహా మంత్రం మన జీవనాడి. కానీ ఇటువంటి కలుపు మొక్కలు సృష్టించిన కట్టుకథలు, కట్టుబాటులతోనే మన సమాజం విడిపోయింది, ఇంకా విడిపోతోంది.
మంచివారి మౌనాన్ని బలహీనంగా చూసే శత్రువు, బలవంతుడి మౌనానికి భయపడతాడు. అర్జునుడు తపస్సు చేసేటప్పుడు కూడా తన గాండీవని విడిచిపెట్టలేదు. అదే అతని బలం. ప్రస్తుతం హిందూ సమాజపు మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్న ఈ ఎడారి మతాలకి కారణం హిందువుల మధ్య సంఘటితమనే బలం లేకపోవడమే.
మౌనం వహించింది చాలు, ఇకనైనా మేలుకోండి. సంఘటితంగా మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ అంతర్గత శత్రువులపై దృష్టి పెడదాం. అందరం ఒక్కటై, బలంగా నిలబడదాం.
జై శ్రీరామ్! జై భారత్!
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849794167
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి