*అతని పేరు మారన్. శ్రీలంక లో అతడు న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఒకానొక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మారన్ కనుచూపు కోల్పోయాడు. ఒకసారి స్థానిక టెలివిజన్ మారన్ ను ఇంటర్వ్యూ చేసింది. అందులో మారన్ మాట్లాడుతూ ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. జీవితం నిరాశను ఆశ్రయించింది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను తనివితీరా వింటూ స్వస్థత పొందేవాడిని. ఆ పరంపరలో నేను కూడా బాలు పాటలు పాడుకుంటూ కాలం గడుపుతున్నాను. బాలు పాటలే నాకు వెలుగు రేఖలు’’ అని చెప్పాడు. ఈ విషయం ఎలాగో బాలు చెవిన పడింది. శ్రీలంక లో సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలు అక్కడకు వెళ్లారు. మారన్ చిరునామాను సేకరించి అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారన్ బాల్కనీలో కూర్చొని తదేకంగా పక్షుల కిలకిలారావాలను వింటూ వున్నాడు. బాలు అతని అతని భార్యకు తనెవరో చెప్పకుండా మారన్ వద్దకు వెళ్ళి అతడు కూర్చున్న కుర్చీ వెనుక నిలబడి ‘’నూరాండ గళ్ నీ వాంగవే’’ అనే ఒక పాట పల్లవి వినిపించారు. తమకంలో ఆ గానం వింటున్న మారన్ వీపు మీద చెయ్యి వేశారు బాలు. వెంటనే మారన్ ‘’ఎంతమంచి బాలు పాట గుర్తుచేస్తున్నారు. ఇంతకీ మీరెవరు?’’ అని ప్రశ్నించాడు. ‘’నేను కూడా బాల సుబ్రహ్మణ్యం లా పాడగలను. నా పేరు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం....’’ అని బాలు అంటూ వుంటే నిజాన్ని నమ్మలేని మారన్ లేచి నిలబడి ‘’నేను ఎంత అదృష్టవంతుణ్ణి. కొలిచే దైవం ఎదుట ప్రత్యక్షమైంది’’ అంటుండగా అతణ్ణి కావిలించుకొని, మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలు కొన్ని పాటలు తను పాడుతూ, మారన్ చేత పాడిస్తూ అతణ్ణి కొన్ని గంటలసేపు అలరించారు. మారన్ కుటుంబ సభ్యులు ఆ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. మారన్ మంచి ఫలహారం, కాఫీ ఇచ్చి బాలు కి తన కృతజ్ఞతలు తెలియజేశారు. తన ప్రత్యేక అతిథిగా మారన్ బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొని తన అభిమానాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. మానవత్వం మూర్తీభవించిన గొప్ప ‘మనీషి’ మనందరి హృదయాలను దోచుకున్న బాలు. మంచితనాన్ని మూటకట్టుకొని దేవేంద్రుని ఆస్థానంలో ఘంటసాలతో కలిసి గళం కలిపేందుకు కాస్త తొందరపడి వెళ్ళిపోయారు. బాలుకి నివాళి.... బాలు విశేష గుణసంపదకు పాదాభివందనం.*
3 కామెంట్లు:
**దశిక రాము**
**హిందూ ధర్మం** 53
(సత్యం)
సత్యమే భగవంతుడు. భగవంతుడిని సత్యపరిపాలన ద్వారానే ఆరాధించాలి. ప్రతి శుభకార్యం తర్వాత మనం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. సత్యమే తానై ఉన్నవాడు కనుక సత్యనారాయణుడని పేరు. ఆ వ్రతానికి సత్యవ్రతం అని పేరు. ఆ వ్రత కధ చదివితే అర్దమవుతుంది సత్యం విలువ ఏమిటో? సత్యనారాయణ స్వామిని ఆరాధిం చడంలో తొలిమెట్టు సత్యాన్ని గట్టిగా పాటించడమే.
సత్యనారాయణ స్వామి కధనే పరీశీలించండి. అందులో వైశ్యుని కధ చూస్తే, తమకు కష్ట వచ్చిన ప్రతిసారీ 'స్వామి నీ వ్రతం చేస్తాము' అని మొక్కుకోవడం, కష్టం నుంచి గట్టేక్కగానే మొక్కును మర్చిపోవడం, లేదంటే ఇప్పుడు కాదులే అంటూ వాయిదా వేయడం. ఇదే తంతు. ఆఖరున వారు చెరసాలలో బంధించబడడం, రాజు వారికి సమస్త కానుకులు ఒక ఓడ నిండుగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అప్పుడు అటు సాధువు రూపంలో వచ్చిన స్వామి 'ఆ ఓడలో ఏమున్నాయి అబ్బాయి' అని అడుగుతారు. అందుకు సమాధానంగా 'ఆ ఓడలో ఏముంటాయి రాళ్ళూ రప్పలు తప్ప!' అని సమాధానం ఇస్తారు. వారు ఆ ఓడ ఎక్కి చూస్తే సంపద మొత్తం చెత్తగా మారిపోతుంది. వచ్చినవాడు సాధువు, అతనికి డబ్బుపై మమకారం ఉండదు, అయినా అసత్యం పలికారు, సత్యమే పరమాత్మ. పరమాత్మను ప్రక్కతోసారు, దిక్కరించారు, మోసం చేయాలనుకున్నారు, పర్యవసానం అనుభవించారు. ఆ కధను బాగా గమనించండి. భగవంతునికి మనం మొక్కిన మొక్కు తీర్చకపోవడం వల్ల కోపం రాదు. ఆయనకు కొబ్బరికాయలు, పూలదండలు అవసరం లేదు.
అయ్యో! వీడు నా దగ్గరే అబద్ధం ఆడుతున్నాడు. నా దగ్గరే ఇంతకు తెగిస్తే, ఇక లోకంలో అన్ని అకృత్యాలు చేస్తాడు, అన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఎంతమందిని మోసం చేస్తాడో అని పరమాత్మ భావిస్తాడు. అందుకే మొక్కు తీర్చలేదని శిక్షిస్తాడు. మొక్కు తీర్చకపోవడమంటే ఆడినమాట తప్పడం. అది ఆయన దగ్గర తప్పితేనే శిక్షిస్తాడు అనుకోకండి. పరమాత్మ ఎప్పుడు సత్యం వైపే ఉంటాడు. సత్యమే గెలుస్తుంది.
జీవితంలో ఎవరి కోసం సత్యంగానో, అసత్యంగానో బ్రతకవలసిన అవసరమేమిటి? మీకోసం సత్యంగా బ్రతకండి, మీ జీవితాలను ఉద్ధరించుకోవడం కోసం సత్యంగా బ్రతకండి. ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. మీ బలహీనతలను పరమాత్మ ముందు అంగీకరించండి. మీలో దుర్గుణాలను నిస్సందేహంగా అంగీకరించి, మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఇది కాలం కాదు, ఇలా బ్రతకలేమంటూ సమర్ధించుకోకండి. అదే ధర్మం చెప్తుంది. సత్యం ధర్మాచరణలో ముఖ్యమైన అంశం.
తరువాయి భాగం రేపు.......
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU
**ధర్మో రక్షతి రక్షితః**
https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95
*ధర్మము - సంస్కృతి*
**ధర్మో రక్షతి రక్షితః**
గ్రూపుల ద్వారా
పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
*ఎప్పుడో మర్చిపోయింది*
ఎప్పుడో మర్చిపోయింది
ఎక్కడో పారేసుకొంది గుర్తుకొచ్చినప్పుడల్లా
వంకల్లోనూ వాగుల్లోను
ఏటిగట్టున నీటమట్టంలోను
వెతుకుతూ వెతుకుతూనేవున్నా...
తొలిజాము వేకువలో
మలిజాము పొద్దుల్లో
అలవోకగా పలకరించే మలయసమీర తంత్రుల్లోను...
హద్దేలేకుండా అంబరం మంతా వూరేగుతూ హడావుడి చేసే మేఘాడంబరాల్లోను ....
మెరుపులతొ మెరుపిస్తూ బెదిరించే ఉరుములలోనూ...
వచ్చే దారే కాని, వెళ్లే దారి తెలియని....వయస్సువసంతాలు
విరిసే అమనిలో..
రాలే శిశిర పత్రాల సవ్వడిలలోను....
చిటారుకొమ్మల గూడుల్లో
హోరు గాలికి ఊగుతూ
తల్లడిల్లే గువ్వపిల్లల కువకువల్లోను వెతుకుతున్నా.....
ఎద ఎద మీటుతూ పొదపొదను తడుతూ మది మదిని కలిపే మానవత్వపు మమతలరాగమాలిక
ఏడ జారిందో తెలియక........
ఊగిసలాడే మనస్సుటుయ్యాలలో
కుదురే లేక మతితప్పి పారసుకొన్న మమతల మాలలో
వాడిన పూలన్నీ వూడి ....
చిక్కు ముడులతో ......
చిట్టడివిలో చిమ్మచీకటిలో
పాడుబడ్డ బావిలో కీచురాళ్ళు
కప్పల బెకబెకల మధ్య పీలగా
ఓ సన్నని స్వరం చుట్టుకొని అరుస్తోంది పిలుస్తోంది
నేను ఇక్కడ ఇంకా వున్నానంటూ......
లలితా భాస్కర దేవ్
30-9-2020
అధికారం , హోదాచూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటేపొరపాటే, *చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా* ఎలాంటి ఫలితంఉండదు .*మంచితనమే శాశ్వతం. నిందించడం తేలిక *నిందను భరించడం కష్టం, *నీతులు* చెప్పడం తేలిక కాని ఆచరించడం కష్టం, అబద్ధం చెప్పడం తేలిక కాని నిజాన్ని దాచడం కష్టం, ఇదే మన *జీవిత రహాస్యం*"
కామెంట్‌ను పోస్ట్ చేయండి