25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శివామృతలహరి

   శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||

శాంతంబున్ కృపయున్ సముజ్జ్వల మహాసౌందర్యమున్ నిండి భా

స్వంతంబౌ జగదేకమాతృ శుభరూపమ్మేలకో వేదనా

క్రాంతంబై వికటోగ్రభీకరమునై గన్పట్టు? పాపౌఘముల్

చింతింపన్ ధరఁజుట్టు ముట్టు కతనన్ శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

శాంతము,దయ ఉట్టిపడుతూ మిక్కిలి ప్రకాశవంతమైన మహా సౌందర్యంతో 

వెలిగిపోయేటువంటి జగన్మాత అయిన అమ్మవారి మంగళకరమైన రూపము ఎందుకో ఎంతో బాధతో నిండి భయంకరమైన ఉగ్రరూపాన్ని దాల్చినట్లు కనిపిస్తున్నది.

దానికి కారణమేమిటానని ఆలోచిస్తే 

మానవులు చేసే పాపాలు సముద్రల్లా భూమండలాన్నంతటినీ చుట్టుముట్టినట్లున్నాయని అనిపిస్తోంది. నువ్వే దయ చూపి కాపాడాలి స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

1 కామెంట్‌:

Ravi Bhushan Sarma Konduru చెప్పారు...

శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారి చక్కటి పద్యాన్ని మాకు పరిచయం చేసారు, ధన్యవాదములు.