31, డిసెంబర్ 2023, ఆదివారం

శ్రీ రేణుకాదేవి మందిర్

 🕉 మన గుడి : నెం 286


⚜ హిమాచల్ ప్రదేశ్  : నహాన్


⚜ శ్రీ రేణుకాదేవి మందిర్



💠 ఈ సరస్సు ఉత్తర హిమాలయాల్లోని శివాలిక పర్వతశ్రేణి అంతర్భాగంలో అతి సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య నెలకొని ఉంది. 

ఈ స్థలం అతి పవిత్రమైన తీర్థస్థానంగా పరిగణించబడుతోంది.


💠 శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురామునితో, తల్లి రేణుకాదేవితోనూ ఈ స్థల పురాణం ముడిపడి ఉంది. 

తండ్రి జమదగ్ని మహర్షి ఆనతితో తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడట పరశురాముడు. 

పుత్రుని ధర్మనిరతికి సంతోషించి తిరిగి తల్లిని బ్రతికించాడట ఆ ఋషిపుంగవుడు.


💠 రేణుకాదేవి సరస్సు నానుకుని రేణుకాదేవి ఆలయం ఉంది. అదే కాకుండా ఇక్కడ అనేక దేవాలయాలు కనిపిస్తాయి. 

ఈ ఆలయం శివుని భార్య అయిన పార్వతీ దేవి అవతారంగా భావించే రేణుకా దేవికి అంకితం చేయబడింది.


 💠 ఈ ఆలయానికి సంబంధించిన పురాణం విష్ణువు యొక్క పది అవతారాలలో ఒకటైన పరశురాముని కాలం నాటిది. 

తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లిని చంపినందుకు క్షమాపణ కోరుతూ తపస్సు చేసేందుకు ఈ ప్రాంతానికి వచ్చినట్లు ప్రతీతి. 

రేణుకా దేవి  ప్రత్యక్షమై అతనిని క్షమించి, ఆమె కనిపించిన ప్రదేశంలో దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

 

🔅 రేణుకా సరస్సు 🔅


💠 దుష్ట సహస్రార్జునుడు జమదగ్ని మహర్షిని చంపి, అతని భార్య రేణుకను అపహరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె నీటిలోకి దూకింది అని  పురాణాలు చెబుతున్నాయి. 

దేవతలు ఆమెను పునరుద్ధరించారు మరియు ఇది ఆమె స్వరూపంగా పరిగణించబడుతుంది.

సరస్సు రేణుక యొక్క స్వరూపంగా మారింది మరియు ఆమె పేరు పెట్టారు.


💠 ఈ ఆలయం చెక్క పైకప్పు మరియు రాతి మరియు మట్టితో చేసిన గోడలతో ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. 

ఆలయ ప్రధాన గర్భగుడిలో విలువైన ఆభరణాలు మరియు వస్త్రాలతో అలంకరించబడిన రేణుకా దేవి విగ్రహం ఉంది.

చుట్టూ పరశురాముడు మరియు అతని తండ్రి జమదగ్ని విగ్రహాలు ఉన్నాయి.

 

💠 కొడుకు మరియు తల్లి ఒకరినొకరు మళ్ళీ  కలుసుకున్న సందర్భానికి గుర్తుగా రేణుక పండుగ అనే జాతర నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో రేణుకా ఫెయిర్ అని పిలువబడే వార్షిక జాతరను నవంబర్‌లో జరుపుకుంటారు. ఈ జాతర స్థానికులకు మరియు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది 


💠 ఈ ప్రసిద్ధ సరస్సును కార్తిక ఏకాదశి రోజున వేలాది మంది యాత్రికులు సందర్శిస్తారు .

ఇక్కడ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన గ్రామస్తులు రెండు రోజులు ఉంటారు. 

కీర్తనలతో సహా రాత్రిపూట ఉత్సవాలు వివిధ సమూహాలచే నిర్వహించబడతాయి.


💠 రేణుకాదేవి సరస్సును చేరుకోవడానికి ఢిల్లీ నుండి 'అంబాలా' మీదుగా 'సహాన్’ని చేరుకోవాలి. 

సహాన్ నుంచి 45 కి.మీ. దూరంలో వుంది ఈ యాత్రాస్థలం.

Aatakadaraa


 

New technique


 

How to get room in TIRUMAL


 

Devudi daya


 

రాజర్షి -బ్రహ్మర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*రాజర్షి -బ్రహ్మర్షి*

హిందూ ధర్మచక్రం.

లోక ప్రసిద్ధుడయిన విశ్వామిత్రుడు 

ఒకసారి వశిష్టుడి గృహానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తన ఇంటికి రావడం చూసి వశిష్టుడు “రాజర్షీ....రండి.... రండి 

మీకిదే నా స్వాగతం" అంటూ లోనికి ఆహ్వానించాడు.  


వశిష్టుడు తనను "బ్రహ్మర్షీ" అనకుండా “రాజర్షి" అని సంబోధించినందుకు విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే "నీ పెద్దకుమారుడు మరణించుగాక" అంటూ శపించి తపస్పుకై తిరిగి అడవులకు వెళ్ళిపోయాడు. వశిష్టుడి నూరుగురు కొడుకులలో పెద్దవాడు ప్రాణాలు విడిచాడు.


కొంతకాలానికి మళ్ళీ విశ్వామిత్రుడు వశిష్టుని ఇంటికి వచ్చాడు. “రాజర్షి .... రండి...." అంటూ వశిష్టుడు విశ్వా మిత్రుడిని ఆహ్వానించాడు. ఆ మాట విన్న విశ్వామిత్రుడు కోపంతో...  


"ఓయీ, నీ అహంకారం ఇంకా అణగ లేదా! నీ రెండో కుమారుడు కూడా మరిణించుగాక!" అంటూ శపించి వెను తిరిగి వెళ్ళిపోయాడు.


ఆ విధంగా వశిష్టుడి కుమారులలో తొంభై తొమ్మండుగురు విశ్వామిత్రుని కోపానికి గురై చనిపోయారు.


తరువాత నూరవసారి వెళ్ళినా విశ్వామిత్రుడిని “రాజర్షీ..” అనే సంభోధిస్తూ వశిష్టుడు అతడికి స్వాగతమిచ్చాడు. ఈసారి విశ్వామిత్రుడికి వశిష్టుడి పై జాలి కలిగింది. అతడు తననెలా సంబోధించినా అతడి ఆఖరి కొడుకును కాపాడాలి అనుకొని, తన కోపాన్నంతా బలవంతంగా దిగమింగుకొంటూ వెనుతిరిగాడు.


అంతలోనే "బ్రహ్మర్షీ" అన్న పిలుపు మెల్లగా వినిపించింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని సమీపించి "నువ్వు ముందే నన్ను బ్రహ్మర్షి అని పిలిచి వుంటే నీ తొంభయి తొమ్మండుగురు కొడుకులూ నీకు దక్కేవారు కదా? ఎప్పుడూ లేనిది ఇవాళ నాలో ఏ గొప్పతనం వుందని అలా పిలిచావు" అని ప్రశ్నించాడు. 


"అయ్యా! తమను పరీక్షించడానికే ఇన్నాళ్లు రాజర్షి అని పిలిచాను. నూరవసారి మాత్రమే మీరు మానవ సహజమైన కోపాన్ని దిగమింగుకొని దైవత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మీలోని శాంతమే నాచేత బ్రహ్మర్షీ అని పిలిపించింది" అని జవాబిచ్చాడు వశిష్టుడు.


వశిష్టుడి మాటలకు విశ్వామిత్రుడు సిగ్గు పడ్డాడు. తన తప్పిదాన్ని తెలుసుకున్నా డు. తన తపశక్తిచే వశిష్టుడి కొడుకులం దరిని తిరిగి బ్రతికించాడు.

మనిషి సర్వోన్నత స్థితిని పొందాలి అంటే దేహంలోని వికారాలను విడిచి పెట్టాలి. అప్పుడే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు.

.✍️ హిందూ ధర్మచక్రం.

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩


 *సేకరణ:- సీమనపల్లి బదరీనారాయణ.* 

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

Aasramamlo


 

Wire joint


 

Free water pump


 

Sivudu vishnuvu


 

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*మన సారథి, మన సచివుడు*

*మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్*

*మన విభుడు, గురువు, దేవర*

*మనలను దిగనాడి చనియె మనుజాధీశా!*


మహారాజా! మనందరినీ రణరంగంలోనూ , జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్నిసమయాలలోనూ సరియైన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన యింటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి చుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడనే వదలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా!


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

Resister


 

Kashmir trip


 

Manali 4 day trip


 

Drawing a hut


 

Shopping in manali


 

Hyderabad to manali

 


Engine restored


 

Hyderabad to goa in car


 

కోపం, అహంభావంట!😜

 ‘కరెక్ట్‌గా ఏవన్నా ఫంక్షన్ల ముందే వెళ్ళి డిప్ప కటింగ్ చేయించుకొస్తావు. కొంచెవేఁ కట్ చెయ్యమని చెప్పు. లేకపోతే ఫొటోలన్నింట్లోనూ ఆర్మీ రిక్రూట్‌మెంటుకి వచ్చినవాడిలా వుంటావు!’  


తనందని కాదుగానీ ఏవిఁటో నాకెప్పుడూ అలాంటప్పుడే ఖాళీ దొరుకుతుంది హెయిర్‌కట్‌కి.


ఆవేళ ఆదివారం. చాలామంది వచ్చేసుంటారు ఈపాటికే! ఈమధ్యే కొత్తగా పెట్టాడు బ్రాండెడ్ సెలూనొకటి. దర్శనం చేసుకుందామని లోపలికెళ్ళాను. ఓ ఆరుగురు మాసిన గెడ్డాల్తో, ట్రాక్ పేంట్లేసుకుని, సోఫాల్లో కూచుని తెగ చదివేస్తున్నారు పేపర్లన్నీ! 


రిసెప్షన్లో పదిహేడేళ్ళ పిల్ల సూటేసుకుని కూర్చునుంది. పేద్ద బౌండు బుక్కొకటి తీసి అపాయింట్‌మెంట్లవీ చూసి ‘ఎల్లుండి సాయంత్రం వస్తారా?’ అనడిగింది. 


నేను కటింగ్ కోసం వస్తే నాకు కటింగిస్తే ఎలా?? ‘కుదరదమ్మాయ్!’ అంటూ నిలయవిద్వాంసుడి దగ్గరకే బయల్దేరాను.


అక్కడా తమిళ హీరోల్లా గెడ్డాలేసుకుని చాలామందే వున్నారు. కానీ రవణ అదేం కాదన్నట్టే వుంటాడెప్పుడూ! ఒట్టి కబుర్లపోగు. అసలు నేనెప్పుడూ ఈ సెలూనుకే రావడానికి బలమైన కారణమేమిటంటే... బండి పెట్టుకోడానికి కాస్త చోటుంటుందని! 


ఆమాత్రం కటింగ్ ఎవరైనా చేసేస్తారు. అందులోనూ మనకి జుట్టు ఒత్తెక్కువ. సుళువుగా పట్టు చిక్కుతుంది. గుప్పిళ్ళతో పట్టుకుని తనివితీరా కత్తిరిస్తోంటే ఒకరకమైన ప్రొఫెషనల్ సాటిస్ఫేక్షన్ అతని మొహంలో! ఏదో మోహంలో వున్నట్టుంటాడు. 


ఆ తన్మయత్వంలో ఒకటికి బదులు రెండుగుప్పెళ్ళు ఏస్సాడంటే సేతు సినిమాలో విక్రమ్‌లా మారిపోతాను. అలాగని మరీ వదిలేస్తే పదిరోజులకే అపరిచితుడి గెటప్పులోకి దిగిపోతాను.


‘సార్! పదినిమిసాలంతే! రెండే సేవింగులు. కూచోండి. రేయ్! సితారివ్వరా డాట్రగారికీ!’ అంటూ తెగ హడావిడి చేస్సేడు. 


సితార చదివి చాలారోజులైంది.


‘ఆ రెండూ వదిలేస్తేనే పరిశ్రమలో  నిలదొక్కుకోగలం’ అని కింద తమన్నా బొమ్మ వేశాడు. చచ్చేలా మొత్తం చదివాను ఏంటొదిలెయ్యాలా అని...

...............

...............

...............

...............


కోపం, అహంభావంట!😜  


ఆ పుస్తకంతోనే నుదుటిమీద కొట్టుకుని పక్కనబడేశాను. 


‘హోమ్ దియేట్ర్ ఫైవ్ పాయింట్ వన్ తీస్కున్నాం సార్ మొన్నే!’ అన్నాడు పైకి కత్తెర చూపిస్తూ.


పైన నాలుగు మూలలా నా అంత స్పీకర్లు నాలుగున్నాయి. వాటిల్లోంచి కిరకిరలాడే ట్రెబల్‌తో  ‘మౌనమేలనోయీ’ పాటొస్తోంది. 


‘ఓర్నీ! ఈపాట ఇలా వినకూడదురా బాబూ! ఆ రిమోటిలా ఇవ్వు! బేస్ పెంచాలి. వూఫర్ జీరోకి సెట్ చేశారా ఏంటీ?’ అంటూ చెయ్యి చాచాను.


‘నాకవేటీ తెలీవు సార్! ఆ రిమోట్లో బేట్రీల్లేవు!’ అన్నాడు షేవింగ్‌క్రీమ్ రాస్తూ! అలాంటి వార్తని అంత ఉత్సాహంగా ఎలా చెప్తాడు ఎవడైనా? 


పోనీ మాన్యువల్‌గా పాట మారుద్దామంటే బుర్జ్ ఖలీఫ్‌లా పైనెక్కడో వుంది డొక్కు... సారీ... డెక్కు!


ఇక నాకు మొదలైంది హింస. వాడి కళాదృష్టెలా వుందంటే... అన్నీ సూపర్ మెలొడీసే! ఓంనమః, మాటే మంత్రము, కురిసేను విరిజల్లులే... ఇవన్నీ డబ్బాలో జంతికలేసి ఆడించిన సౌండ్‌లో వినాల్సొచ్చింది.


అదుగో ఆక్షణం మధురాతిమధురం! సడన్‌గా కరెంట్ పోయింది. ఒక్కసారిగా మా ఆవిడా, వాళ్ళ డిపార్టుమెంటూ ముద్దొచ్చేశారు. భలే కాపాడేస్తారబ్బా ఒక్కోసారి.


ఎంతసేపురా బాబూ? 


పక్కనెవరో ఇరవయ్యేళ్ళ కుర్రాడు క్షవరానికొచ్చాడు. ఏదో పుస్తకం ఇచ్చి ఏ నెంబరో అడిగాడు రవణ. అది కటింగ్ మోడళ్ళ పుస్తకంట! ఆ కుర్రాడు ‘ఇరవైరెండు’ అన్నాడు. ఆ పుస్తకం తీసుకుని ఇరవైరెండేవిఁటో అని చూశాను. 


గంటస్థంభం దగ్గర అనాసపళ్ళని ఒక డిజైన్లో చెక్కి అందర్నీ ఆకర్షిస్తూ అమ్ముతుంటాడొకడు. అచ్చం అలావుంది ఆ ఇరవైరెండు. వాడి కటింగయ్యేలోపు నాకళ్ళు పోతే బావుణ్ణు. ఆ దరిద్రాలన్నీ చూళ్ళేక ఏడుపొస్తోంది. మొన్నొకణ్ణి చూశాను రోడ్డుమీద. కెటిఎమ్ బండిమీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా పక్కనే ఆగాడు. మొత్తం గుండు చేయించేసుకుని స్వస్తిక్, సిలువ, ఉర్దూ అక్షరాలూ చెక్కించుకున్నాడు కొత్తెం మీద. వీడెవడో పెక్యులియర్ సెక్యులర్ అనుకున్నాను.


ఈలోగా ముగ్గురు కుర్రాళ్ళు జబర్దస్తీగా లోపలికొచ్చి దువ్వెన్నలతో దువ్వేసుకుని, పౌడర్లవీ రాసేసుకుని, ‘పవన్ కళ్యాణ్‌లా వున్నానా లేదా?’ అని అద్దంలో చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని వెళిపోయారు.


‘క్యూటికురా పౌడ్రు ఫ్రీ అనుకుంటన్నావేటి బే! కొంటే తెలుస్తాది. ప్రతివోడూ వొచ్చీసి తెగరాసేత్తారు పౌడర్లు. వారానికే డబ్బా ఖాళీ సార్ ఈ ఎదవల వల్ల!’ అంటూ ఆవేదనగా పలికాడు రవణ.


పక్క కుర్చీలో నాలుగేళ్ళ పిల్లాడొకడు కూర్చున్నాడు. వాణ్ణి క్షవరానికి తీసుకొచ్చిన వాళ్ళ నాన్న ప్రపంచంతో ప్లగ్ తీసేసుకుని కేండీక్రష్ ఆడుకుంటున్నాడు. ఆ పిల్లాడేమో ప్లగ్గుల్లో వేళ్ళు పెడుతున్నాడు.


వాడి అల్లరి మరీ రాక్షసంగా వుంది. కత్తెర్లు తియ్యద్దని రవణ అప్పటికి నాలుగుసార్లు చెప్పినా అదే తీస్తున్నాడు. పెదాలమీద పెట్టుకుని కటింగ్ చేసుకుంటున్నట్టు ఆడిస్తున్నాడు. గట్టిగా అరిచి కత్తెర లాక్కున్నాడు రవణ. వాళ్ళ నాన్న ఒకసారి తలపైకెత్తి చిరునవ్వు నవ్వి, ‘బంగార్తండ్రి!’ అని కొత్తెం మీద మెల్లిగా కొట్టి, మళ్ళీ తొంభైరెండో లెవెల్‌కి వెళిపోయాడు. 


ఇహ లాభంలేదని వెంకటిని పిలిచి వాడికి డిప్పకొట్టి పంపించెయ్యమన్నాడు. ఆక్షణంనించి వెంకటిగాడికి సంకటం మొదలయింది. 


వాడు కదలకుండా కూచోడు, వాళ్ళనాన్న కూచున్నచోటునించి కదలడు. ఏదో అయిందనిపించి ఇద్దర్నీ బయటకి గెంటేశాడు వెంకటి.


మొత్తానికి అందరి క్షవరాలూ అయ్యి నాదగ్గరకొచ్చాడు రవణ. 


‘సెల్ ఫోన్లయీ జోబీలోంచి తీసీండి సార్! మళ్ళీ కప్పేస్తే తియ్యడం ప్రోబ్లం!’ అన్నాడు స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో భాగంగా!


నేను మరింత ముందు జాగ్రత్తతో గోక్కోవలసిన చోటల్లా అప్పుడే గోకేసుకుని అప్పుడు కప్పమన్నాను. 


‘ఫోర్‌జీ ఫోన్లేనేటి సార్ రెండూనూ?’ అన్నాడు తలంతా పూరీలపిండిలా తడుపుతూ! 


‘ఆ! ఇవాళ్రేపన్నీ ఫోర్‌జీ ఫోన్లేకదా! నీకూ వుందిగా?’ అన్నా.


‘ఆ! మొన్నే కొన్నాన్సార్. అత్తమ్మ డబ్బులిచ్చింది ఫోను కొనుక్కోమని. జియో సిమ్మేసాను అందులో. హేపీగుంది సార్!’ వాడి స్వల్ప ఆనందాలకి ఆలంబనగా నిలిచిన అంబానీని పొగడ్డం మొదలెట్టాడు.


‘సినిమాలేం బావున్నాయి రవణా?’ అన్నాను టాపిక్ డైవర్ట్‌ చేద్దావఁని.


‘న్యూపూర్ణా చూడండ్సార్! బావుంది. ఫేమిలీ సినిమా. ఫైట్లు గట్రా లేవు!’ అని ముగించాడు.


ఇప్పుడా న్యూపూర్ణాలో ఏంసినిమా ఆడుతోందో తెలుసుకోవాలి. వీడెప్పుడూ ఇంతే! థియేటర్ల పేర్లే చెప్తాడు. 


ఉత్సాహంగా కట్ చేసేస్తోంటే ఉద్రేకంతో కిందడిపోతోంది జుట్టంతా. సడన్‌గా మొత్తం జుట్టు నుదుటిమీదకి దువ్వేసి, కట్ చేసేసి నన్ను మాస్టర్ రాములా తయారుచేసేసాడు.


‘మరీ వెర్రివెధవలా వున్నట్టున్నానూ?’ అని మనసులో అనుకుంటూండగానే


‘సార్! గోద్రెజ్జా? హెన్నానా?’ అన్నాడు క్లాత్ మారుస్తూ! కాటికాపరి గొంగళిలాంటి నల్లదుప్పటి ఒకటి తీశాడు బయటికి. 


‘ఏదోవొకటి. కానీ పదిహేన్రోజులకే అసలురంగు బయటపడిపోతోందీ మధ్య! మనస్ఫూర్తిగా వెయ్యట్లేదు నువ్వు!’ అన్నాను గోముగా.


‘సార్!’ అంటూ రెండడుగులు వెనక్కెళిపోయాడు. హడిలిపోయాను ఏమయ్యిందా అని! 


‘ఊళ్ళో ఇద్దరవేఁ టాపు సార్! అలాటిది నన్నేటి సార్ అలాగనీసేరు?’ ఆశ్చర్యంలో ఏంచేసేస్తాడో వెధవఖర్మ! వాడిష్టానికే వదిలేద్దాం అని డిసైడైపోయాను.


ఆపరేషన్ కి ముందు సర్జన్‌తోను, కటింగుకి ముందు బార్బర్‌తోను గొడవపెట్టుకోకూడదు😜


తలమీద నిమ్మకాయ రాసి మృదంగం వాయించడం మొదలెట్టాడు. చెవుల వెనకనించి బొటనవేళ్ళతో బలంగా లాగుతోంటే నిద్దరొచ్చేస్తోంది. 


నేనారోజు డ్యూటీలో వున్నాను. మత్తివ్వాల్సింది పోయి మత్తులోకెళిపోయాను.


‘రవణా! ఏడీ మీ ఓనరూ?’ అన్న అరుపుకి మెలకువొచ్చింది. బయట టీవీఎస్ ఫిఫ్టీ మీంచే అడిగాడు ఫైనాన్స్ బుజ్జి. అందరికీ అప్పులిచ్చి రోజూ కలెక్షన్ కోసం షాపులంట తిరుగుతాడు. 


‘ఆదివారం కద్సార్! ఆళ్ళింటికెళ్ళాడు! సాయంత్రం వచ్చేత్తాడు!’ అన్నాడు నన్నొదిలేసి బయటికెళిపోయి. 


‘ఊరంతా అప్పులెట్టీసి రెండేసి ఫేమిలీలెందుకు మీవోడికి? ఎప్పుడడుగు.. షాపులో లేడు, రాడు! మరేదగా తెచ్చిచ్చీమను. రేపుగ్గాని ఇవ్వకపోతే జవానొస్తాడు. ఆతరవాత ఆడిష్టం!’ అంటూ కొంత పాండిత్యం కూడా ప్రదర్శించాడు.


దాంతో వీడిక్కోపమొచ్చేసింది. మాటామాటా పెరిగింది. లోపలికొచ్చి ఫిలిప్స్ షేవరొకటి పట్టుకుపోయాడు. 


తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్నాడు రవణ. 

ఆ కోపం అంతా నామీద చూపించాడు. 


ఏంచేస్తున్నాడో నాక్కనబడలేదు. అంతా అయిపోయి బయటికొచ్చేటప్పటికి సేతులాగా లేను, అపరిచితుళ్ళాగా లేను....


చెల్లెలికాపురంలో శోభన్‌బాబులా వున్నాను! 


వాడు నాకంత ‘డై హార్డ్’ ఫ్యానని తెలీదు!😜 


               


............జగదీశ్ కొచ్చెర్లకోట

శ్రీ సీతా మాయి మందిర్

 🕉 ⚜ హర్యానా : కర్నాల్ ⚜ 

శ్రీ సీతా మాయి మందిర్



💠 త్రేతా యుగంలో విష్ణువు అవతారమైన మర్యాద పురుషోత్తం శ్రీ రామచంద్రుడు ప్రవర్తన మరియు పరిపూర్ణమైన లక్షణానికి ఆదర్శంగా ఆరాధించబడతాడు.  అతని భార్య, సీతా మాత పవిత్రత, యోగ్యత మరియు సద్గుణాల విగ్రహంగా పూజించబడుతోంది.


💠 కుశధ్వజుని కుమార్తె వేదవతి రామాయణ కాలం నాటి సీత .

రావణుడు తపస్సులో నిమగ్నమైన ఒక అమ్మాయిని సంప్రదించి, తపస్సు యొక్క ఉద్దేశ్యాన్ని అడిగాడని నమ్ముతారు.  

ఆ అమ్మాయి తనను తాను కుశధ్వజు రాజు కుమార్తెగా వేదవతిగా పరిచయం చేసుకుంది.  ఆమె తండ్రి ఆమెను విష్ణువుతో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.  దీనితో కోపోద్రిక్తుడైన శుభ అనే రాక్షసుడు తన తండ్రిని చంపాడు మరియు ఆమె తల్లి కూడా అగ్నిలో కాలిపోయింది.  

తన తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, ఆమె విష్ణువుపై తపస్సు చేసింది.  

ఇది విన్న రావణుడు కోపోద్రిక్తుడై విష్ణువును

నిందించడం ప్రారంభించాడు.


💠 వేదవతి రావణుడిని ఆపింది, కానీ రావణుడు ఆమె జుట్టును పట్టుకున్నాడు.  అవమానానికి బాధపడిన వేదవతి పశ్చాత్తాపంతో అగ్నిప్రవేశం చేసి రావణుడి మరణం కి కారణం అయ్యే సీతగా  మళ్లీ జన్మనిస్తానని చెప్పింది.

తరువాత, రామాయణ కాలంలో వేదవతి రాజ జనకుని ఇంట్లో జన్మించి  రాముడి భార్య సీత రూపంలో రావణుని సంహారానికి కారణమైంది.


💠 సీతా మాయి దేవాలయం ఉత్తర భారతదేశంలోని హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని సీతామాయి గ్రామంలో ఉన్న ఒక పురాతన కట్టడం.  

సీతాదేవికి  మాత్రమే అంకితం చేయబడిన భారతదేశంలోని ఏకైక ఆలయం ఇది కావచ్చు.


💠 గర్భవతి అయిన సీతను రాముడు విడిచిపెట్టినప్పుడు, సీత అయోధ్యను విడిచిపెట్టింది.

14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడి ఆజ్ఞపై లక్ష్మణుడు సీతను విడిచిపెట్టిన అడవికి లద్వాన్ అని పేరు పెట్టినట్లు ఒక పురాణం. 

ఈ దట్టమైన అడవికి పశ్చిమాన మహర్షి వాల్మీకి ఆశ్రమం ఉంది, అక్కడ సీత వనవాస సమయంలో నివసించేది.


💠 వాల్మీకి మహర్షి ఆశ్రయంలో, సీత లవ మరియు కుశ అనే కవల కుమారులకు జన్మనిచ్చింది.  తన కుమారులు పెరిగి తండ్రితో కలిసిన తర్వాత, సీత తన స్వచ్ఛతకు నిదర్శనంగా తన తల్లి, భూగర్భం వద్దకు తిరిగి వచ్చింది.  

సీతాదేవి తన స్వచ్ఛతకు రుజువు కోసం వేడుకుంటూ భూమి విడిపోయి ఆమెను మింగేసిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది.


💠 సీత భూమిలో కనిపించకుండా పోయిన ప్రదేశంలోనే సీతామయి ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. 

తరువాత, ఈ కారణంగా ఇక్కడ ఉన్న గ్రామానికి సీతామయి అని కూడా పేరు పెట్టారు. ఈ దేవాలయం పేరు కూడా చరిత్రలో సీతామఠంగా పేర్కొనబడింది.


💠 ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దీనికి సంబంధించిన అనేక కథలు మరియు కథలు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి.

ఒకప్పుడు ధనవంతుడు కొన్ని ఒంటెలను పోగొట్టుకున్నాడని కూడా చెబుతారు. 

ఎంత వెతికినా దొరకకపోవడంతో ఈ ప్రదేశంలో తలదాచుకున్నాడు. అప్పుడు ఇక్కడ తల్లి సీత అతనికి ఒక చిన్న అమ్మాయి రూపంలో కనిపించింది మరియు ఇక్కడ ఆలయం నిర్మించమని కోరింది. ఆ తర్వాత తల్లి హఠాత్తుగా అదృశ్యమైంది. రాత్రి విశ్రాంతి తీసుకున్న వ్యక్తి ఉదయం మేల్కొన్నప్పుడు, అతనికి సమీపంలో ఒంటెలు కనిపించాయి. అమ్మవారి అద్భుతంగా భావించి ఆలయాన్ని నిర్మించాడు.


🔆 వేదవతి తీర్థం 🔆


💠 ఈ ప్రదేశాన్ని వేదవతి తీర్థం అని కూడా అంటారు.  వాస్తవానికి, ఆలయ సందర్భంలో, వామన్ పురాణంలో, వేదవతి తీర్థాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ స్నానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి కన్యాయాగ ఫలాలను పొందుతాడని మరియు సర్వ పాపాల నుండి విముక్తి పొంది ఉన్నత స్థితిని పొందుతాడని చెప్పబడింది.  మహాభారతం ప్రకారం, ఈ తీర్థయాత్రలో స్నానం చేయడం వలన అగ్నిష్టోమ యాగ ఫలితాలు లభిస్తాయి.  

ఈ అతీంద్రియ ప్రదేశంలో భక్తుల విశ్వాసం చాలా లోతైనది.  

ఇక్కడ ఏడుసార్లు తల వంచి నమస్కరిస్తే పక్షవాతం, అంధత్వం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.  

ఇందుకోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు సుదూర ప్రాంతాలకు తరలివస్తున్నారు.  


💠 అయితే ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన కొన్ని వివాదాల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు మాత్రమే ఇక్కడికి చేరుకుంటున్నారు.  దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 

ప్రస్తుతం ఆలయంలో భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.  


💠 కార్తీక పూర్ణిమ మరియు ఫాగుణ అష్టమి నాడు ఈ ఆలయంలో ప్రత్యేక జాతరలు జరిగేవని గ్రామస్తులు చెబుతారు. 

వీటిలో వేలాది మంది భక్తులు పాల్గొని ఆలయంలో తల వంచి మొక్కులు తీర్చుకుంటారు.  

కానీ, ఈ మధ్య కరోనా కారణంగా జాతరలు నిర్వహించలేకపోయారు.


💠 కర్నాల్ రైల్వే స్టేషన్ దగ్గరి రైలు మార్గం. కర్నాల్‌ కి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. 

ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రభుత్వ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

believe it.

 Charlie Chaplin lived 88 years

He left us 4 statements:

(1) Nothing is forever in this world, not even our problems.

(2) I love walking in the rain because no one can see my tears.

(3) The most lost day in life is the day we don't laugh.

(4) Six best doctors in the world...:

1. The sun

2. Rest

3. Exercise

4. Diet

5. Self-respect

6. Friends

Stick to them at all stages of your life and enjoy a healthy life...

If you see the moon, you will see the beauty of God...

If you see the sun, you will see the power of God...

If you see a mirror, you will see God's best creation. So believe it.

We are all tourists, God is our travel agent who has already identified our routes, bookings and destinations... trust him and enjoy life.

Life is just a journey! Therefore, live today!

Tomorrow may not be.

సంకల్పము

 **********

*శుభోదయం*

16.229192313

***********

సంధ్యా వందన

 మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.31.12.2023

 ఆది వారం (భాను వాసరే) 

*********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ

మార్గశీర్ష మాసే కృష్ణ పక్షే  చతుర్ధ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ మార్గశీర్ష మాసే  కృష్ణ   చతుర్ధ్యౌపరి పంచమ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.34

సూ.అ.5.31

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

మార్గశిర మాసం 

కృష్ణ పక్షం చవితి ప. 10.11 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం మఘ పూర్తి. 

అమృతం రా.తె.4.40 ల 6.26 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 4.03 ల 4.47 వరకు.  

వర్జ్యం రా. 6.06 ల 7.52 వరకు. 

యోగం ప్రీతి రా.తె.3.53 వరకు.

కరణం బాలవ ప. 10.11 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

**********

పుణ్యతిధి మార్గశిర బహుళ పంచమి. 

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

డిసెంబరు 31,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, డిసెంబరు 31,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:చవితి ఉ10.11 వరకు

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:మఖ పూర్తి 

యోగం:ప్రీతి తె3.05 వరకు

కరణం:బాలువ ఉ10.11 వరకు తదుపరి కౌలువ రా11.14 వరకు

వర్జ్యం:సా6.02 - 7.48

దుర్ముహూర్తము:సా4.04 - 4.48

అమృతకాలం:తె4.37 - 6.23

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: ధనుస్సు

 చంద్రరాశి:  సింహం 

సూర్యోదయం:6.38

సూర్యాస్తమయం:5.32


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్థి -  మఘా  -‌ భాను వాసరే* *(31-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/A990GphK7d4?si=md8o3BE5KE_jVETB


🙏🙏

*31-12-2023 / ఆదివారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

•••••━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*31-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


మిత్రులతో  చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.   వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

---------------------------------------

మిధునం


వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన  పనులు సజావుగా పూర్తి చేస్తారు. 

---------------------------------------

కర్కాటకం


వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలిస్తాయి.  వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కన్య


పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు  కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు.

---------------------------------------

తుల


వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

---------------------------------------

వృశ్చికం


నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

---------------------------------------

మకరం


ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

కుంభం


నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మీనం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద  కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార  విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

కన్నెత్తైనా చూడజాలరు

 🪷🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*పాతాళ భూతల వ్యోమ చారిణశ్ చద్మ చారిణః౹*

*న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః॥*


 - *శ్రీ రామరక్షా స్తోత్రం - 11* -


*తా* 𝕝𝕝  

కపటులై, భూమ్యాకాశ పాతాళాలలో సంచరించువారు, ఎవరైనప్పటికీ శ్రీరామ నామముచే రక్షింపబడిన వానిని కన్నెత్తైనా చూడజాలరు. భూమి, ఆకాశము, పాతాళ లోకాలలో చరించే ఏ జీవి అయినా కూడా, రామనామం చేత రక్షించబడినవాడిని కన్నెత్తి అయినా చూడడం సాధ్యం కాదు.

*పాతాళమునందు, భూమియందు, ఆకాశమునందు సంచరించే జీవులుగాని, అదృశ్యరూపమున విహరించే శక్తులుగాని రామనామముచే రక్షింపబడునట్టి వానిని కన్నెత్తికూడా చూడజాలవు*.

Modi ji


 

30, డిసెంబర్ 2023, శనివారం

విష్ణుచిత్తుని కుమార్తె

 https://youtu.be/vNxjOuvR7e4?si=mAzbn6qcyYQeUgLs


శ్రీభారత్ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలు 🌹 ధనుర్మాసం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది గోదాదేవి, ఆమె రచించిన తిరుప్పావై. లక్ష్మీ దేవి అవతారమైన గోదాదేవి శ్రీరంగనాథుని వలచి, వలపించుకొంది. ఆమె  తిరువిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుని కుమార్తె ఎలా అయిందో,  కాత్యాయనీ వ్రతం చేసి శ్రీరంగనాథుని ఎలా చేరిందో, పాశురాలు ఎందుకు రచించిందో అది ఒక అద్భుతమైన చరిత్ర. ఆ విషయాలన్నీ ఎంతో మృదుమధురంగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

⚜ శ్రీ మణిమహేశ్ మందిర్

 🕉 మన గుడి : నెం 285


⚜ హిమాచల్ ప్రదేశ్  : కిణ్ణూర్


⚜ శ్రీ మణిమహేశ్ మందిర్


💠 హిమాచల్ ప్రదేశ్లోని ‘చంబా' జిల్లాలో వున్న ఈ ప్రదేశం 4170 మీటర్ల ఎత్తులో ఉంది. 

ఇది గొప్ప శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. మణిమహేశ్లో ఓ సరస్సు కూడా ఉంది. 

ఇక్కడి నుంచి మనం కైలాస పర్వతాన్ని చూడవచ్చు. 

ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ట్రెక్కింగికి ఉపయోగిస్తారు.


💠 ఈ ప్రదేశాన్ని చంబా కైలాష్ అని కూడా పిలుస్తారు.

మణిమహేష్ కైలాస శిఖరం శివుని నివాసంగా ప్రసిద్ధి చెందింది.

మణిమహేష్ సరస్సు ని దాల్ సరస్సు అని కూడా పిలుస్తారు.


💠 మణిమహేష్ అంటే "శివుని ఆభరణాలు" అని అర్ధం.  స్థానిక పురాణం ప్రకారం, పౌర్ణమి రాత్రి, అద్భుతమైన సరస్సులో ఈ ఆభరణం యొక్క ప్రతిబింబాన్ని చూడవచ్చు అంటారు..


💠 సంవత్సరంలో ఎక్కువ భాగం, మంచు కారణంగా మూసి ఉంటుంది.  

ఈ సరస్సు చేరుకోవాలంటే 13 కి.మీ దూరం మంత్రముగ్ధులను చేసే పర్వతాలు మరియు పచ్చదనం గుండా ప్రయాణించాలి.  


💠 ఇక్కడి సరస్సు రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది - పెద్ద భాగం శివ కటోరి (శివుని స్నాన ప్రదేశం), మరియు దిగువ భాగాన్ని గౌరీ కుండ్ (పార్వతి దేవి కోసం స్నాన స్థలం) అని పిలుస్తారు.


💠 ఈ పవిత్ర సరస్సులో శివుడు మరియు పార్వతి స్నానం చేస్తారని ప్రజల నమ్మకం.  మణిమహేష్ శిఖరాన్ని చూసేందుకు యాత్రికులు సరస్సుకు చేరుకుంటారు.


💠 పూర్తి ఆధ్యాత్మిక సంతృప్తిని అందజేస్తుందని తెలిసినందున ఈ పవిత్ర స్నానం "మన్ కా మహేష్" అని కూడా పిలువబడుతుంది.


💠 ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబరులో,క్రిష్ణాష్టమినుండి,రాధాష్టమి వరకు ఈ పర్వతాలలో యాత్రలు చేస్తారు.

యీ సమయంలో  మణిమహేష్ సరస్సులో  పరమేశ్వరుడు, దాన్జో గ్రామంలో వున్న 'గౌరీకుండ్' లో పార్వతి దేవి  స్నానం చేస్తారని ఐహీకం. 


💠 గౌరికుండ్ లో స్త్రీలు మాత్రమే  స్నానం చేయాలని నియమం.

ఈ యాత్ర మిక్కిలి పవిత్రమైనదిగా భావిస్తారు.


💠 పరమేశ్వరుడు , బ్రాహ్మీదేవికి యిచ్చిన మాట ప్రకారం బర్మోర్ బ్రాహ్మిణీ ఆలయ పుష్కరిణి లో స్నానం చేసిన తరువాత , మణిమహేష్ సరస్సు లో  స్నానం చేయాలన్నది  ఆచారం. 


💠 ఆరు బయట ,  గోపురం, విమానం ఏమీ లేకుండా  శూలములు మాత్రమే వుంటాయి. సూర్యోదయ దృశ్యం, పౌర్ణమి రోజున మణిమహేష్ శిఖరం చంద్ర కాంతిలో మెరుస్తున్న దృశ్యం పరమాద్భుతము.


💠 స్థల పురాణం పురాణం ప్రకారం, మాతా గిరిజగా పూజించబడే పార్వతీ దేవిని వివాహం చేసుకున్న తరువాత శివుడు మణిమహేష్‌ని సృష్టించాడని నమ్ముతారు . 

ఈ ప్రాంతంలో సంభవించే హిమపాతాలు మరియు మంచు తుఫానుల ద్వారా శివుడు మరియు అతని అసంతృప్తిని ప్రదర్శించడం గురించి అనేక పురాణాలు వివరించబడ్డాయి . 


💠 మణిమహేష్ సరస్సు ఒడ్డున శివుడు తపస్సు చేసినట్లు కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. 

శివుడు కైలాస పర్వతంలో ఆరు నెలల పాటు నివసిస్తాడనీ, ఆ తర్వాత విష్ణువుకు రాజ్యాన్ని అప్పగిస్తూ పాతాళానికి వెళతాడని కూడా ఇక్కడి వాసులు నమ్ముతారు. 

అతను భూలోకానికి బయలుదేరే రోజును ప్రతి సంవత్సరం గడ్డీలు ( గొర్రెలు కాచే వారు)  భక్తితో పాటిస్తారు, ఇది జన్మాష్టమి రోజు, భదోన్ (ఆగస్టు) మాసంలో ఎనిమిదవ రోజు (అష్టమి) శ్రీకృష్ణుడు (విష్ణువు అవతారం) పుట్టినరోజు. 


💠 స్థానిక పురాణం ప్రకారం, ఆభరణం నుండి ప్రతిబింబించే చంద్ర కిరణాలు మణిమహేష్ సరస్సు నుండి స్పష్టమైన పౌర్ణమి రాత్రి (ఇది అరుదైన సందర్భం) చూడవచ్చు . 

అయితే, శివుని మెడలో ఉన్న పాము రూపంలో శిఖరాన్ని అలంకరించే హిమానీనదం నుండి కాంతి ప్రతిబింబం ఫలితంగా ఇటువంటి అద్భుత దృశ్యం  సంభవించవచ్చని ఊహించబడింది. 


💠 పురాణాల ప్రకారం, శివుడు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసాడు. 

అతని జటాజూటం నుండి నీటిచుక్కలు వచ్చి సరస్సు రూపాన్ని సంతరించుకున్నాయి. 

ఇది రెండు విభిన్న భాగాలను కలిగి ఉంటుంది. ఎక్కువ భాగం మంచుతో నిండిన చల్లని నీటిని కలిగి ఉంది, దీనిని 'శివ్ కరోత్రి' (శివుని స్నాన ప్రదేశం) అని పిలుస్తారు. 

పొదల్లో దాగి ఉన్న సరస్సు యొక్క చిన్న భాగం గోరువెచ్చని నీటిని కలిగి ఉంది మరియు దీనిని 'గౌరీ కుండ్' అని పిలుస్తారు.

ఇది శివుని భార్య అయిన పార్వతి యొక్క స్నాన ప్రదేశం. అందువలన, పురుషులు మరియు మహిళలు సరస్సు యొక్క వివిధ ప్రాంతాల్లో స్నానం చేస్తారు. 


💠 ఒక కథ ప్రకారం, ఒకసారి ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందతో కలిసి పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. 

అతను తన గొర్రెలతో పాటు రాయిగా మారాడని నమ్ముతారు. 

ప్రధాన శిఖరం క్రింద ఉన్న చిన్న శిఖరాల శ్రేణి దురదృష్టకరమైన గొర్రెల కాపరి మరియు అతని మంద యొక్క అవశేషాలు అని నమ్ముతారు.


💠 మణిమహేష్ పవిత్ర తీర్థయాత్రకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, మణిమహేష్ తీర్థయాత్ర కమిటీ మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. 

ఈ ప్రాంతంలోని గడ్డి గిరిజనులకు , సరస్సుకు తీర్థయాత్ర అత్యంత పవిత్రమైనది. 

ఇది స్థానికంగా "డోలీ ఛరి" (యాత్రికులు తమ భుజాలపై మోసే పవిత్ర కర్ర) అని పిలువబడే ఒక ఊరేగింపు  


💠 భార్మావోర్ నుంచి ఈ క్షేత్రం 35 కి.మీ. దూరం

భాషాద్వయ సమ్మేళనమ్

 భాషాద్వయ సమ్మేళనమ్ 

                                                 

       (   చిత్ర కవిత)


              కం:  మాయంమాన సు  నీవే


                     రాయలవై  కావ  దేవరా!  జే జే జే !


                    మాయాతుమ లానిన యది


                    పాయక  సంతోసమున్న  పల  మిలసామీ !


                          కళాపూర్ణోదయము--6  ఆ : 161 పద్యం- పింగళి సూరన !


                       

               ఈపద్యము కళాపూర్ణోదయమున  ప్రథమాగమాదులు  పామరవేషధారులైవచ్చి  కళాపూర్ణుని  స్తుతించు సందర్భము లోనిది. ఇందు ఒకరీతి గా పదములను చదివిన తెనుగును, మరియొక రీతిగా చదువగా సంస్కృత మును మనకు అవగత మగుచుండును. ఇదియే భాషాద్వయ సమ్మేళనము. 


      తెలుగు: పదవిభాగము+ అన్వయము.


                  ఇలసామీ! --మాయమ్మ-  ఆన- సు- నీవే - రాయలవై -కావన్-  దేవరా - జేజేజే- మా ఆతుమలానినయవి- పాయక- సంతోషమున్న- పలము. 


             అర్ధము: దేవరా! ఓరాజా! ! జేజేజే-  జయము జయము జయము;ఇలసామీ-ఓభూపతీ!  నీవే- నీవే ;రాయలవై- రాజువై;

కావన్- రక్షింపగా ; సంతోసము- ఆనందము; పాయక- విడువక; మాయాతుమలను- మామనస్సులందు; ఆనినయది-పొందినది;  ఉన్నపలము- ఇదిమాకు కల్గిన ఫలము; మాయమ్మఆన- మాతల్లిపై  ఒట్టు;


            భావము: ఓరాజా! నీకు జయమగుగాక! మాయమ్మపై నొట్టుపెట్టుకొని చెప్పు చున్నాము.  నీవు రాజువై రక్షించుటచే  మామనస్సులానందముతో నిండిపోయినవి;


             సంస్కృతము:పదవిభాగము+ అన్వయము:   మా-- ఆయమ్--మాన- సునీవే-- రాః - అలవా - ఏకా - అవత్-  ఏవ -రాజే - అజేజే - మా - ఆయాతు-  మలాని-- న- యది- పాయక- సంతః-  అసముత్ - న- వల- మిల- సా- అమీ;


          అర్ధము: హే సునీవే- చక్కని మూలధనముగల ఓరాజా! ;  ఆయమ్- రాబడిని ; మామాన-  లెక్కచేయకుము; అలవా--తరుగని;

రాః - ధనము; ఏవ- ఒక్కటియే; అవత్- రాజును కాపాడును ; అజేజే-- భగవంతుని పూజించు-- రాజే--రాజుకొరకు ; మా- లక్ష్మి; ఆయాతు- వచ్చునుగాక - మలాని- పాపములు-- న-- చేరవు;  పాయక- ఓరక్షకుడా! ; సంతత్సు- పడితులైనచో (చూడవచ్చినవారు)

అసముత్--సంతోషరహితుడవై ; నవల- దూరముగా పోకుము; మిల-- వారిని కలువుము; అమీ-- ఆపండితులే- సా  లక్ష్మీ  -- ఆ  లక్ష్మియని  యెఱుంగుము;


             భావము:  ఓరాజా! రాబడిని నమ్మి  మూలధనమును వమ్ముచేయకుము. తరుగని సంపదయే రాజునకు సంతసమును గూర్చును. భగవదారాధనచే  సకల సంపదలు కలుగును. పాతకములు దరిజేరవు.  ప్రభూ! పండితులను గాంచినంతనే  పరాఙ్ముఖుడవుగాక  ,వారిని సంభావింపుము. వారే లక్ష్మికి  ప్రతిరూపములని భావింపుము.


                 ఇది పాఠకులకు కొంత కష్ట సాధ్యమేయైనను  రహస్య సమాచారాదులకొరకు  వేగులు ,మంత్రులు ,ప్రభువులు, తమతమ

కార్యకలాపములకు ఇట్టివి వాడుచుండెడివారు. 


                                                      స్వస్తి!!🙏🙏👌👌💐🌷🌷🌷🌷💐💐🌷🌷💐💐💐💐💐💐💐🌷

బ్లడ్ క్యాన్సర్ కు మందు

 చాలా ముఖ్యమైన వార్త


 పూణేలో అందుబాటులో ఉంది


 దయచేసి ఈ ముఖ్యమైన వార్తను చదివిన తర్వాత తప్పకుండాఫార్వార్డ్ చేయండి.                                                         


 నా ప్రియమైన స్నేహితులారా


 బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!!


 దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు

 ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి.


 'ఎమోటిఫ్ మెర్సిలేట్' బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం.


 పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది.


 అవగాహన కల్పించండి.


 ఇది ఎవరికైనా సహాయం చేయగలదు.


 మీకు వీలైనంత వరకు కొనసాగండి.

 నైతికతకు ధర లేదు.


 తెలుసు:

 యశోదా హెమటాలజీ క్లినిక్.  109, మంగళమూర్తి కాంప్లెక్స్, హీరాబాగ్ చౌక్,

 తిలక్ రోడ్,

 పూణే-411002.


 ఫోన్:

 020-24484214 లేదా 09590908080 లేదా 09545027772 లేదా www.practo.comని సందర్శించండి.


 నా వినయపూర్వకమైన అభ్యర్థన: దయచేసి ఫార్వార్డ్ చేయండి

Panchang


 

Doshaalu

 


ఐదు విధాలైన దోషాలు

 🍃🪷🍃🪷🍃🪷🍃

⚡ *మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...*


1.  *అర్ధ దోషం*

2.  *నిమిత్త దోషం*         

3.  *స్ధాన దోషం*

4.  *గుణ దోషం*   

5.  *సంస్కార దోషం*.


 *అర్ధ దోషం*


ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం


 *నిమిత్త దోషం*

 

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు


అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది


ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను .నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం' ఏర్పడుతోంది


 *స్ధాన దోషం*


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు


దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి


 *గుణ దోషం*


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది


*సంస్కారదోషం*


ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది.

A Best Collection from Brahmana Samaakya.


🍃🪷🍃🪷🍃🪷🍃

మిఠాయి సత్యం:

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

మిఠాయి సత్యం:


మా ఊర్లో సత్యంగారనే వారు

ఉండేవారు.ఉదయం పదిగంటల నుంచి

జంతికలు,చెగోడీలు,బజ్జీలు,బెల్లం మిఠాయి

ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో‌ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనే

వారు.దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనే‌పేరు స్థిరపడిపోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే

ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు,హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా

భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథ కులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:


సెనగపిండి (మూలమనుకోండి)

1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.

2.లావుగొట్టంలో సుడితే జంతికలు

3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ,పుట్నాలు,అటుకులు ,కర్వేపాకు యేపి

కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి

పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు

ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే 

మైసూరు పాక్ అవుతుంది.

6.అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కలిపి‌వేయిస్తే

పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు,మనకి శివుడుగా

యిష్ణువుగా,ఆంజనేయుడుగా,గణపతిగా

ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.


మనం ఎలా కొలిచినా,పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి.ఆయ్! నాకరదమయినకాడికి

సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన ‌శాలువ‌సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు.


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువు గా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.


సభంతా చప్పట్లు మోత.

                 ***.

ఆశించవద్దు

🙏

*దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్ధం చేసుకోవద్దు.*

జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు.

మా నుండి ఆశించవద్దు.

హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ  ఉగాది.

హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది.

జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, జనవరి 31వ తేదీన అర్ధరాత్రివేళ నూతనసంవత్సర వేడుకలలో పాల్గొనడంగానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి, ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు.

హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయం ఏమనగా హిందూమతంలో  బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3.30గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుండి మనము మంచిసమయంగా హిందూధర్మంలో భావిస్తాం.  రాత్రి 11గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధసమయముగ భావిస్తాo. ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం.

*గమనించండి.* 

హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్లీ చెబుతున్నా. మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాదిపండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు. ఉగాది ముద్దు. 

దయచేసి ఈ మెసేజ్ ను అన్ని హిందూ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన  పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం హిందూ బంధువులందరూ దీనిని గ్రూపులలో ప్రచారం చేసి మన సాంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.🙏

*(జై సనాతన ధర్మం. జై హిందూ ధర్మం)*

గుఱ్ఱం గుడెక్కింది*

 *సామెత కథ*


*గుఱ్ఱం గుడెక్కింది* 


దొరలు మనదేశం వచ్చిన కొత్తలో, వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టటానికి పల్లెటూరి ప్రజలు వప్పుకొనేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు సుతరామూ వాళ్ళను రానిచ్చేవాళ్ళు కాదు. ఎందు కంటే, దొరలు అనగా సీమదేశంనించి దిగిన మ్లేచ్ఛులనీ, వాళ్ళ సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందనీ వాళ్ళ వుద్దేశం.


అటువంటి కాలంలో— దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా పెద్ద పెద్ద ఉద్యోగస్థులుగా బస్తీలకు వచ్చి చేరుకొనే వారు, ఉద్యోగరీత్యా చిన్నచిన్న గ్రామాలలో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆవిధంగా మకాంచేసిన దొరలకు ఎదురు చెప్పడమంటే పల్లెటూరి వాళ్లకు భయంగా వుండేది. 


అలా భయపడకుండా ఉండే వాళ్లు గోదావరిజిల్లా కోనసీమలోని *పేరూరు* ద్రావిడులు. వారు దొరలను కాదుకదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్ళలో వాళ్ళే తగవులు పరిష్కారం చేసుకొనేవారు. అంతేగాని, కోర్టులకూ గిర్టులకూ తిరిగి పిరికిపంద అనిపించుకునేవారు కాదు.


ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలక్టర్లుగా వచ్చి, పల్లెలలో మకాం చేసి, కేసులు విచారణ చేయటం విరివిగా సాగుతూ వుంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే, కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుఱ్ఱం ఎక్కి నవుకర్లతో సహా బయల్దేరాడు.


కలెక్టరుగారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్ళకు

తెలిసింది. వెంటనే, వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరివెలుపల కలెక్టరుగారి వద్దకు వెళ్ళి, "అయ్యా, దొరగారూ! పరాయిదేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీలులేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు. కనుక, మా గ్రామమర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము ' అంటూ వినయపూర్వకంగా చెప్పారు.


గర్వంతో, వినీ విననట్లు నటించి నవ్వేసి ఊరుకొన్నారు. ఎన్ని విధాల చెప్పినా వాళ్ల మొర దొరగారి చెవికి ఎక్కేటట్టు కనిపించలేదు. మరి కొంచెం సేపటికల్లా కలక్టరుగారు ఊళ్లో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి, కేసు విచారణ ప్రారంభించారు.


రెండు మూడు రోజులు విచారణ జరిగింది. కలెక్టరుగారి గుఱ్ఱాన్ని

బంట్రోతులు డేరా వెనుక పక్కన కట్టిపెడుతూ ఉండే వారు. మూడోరోజున, కలెక్టరుకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకొని, ద్రావిడులు నిశ్చయించారు. ఆరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా, వారు నడుములు బిగించి, ఒకొక్కరు ఒకొక్క గడ్డిమోపు చొప్పున అంచీలమీద తెచ్చి, గుడికి దాపుగా ఏటవాలుగా, చక్కగా మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకూ పేర్చి, అమర్చారు. తరువాత, గుఱ్ఱాన్ని కట్టిన చోటునుండి, గుడి పైదాకా వారు పేర్చిన మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి, ఆ తర్వాత గుఱ్ఱానికి కట్టిన తాడు కాస్తా తొలగించివేశారు.


గుఱ్ఱం ఆ పరకలను అందుకొంటూ, ఒకొక్క అడుగే వేసుకొంటూ, ఆ మోపుల మీదినించి సులువుగా గుడిమీదికి ఎక్కిపోయింది.


తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసివేసి ఇళ్ళకు పట్టుకుపోయారు.


తెల్లవారింది. దొరగారి గుఱ్ఱం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా వుంది. "ఏమిరా ఇంత అజాగర్త!” అంటూ దొర నవుకర్లను చెడామడా తిట్టాడు.


నవుకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టివచ్చారు. కాని,  గుఱ్ఱం ఎక్కడా అగపడలేదు. ఇంతలో, పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకటానికి బయల్దేరారు. కొంచెందూరం పోయేసరికి, యజమాని కంటబడగానే గుడిమీద ఉన్న గుఱ్ఱం సకిలించింది. దొరగారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. గ్రామస్థులంతా క్షణంలో మూగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారేగాని గుఱ్ఱం గుడి ఎందుకు యెక్కింది? ఎలా ఎక్కింది? అనే ప్రశ్న ఒక్కళ్ళకూ తట్టనేలేదు. అప్పుడు ఆ గుంపులోనుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకొంటూ దొరగారి వద్దకు వచ్చి, "బాబూ ! ' వద్దండీ ! ' అని మొదట్లోనే మేం మొరపెట్టుకొంటే విన్నారు కాదు. పైగా, దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేముడు సహిస్తాడనుకొన్నారా? మా దేముడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? 'శరణు' అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేముడు. ఆయన కరుణిస్తే మీ గుఱ్ఱం మళ్ళీ మీకు దక్కుతుంది. కనుక, దేమునికి సాష్టాంగపడి మొక్కుకొండి !” అన్నాడు.


దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినట్టుగా దేముణ్ణి ప్రార్ధించారు. ఈవిధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకొన్నతరువాత, ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు "మీరు నిశ్చింతగా ఉండండి. మీ గుర్రానికి వచ్చిన పరవా లేదు ” అని అభయమిచ్చారు.


ఆ రాత్రికి రాత్రి, గడ్డిమోపులు మెట్లుగా పేర్చి, మునుపు ఏవిధంగా గుఱ్ఱాన్ని గుడి ఎక్కించారో అలానే చీమ చిటుక్కుమన కుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందికి దింపి, యధాస్థానంలో డేరా వెనుక గుంజుకు కట్టివేశారు.


మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుఱ్ఱం సురక్షితంగా మకాంలో ఉండటం చూచి, కలెక్టరుగారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నించీ *పేరూరు* ద్రావిడులంటే దొరగారికి గౌరవమూ, ఆ వూరి దేముడంటే భక్తి విశ్వాసాలూ ఏర్పడినై. స్వామి ధూప దీప నైవేద్యాలకుగాను పది ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకొంటారు.


ఆనాటినించి ఆ వూళ్ళో ఎవరైనా ఒక *కూడనిపని తలపెట్టి ఎదటివాళ్లు ఆ పని చేయవద్దు'* అన్నప్పటికీ మొరాయించి చేయబోతే, *"గుఱ్ఱం గుడెక్కేను, జాగర్త"* అంటూ ఉండేవారు.


ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి, క్రమక్రమంగా దేశ మంతటా వాడుకలోకి వచ్చిందట.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆

సెకరణ:కె.ఆర్.శాస్త్రి.

(చందమామ, 1950,జూన్)

బలిసినవాడైన

 🍃🪷 బిచ్చగాడైయిన బలిసినవాడైన..

పోరాడేది పైసల కోసమే..మరి తేడా ఎక్కడ వస్తుందంటే..ఆ పైసలు ఒకరికి బ్రతుకుని ఇస్తే ఇంకొకరికి బలుపునిస్తోంది..


🍃🪷కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది..ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది..


🍃🪷 అబద్ధాలు మాట్లాడుతూ...అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా, నిజాయితీగా ఉండేవాళ్ళకు ఉండదు..


🍃🪷మనం మంచోళ్ళమా..! చెడ్డళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు..వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు..అవసరం తీరిన తరువాత చెడ్డవాళ్ళను చేసేస్తారు.. శివశక్తి సేవాసమితి  


🍃🪷 నమస్సులు మీకు ఆత్మీయంగా స్వీకరించండి

👍👍👍💐💐💐

Vegetables cultivation


 

Srikaalaahasti


 

Verity life style in usa


 

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 38*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 15*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*బుద్ధావతార కధనము*


అథ షోడశోధ్యాయః.

అథ బుద్ధాద్యవతార కథనమ్‌.


*అగ్ని రువాచ :*


వక్ష్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతోర్ధదమ్‌ | పురా దైవాసురే యుద్ధే దైత్యైద్దేవాః పరాజితాః. 1


రక్ష రక్షేతి శరణం వదన్తో జగ్మురీశ్వరమ్‌ | మాయామోహస్వరూపో7సౌ శుద్ధోదనసుతోభవత్‌. 2


మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్‌ | తే చ బౌద్ధా బభూవుర్హి తేభ్యోన్యే వేదవర్జితాః.


అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. 


అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. 


ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.


నారకార్హం కర్మ చక్రుర్గ్రహీష్యన్త్యధమాదపి | సర్వే కలియుగా న్తే తు భవిష్యన్తి చ సఙ్కరాః. 5


దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః | దశ పఞ్ఛ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి. 6


వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.


ధర్మకఞ్చకసంవీతా అధర్మరుచయ స్తథా | మానుషాన్‌ భక్షయిష్యని వ్లుచ్ఛాః సార్థివరూపిణః. 7


ధర్మ మను చొక్కా తొడిగికొనిన వ్లుచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)


కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః | ఉత్సదయిష్యతి వ్లుచ్ఛాన్‌ గృహీతాస్త్రః కృతాయుధః. 8


విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి వ్యచ్ఛులను నశింపజేయును.


స్థాపయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణ్యే యథోచితామ్‌ | ఆశ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని. 9


నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.


కల్కిరూపం పరిత్యజ్య హరిః స్వర్గం గమిష్యతి | తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతి. 10


విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.


వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్యన్తి సత్తమ | ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేషు చ. 11


అవతారా ఆసంఖ్యాతా అతీతానాగతాదయః | విష్ణోర్దశావతారాఖ్యాన్యః పఠేచ్ఛృణుయాన్నరః. 12


సోవాప్తకామో విమలః సకులః స్వర్గమాప్నుయత్‌ | ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః. 13


అవతీర్ణశ్చ స గతః సగ్గాదేః కారణం హరిః |


ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశోధ్యాయ.


ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. 


గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. 


విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణ మైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.


ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

పాద శ్రీ వల్లభ చరితామృతం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 5*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*


    శంకరభట్టు ఒక దగ్గర  సుఖంగా కూర్చొని శ్రీపాదుల వారి చరిత్ర వ్రాయలేదు. 

చాలా ప్రయాసలకు ఓర్చి ఎనలేని  కష్టాలు పడి పరీక్షలు ఎదుర్కొని స్వామి వారిని భక్తితో  స్తుతిస్తూ    శ్రీవారి అనుమతితో స్వామివారి చరిత్ర చూసినది చూసినట్లుగా  లిఖించేరు. ఈ గ్రంథం చాలా తక్కువమంది వద్ద వున్నది.  శంకరభట్టు పడిన కష్టాలు పగవాళ్ళకి కూడా వద్దు అని అనిపిస్తుంది. మజిలీ మజిలీకి ఆయన కష్టాలు చదువుతూ వుంటే గుండె‌ ద్రవించకమానదు. 

శంకరభట్టు కదంబవనం చేరేసరికి ఆయన బరువుకోల్పోయినట్లు అనిపించి దూదిపింజలా తేలిక అయినట్లుగా అనిపించి అటు ఇటు దిక్కు తోచక తిరుగుతూవుండగా ఒక పూరాతన శివలింగం కనబడింది.

 చూడచక్కని ఆ మహా శివలింగంను చూసి భక్తితో నమస్కరించిన వెంటనే 

కాళ్శు బరువు అయినట్లుగా అనిపించి 

ఆ ఆలయప్రాంగణంలో తిరుగుతుండగా సిద్దయోగీంద్రుల వారి దర్శనం లభ్యమయినది.

సిద్దయోగీంద్రులు  దీవించి శంకరభట్టు చూసిన శివలింగం చాలా శక్తివంతమైనది  దర్శనమాత్రమున దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషము 

పోవడంవలన‌ దేవేంద్రుడు ఆ శివలింగానికి ఆలయము నిర్మించేడని చెప్పెను. సిద్దయోగింద్రులవారు శ్రీపాదుల వారి దివ్య దర్శనము చేసుకోమని స్వామివారి ఆశీస్సులు మెండుగా వున్నావని స్వామి వారి చరిత్ర వ్రాయుటకు తనను నిమిత్తం చేసుకొని స్వామివారే వ్రాసుకుంటారని చెప్పి మరలా అదే శివలింగాన్ని దర్శనము చేసుకోమని పంపించేరు.

శంకరభట్టు తీరా వెళ్ళి చూసేసరికి అచ్చట తాను లోగడ చూసిన గుడి బదులు అతి సుందరమైన మందిరం జనసందోహం తో కనబడింది.

తాను మధురలో వున్నట్లు మీనాక్షీ దేవీ సుందరేశుని‌ సన్నిధి లో వున్నట్లు అందరూ చెప్పగా ఆశ్చర్యపోయాడు. సుందరేశుని దర్శనం అనంతరం ఎక్కడ చూసినా సిధ్ధయోగింద్రుల ఆశ్రమము కనబడలేదు. 

శ్రీపాదవల్లభుని నామస్మరణ చేసుకుంటూ కొంతదూరం వెళ్ళేసరికి సిధ్దయోగింద్రులు కనబడి శంకరభట్టు చూసిన రెండూ శివాలయాలు ఒక్కటే అని. శ్రీపాదుల వారి కృపతో అప్పటి శివాలయం మరియూ ఇప్పటి శివాలయం కూడా స్వామివారు  దయతో చూడగలిగెనని సెలవిచ్చెను. మధురయొక్క స్ధలపురాణం అంతా సిధ్ధయోగింద్రులువారు వివరించి చెప్పి శ్రీపాదులవారు పిఠాపురంలో జన్మించిరని అప్పటిలో కూడా ఆ వూరిలో స్వామివారిని వ్యతిరేకించిన వారు చాలా మంది వుండేవారని  స్వామివారు తన బాల్యం నుండి  ఎన్నో లీలలు చూపించి తన 16వ యేట తల్లితండ్రులను,వూరివారిని విడిచిపెట్టి  విరాగిగా కురుపురం వెళ్ళిపోయారని త్వరగా వెళ్ళి స్వామివారి దర్శనము‌ చేసుకొమ్మని ఆశ్వీరదించి కడుపునిండా ఆహారము పెట్టి‌ చేతితో శంకరభట్టు వెన్నునిమిరి హాయిగా విశ్రాంతి తీసుకోమన్నారు. శంకరభట్టు ఒడలు తెలియకుండా నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి అచ్చట‌ సిద్దయోగీంద్రుల ఆశ్రమము కనబడలేదు. ఆ వింత చూసి  తాను భ్రమలో వున్నాడా లేక సిద్దయోగింద్రుడు మాయావా,మంత్రగాడా  అని మనసులో తలపోస్తూ మూటా ముల్లె సర్దుకొని ప్రయాణించేందుకు ఉపక్రమించేడు.

సశేషం


ఒకసారి శనీశ్వరుడు దత్త స్వామి దగ్గరకు వచ్చి స్వామి రేపు నీ భక్తునికి ఏడున్నర సంవత్సరములు, కష్టములు రానున్నది. కనుక మీరు సెలవివ్వలసిందిగా ప్రార్థించారు. అప్పుడు దత్తస్వామి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు నా భక్తుడిని రక్షించుకుంటాను అని చెప్పి శనీశ్వరుని పంపించారు. ఆ తరువాత రోజు నుంచి ఆ భక్తునికి కష్టాలు మొదలైనాయి. అంతటి కష్టం లో ఆ భక్తుడు నిరంతరం దత్త దీక్ష లో ఉండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే నామాన్ని నిరంతరం స్మరించ సాగాడు దాంతో శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరములు అతని బాధ పెట్టవలసిన శనీశ్వరుడు కేవలం *ఏడున్నర రోజులు* మాత్రమే, అతన్ని కష్టపెట్ట గలిగాడు, ఇదంతా దత్త దీక్ష నామస్మరణ మహిమ, కనుక ఎంత కష్టాల్లో ఉన్న నిరంతరం దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా నామకరణ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. 


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 131*


*పరివర్తన చెందిన చోరుడు*


హృషీకేశ్ లోఒక గొప్ప సన్న్యాసిని స్వామీజీ కలుసుకొన్నారు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన వ్యక్తిలా కనిపించగా, స్వామీజీ ఆయన  వద్దకెళ్లి మాట్లాడనారంభించారు. తమ ప్రయాణ విశేషాలు గురించి చెబుతూ తాము కలుసుకొన్న మహాత్ములను గురించి ప్రస్తావించారు. మాటల మధ్యలో పవహారీ బాబా పేరు చెప్పగానే ఆ సన్న్యాసి కళ్లవెంట నీరు ధారకట్టింది. 


గద్గదస్వరంలో ఆయన, "స్వామీజీ! మీకు బాబా తెలుసా?" అని అడిగారు. "తెలుసు" అని స్వామీజీ జవాబిచ్చారు. "ఆయన ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి తెలుసా?” అన్న ప్రశ్నకు, "తెలుసు" అన్నారు స్వామీజీ. 


“ఒక రోజు ఆయన ఆశ్రమంలో ఒక దొంగ ప్రవేశించాడు. ఆయనను చూడగానే భయపడిపోయి, తాను దొంగిలించిన వస్తువుల మూటను అక్కడే పడేసి పరుగు లంకించుకొన్నాడు. వెంటనే ఆయన ఆ మూటను పుచ్చుకొని,దొంగను వెంబడించి కొన్ని మైళ్లు పరుగెత్తి ఎట్టకేలకు అతణ్ణి పట్టుకొన్నారు. 


ఆ మూటను అతడి పాదాల వద్ద ఉంచి, చేతులు జోడించి, చెమ్మగిల్లిన కళ్లతో, నాయనా! నిజానికి ఇవన్నీ నీవే. నీ వస్తువులను నువ్వు తీసుకొన్నప్పుడు అడ్డుపడినందుకు నన్ను క్షమించు. వీటిని పుచ్చుకో' అని ప్రాధేయపడ్డాడు" అని స్వామీజీ ఆ కథనం చెప్పి, “నిజంగానే బాబా ఒక అద్భుతమైన వ్యక్తి" అన్నారు.


మౌనంగా వింటూవున్న ఆ సన్న్యాసి కథనం పూర్తికాగానే స్వామీజీని చూస్తూ, ప్రశాంతంగా “స్వామీజీ, ఈ కథలో వచ్చిన దొంగను నేనే" అన్నాడు. స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. సన్న్యాసి కొనసాగించాడు:


"ఆ రోజు బాబాను కలుసుకోవడం నా జీవితంలో అనుకోని గొప్ప మలుపుగా పరిణమించింది. నా మార్గం తప్పని నేను గ్రహించాను. ఐశ్వర్యాలలో కెల్లా అత్యున్నతమైన ఐశ్వర్యమయిన భగవంతుణ్ణి పొందడానికి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకొన్నాను.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 7*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అస్మాకం తు విశిష్టా యే*

*తాన్నిబోధ ద్విజోత్తమ ।*

*నాయకా మమ సైన్యస్య*

*సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।।*


అస్మాకం — మన; 

తు — కానీ; 

విశిష్టాః  — శ్రేష్ఠ మైన వారు;                                                                                                                                

యే — ఎవరు; 

తాన్ — వారిని; 

నిబోధ — తెలుసుకొనుము;                                                                                                                                      

ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; 

నాయకాః  — నాయకులు;                                                                                                                     

మమ — మన; 

సైన్యస్య — సైన్యానికి; 

సంజ్ఞా-అర్థం — ఎరుక కొరకు ;                                                                                                                  

తాన్ — వారిని; 

బ్రవీమి — తెలుపుతున్నాను; 

తే  — మీకు.


*భావము:* 

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.


దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని "ద్విజోత్తమ" (బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంభోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా యోధుడు కాడు, సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడి లాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సందేహాలను కలిగిఉన్నాడు.  దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒక వేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడక పోతే అతను దుర్యోధనుడి రాజ మందిరంలో భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని.


ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు, తన స్వంత ఉత్సాహాన్ని తన యొక్క గురువు గారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తన పక్షంలో వున్న మహా యోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 43*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కలియ నాయనారు*


తొండ మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో తిరువొట్రియూరు ఒకటి.

ఆ గ్రామంలో గాండ్ల కులానికి చెందిన గొప్ప శివభక్తుడైన కలియనాయనారు

అవతరించాడు. శ్రీమంతుడైన అతడు తిరువొట్రియూరు శివాలయానికి

వెళ్లి రాత్రింబగళ్లు దీపాలు వెలిగించడం ఒక వ్రతంగా నిర్వహిస్తూ వచ్చాడు.


 కలియ నాయనారు శివభక్తిని పరమేశ్వరుడు లోకానికి తెలియజేయాలని

అనుకున్నాడు. అది మొదలుకొని నాయనారు సంపద రోజు రోజుకూ

క్షీణించడం ప్రారంభించింది. అయినప్పటికీ కలియ నాయనారు గుడిలో

దీపాలు వెలిగించే వ్రతాన్ని మాత్రం మానలేదు. కూలిపనికి వెళ్లి వచ్చిన

డబ్బులతో గుడిలో దీపాలు వెలిగించాడు. కొద్ది రోజులైన తరువాత అతనికి

కూలి పని కూడ దొరకలేదు. 


ఇంటిని, ఇంటిలోని వస్తువులను అమ్మి

దేవాలయంలో దీపారాధన నిర్వహించాడు. ఆ డబ్బులు కూడ పూర్తిగా

ఖర్చయిన తరువాత తన భార్యను అమ్మి తన వ్రతాన్ని నిరాటంకంగా

జరపాలనుకున్నాడు. భార్యను పిలుచుకొని నగరమంతటా తిరిగినప్పటికీ

ఆమెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దీపాలు వెలిగించడానికి అతనికి ఏ మార్గమూ తోచలేదు.


దేవాలయానికి వెళ్లి ప్రమిదలను వరుసగా అమర్చి వాటిలో వత్తులను వేశాడు. “దీపాలు వెలిగించకుండా జీవించడం కన్నా మరణించడమే మేలు.

నా శరీరంలోని రక్తంతో దీపాలను వెలిగిస్తాను" అని నిశ్చయించుకున్నాడు.

కత్తితో తన శరీరాన్ని పొడుచుకొన్నారు. కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు

ప్రత్యక్షమై కలియ నాయనారుకు శివలోక పదవిని అనుగ్రహించాడు.


*నలభైమూడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

నీతి శాస్త్రం

 *రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః౹* *భర్తా చ  స్త్రీకృతం పాపం శిష్య పాపం గురోరపి॥* ( గురుస్తథా )

- నీతి శాస్త్రం

తాత్పర్యము - రాజ్యానికి రాజు తండ్రి వంటివాడు  కనుక . రాజ్యంలో ప్రజలను ధర్మమార్గంలో పెట్టవలసిన బాధ్యత రాజుది. ప్రజలు తప్పు ద్రోవ పడితే, దానికి రాజే బాధ్యత వహించాలి. అందువలన ప్రజలు చేసిన పాపాలు బాధ్యుడు రాజు; రాజుకు సరైన సలహాలు ఇస్తూ , అతడు ధర్మం తప్పకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత పురోహితులది. ఒకవేళ పురోహితులు రాజుకు సరైన సలహాలు ఇవ్వని పక్షంలో రాజు చేసిన పాపాలకు పురోహితులు బాధ్యులు. భార్యకు భర్త గురువుతో సమానము. భరించువాడు భర్త. ఆమెను ధర్మ మార్గంలో పెట్టవలసిన వాడు, ఆమెకు సరైన మార్గదర్శనం చేయనిపక్షంలో భార్య చేసిన పాపం భర్తను చేరుతుంది. తనను శరణు వేడినవారికి ధర్మమార్గం చూపి, మార్గదర్శనం చేయుట గురువు కర్తవ్యం. శిష్యుడు చేసిన పాపాలన్నిటికి గురువే బాధ్యుడవుతాడు. పైగా శిష్యుని బాధ్యతను తీసుకున్నందుకుగానూ శిష్యుడు చేసిన పాపాలన్నీ గురువునే చేరతాయి.

29, డిసెంబర్ 2023, శుక్రవారం

Replacing clutch wire


 

Wire connection


 

Driver


 

Chukkudu


 

Gold jewellery


 

Train track change


 

రామకృష్ణుని పాండిత్యం"

 "తెనాలి రామకృష్ణుని పాండిత్యం"

                     01-09-2020

      విజయనగర సామ్రాజ్యాన్ని సాహితీ

సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు

పాలించే రోజులవి.ఆయన ఆస్థానంలో అష్ట

దిగ్గజ కవులుండేవారనే సంగతి అందరికీ

తెలిసిందే.అష్టదిగ్గజ కవుల్లో ఒకడైన తెనాలి

రామకృష్ణుని ప్రతిభా,పాండిత్యాలు కూడా

అందరికీ తెలిసిందే.

     అయితే రామకృష్ణుడంటే  పడని ప్రత్యర్ధులైన

 కవులు ఎలాగైనా రామకృష్ణుని పాండిత్యాన్ని

దెబ్బతీయడానికి పథకాన్ని రచించారు.ఒకసారి

రాయలు సభకు రావడానికి ముందు ఒక

సేవకుని ద్వారా "కుంజర యూధంబు దోమ 

కుత్తుక జొచ్చెన్"అనే సమస్యనిచ్చి పూరించమని

పంపారు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రత్యర్ధులకు

ఆ సమస్యను ఈ విధంగా పూరించి పంపాడు.

కంద పద్యం:-

"గంజాయి తాగి తురకుల

 సంజాతము తోడ కల్లు చవిగొన్నావా?

 కొడకా ఎక్కడ

 కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్?"

బహమనీ సుల్తానుల హయాంలో తురుష్కు

లో సేవకులు గంజాయితో పాటు కల్లును కూడా

సేవించేవారు.వారితో కూడి తాగున్నావా?అని

తిడుతూ ఎక్కడరా!ఏనుగులు సమూహమెక్కడైనా

దోమ కుత్తుక లో చొరబడగలదా?చెప్పు అని

మందలిస్తూ ఆ సమస్యను పూరణచేసి. పంపాడు.

దానర్థం తెలియని సేవకుడు ఆ ప్రత్యర్ధులకు

దాన్ని ఇచ్చాడు.

    కాని ఇదేదీ జరుగనట్లు మౌనంగా ఉండి తరువాత

రోజు నిండుసభలో రాయల వారి ముందు ఈ సమస్య

ను రామకృష్ణుని కిస్తే రామకృష్ణుడు అవమానం

పడడం ఖాయమని  సంబర పడ్డారు. మరుసటిరోజు

రాయలు ఎదుట పై సమస్య నుంచారు.

      నిన్నటి సంఘటనను గుర్తుంచుకుని రామ

కృష్ణుడు ఆ సమస్యను రాయల వారి సభలో

ఈ విధంగా పూరించాడు.

కంద పద్యం:-

"రంజనజెడి పాండవులరి

  భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!

  సంజయ!యేమని చెప్పుదు

  కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!"

భావం:-

మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత

బాగోలేక విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు.

విధి ఎంత బలీయమైనది.ఏనుగుల గుంపు

దోమగొంతుకలో ప్రవేశించింది కదా!

  రామకృష్ణుని సమస్యా పూరణానికి

 ఆశ్చర్యపడిన రాయలు అభినందించాడు.

ప్రశంశలు రామకృష్ణునికి,భంగపాటు ప్రత్యర్ధి

కవులకు దక్కింది.

ద్రోణంరాజు శ్రీనివాసరావు ఎస్:ఎ.తెలుగు.

                  మునిపల్లి.

ధనుర్మాసము రోజు: 11

 ధనుర్మాసము   రోజు:  11 


బాపు రమణల  మేలుపలుకుల మేలుకొలుపులు    11


కొమ్ము విసిరే ఆలపొదుగుల పాలుపిదికే ఒడుపులో

బాణమేసినవాడి ప్రాణము పిండి, నెత్తురు పిదుకుచో

సాటిలేని హరివంశవీరుల శూరపుత్రివి నీవెలే

అందాల బరిణవు నీవెలే అపరంజి బొమ్మవు నీవెలే

నెమలిపింఛపు నీలకాంతుల నెరికురులసిరి నీవెలే

ఫణి ఫణాగ్రపు మణుల బోల్‌ ఘనజఘన లాస్యాల్‌ నీవెలే

ఎన్నిఉన్నా ఏమి లాభం నిద్ర ఒకటే నీదులోపం

జామునుంచీ వేచిఉన్నా చెలులపైనా జాలితలచీ

లేచి రమ్మా మొద్దుగుమ్మా లేవెలేవె బద్ధకమ్మా

కృష్ణచంద్రుని అందరం పాడుతూ కొనియాడుతూ

ఊరేగుదాం తొలి వెలుగులో ఉహూ కుహూ యంటూ

యమునచేరీ మునకలేసీ నోమునోచీ తరించుదాం-


సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము

గోకులం కన్నెలకు కల్యాణకరము

లోకులం దరికిదే సౌభాగ్యప్రదము

పల్లెపిల్లా మేలుకో

రే-పల్లె పిల్లా మేలుకో

యజమాని శ్రేయస్సు కోరుకోవాలి

 *సేవకుడు... యజమాని.....*


*ధర్మరాజు భీష్ముడిని... "పితామహా... నాకు ఒక సందేహము... తమ యజమానుల ఎడల అతడి దయా దాక్షిణ్యాల మీద బ్రతికే సేవకుడు... ఎలా నడచుకోవాలి వివరించండి" అని అడిగాడు. దానికి... భీష్ముడు "ధర్మనందనా... ఒక వూరిలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేట కొరకు అడవికి వెళ్ళి ఒక లేడి మీద విషము పూసిన బాణమును వేశాడు. కాని ఆ బాణము గురి తప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలు,పండ్లతో నిండి ఉండేది.*


*కానీ... ఆ విష పూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగ కాసిన పండ్లలతో సహా దహించివేసింది. ఆ చెట్టు మీద నివసిస్తున్న ఒక చిలుక మాత్రం ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా, గాలి వచ్చినా, వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు.*


*ఆ నోట ఈ నోట... ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు సాధారణ మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి..."ఓ చిలుకా... ఈ చెట్టు మాడిపోయింది కదా... ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు" అని అడిగాడు. దానికి ఆ చిలుక "మహేంద్రా... ఈ చెట్టు ఫల పుష్పాలతో నిండుగా ఉన్నప్పుడు ఈ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఈ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతఘ్నత కాదా..." అని అడిగింది.*


*మారువేషములో వచ్చిన తనను మహేంద్రా... అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు. ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని.. "చిలుకా.. నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో" అన్నాడు. ఆ చిలుక.. "ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి" అని కోరుకుంది.*


*ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. ధర్మనందనా.. చూశావా ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు ఏ వరము కోరుకోకుండా తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకోవాలి" అని చెప్పాడు...*


*సమస్త లోకా సుఖినోభవంతు


 🍁🍁🍁 🌳🕉️🌳 🍁🍁🍁

" వేద వ్యాసుని ముఖ్య శిష్యులు

 *" వేద వ్యాసుని ముఖ్య శిష్యులు, వాళ్ళ వివరాలు "*


వేదవ్యాస మహర్షి ముఖ్య శిష్యులు: జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, దాల్భభ్యుడు మొదలైనవారు.


ఇపుడు మనం చదివేది వైశంపాయనుడు లోక వ్యాప్తి చేసిన భారతం.  ^జయము^ అని దీనికి మరో పేరు.  హరి వంశం సంస్కృత భారతంలో చివరి పర్వం.  వేరే గ్రంథం కాదు.  దీన్ని ఎఱ్ఱన విడిగా వ్రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేశాడు.


జైమిని చెప్పిన భారతం లో అశ్వమేధ పర్వం మాత్రమే లభిస్తున్నది.  వేదవ్యాసుని తండ్రి పరాశరుడు వ్రాసిన ^పరాశర సంహిత^ జ్యోతిషంలో ప్రముఖ గ్రంథం కాగా *జైమిని సూత్రాలు* ఫలాంశ గణనలో విశిష్టమైన కొత్త మార్గాలు సూచిస్తాయి.


దాల్భ్య మహర్షి ప్రతిష్ఠ అయిన *ప్రసన్న వేంకటేశ్వరాలయం* "గుణ శీలం" అనే ఒక గ్రామం (కొంచెం పెద్ద దే) లో చూచాను.  ఆలయం చిన్నదే.  శ్రీరంగం సమీపంలో ఉంది.  మతిస్థిమితం లేని వాళ్ళు ఆ స్వామిని ఆరాధించి స్వస్థులవుతారని ప్రసిద్ధి.


మహర్షి శిష్యులందరూ వివిధ శాస్త్రాలను లోక వ్యాప్తి చేశారు.  వేదాలను యజ్ఞార్థం నాలుగు భాగాలుగా వేదవ్యాసుడు విభాగం చేశాడు.  శిష్యులకు అన్నీ వేదాలు బోధించాడు. 


1. ఋగ్వేదం —- పైలుడు, 

2. యజుర్వేదం —  వైశంపాయనుడు,

3. సామవేదం — జైమిని,

4. అధర్వణ వేదం — సుమంతుడు


ఈ నలుగురికీ బోధించి లోకంలో వ్యాప్తి చేయాలని ఆదేశించాడు.  


కుమారుడైన శుక మహర్షికి భాగవతాన్ని ఉపదేశించి పరీక్షిన్మహారాజుకు ఉపదేశించమన్నాడు.  ఒక్క వారం రోజులు భాగవతం ఏక దీక్షగా విని ఆ రాజు సద్గతి పొందాడు.


పాండవులకు, ధృతరాష్ట్రుడికి వ్యాసుడు ఎన్నో విషయాలు బోధించాడు. 


అరణ్య వాస కాలం లో ధర్మరాజుకు "ప్రతిస్మృతి" అనే మంత్రాన్ని ఉపదేశించి అర్జునుడికి ఉపదేశించ మని చెప్పాడు.  ఆ మంత్రం వల్ల పాశుపతాస్త్రం అర్జునుడికి లభించింది.


వ్యాసుడు నారాయణ తేజోంశ - *మునీనామపి అహం వ్యాసః* అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ.


******************

Mudiyala saagu


 

Big boat


 

Outdoor kitchen


 

అమృతా గార్డెన్ పంక్షన్ హాల్

 *అమృతా గార్డెన్ పంక్షన్ హాల్ అద్దెలో బ్రాహ్మణులకు సగం రాయితీ!*🍇🍇🍇🌾🌾🌾🌾🌹🌹 హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు శామీర్ పేట ఎగ్జిట్ నెంబర్ 7 నుండి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారి స్టేట్ హైవే వన్ (జెబీస్ - రామగుండం) కు సమీపాన ఉన్న *అమృతా గార్డెన్* లో పెళ్ళిళ్ళు, గేట్ టు గెదర్ లు, సారీ పంక్షన్, దోతీ పంక్షన్ లు, బర్త్ డే పంక్షన్లు...షష్టి పూర్తి పంక్షన్ లు, ఉపనయనాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి శుభ కార్యానికి మా *అమృతా గార్డెన్* సిద్దంగా ఉంది...ఈ హాల్ లో శుభ కార్యాలకు  హైదరాబాద్ పరిసర జిల్లా ల వారు ఉపయోగించు కోవచ్చు! విశాల మైన రెండు బెడ్ రూం లు విత్ వాష్ రూమ్స్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కు ప్రత్యేక గదులు, విశాల మైన కారు పార్కింగ్, కాకుండా కేటరింగ్ సౌకర్యం ఉంది...అమృతా గార్డెన్ 48 గంటల అద్దె లక్షా 50 వేలు, 24 గంటల అద్దె 75,000 గా ఉంది...బ్రాహ్మణులకు అయితే అందులో సగం అంటే 75,000 48 గంటలు, 24 గంటలకు 37,500 కు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం...కేటరింగ్ విషయానికి వస్తే 200 రూపాయలకు ప్లేట్ భోజనం నుండి 1500 రూపాయలకు ప్లేట్ భోజనం తయారు చేసే బ్రాహ్మణ కేటరర్స్ అందు బాటులో ఉన్నారు...సర్వ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కరికీ 1000 రూపాయలు ఉంటాయి...ఇక సినిమా లేదా టెలివిజన్ ఆర్టిస్ట్ లకు వారి పేరును బట్టి 5000 నుండి 50,000 వరకు, అలాగే కేరళ లేదా ఆంధ్ర సన్నాయి మేళం వారికి 25,000 నుండి 50,000, లేదా లోకల్ సన్నాయి మేళం వారికి 11,000 కి వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు...ఇక బర్త్ డే పార్టీ  మిమిక్రీ ఆర్టిస్ట్ లు లోకల్ 11,000 లేదా ఎంటర్ టైన్ మెంట్ మిమిక్రీ ఆర్టిస్ట్ 25,000 లకు వారి ఫోన్ నెంబర్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు...ఇక  హైదరాబాద్ నుండి 21 సీటర్ లేదా ఫిఫ్టీ సీటర్ బస్ లు కూడా అందు బాటులో ఉన్నాయి! మీకు కావలిస్తే వారి బస్ నెంబర్ల జాబితా ఇస్తాం.. మీరు ఆ బస్ ఆపరేటర్ల తో మాట్లాడు కోవచ్చు! డెకరేషన్ వాళ్ళు కూడా లోకల్, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు...వాళ్ళ ఆల్బమ్ డెకరేషన్ ఫొటోస్ ప్రకారం మీరు డెకరేషన్ గురించి వాట్సప్ ద్వారా ఫొటోస్ చూసి మాట్లాడుకోవచ్చు...ఇవే కాకుండా సైట్ సీయింగ్, వర్గల్ సరస్వతి దేవాలయం, కొండ పోచమ్మ ప్రాజెక్ట్, నాచారం లక్ష్మి నరసింహస్వామీ టెంపుల్, కొమురవెల్లి మల్లికార్జున టెంపుల్, అమృతా గార్డెన్ నుండి 15 నుండి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి...యాదగిరి గుట్ట టెంపుల్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గేట్ టు గేదర్ పార్టీల వాళ్లకు సైట్ సీయింగ్ కు 21 సీటర్, 12  సీటర్ బస్సులు రోజు వారి అద్దెబస్సులు విత్ ఏసి 15000 నుండి 20,000 అందుబాటులో ఉన్నాయి...అయితే వారం ముందు సమాచారం ఇచ్చి అడ్వాన్స్ ఇస్తే ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి...బ్రాహ్మణ కుటుంబాలకు ఈ బస్సుల్లో పది శాతం రాయితీ ఉంటుంది! *మరిన్ని వివరాలకి +91 88857 30986* ఫోన్ చేసి తెలుసుకోవచ్చు!

నిశ్శబ్ద సందేశం

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

 న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాల్ని హత్తుకునేల మనస్సులను కదలిస్తుంది

 *"సౌండ్ ఆఫ్ నాకింగ్"*


 *పేపర్ బాయ్* :

నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. ఇంట్లోని ప్రసాద్ రావు గారు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు.  పేపర్ బాయ్ అడిగాడు, "సార్,  మీ మెయిల్ బాక్స్  ఎందుకు లాక్ చేయబడింది?"

 

ఉద్దేశపూర్వకంగానే లాక్ చేశాను అని బదులిచ్చారు ప్రసాదరావు చిరునవ్వుతో. ఇంకా  ఇలా చెప్పారు , "నువ్వు రోజూ వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని కోరుకుంటున్నాను, దయచేసి తలుపు కొట్టు లేదా కాలింగ్ బెల్ నొక్కి నాకు స్వయంగా ఇవ్వు."


పేపర్ బాయ్ అయోమయంలో పడ్డాడు, అలాగే అన్నాడు, కానీ అది ఇద్దరికి అసౌకర్యంగా, సమయం వృధా అవుతుంది" అని జవాబిచ్చాడు.


"ఏమి ఫర్వాలేదు... ప్రతి నెలా నీకు రూ. 500/- అదనంగా ఇస్తాను" అన్నాడు ప్రసాద్ రావు

 

 "నువ్వు తలుపు తడితే నేను  తీయలేని పరిస్థితి ఉండే రోజు ఎప్పుడైనా వస్తే, దయచేసి పక్కవాళ్ళని పిలవగలవు!"

 

పేపర్ బాయ్ షాక్ అయ్యి "ఎందుకు సార్?" అని అడిగాడు.


"నా భార్య చనిపోయింది, కొడుకు విదేశాల్లో  భార్య పిల్లలతో స్థిరపడ్డాడు.మా కన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివవించాము. ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా  జీవిస్తున్నాను, నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?"

ఆలా చెబుతున్నపుడు పేపర్ బాయ్ తేమతో చమర్చిన వృద్దుడి కళ్ళని చూశాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు , *"నేను పేపర్  చదవలేను......నాకు చూపు మందగించింది ....తలుపు చప్పుడు లేదా డోర్‌బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను . తెలిసిన వ్యక్తిని చూడటానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడాని ప్రయత్నం చేస్తూ ఉంటాను !"*


అతను చేతులు జోడించి పేపర్ బాయిని, "చిన్నా , దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి !

ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్. ఏదో ఒకరోజు నువ్వు తలుపు తట్టినపుడు నా నుండి సమాధానం రాకపోతే,  దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి అతనికి తెలియజేయ..." అన్నాడు.


తరువాత పేపర్ బోయికి కర్తవ్యం అర్ధం అయ్యింది , తన స్నేహితుల సర్కిల్‌లో కూడా చాలా మంది ఇళ్లలో  ఒంటరిగా ఉన్న వృద్ధులు ఉన్నారు. 


వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ , వాట్సాప్‌లో ఎందుకు  పంపుతారని మీరు ఆశ్చర్యపోవచ్చు/విసుగు చెందవచ్చు.

ఈ ముసోలోళ్ళకి పని పాట ఏమి లేదు ఉదయం 4గంటల నుండే గుడ్ మార్నింగ్ మెస్సేజ్ పెడతారు అనుకుంటూ ఉంటాము.

వాస్తవానికి, ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ..........


 *భూమ్మిద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం*

 

ఈ రోజుకి మేము ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం.

దయచేసి పెద్ద వాళ్ల గుడ్ మార్నింగ్ మెస్సేజ్లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాము.


ఈ రోజుల్లో వాట్సాప్ చాలా సౌకర్యవంతంగా ఉంది.  ఇకపై వార్తాపత్రికల సభ్యత్వాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు.

 *మీకు సమయం ఉంటే, మీ పెద్దవాళ్లకి  వాట్సాప్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి! వారికి కొంత సమయం కేటాయించండి*


ఏదో ఒకరోజు, మీరు వారి మార్నింగ్ గ్రీటింగ్‌లు లేదా షేర్ చేసిన కథనాలను అందుకోకపోతే, వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు అని గ్రహించండి.


దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి. 


ఇది చదివితే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మనస్సు బరువెక్కుతుంది !!! 


మనం ఒకరికొకరం పంపే వాట్సాప్ సందేశాల ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకుని వాటికి సమాధానం లేదా కార్యాచరణ పాటించాలి!!!


🌹🙏అందరూ ఆరోగ్యంగా ఉండాలి వారి జీవితం సాఫీగా సాగాలి. అందులో నేను కూడా ఒకడినై ఉండాలి🌹🙏


🙏సర్వే జన సుఖినోభావంతు🙏

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్దపెట్టున నవ్వేడు. మహారాజా ! ఈ తీర్థం చాలా

పుణ్యప్రదం. పాపనాశకం. ఇందులో సాన్నం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది

శుభముహూర్తం. అటుతరవాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దువుగాని. ఈ పుణ్యతీర్థంలో చేసిన

స్నానాలూ దానాలూ రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సాన్నం చేయకుండా

వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్యా సదృశమని స్వయంభువు చెప్పాడు. కనక ముందుగా స్నాన

తర్పణాలు కానియ్యి. అటుతరువాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెడుదువుగాని. నువ్విచ్చే

దానానికి సంతోషించి నీతోకూడా అందాకా నేనూ వస్తాను.

హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. మూడు మునకలూ

వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్వామి!

దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో. ఆవులా, నేలా, బంగారమా, ఏనుగులా,

రథాలా, అశ్వాలా ? ఏదైనా సరే కోరుకో. కోరుకున్నంతా ఇస్తాను. నా దృష్టిలో- ఇవ్వకూడనిదంటూ

ఏదీలేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థమూ,

నువ్వూ అదృష్టవశాత్తూ ఇక్కడ లభించారు. మొగమోటపడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్ధుణ్ణి

చెయ్యి- అని అభ్యర్థించాడు.

నాదేయం మే కిమప్యప్తి కృతమేతద్ర్వతం పురా |

రాజసూయే మఖశ్రేష్టే. మునీనాం సన్నిధావపి


తస్మాత్ త్వమిహ సంప్రాప్తః తీర్థేఽస్మిన్ ప్రవరే మునే |

యత్తేఽస్తి వాంఛితం బ్రూహి దదామి తవ వాంఛితమ్ ॥ (19-12)

రాజన్ ! నీ కీర్తినిగురించి చాలాకాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వసిష్ఠులవారు

చెప్పారు. 

హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః, తాదృశో నృపతిర్దాతానభూతో న భవిష్యతి.

అన్నారాయన

Hand stick 🪑chair


 

Bhakti kaadaa


 

Filling bags

 


🔥శ్రీ మదగ్ని మహాపురాణము

 *🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 37*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*పాండవ చరిత వర్ణనము - 2*


తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10


వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |


కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.


తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్‌.


ప్రస్థానం ప్రస్థితో ధీమాన్‌ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12


ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.


మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13


ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్‌ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14


ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్‌.


ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశోధ్యాయః.


ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.


అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

నవగ్రహా పురాణం🪐*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *120వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*నవగ్రహాల పట్టాభిషేకం - 1*


దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.


క్షీరసాగర తీరం -  మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి !


శ్రీమహావిష్ణువు లక్ష్మీ ఉన్నతాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మా , సరస్వతీ , పరమేశ్వరుడూ , పార్వతీ కూర్చున్నారు. ఇంద్రాదిదేవతలూ పత్నీ సమేతంగా ఒక వైపున కూర్చున్నారు. బ్రహ్మ మానస పుత్రులూ , వాళ్ళ ధర్మపత్నులూ ఒకవైపునా , మహర్షులందరూ ఒకవైపునా ఉన్నారు.


ఆనాటి మహత్కార్యక్రమానికి నాయకులైన సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , బృహస్పతీ , శుక్రుడూ , శనీ , రాహువు , కేతువూ ప్రత్యేమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదీరి ఉన్నారు. ఆ 'నవ నాయకుల' పత్నులు - సంజ్ఞ , అశ్విని మొదలు ఇరవై ఏడుగురు చంద్ర పత్నులూ , శక్తి దేవీ , ఇలా , తారా , ఊర్జస్వతీ , జ్యేష్ఠాదేవీ , సింహిదేవీ , చిత్రలేఖా - ఒక బృందంగా కూర్చుని తమ భర్తలను ఆనందంగా చూస్తున్నారు. త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ సింహాసనాలున్నాయి... ఎవరి కోసమో ఎదురుచూస్తూ !


క్షణం సేపు ధ్యాన ముద్రలో మునిగి , బ్రహ్మ కళ్ళు తెరిచి తన ప్రక్కనే ఉన్న శ్రీమహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు.


*"జనకా ! సుముహూర్తం ఆగమించింది ! ప్రారంభించండి !”*


శ్రీమహావిష్ణువు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు. పాలకడలి కెరటాల హోరును అణచి వేస్తూ , ఆయన గంభీర కంఠధ్వని సభాసదుల కర్ణపుటాలను కమనీయంగా తాకింది.


*"కల్పకల్పానికీ ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహాసృష్టి విన్యాసంలో 'నవగ్రహాల' సశరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం ! లోకాలలోని ప్రాణులు ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ - సూక్ష్మ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో సశరీరంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలో నేను సంకల్పించాను ! ఆ సంకల్పం సాకారమై , నవ్యమైన నవ రూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది !"* అంటూ శ్రీమహావిష్ణువు తన దక్షిణ హస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు. దేవతల మానస పుత్రుల , మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాయి. ఆ దేవతల , దేవతా పురంధ్రుల దృష్టి కిరణాలు వాళ్ళను మౌనంగా అభినందిస్తున్నాయి. సూర్యుడు , చంద్రుడూ మొదలైన తొమ్మండుగురూ చేతులు జోడించి సభకు నమస్కరించారు.


శ్రీమహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినదాన్ని అవలీలగా అణచి వేసింది.


*“పరమేష్ఠీ , పరమేశ్వరుల సూచనలను అనుసరించి , నవగ్రహదేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రహాల ప్రాధాన్యతా నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జరిగింది. ఆయా గ్రహాల శక్తి సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని - ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ మేము ముగ్గురమూ నిర్ణయించాం ! నవగ్రహ బృందంలో వాళ్ళ స్థానమానాలను నిర్దేశించే వరుస క్రమంలో ఆహ్వానం పలుకుతాను ! ఆహ్వానాన్ని అనుసరిస్తూ గ్రహ దేవతలు వరుసగా ఆగమించి , స్వర్ణాసనాలను అలంకరిస్తారు !"*


ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి కలయజూసి , విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు.


*“నవగ్రహాలలో ప్రథమ గ్రహదేవత సూర్యుడు !"*


మహాసభ సమధికోత్సాహంతో చేస్తున్న హర్షధ్వానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు. ప్రథమ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు.


*"ద్వితీయ గ్రహం చంద్రుడు !"* శ్రీమహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది.


*"తృతీయ గ్రహం కుజుడు !”*


*"చతుర్థ గ్రహం బుధుడు !"*


*"పంచమ గ్రహం బృహస్పతి !”*


*"షష్ట గ్రహం శుక్రుడు !"*


*"సప్తమ గ్రహం శనైశ్చరుడు !"*


*"అష్టమ గ్రహం రాహువు !”*


*"నవమ గ్రహం కేతువు !"*


విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుండి , కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనాల మీద ఆసీనులయ్యారు. నవరత్న సింహాసనాల మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులూ కేంద్రీకరించబడ్డాయి.


*"నవగ్రహాలలో ఒక్కడైన బృహస్పతి దేవతలకు గురువైన కారణం చేతా , మహాజ్ఞాని అయిన కారణం చేతా - తన నిజ నామధేయంతో కాకుండా 'గురువు' అనే సార్థకనామధేయంతో సుప్రసిద్ధుడవుతాడు !"* శ్రీమహావిష్ణువు హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.


*"సృష్టిలో నవధాన్యాలకూ , నవరత్నాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. నవగ్రహ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యం మీదా , ఒక్కొక్క రత్నం మీదా ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది. నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ , రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడూ వెల్లడిస్తారు !"* పరమేష్టి , పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శ్రీమహావిష్ణువు.


బ్రహ్మ ఆయనకు నమస్కరించి , ప్రారంభించాడు.


*"సూర్యుడికి గోధుమలూ , చంద్రుడికి వడ్లూ , కుజుడుకి కందులూ , బుధుడికి పెసలూ , గురువుకు శనగలూ , శుక్రుడికి అలసందలూ , శనైశ్చరుడికి నువ్వులూ , రాహుకేతువులకు మినుములూ , ఉలవలూ ఇష్టధాన్యాలుగా ఉంటాయి. ఇష్ట ధాన్యాల మీద వాళ్ళ ఆధిపత్యాలుంటాయి. ఇది త్రిమూర్తుల అనుశాసనం !"*


నవగ్రహ దేవతలు వినయంతో , కృతజ్ఞతతో నమస్కరించారు.


*"నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను..."* అంటూ పరమశివుడు ప్రారంభించాడు.


*"సూర్యుడు - మాణిక్యం , చంద్రుడు - ముత్యం , కుజుడు - పగడం , బుధుడు - మరకతం , గురువు - పుష్యరాగం , శుక్రుడు - వజ్రం , శనైశ్చరుడు - నీలం , రాహువు - గోమేధికం , కేతువు - వైడూర్యం !"* నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు.


పరమేశ్వరుడి అనుశాసనం వెలువడిన మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ముంచివేసింది.


సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి ! చంద్రుడి మీద ముత్యాలూ , కుజుడి మీద పగడాలూ , బుధుడి మీద మరకతాలూ , గురువు మీద పుష్యరాగాలూ , శుక్రుడి మీద వజ్రాలూ , శనైశ్చరుడి మీద నీలాలూ , రాహువు మీద గోమేధికాలూ , కేతువు మీద వైడూర్యాలూ వర్షిస్తూ , అందరికీ కనువిందు చేస్తున్నాయి. హర్షధ్వానాలు అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐