28, ఫిబ్రవరి 2026, శనివారం

సీతారాముల కళ్యాణం

 ☸️☸️☸️☸️☸️☸️

🌸సీతారాముల కళ్యాణం🙏🙏

కన్యాదాన సమయంలో 

జనకుడు చెప్పిన శ్లోకం…*

               ➖➖➖✍️


*శ్లోకం :

*ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ|*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||*

*పతివ్రతా మహాభాగా చాయేవానుగతా సదా||*


ఈమె సీత నా బిడ్డ! ఈమె ను సహధర్మచారిణి గా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్ట నష్టాలలో అయినా నీకు నీడ లా వెన్నంటి ఉండే పతివ్రత ను 

నీ చేతిలో పెడుతున్నాను.

నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాట గా నిలవాలి...” అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు.



*శ్రీరామచంద్ర స్వామి ప్రవర :*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత


వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణో నప్త్రే|

 అజ మహారాజ వర్మణః పౌత్రాయ|

 దశరథ మహారాజ వర్మణః పుత్రాయ|

  ..... గోత్రోద్భవాయ| త్రిభువనాధీశాయ| 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ| తత్వాతీతాయ| సచ్చిదానంద మూర్తయే| సూర్యవంశ పావనాయ| శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవాయ|    

శ్రీరామచంద్ర వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ||



*శ్రీ సీతాదేవి ప్రవర:*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత|


గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం|

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం|

 జనక మహారాజ వర్మణః పుత్రీం|

    .......గోత్రోద్భవాం| చతుర్దశ భువనాధీశ్వరీం| అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం| తత్వస్వరూపిణీం| చంద్రవంశ ప్రదీపికాం| నిమివంశోద్భవాం|


శ్రీ సీతా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం ||


. శ్రీరామ జయరామ జయ జయ రామ  

                       🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!



సేకరణ

కామెంట్‌లు లేవు: