*_అటిక మామిడి ఆకుతో డయాలసిస్ చేయాల్సిన సమయంలో కూడా ఈ ఆకు రసం తాగితే కిడ్నీ సమస్యలు దూరం_*
*_ఆధునికత పేరుతో ఆహారం తినే విషయం దగ్గరనుంచి అన్నిటిలోనూ మార్పులు చేసుకుంటూ వచ్చాడో అప్పటినుంచే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల సహా అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ఎప్పుడైనా పూర్వీకులు రోగాల బారిన పడితే.. పదిపైసలు ఖర్చు లేకుండా పెరటి మొక్కల వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. అవును మనం తినే ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను తగ్గించే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఔషధ మొక్క అటిక మామిడి తీగ. ఇది పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు._*
*_ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చు_*
*_# తయారీ విధానం :_*
*_అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి. 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అటిక మామిడి తీగ ముక్కలను వేయలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చు._*
*_#అటిక మామిడి తీగ ప్రత్యేకత :_*
*_అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది._*
*_దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం 'బొహేవియా డిప్యూస'_*
*_కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు._*
*_కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా తగ్గిపోతాయి._*
*_దీనిని ఇతర ఆకు కూరల్లాగా వండుకుని తింటే ఇంకా మంచిది._**
*_కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది._*
*_కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు._*
*_ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు._*
మానవత్వం!
➖➖➖✍️
– జాఫర్ ఇర్షాద్
నేను జర్నలిస్ట్ గా అనేక ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకు వెళ్ళాను, రిపోర్ట్ తయారు చేశాను. కానీ నాకు ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంపై వచ్చిన విమర్శలు, వాదోపవాదాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.
ఈ విమర్శలు చేసినవారెవరూ ఆర్ ఎస్ ఎస్ చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పుడూ చూసినవారుకాదు, తెలుసుకున్నవారుకాదు.
కానీ ఒక జర్నలిస్ట్ గా నేను వారి సేవాకార్యక్రమాలను దగ్గరగా చూశాను. అందుకే ఇప్పుడు వాటి గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను.
ఆర్ ఎస్ ఎస్ ముస్లిములకు వ్యతిరేకమా, హిందువులకు అనుకూలమా అంటే నేను చెప్పలేనుకానీ అది మానవత్వానికి విరుద్ధంకాదని మాత్రం చెప్పగలను.
నా 24 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక సందర్భాల్లో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎలాంటి పేరు, గుర్తింపు కోరుకోకుండా ప్రజలకు సహాయపడ్డం చూశాను కానీ ఏ మత ఘర్షణలో, దొమ్మిలో పాల్గొన్నట్లు చూడలేదు.
అలాగే ఇతర జర్నలిస్ట్ లు లేదా నాయకులు కూడా మత ఘర్షణల్లో వారి పాత్ర ఉందని చెప్పగలరని నేను అనుకోవడం లేదు.
అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నాకు ఆర్ ఎస్ ఎస్ తో గాని, బిజెపితోగాని ఎలాంటి సంబంధం లేదు.
అది 2011 జులై 10. నేను కాన్పూర్ లో ఒక న్యూస్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్నాను. ఆదివారం కావడంతో కాస్త విశ్రాంతిగా ఉన్నాను. హఠాత్తుగా మా ఎడిటర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫతేపూర్ దగ్గర మాల్వాలో రైలు ప్రమాదం జరిగిందని, వెంటనే వివరాలు సేకరించమని చెప్పారు.
నేను వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం అడిగాను. వాళ్ళు రైలుప్రమాదం జరిగిందని, అదికూడా పెద్ద ప్రమాదమేనని చెప్పారు.
నేను వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరాను. గంట ప్రయాణం తరువాత ఘటన స్థలానికి చేరాను.
మాల్వాకు 10-12 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చుట్టుపక్కల ఎక్కడా జనవాసాలు లేవు. అక్కడికి చేరాలంటే దాదాపు 4కి.మీ లు పొలాల్లో నడిచి వెళ్ళాలి.
అక్కడికి చేరుకోగానే నేను పని ప్రారంభించాను. ప్రమాదం గురించి డిల్లీలోని మా ఎడిటర్ కు, న్యూస్ డెస్క్ కు సమాచారం అందించడం మొదలుపెట్టాను. పూర్తిగా దెబ్బతిన్న బోగీల నుంచి శవాలను బయటకు తీస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దగ్గరవారిని కోల్పోయిన వారి ఏడ్పులు, గాయాల మూలంగా బాధితులు పెడుతున్న పెడబొబ్బలు ఆ ప్రదేశాన్ని భయానకంగా మార్చాయి. శవాలను దగ్గర ఉన్న పొలాల్లోకి చేర్చారు. బాగా ఛిద్రమైన వాటితోపాటు ఇతర శవాలపై కొందరు తెల్లబట్ట కప్పుతూ కనిపించారు. వాళ్ళంతా ఖాకీ నిక్కర్లు వేసుకుని ఉన్నారు.
తమవారిని కోల్పోయి బాధలో ఉన్నవారు కూర్చున్న చోటికి వెళ్ళాను. వారిని ఆకలి, దప్పిక కూడా బాధిస్తోంది. అప్పుడే కొద్దిమంది అక్కడికి వచ్చి బాధితులకు టి, బిస్కట్ లు ఇవ్వడం చూశాను.
నాతోపాటు మరో 24మంది జర్నలిస్ట్ లు అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు కప్పు టీ, రెండు బిస్కట్ లు తెచ్చి ఇచ్చాడు.
ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నాలుగు గంటలుగా పనిచేస్తున్న మాకు ఆ టీ అమృతప్రాయంగా అనిపించింది. అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత నిర్మానుష్య ప్రదేశంలో టీ, బిస్కట్ లు ఉచితంగా ఇస్తున్న వీళ్ళు ఎవరు? వీళ్ళు ప్రభుత్వోద్యోగులా? వెంటనే వాళ్ళలో ఒకరిని అడిగాను -`భాయిసాబ్ మీరు ఎందుకు ఇవి పంచుతున్నారు? ఎవరి తరఫున పనిచేస్తున్నారు?’ అందుకు ఆ వ్యక్తి `మీకు మరికొంత టీ కావాలంటే ఆ చెట్టు దగ్గరకి రండి’ అన్నాడు.
నా సందేహం తీర్చుకునేందుకు నేను అతను చెప్పినట్లే చెట్టు దగ్గరకి వెళ్ళాను. అక్కడకి వెళితే నాకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. కొద్దిమంది మహిళలు అక్కడ కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు. రొట్టెలకు పిండి తయారుచేస్తున్నారు. ఆ పక్కనే కట్టెల పొయ్యి మండుతోంది. దానిపై టీ మరుగుతోంది. అక్కడే కొన్ని వందల బిస్కట్ ప్యాకెట్ లు ఉన్నాయి. మరోపక్క కొందరు బాధితులకు అందించడం కోసం మంచినీటిని కవర్ లలో నింపుతున్నారు.
కుర్తా, పైజమా వేసుకున్న ఒక వ్యక్తి పని త్వరగా చేయాలంటూ అందరికీ సూచనలు ఇస్తూ కనిపించాడు.
నేను అతని దగ్గరకు వెళ్ళి `మీ పేరేమిటి’ అని అడిగాను. అతను నవ్వాడుగానీ సమాధానం చెప్పలేదు. నన్ను నేను పరిచయం చేసుకుని ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారని అడిగాను. బాధితులకు అందిస్తున్న సేవ గురించి నేను రాస్తానని చెప్పాను. ఎప్పుడైతే నేను జర్నలిస్ట్ నని చెప్పానో వెంటనే అతను అక్కడ నుంచి వెళిపోయి బాధితులకు టీ అందించడంలో నిమగ్నమయ్యాడు. టీ అందిస్తూ అతను ఎవరినీ... ‘నీ మతం ఏది? నీ కులం ఏది’ అని అడగలేదు.
నేను కూడా చనిపోయినవారు ఎంతమంది, గాయపడినవారు ఎంతమంది అని తెలుసుకుని, సహాయ కార్యక్రమాల గురించి మా ఆఫీస్ కు సమాచారం అందించడంలో పడిపోయాను.
అది అర్ధరాత్రి సమయం. శవాలను బోగీల నుండి తీసే పని కొనసాగుతోంది. అప్పుడే మధ్యాహ్నం నేను కలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నాకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. “ఇందులో నాలుగు రొట్టెలు, కొద్దిగా కూర ఉన్నాయి. మీరు మధ్యాహ్నం నుంచి పని చేస్తూ అలిసిపోయి ఉంటారు. ఆకలిగా ఉండిఉంటుంది. తినండి’’అన్నాడు.
నాకు నిజంగానే బాగా ఆకలిగా ఉంది. అయినా ‘మీ పేరు, మీరు ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారో చెపితేనే ప్యాకెట్ తీసుకుంటా’నని షరతు పెట్టాను.
అప్పుడు అతను తాము రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలమని చెప్పాడు. రైలు ప్రమాద బాధితులకు సహాయం అందించడానికి వచ్చామని చెప్పాడు. వెంటనే నా జర్నలిస్ట్ బుర్రకు ఇది చాలా మంచి స్టోరీ అవుతుందనిపించింది. అతని పేరు చెప్పమని పదేపదే అడిగాను. అయినా అతను తన పేరు మాత్రం చెప్పలేదు. పైగా ఇది ఎక్కడా ప్రచురించనని నేను అంతకుముందే చేసిన వాగ్దానాన్ని గుర్తుచేశాడు.
అప్పుడు రోజంతా అక్కడే ఉండి, అందరికీ టీ, టిఫిన్ తయారుచేసిన మహిళల గురించి అడిగాను. వాళ్ళంతా తమ కార్యకర్తల కుటుంబాల నుంచి వచ్చినవారు అని చెప్పాడు.
శవాలపై కప్పిన తెల్ల బట్ట గురించి అడిగితే అది బట్టల దుకాణం ఉన్న స్వయంసేవకులు స్వచ్ఛందంగా ఇచ్చిన బట్ట అని చెప్పాడు. రొట్టెల పిండి, నూనె కిరాణా దుకాణం ఉన్న వాళ్ళు ఉచితంగా ఇచ్చారని చెప్పాడు.
“ఆర్ ఎస్ ఎస్ హిందూ సంస్థ కదా, మీరు ఇతరులకు కూడా సహాయం అందిస్తున్నారేమిటని” అడిగాను.
అందుకు అతను “భాయిసాబ్, ఇక్కడ బాధితులందరికి మేము సహాయం అందిస్తున్నాము. సహాయం అందించడంలో కులం, మతం చూడకూడదని మా సంస్థ భావిస్తుంది’’ అని సమాధానమిచ్చాడు.
శవాలపై బట్ట కప్పుతున్నప్పుడు కూడా చనిపోయినవారి మతం ఏమిటో, కులం ఏమిటో తమకు తెలియదని, అది పట్టించుకోమని చెప్పాడతను.
ఈ మాటలు చెప్పి ఆ నిజాయతీపరుడైన `భగవంతుని సేవకుడు’ తన పేరు చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నేను ప్రమాద స్థలంలో 36 గంటలపాటు ఉన్నాను. అంతసేపూ వాళ్ళు బాధితులకు, జర్నలిస్ట్ లకు, డ్యూటీలో ఉన్న ప్రభుత్వాధికారులకు కావలసినవి అందిస్తూ కనిపించారు.
ఆ మర్నాడు ప్రమాద వార్తను పత్రికలన్నింటిలో చూసిన నాకు బాధితులకు నిస్వార్ధంగా సేవ చేసిన ఆ కార్యకర్తల పేర్లు గానీ, ప్రస్తావన గానీ ఎక్కాడ కనిపించలేదు.✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
16 కళలవాడు-శ్రీరామచంద్రుడు..
*పుష్టాయ నమః*
➖➖➖✍️
*శ్రీ రాముడు రఘువంశములో జన్మించాడు. రఘువంశపు రాజులంతా సూర్య వంశానికి చెందినవారు.*
*ఆకారణంగా రాముడిని ఆయన ‘రామసూర్య’ అని సంబోధించవచ్చును. కానీ , రాముడిని 'శ్రీరామచంద్రా' అనే పిలుస్తారు.*
*దీనికి పలు కారణాలు వున్నప్పటికీ, వాల్మీకి రామాయణం లో ఒక వివరణ వుంది…*
*వాల్మీకి రామాయణంలో బాలకాండం మొదటి సర్గలో రామునిలోని 16 ముఖ్యమైన సుగుణాలను పేర్కొన్నారు.*
*నింగిలోని చంద్రుని కళలు పదహారు. అలాగే శ్రీరాముడు కూడా షోడశకళలతో విరాజిల్లి అందరిచేత పూజించబడ్డాడు.*
*శ్రీరాముడు…*
*1 .గుణవంతుడు.. అతి నిరాడంబరుడు. తను ఎంత ఉన్నతుడైనప్పటికీ తనకు సాటికాని వారితో కూడా కలసి మెలసి సంచరించాడు.*
*2. మహావీరుడు : ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగాడు.*
*3. ధర్మాత్ముడు: పితృవాక్య పరిపాలకుడు. సకల ధర్మ రక్షకుడు.*
*4. కృతజ్ఞతాభావం కలిగినవాడు.. తనకి ఎవరు ఏ చిన్న సహాయము చేసినా, అది అతిపెద్ద సహాయంగా తలచి తిరిగి వారందరికి తృప్తి కలిగేలా పెద్ద పెద్ద ఉపకారాలు చేసేవాడు.*
*తనకి ఎవరైనా కీడు తలపెట్టినా వారిని క్షమించి ఆ క్షణమే మరచి పోయేవాడు.*
*5. సత్యవాక్పరిపాలకుడు..*
*ఎన్ని కష్టాలు వచ్చినా..(భగవంతుడు కష్టాలకు అతీతుడైనా, మానవ స్వభావాన్ని అనుసరించి అవతారసమయంలో ఎన్ని కష్టాలుకలిగినా) ఇచ్చిన మాట తప్పేవాడు కాదు.*
*6. ధృఢమైన స్వభావం కలవాడు.. చేపట్టిన కార్యం పట్టుదలతో సాధించేవాడు.*
*7. పవిత్రమైన శీలము కలవాడు.*
*8. సర్వభూతేషు హితుడు.. శతృవులకు కూడా సహాయపడేవాడు.*
*9. విద్వాంసుడు... సకల విద్యలలో పాండిత్యము కలవాడు.*
*10. సమర్ధవంతుడు - ఏ కార్యమైనను సాధించగల నేర్పరి.రాతిని నాతిని చేయగలడు.గడ్డిపోచను బాణంగా చేయగలడు.*
*11. ప్రియదర్శకుడు... ఆ మూర్తిని ఎల్లప్పుడూ దర్శించాలనే కోరికను జనింపజేసేవాడు.*
*12. ఆత్మస్థైర్యం కలవాడు. ఎప్పుడూ దేనికి భయపడని స్వభావం కలవాడు.*
*13. జితక్రోధుడు.. తన కోపాన్ని తన కట్టుబాటులో వుంచుకునేవాడు.*
*14. ద్యుతిమంతుడు.. ప్రకాశవంతుడు.*
*15. అనసూయాపరుడు - ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎవరి మీద అసూయ చెందనివాడు.*
*16. జాతరోషుడు.. శ్రీ రామునికి ఆగ్రహమే రాదు. అలాటి కోపమే వస్తే ఇంద్రాది దేవతలే తల్లడిల్లిపోతారు.*
*ఈ విధంగా చంద్రుని వలె 16 కళలు గలవాడు శ్రీరాముడు.*
*పాడ్యమి మొదలు అమవాస్య, పౌర్ణమితో సహా గల 16 తిధులు చంద్రుని కళలుగా పూర్ణ చంద్రునిగా చెప్తారు.*
*చంద్రుని16 కళలవలె , ఈ 16 శుభగుణములు పరిపూర్ణంగా కలిగి వున్నందున శ్రీ రాముడు 'రామచంద్రా' అని పిలువబడుతున్నాడు.*
*రాముని 16 శుభగుణములు, 16 చంద్రకళలతో పోల్చి శ్రీరామని విశిష్టతను వివరించడం జరిగింది.*
*'పుష్టః' అంటే పరిపూర్ణుడని అర్ధం.*
*చంద్రుని 16 కళల వలెనె రాముడు 16 శుభగుణములు కలిగి పరిపూర్ణుడైనందున రాముడు ' పుష్టః' పిలువబడుతున్నాడు.*
*ఇది…*
*అనంతుని వేయి ఆనంద నామాలలో 394 వ నామము.*
*'పుష్టాయ నమః ' అని నిత్యం జపించే భక్తుల జీవితాలలో సకల శుభాలు పరిపూర్ణంగా లభించేలా శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*వీళ్ళు నరకానికి వెళ్ళరు!*
➖➖➖✍️
*మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి వృక్షాలు.*
*మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని... “శ్రీ వరహా పురాణం“(172వ అధ్యాయం,36 వ శ్లోకం) పేర్కొంది.*
*శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı*
*ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı*
*ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.*
*పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు...*
*మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.*
*అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.*
*వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది…*
*శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı*
*మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı*
*ఇతర పక్షుల పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి.*
*వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి.*
*జంతువులకు, పక్షులకు ఇతర జీవరాశులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.*
*వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి.*
*గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది.*
*మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి.*
*మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ధ్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం.*
*ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..*
*మన మతాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా ‘పుక్కిట పురాణాలు’ అంటూ మన మనసుల్లో ‘సెక్యూలర్’ విషాన్ని ఎక్కించేశారు.*
*పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే,*
*గత డెభై సంవత్సరాలలో ఎంత ‘పెద్ద అడవి’ సృష్టించబడి ఉండేదో ఊహించుకోవచ్చు.*
*నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.*
*నూరు బావులకంటే ఒక చెరువు మేలు !*
*నూరు చెరువులకంటే ఒక సరస్సు మేలు !*
*నూరు సరస్సులకంటే ఒక కొడుకు మేలు !*
*నూరుగురు కొడుకులకంటే ఒక ‘చెట్టు’ మేలు !*
*-మత్స్య పురాణం.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
[
*భోజనం చేసేటపుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు.*
➖➖➖✍️
*ఎంత గొప్ప అతిధి వచ్చినా ఆ అతిధి కోసం పంక్తిలో కూర్చున్న వ్యక్తిని లేపి మరొకచోట కూర్చోమని అనరాదు.*
*రాహువు రాక్షుసుడైనా మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు.*
*అలా లేచి మరొకచోట కూర్చోమనడం పరమ దోషం. ఏ భేదము చెప్పి కూడా పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఎంత బలవత్తరమైన కారణము మీదనైనా లేచి మరొకచోట కూర్చోమని అనకూడదు.*
*పంక్తియందు ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కానీ, పెట్టనని కానీ మీరు అనడానికి వీలులేదు.*
*పంక్తిలో కూర్చున్న వానిని మీరు ఈశ్వర స్వరూపంగా భావించాలి. భేదమును చూపడం శాస్త్రమునందు మహా దోషము.*
*అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని శ్రీమన్నారాయనునికి తెలుసు. ఐనా అతనికి అమృతమును పోశాడు. ఇపుడు రాహువు అమృతమును త్రాగాడు.*
*అతడు త్రాగిన అమృతము క్రిందకి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనిది రాక్షస ప్రవృత్తి. మంచి ప్రవృత్తి కాదు. వెంటనే సుదర్శన చక్రము ప్రయోగించి ...*
*పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. *
*అమృతంతో కూడినందువలన తల నిర్జీవం కాలేదు.*
*మొండెం మాత్రం కింద పడిపోయింది. పంక్తియందు కూర్చున్నవాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం.*
*అమృతత్వాన్ని పొందాడు. శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. *
*ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య, చంద్రులను ఇప్పటికీ .... రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏