అందరికీ శుభోదయం.
🌸 యశోదా దేవి శ్రీకృష్ణ పరమాత్మకు రాముల వారి కథ చెబుచున్న సందర్భం🙏🙏
శ్లో. *రామో నామ బభూవ హుం, తదబలా సీతేతి హుం, తౌ పితు ర్వాచా పంచవటీతటే విహరతస్తామా హరద్రావణః ।*
*నిద్రార్థం జననీ కథామితి హరే ర్హుంకారతశ్శృణ్వతః 'సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధను' రీతి వ్యగ్రా గిరః పాంతు వః ॥*
(రామావతారము తరువాత కృష్ణావతారము- యశోద కృష్ణుని నిద్ర పుచ్చుటకు కథ చెప్పుచున్నది! కృష్ణుడు ఊఁ కొట్టుచున్నాడు)
తా॥ *"అనగా అనగా రాముడనే వాడున్నాడు!" - "ఊ!" - "అతని భార్య సీత!'” "ఊ!” వారిద్దరును తండ్రి మాటను అనుసరించి గోదావరీతీరంలో పంచవటిలో విహరించు చుండగా సీతను రావణుడెత్తుకొని పోయినాడు!" - అని చెప్పగానే నిద్రలోనికి వెళ్ళుచున్న కృష్ణుడు ఉలికిపడి "లక్ష్మణా! నా ధనుస్సు! నా ధనుస్సు ధనుస్సు!” అనుచు కలవరించిన కలవరింతలు మిమ్ము రక్షించుగాక! (కృష్ణుడు ఆవేశములో వెనుకకు రామావతారము లోనికి వెళ్ళి, ఇప్పటి తన అవతారమును మరచినాడు! రాముడే కృష్ణుడు కదా!)*
〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి