ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం
కథలు అనే విషయాన్ని నేను అసలు అంగీకరించను ఇప్పటికి కూడా హిమాలయాలలో అనేక మంది యోగులు కఠిన తపస్సు చేస్తున్నారన్నది వాస్తవం గడ్డగట్టిన నీటిని చదువుకొని ఆ చల్లటి నీటితో స్నానాలు చేస్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఏమాత్రం నరసంచారం లేని అతి శీతలమైన హిమాలయాలలో నిరంతరం తపస్సులో నిమగ్నమైన మహానుభావులు ఎందరో ఈరోజు కూడా ఉన్నారు. నేను అనుకుంటాను సమాజంలో ఎన్నో పాపాలు నిత్యం జరుగుతున్న ఇంకా సమాజంలో ధర్మం ఉందంటే అటువంటి మహానుభావుల నిరంతర తప శక్తి కారణం అయి ఉండవచ్చు ఈ రోజుల్లో చాలా మటుకు భక్తి అనేది ఒక ప్రదర్శనగా మారుతున్నది అని చెప్పటానికి నేను సిగ్గుపడుతున్నాను నిజానికి త్రీకరణ శుద్ధిగా పరమేశ్వరుని ఆరాధిస్తే తప్పకుండా ప్రతివారు శిద్దులే అవుతారు నిత్యం భౌతిక ప్రపంచంలో జీవిస్తూ అరిసెట్ వర్గానికి బానిసలై బ్రతుకుతూ ఉంటే వారికి దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు కనబడదు అనేటువంటి మూర్ఖపు సందేహాలు వస్తూ ఉంటాయి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది నిత్యం మన జీవనం గడవడానికి అనేక విధాలుగా కష్టపడుతున్నామే మరి ఈ జగత్తుకు మూలకారకుడైన ఆ పరమేశ్వరుని చేరటానికి ఇంకా ఎంత కష్టపడాలి అనేటువంటి భావన ఉన్నవాళ్లు తప్పకుండా సాధన మొదలు పెడతారు సాధనాత్ సాధ్యతే సర్వం ముక్తి కూడా తప్పకుండా సిద్ధిస్తుంది మనకు హృదయమే పరిశుద్ధంగా లేనప్పుడు ఇక తపస్సు ఎలా చేయ గలుగుతాం నిరంతరం ఈ సమాజం చుట్టూ ఒక మంచి పేరు ఒక గొప్పతనం చాటి చంపాలనే తపనతోటే అనేక పనులు చేస్తూ సాటివారి మెప్పును అభిలాషీస్తూ ఉంటే వారికి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా మనసు భగవంతుని మీదికి పోదు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఏ కొద్దో శక్తి సంపాదించిన ప్రతి వాళ్లు నేనే దేవున్ని అని చాటుకుంటూ వాళ్ల చుట్టూ అనేకమంది శిష్యబృందాలను ఏర్పాటు చేసుకుంటూ నిరంతరం భోగా లాలసులై జీవిస్తూ ఉండటమే కాకుండా ఆ పరమేశ్వరుని కూడా విమర్శిస్తూ నిందిస్తూ ఉన్నారంటే ఇక వారి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మన హిందుత్వంలో శివ కేశవ బేధం లేదు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడో సెలవిచ్చారు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి శ్రీ ఆది శంకర చార్యుల వారి బోధనలు మాత్రమే శరణ్యం శంకరుల వారు అనుచరులమై వారు స్థాపించిన అద్వైత మతాన్ని ఆచరిస్తూ ఉంటే తప్పకుండా సమాజం సుభిక్షంగా ఆనందకరంగా సంతోషమయంగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు మనకు మొట్టమొదటగా ఉద్భవించిన శుక్ల యజుర్వేద దానికి సంబంధించిన ఉపనిషత్తు ఈసా వాసు ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు జగత్తు మొత్తం ఈశ్వరునిదే అయినది అనే మంత్రంతో మొదలవుతుంది అక్కడ నేను నీవు లేనే లేవు కేవలం జగత్తులో జీవులు నిర్జీవులు అన్ని ఈశ్వరుడే ఈ భావం అందరికీ కలిగితే ముందుగా తాను ఈశ్వరుడు అని తలుస్తాడు అప్పుడు భగవంతుడు తప్పులు చేయడు అని తెలుసుకొని తాను సత్ ప్రవర్తన పరుడవుతాడు అంతేకాకుండా తాను చూసే జగత్తు పూర్తిగా ఈశ్వరుడి మయంగా తలంచి ప్రతి వారిలో ఈశ్వరుని దర్శించి తాను ఈశ్వరునితో అంటే భగవంతునితో ఎలా ప్రవర్తిస్తాడో అలానే అందరితో ప్రవర్తించగలుగుతాడు కాబట్టి ప్రతివారికి ఈ ఒక్క ఉపనిషత్తు పూర్తిగా కూడా అవసరం లేదు కేవలం మొట్టమొదటి మంత్రం తెలుసుకుంటే చాలు ప్రతివారు తముతాను ఉద్ధరించుకుంటాడు సమాజాన్ని ఉద్ధరించుకోవటానికి తోడ్పడుతాడు కోపము ద్వేషము అసహనము స్వార్థం మొదలైన భావాలు నశించి మనస్సు స్వచ్ఛత చేకొరితే మన భార తావనే స్వర్గసీమగా వెలుగొందుతుంది అనటానికి సందేహం లేదు అటువంటి జగత్తు కావాలని ఆ జగదీశ్వరుని నిత్యం మనం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి