28, ఫిబ్రవరి 2026, శనివారం

చంద్రగ్రహణం

 మార్చి 3వ, తేదిన మన భారతదేశంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. 


ఈ సందర్భంలో ఈ గ్రహణం గురించి కొన్ని విషయాలు.


*యస్మిన్ రాశౌ తు దృశ్యేత*

*గ్రహణం తత్ర సూతకం |*

*అదృశ్యే నైవ కర్తవ్యం*

*స్నానదానాదికక్రియా ||*


ఏ ప్రాంతంలో (రాశిలో/ప్రదేశంలో)

గ్రహణం కనిపిస్తుందో అక్కడ

మాత్రమే సూతకం (నియమాలు)

వర్తిస్తుంది. గ్రహణం కనిపించని

చోట స్నాన, దానాది క్రియలు

చేయవలసిన అవసరం లేదు.


స్పర్శ మరియు మోక్ష స్నానాలు

గ్రహణం పట్టుకున్నప్పుడు,

విడిచినప్పుడు స్నానం చేయాలి.


*నాఽదృశ్యే గ్రహణే స్నానం*

*కుర్యాన్ముక్తిః కదాచన |*

*దృశ్యమానే తు కర్తవ్యం*

*స్నానదానాదికక్రియా ||*

కంటికి కనిపించని గ్రహణానికి

స్నానము, మోక్షము వంటివి

పాటించాల్సిన పనిలేదు. గ్రహణం

ఎప్పుడు దృశ్యమానం

(కనిపిస్తుందో) అవుతుందో,

అప్పుడే స్నానము, దానము వంటి

క్రియలు చేయాలి.

 

*"సర్వే గంగా సమం తోయం*

*సర్వే బ్రాహ్మణ సమో గురుః |*

*గ్రహణే స్పర్శనే స్నానం*

*మధ్యే హోమజపాదికం |*

*ముచ్యమానే భవేద్దానం*

*ముక్తే స్నానం విధీయతే ||*


స్పర్శనే స్నానం: 

గ్రహణం పట్టుకున్న వెంటనే (స్పర్శసమయంలో) స్నానం చేయాలి. మధ్యే హోమజపాదికం: గ్రహణం

మధ్య కాలంలో హోమం, జపం,

పారాయణం వంటివి చేయాలి.


ముక్తే స్నానం: 

గ్రహణం పూర్తిగా

విడిచిన తర్వాత (మోక్ష కాలంలో)

మళ్ళీ స్నానం చేయాలి.


శాస్త్రం ప్రకారం "చక్షుః స్పర్శే

స్నానం" (కంటికి కనిపించినప్పుడే

స్నానం) అని కూడా అంటారు.

మార్చి 3, 2026 న మనకు

మధ్యాహ్నం నుంచి గ్రహణం

ఉన్నా, అది భూమికి అవతలి

వైపు ఉండటం వల్ల మనకు

స్పర్శ కనిపించదు.

సాయంత్రం 6:24 గంటలకు

చంద్రుడు మనకు కనిపించినప్పుడే 

అది "స్పర్శ" (మన దృష్టికి)

అవుతుంది. కాబట్టి ఆ

సమయంలో చేసే స్నానమే పట్టు

స్నానం అవుతుంది.


ఆ తర్వాత 24 నిమిషాలకే

గ్రహణం విడిచిపోతుంది కాబట్టి,

6:48 కి చేసే స్నానం విడుపు

స్నానం అవుతుంది.


గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగులు 

మాత్రం గ్రహణం మనకు

 కనిపించకపోయినా, భూమిపై గ్రహణ

 ప్రభావం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం

 నుంచే జాగ్రత్తలు పాటించడం

 శ్రేయస్కరం.


కేవలం 24 నిమిషాలే గ్రహణం

కనిపిస్తుంది కాబట్టి, ఆ కొద్ది

సమయం వీలైనంత వరకు దైవ

నామస్మరణలో గడపడం విశేష

ఫలితాన్నిస్తుంది.


గ్రహణే గతే స్నానం 

సచేలం తు విధీయతే |

అకృత్వా స్నానమశ్నన్ 

హి భుంక్తే విణ్మూత్రమేవ సః ||


​గ్రహణం పట్టుకున్నప్పుడు

మరియు విడిచినప్పుడు సచేల

స్నానం (బట్టలతో సహా చేసే

స్నానం) చేయాలి. ఒకవేళ స్నానం

చేయకుండా ఆహారం తీసుకుంటే,

అది మలమూత్ర సమానమైన

పాపంతో సమానం.


రాహుదర్శనసంవాదే

స్నానదానాదికక్రియాః |

అదృశ్యే రాహుమణి చ

 న స్నానం న చ భోజనమ్ ||

రాహువు (గ్రహణం) కంటికి

 కనిపించినప్పుడు మాత్రమే

 స్నాన, దానాది క్రియలు చేయాలి.

 గ్రహణం ఉన్నా అది మనకు

 అదృశ్యంగా ఉంటే, ఆ

 సమయంలో స్నాన నియమాలు

 గానీ, భోజన నియమాలు గానీ

 వర్తించవు.


వారణాస్యాం కురుక్షేత్రే 

గ్రహణే యత్ఫలం భవేత్ |

తత్ఫలం కోటిగుణితం 

రాహుగ్రస్తే నిశాకరే ||

​కాశీ (వారణాసి) లేదా

 కురుక్షేత్రంలో స్నాన, దానాలు చేస్తే

 ఎంత పుణ్యం వస్తుందో, గ్రహణ

 సమయంలో చేసే దానం దానికి

 కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని

 ఇస్తుంది. ముఖ్యంగా చంద్రగ్రహణ

 సమయంలో చేసే దానానికి

 అంతటి విశిష్టత ఉంది.


సూర్యగ్రహే తు యామాన్త్రీన్

చంద్రగ్రహే చతుష్టయమ్ |

భోజనం నైవ కర్తవ్యం వేధః

పూర్వం తథా భవేత్ ||


చంద్రగ్రహణానికి 3 యామముల

 (9 గంటల) ముందు నుండి వేధ

 ప్రారంభమవుతుంది. ఆ

 సమయంలో భోజనం

 చేయకూడదు.


సర్వేషామపి వర్ణానాం 

సూతకం రాహుదర్శనే |

తత్కాలం భోజనం త్యాజ్యం 

శుద్ధిః స్నానేన జాయతే ||

రాహువు (గ్రహణం) కంటికి

కనిపించినప్పుడు అన్ని వర్ణాల

వారికి సూతకం (వేధ) వర్తిస్తుంది.

ఆ సమయంలో భోజనం

వదిలివేయాలి. గ్రహణం విడిచిన

తర్వాత స్నానం చేయడం వల్లనే

శుద్ధి కలుగుతుంది.


గ్రహణాత్ పూర్వయామం తు 

న భుంజీత కదాచన |

పానీయమపి వర్జ్యేత 

అశక్తేర్నాస్తి నియమః ||


గ్రహణానికి ఒక యామము (3

 గంటలు) ముందు నుండి ఆహారం

 అస్సలు తీసుకోకూడదు.

 వీలైనంత వరకు నీటిని కూడా

 తీసుకోకపోవడం ఉత్తమం.

 అయితే, అనారోగ్యంతో

 ఉన్నవారు లేదా శక్తి లేని వారికి

 (అశక్తులకు) ఈ నియమం

 వర్తించదు.


బాలవృద్ధాతురైః సార్ధం 

భోజనం నైవ త్యజ్యతే |

గ్రహణాత్ పూర్వయామం తు

భోజనం నైవ కారయేత్ ||


పిల్లలు (బాలలు), ముసలివారు

(వృద్ధులు) మరియు రోగులు

(ఆతురులు) 9 గంటల వేధ

 పాటించలేకపోతే, వారు

 గ్రహణానికి ఒక యామము (3

 గంటల) ముందు వరకు ఆహారం

 తీసుకోవచ్చు. అంటే వీరికి వేధ

 సమయం కేవలం 3 గంటలు

 మాత్రమే.


పక్వమన్నం పరిత్యజ్యం 

జలమపి చ రాహుదర్శనే |

కుశైః స్పర్శం చ కర్తవ్యం

తైలఘృత్యాదిషు సర్వదా ||


గ్రహణ సమయంలో వండిన

అన్నాన్ని, నీటిని వదిలివేయాలి.

అయితే పాలు, పెరుగు, నెయ్యి,

నూనె వంటి పదార్థాలలో దర్భలు

 (కుశలు) వేయడం ద్వారా అవి

 అపవిత్రం కాకుండా

 రక్షించబడతాయి.


గర్భిణీ నైవ పశ్యేత 

రాహుగ్రస్తం నిశాకరం |

యథాశక్తి జపేన్మంత్రం 

కుశధారణ పూర్వకం ||

గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని

చూడకూడదు. వారు దర్భను 

దగ్గరఉంచుకుని, యథాశక్తి దైవ

నామస్మరణ లేదా జపం చేయాలి.


పురశ్చరణకృన్మంత్రః 

గ్రహణే చంద్రసూర్యయోః |

తస్మాత్సర్వం పరిత్యజ్య 

జపమేవ సమాచరేత్ ||

చంద్ర లేదా సూర్యగ్రహణ

 సమయాల్లో మంత్ర జపం

 చేయడం వల్ల ఆ మంత్రం త్వరగా

 సిద్ధిస్తుంది. అందుకే మిగిలిన

 పనులన్నీ వదిలిపెట్టి, ఆ కొద్ది 

సమయం కేవలం జపం మాత్రమే

 చేయాలి.


ఖననం దంతధావనం చ

వృక్షచ్ఛేదం చ వర్జయేత్ |

గ్రహణే పతితే భూమౌ న

 కుర్యాత్కామ్యకర్మ చ ||

గ్రహణ సమయంలో భూమిని 

తవ్వడం, పళ్ళు తోముకోవడం,

చెట్లు లేదా కొమ్మలు నరకడం 

వంటి పనులు అస్సలు

చేయకూడదు. ఇవి

దోషపూరితమైనవి.


భూగతం నిర్మలం తోయం

ఉద్ధృతం చైవ తాత్కాలమ్ |

గ్రహణే సర్వగంగాఖ్యం పునీతే

 స్నానదానయోః ||"

గ్రహణ సమయంలో భూమిపై

 ఉన్న నిర్మలమైన జలమంతా

 గంగానదితో సమానమైన

 పవిత్రతను పొందుతుంది. 

ఆ సమయంలో బావి నుండి

 తోడిన నీరు లేదా ప్రవహించే నీరు

 స్నానానికి, దానానికి అత్యంత

 శుభప్రదమైనవి.


చంద్రగ్రహే లక్షగుణం 

ఆదిత్యే దశలక్షకమ్ |

పుణ్యం కోటిగుణం ప్రోక్తం

గంగాయాం గ్రహణే సతి ||


సాధారణ చంద్రగ్రహణ

 సమయంలో చేసే జపం లక్ష 

రెట్లు ఫలితాన్నిస్తుంది.

సూర్యగ్రహణంలో పది లక్షల రెట్లు

 ఫలితాన్నిస్తుంది. అదే గంగానది

 తీరంలో గ్రహణ సమయంలో

 జపం చేస్తే కోటి రెట్లు పుణ్యం

 లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: