31, మార్చి 2024, ఆదివారం

మిత్రుని లక్షణములు.

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 

*దదాతి ప్రతిగృహ్ణాతి*

*గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి౹*

*భుంక్తే చ భోజయతే చైవ*

*షడ్విధం మిత్రలక్షణమ్॥*


తా𝕝𝕝 తనకున్న దానిని మిత్రునికి ప్రేమతో ఇవ్వాలి, మిత్రుడు ఇచ్చిన దానిని ప్రేమతో గ్రహించాలి. తన మనసులో మాట దాపరికం లేకుండా చెప్పాలి, చెబితే వినాలి, అడిగి తెలుసుకోవాలి. మిత్రుని ఇంటిలో భోజనం చేయాలి, మిత్రుడిని భోజనానికి ఆహ్వానించాలి. - ఈ ఆరు మంచి మిత్రుని లక్షణములు.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*31-03-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

---------------------------------------

వృషభం


ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.

---------------------------------------

మిధునం


వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు. 

---------------------------------------

కర్కాటకం


సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరతాయి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కన్య


బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

తుల


ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరో బాధలు అధికమౌతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

వృశ్చికం


ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

ధనస్సు


 సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------

మకరం


చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతా. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

మీనం


వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

జాతక_దోష_నివారణ

 #జాతక_దోష_నివారణ  


భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.


దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము .బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.


సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకున్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.


స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.


ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.


పితృ కార్యములు ఆచరించునప్పుడు ఒకే పరమేశ్వరాగ్ని 3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృశక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.


నైవేద్యం

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దలు కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రాన్నాన్ని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతల శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

History of Hyderabad.

 Great History of Hyderabad.

All Hyderabadi's must know and share this information about Hyderabad.

1856 - First Post office

1871 - Singareni collieries

1875 - Deccan Railways

1876 - Printing Press

1885 - Telecommunications

1910 - Hyderabad electricity board

1921 - Chemical Laboratory

1942 - Hyderabad State Bank

1943 - Praga Tool

1873 - Spinning Mills

1878 - Pirani Factory

1910 - Soda Factory, Iron Factory, Deccan Button Factory

1912 - Distilleries, Iron foundry

1913 - Bone Factory

1919 - VST

1927 - Deccan Glass Factory

1929 - GBR Mills, Ram Gopal Cotton Mills

1931 - Azam Jahi Mills

1932 - Hyderabad Steel and World LTD

1933 - Kohinoor Glass factory

1936 - Indian Hume Pipe Company LTD, The Taj clay works ltd

1937 - Nizam Sugar Factory

1939 - Sirpur Paper Mill

1940 - Taj Glass works (Sanathnagar)

1941 - Golconda Cigarette Factory

1946 - Sursilk, Hyderabad Asbestos

1947 - Hyderabad Lamination Products, Hyderabad Soap Factory, Deccan Chemical Works, Zinda Tilismat, The Baba water Manufacturing Ltd, VasuDeva Ayurvedic pharmacy Ltd, Deccan Potteries and Enamel World Ltd, Charminar Potteries

Hyderabad using electricity from 1910. There was a Thermal plant near Hussainsagar which

was sold in the period of NTR for 6 crores

1813 - Hyderabad Public School

1854 - Darul uloom Oriental School, College

1856 - Darul uloom School

1869 - Hyderabad Civil engineering college

1872 - Chaderghat School

1879 - Mufidul Anam School

1881 - Chaderghat First Grade College

1882 - Mahboob College

1884 - Secunderabad Mahboob College

1874 - Nizam College

1887 - Nampalli Girls School

1890 - Warangal Telgu School

1894 - Asfiya School, Medical College

1899 - Law school

1904 - Viveka Vardhini School

1920 - City College, Osmania University

1921 - Osmania Medical College

1923 - Hyderabad Public School

1924 - Marwadi Hindi Vidyalay

1926 - Hindi Vidyalayam, Secunderabad

1930 - Physical Education College

1946 - Veterinary Sc. College, Koti Womens college, Nampally Womens college

1834 - First English Public School

*1835 - Roman Cathelic School*

*All saints and Rosery convent school*

1850 - St Francis school

1861 - St Anns school

1630 - Hakeem Nizamuddin Clinic

1916 - St William bradford Hospitals

1880 - Darul Shifa hospital

1851 - Kind Edward Memorial Hospital KEM hosp now Gandhi hosp

1866 - Afzalgunj Hospital now Osmania hosp

1889 - jazgi khana -> Queen Victoria zanana  hosp-> GMH govt maternity hosp -> shifted to petla burj

1890 - Ayurveda Unani Hospital

1894 - Medical College

1897 - Erragadda Mental Hospital

1916 - Homeopathy College

1927 - Charminar Unani Ayurved Hospital

1925 - Nilofer Hospital

1926 - Osmania Medical college, Victoria Zanana And Children, Maternity Hospital, Quarantine (Korenty) hospital or fever hosp now communicable diseases hosp. Nizam Orthopedic Hospital.

The seventh Nizam Mir Osman Ali Khan of Hyderabad state was made the   *RAJ-PRAMUKH* equivalent to present Governor, the Head of the state of erstwhile HYDERABAD after the Nizams kingdom joined the Indian Union by the then Govt. Of India .

India got electricity when Hyderabad used it 15 years before.

It was only 7th Nizam Mir Osman Ali Khan of Hyderabad state who gave seven lorries of gold to Indian government at the time of  Indo-China war.

No outsider has developed Hyderabad, it was already a developed place before india became independent.

and

British ruled all over India except Nizam State.

Now Hyderabad is in Telangana State as it's capital.

My Hyderabad ! My Pride !

30, మార్చి 2024, శనివారం

మాంచి స్ఫూర్తి నింపు కథ*

 *ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ*


దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…


1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.

జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’

ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె.

అయోమయంగా చూశాడు డాక్టర్.

ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 

‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… 

ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…

నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?’

‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…

డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…’

కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…

‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…

ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…

‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’

‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’

‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’

‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.

డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…

‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…

ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’

అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… 

సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…

ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… 


చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.

ఆహా...ఎంత గొప్ప మనసులు...

ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!


☘️ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.! నేను చదువుతుంటే నా కళ్క్ష వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.! ఇది మన కథ.!!

మీ🙏🏻శ్రేయోభిలాషి

Panchaag


 

గోత్రము

 *ॐశ్రీవేంకటేశాయ నమః*

💝 *గోత్రము,ప్రవర,వివాహ నిబంధనలు:~*

గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి (ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు.అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. 

బ్రాహ్మణ గోత్రాలు, క్షత్రియ గోత్రాలు, వైశ్య గోత్రాలు ..ఇలా ఉన్నప్పటికీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉన్నాయి.

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ,ఇతర ఋషుల సంబంధాలతో అనేక కలయికలు కలిగి గోత్రాలు ఏర్పడ్డాయి. 

ఆ గోత్రజుల సంతానానికి అదే గోత్రము. నాది ఫలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే,అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన.

(అగ్ని స్తుతి) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురుతుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. 

గౌతముడు, ఆపస్తంబుడి చెప్పినప్రకారం సగోత్రీకుల మధ్య వివాహాలు చేసుకోకూడదు. ఎందుకంటే… ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటివారు ఔతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో, అక్కా తమ్ముళ్ళో, తండ్రీకూతుళ్ళో, తల్లీ కొడుకుల వరస కలవారో అవుతారు. 

సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,

ఏ రెండు కుటుంబాలకుగానీ "ప్రవర" పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే…ఇలా చెప్పడం:~

*చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు --------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ /సప్తార్షేయ ప్రవరాన్విత ---- సగోత్రః , ----- సూత్రః, ---- శాఖాధ్యాయీ ....................... శర్మన్ అహం భో అభివాదయే*

పైని ప్రవరలో మన గోత్రము పేరు ,గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ ,తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి ,మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ ,కొన్నింటికి ఐదుగురు, మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు.ఇంకా ఖాళీలలో, సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి (ఆపస్తంబ , బౌధాయన,కాత్యాయన ..ఇలా..)శాఖ అన్నచోట… తమ వంశపారంపర్యంగా అనుసరించ, అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి (యజు, రిక్ , సామ ...ఇలా) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే వర్మా అని, వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.


బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక 'సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.

మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. ఆ తర్వాత….

* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్యతో వివాహము తగదు. 

* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు. 

* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* * ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

~ఇదీ సగోత్రము ఔనా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..

మాతృ గోత్రాన్ని వర్జించాలి.

అంటే, తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.

ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది... ఇక్కడ రాయడము వీలు పడదు.

ఈ విషయములో సడలింపులు అంటూ ఏవీ లేవు.

తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే ,ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.

తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు. 

తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా ,ఒక నెలలోని శుక్ల పక్షంలో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు ,మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షంలో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్యకు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం కేవలం తాను శుధ్ధుడవటానికి మాత్రమే! ఇది ఒక వెసులుబాటు కాదని గమనించాలి.

Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*

💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*

*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-03-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృషభం


ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. 

---------------------------------------

మిధునం


బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

---------------------------------------

కర్కాటకం


నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. 

---------------------------------------

సింహం


విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

---------------------------------------

కన్య


దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. 

---------------------------------------

తుల


ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

మకరం


స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

---------------------------------------

కుంభం


దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తా. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

మీనం


నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్న. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

తనను తానే ఉద్ధరించుకోవాలి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో 𝕝𝕝 

*ఉద్ధరేదాత్మానాత్మానంచ*

*మగ్నం సంసారవారిధౌ।*

*యోగారూఢత్వమాసాద్య*

*సమ్యగ్దర్శన నిష్ఠయా॥*


*ఆదిశంకరాచార్య : వివేకచూడామణి*


తా𝕝𝕝 ధృఢమైన వివేకంతో, నిర్విరామకృషితో యోగారూఢత్వాన్ని సంపాదించి సంసారసాగరం నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి......

లోక రీతి

 శ్లో! అన్యముఖే దుర్వాదో యః ప్రియవదనే స ఏవ పరిహాసః

ఇతరేంధన జన్మా, యో ధూమః, సోగరుభవో ధూపః

—నీతి శాస్త్రం.


ఇతరుల నోటి నుంచి వచ్చిన అపశబ్దం లేక చెడ్డ మాట, మనకు కావలసిన వారి నోటి నుంచి గానీ, మన పిల్లల నోటి నుంచి గానీ వస్తే, అది పరిహాసంగా తీసుకుంటాం. ఇతర 

కట్టెల నుంచి వచ్చిన పొగను 'ధూమం' అంటాము. అదే అగరు పుల్లల నుంచి వస్తే 'ధూపం' అని, గౌరవంగా, ప్రత్యేకంగా పిలుస్తాం.

ఏ కాలమయినా, ఇది అన్వయించుకోదగ్గ శ్లోకం. పర, తన మధ్య తేడా ఎప్పటికీ వుంటుంది. మన పిల్లల అల్లరి ముద్దుగా వుంటుంది. మన పిల్లల అల్లరిలో పదవ వంతు ఇతర 

పిల్లలు చేసినా, భరించలేక పంపించేస్తాము.

మన పిల్లలు బాగా తింటే, మా వాడు మంచి 'తిండి పుష్ఠి' కలవాడు అంటాం, అదే తిండి ఇతరులు తింటే, వాడొట్టి 'తిండి పోతు' అని వెంటనే వెటకారంగా అంటాం. ఇలా ఎన్ని 

ఉదాహరణలన్నా చెప్పవచ్చు. ఇది లోక రీతి, నీతి.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

29, మార్చి 2024, శుక్రవారం

పద్యాలని

 ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామ గారట మరి నే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా

----------------------------------------

కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

------------------------------------------------

కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

-------------------------------------------------

కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు కాడోయ్!

---------------------------------------------

కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

-----------------------------------------------

కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

--------------------------------------------

కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

------------------------------------------------

ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

-----------------------------------------------------

ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

--------------------------------------------------

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

-----------------------------------------

మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

------------------------------------------

చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

----------------------------------------------

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

-------------------------------------------------

పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి.

Read and enjoy

 Doctor : Your Liver is enlarged

Patient : Does that mean it has space for more whisky ?

(This is called "Positive Thinking" 😄😄)


Lady to her dietician :- What l am worried about is my height and not my weight.

Doc :- How come???

Lady :- According to my weight, my height should be 7.8 feet... 😜

(Now this is called "Positive Attitude" 👍)


A Man wrote to the bank. "My Cheque was returned with remark 'Insufficient funds'. I want to know whether it refers to mine or the Bank".

(This is self confidence in its peak 😂😂)


A cockroach's last words to a man who wanted to kill it : "Go ahead and kill me, you coward. You're just jealous because I can scare your wife and you cannot..!!!!" 😅😅😅


Son : Why is 1st April celebrated as Fools Day?

Father : Because after paying all the taxes up to 31st March, we Start working for the government again from 1st April ...... 😅😂

*Best answer ever*


"Wife ask - why in all marriages girl sits on left side and boy on right side?

"Husband reply - According to profit and loss statement a/c all income is on right side and expenses are on left side".....


😄Happy March ending.😄😜

Panchaag


 

Joke






 

ఆహర విరుద్ధాలు -

 ఆహర విరుద్ధాలు -


 మనం భుజించే ఆహరం వరసగా 


 1.రసం .


 2.రక్తం .

 

 3.మాంసం .


 4.మేధస్సు (కొవ్వు ) .


 5. ఎముక .


 6. మజ్జా .


 7. వీర్యము. (ఆర్థవము ).


అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.


 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.


 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.


 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.


 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.


 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .


 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .


 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.


 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.


 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.


 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.


 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.


 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.


       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్థి - విశాఖ -‌‌ భృగు వాసరే* *(29-03-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

బృహష్పతి వాసరః గురువారం రాశి ఫలితాలు

 28-03-2024

బృహష్పతి వాసరః గురువారం 

రాశి ఫలితాలు

********

మేషం

అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

---------------------------------------

వృషభం

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

మిధునం

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

---------------------------------------

కర్కాటకం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

సింహం

అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది.

---------------------------------------

కన్య

ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------

తుల

విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

--------------------------------------

ధనస్సు

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం

నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

మీనం

ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

⚜ శ్రీ చొక్కనాధస్వామి గుడి

 🕉 మన గుడి : నెం 269


⚜ కర్నాటక  : బెంగళూరు


⚜ శ్రీ చొక్కనాధస్వామి గుడి



💠 కాస్మిక్ లేదా ప్రాణిక్ లేదా లైఫ్ ఎనర్జీ అనేది మన చర్యలన్నింటికీ ఆధారం.

పరిస్థితులు మరియు విధులకు మన ప్రతిచర్యలు అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. 

మన నిద్రలో, మనం పూర్తి నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మరియు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరం కొంత మొత్తంలో విశ్వ శక్తిని పొందుతుందని మీకు తెలుసా?  

జ్ఞానాన్ని పొందేందుకు, క్రమబద్ధమైన సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ప్రాణిక శక్తి అవసరం.   ఈ జీవశక్తిని మనం ఎంతగా పొందితే అంతగా మన స్పృహను విస్తరించుకోగలుగుతాము.


💠 కొన్నిసార్లు మన స్వంత పెరట్లోని రత్నాలను కనుగొనడంలో విఫలమవుతాము. 

అటువంటి ప్రాణిక శక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ 

అందించే అపురూపమైన అలయమే బెంగళూరు డోములూర్ ప్రాంతంలో ఉన్న చొక్కనాధస్వామి గుడి.


💠 బెంగళూరు నగరంలోని డోమ్లూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం చొక్కనాథస్వామి లేదా చొక్కా పెరుమాళ్ అని పిలువబడే విష్ణువుకు అంకితం చేయబడింది.  

చోళ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో గర్భగుడిలో భూదేవి మరియు శ్రీదేవి సమేతంగా చొక్కనాథస్వామిగా పూజించబడ్డాడు.


💠 ఇది చోళ రాజుల కాలంలో తలైకాదుకు చెందిన తిరిపురాంతకన్ మరియు అతని భార్య చెట్టిచి పార్పతిచే నిర్మించబడిన బెంగుళూరులోని పురాతన దేవాలయంగా పరిగణించబడుతుంది.  

చొక్కనాథ అనేది శివునికి మరొక పేరు కానీ ఈ ఆలయంలో చొక్కా అంటే తెలుగులో అందమైనదని.

అందువల్ల, చొక్కనాథుడు విష్ణువును అందమైన భగవంతుడిగా సూచించడానికి ఉపయోగిస్తారు. 


💠 ఈ ఆలయంలో అనేక కన్నడ మరియు తమిళ శాసనాలు ఉన్నాయి, ఈ శాసనాల ఆధారంగా ఆలయం కనీసం 1200CE నాటిది.

ఆలయ శాసనాల ప్రకారం, ఆలయం ఉన్న డోమ్లూర్ ప్రాంతాన్ని పూర్వం తొంబలూర్ మరియు దేశిమాణిక్క పట్టణం అని పిలిచేవారు.


💠 పూర్వం ఒక మహర్షి చేసిన తపస్సు ఫలితంగా తూర్పు ముఖంగా ఉన్న చొక్కనాథ స్వామి ఆలయం నిర్మించబడింది. 

ఋషికి  విష్ణువు సూచనల ప్రకారం, ప్రజలు తమ చివరి క్షణాలలో భగవంతుని నామస్మరణను మరచిపోకూడదు, ఇది వాస్తవానికి దేవుని పాదాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.

ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వివాహం, ఆరోగ్యం, పిల్లలు, విద్య, శ్రేయస్సు మరియు ఉద్యోగ సమస్యల కోసం ప్రార్థిస్తారు.


💠ఈ ఆలయంలో గర్భగుడిలోని విగ్రహం ఎత్తులో ప్రతిష్టించబడి, అది విశ్వశక్తిని స్వీకరించి ఎనిమిది దిక్కులకూ ప్రసరిస్తుంది.  ఉత్తరాయణం మరియు దక్షిణాయణంలో కొన్ని రోజులలో సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ప్రధాన దేవతపై పడేలా విగ్రహాన్ని ఉంచడం జరుగుతుంది.


💠 బెంగుళూరులో ప్రాణిక్ ఎనర్జీ పాయింట్స్‌తో అన్ని దిశలలో హీలింగ్ ఎనర్జీని ప్రసరింపజేసే మొదటి ఆలయం ఇది. 

చతురస్రం లోపల నిలబడి, మందిరానికి అభిముఖంగా ఉండి, ఈ పాయింట్ల వద్ద విశ్వశక్తిని అనుభవించడానికి మరియు ప్రయోజనం పొందడానికి కనీసం 2 నిమిషాలు ప్రార్థించాలని నమ్ముతారు.  

10 సంవత్సరాల క్రితం రిటైర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పాయింట్లను కనుగొన్నారు.  


💠 ఆలయంలోని విష్ణువు, శ్రీదేవి మరియు భూదేవి దేవతలను నేపాల్‌లోని గండకీ నది నుండి తీసుకువచ్చిన శాలిగ్రామ శిలాల నుండి చెక్కారు.  

గర్భగుడి మరియు రెండు అర్ధమంటపాలను పక్కన పెడితే, దేవాలయంలోని ప్రతి ఇతర భాగం శతాబ్దాలుగా అనేక సార్లు పునర్నిర్మించబడింది మరియు అందువల్ల ఇప్పుడు చోళ నిర్మాణ శైలికి చాలా తక్కువ సారూప్యత ఉంది.  ఆలయ సముదాయంలోని ఇప్పుడు మూసివున్న భూగర్భ గదులు విలువైన వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించబడ్డాయి.


💠 ఒక స్తంభంపై, భక్తులు విష్ణువు యొక్క దశావతారాలు (10 రూపాలు) అందంగా చెక్కబడి ఉండటాన్ని చూడవచ్చు. 


💠 12మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్ రచించిన తిరుప్పావై ప్రతి సంవత్సరం ధనుర్మాస సమయంలో ఇక్కడ శ్రద్ధగా పాడతారు.  రామనవమి సందర్భంగా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పల్లకీ ఉత్సవాన్ని జరుపుకుంటారు.


💠 చొక్కనాథస్వామి ఆలయం దాని ప్రాణిక్ ఎనర్జీ పాయింట్లకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.  రెండు ప్రాణిక్ ఎనర్జీ పాయింట్లు ఆలయం లోపల ఉండగా వాటిలో 12 ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ప్రాంగణంలోని మచ్చలు తెల్లటి చతురస్రాలతో గుర్తించబడ్డాయి, ఇందులో భక్తుడు గుడి వైపు నిలబడి దేవుడిని ప్రార్థించాలి.

మనం నిద్రపోతున్నప్పుడు మనం పూర్తి నిశ్శబ్దం మరియు శాంతితో ఉన్నందున విశ్వశక్తి ప్రవాహాన్ని అందుకుంటాము.


💠 ఈ ప్రాణిక శక్తి మనకు జ్ఞానాన్ని పొందడంలో మరియు మన జీవితంలో క్రమశిక్షణను తీసుకురావడంలో సహాయపడుతుంది.  

ఈ ఆలయం సరిగ్గా అదే అందిస్తుంది.  

విగ్రహాల ముందు, మీకు కాస్మిక్ ఎనర్జీ పాయింట్లు ఉన్నాయి, అవి ధ్యాన బిందువు.  విగ్రహం అటువంటి దిశలో ఎత్తబడి ఉంటుంది, అది గరిష్ట మొత్తంలో సానుకూల ప్రాణిక్ శక్తిని ప్రసరిస్తుంది.

అంతర్యామి

 🔱 అంతర్యామి 🔱


# ప్రేమే దైవం 


🍁ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది.


వేదవాఙ్మయం అంతా ప్రేమనే ప్రబోధిస్తుంది. సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు కూడా చెబుతున్నాయి. శ్రీరాముడు సర్వులనూ ప్రేమించాడు. వారితో అనుబంధం పెంచుకున్నాడు. పశుపక్ష్యాదులనూ ప్రేమించాడు. అలాగే శ్రీకృష్ణుడు నమ్మినవారందరినీ ఆదుకున్నాడు. గోవులనూ ప్రేమతో కాపాడి గోపాలుడయ్యాడు. ప్రేమ భగవత్ స్వరూపం. ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నిస్వార్ధ సేవకు దారి చూపుతుంది. పరస్పర సహకారానికి పునాది వేస్తుంది. మనుషుల మధ్య సఖ్యతకు రెండక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తుంది


🍁నిజానికి మనిషిని మనిషిగా చూసేదే అసలైన ప్రేమ ప్రేమ నిండిన ఒక మాట గాయపడిన హృదయానికి సాంత్వన కలిగిస్తుంది. నిరాశ నిండిన మనసులో ఆశలు రేకెత్తిస్తుంది. ఆర్థిక సంబంధాలు, కులమతాలు, బాహ్యసౌందర్యం, ఆడంబరాలు... ఇలా దేనితోనూ సంబంధం లేకుండా. ఇచ్చిపుచ్చుకొనేదే నిజమైన ప్రేమ. అందుకే ప్రేమను పొందడం కాదు, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి.


🍁స్వచ్ఛమైన ప్రేమంటే ఎదుటివ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు. ఆ వ్యక్తి కష్టాల్లో, బాధలలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలగాలి. అదే మనిషికి కొండంత ఓదార్పున వి ఇస్తుంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా: అండగా ఉండేవారే స్వచ్చమైన ప్రేమను అందించే నిజాయతీపరులు. వారే అసలైన ప్రేమికులు. మనిషి ఆనందంగా, సజావుగా మనుగడ సాగించాలకున్నప్పుడు అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. మూగజీవుల పట్ల దయతో వ్యవహరించాలి. వాటికి ఆహారం పెట్టి. వాటి దాహార్తిని తీర్చాలి. అప్పుడే మనల్ని ప్రేమించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.


🍁పసిపాపలోని వెల్లివిరిసిన అమాయకమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటివారిపై చూపించగలిగితే ఈ మాయా మోహా జగత్తులో అజాతశత్రువులుగా మనగలుగుతాం. ప్రేమ జీవననావకు ఓ చక్కని చుక్కాని కాగలదు అంటారు పెద్దలు.


🍁ప్రేమ ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి. ఈ స్థితిని పొందినవారు తమకు అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేసే విశాల హృదయం కలిగి ఉంటారు. వారికి ఈ ప్రపంచంలో అందరిపట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. ప్రేమకు మరో రూపం దయాగుణం. బాధలలో ఉన్నవారిని కారుణ్యంతో ఆదుకుంటే అది వారి వేదనను దూరం చేస్తుందని బుద్ధుడు తన ం శిష్యురాలైన ఆమ్రపాలికి ఉపదేశిస్తాడు. ప్రేమంటే ఓ ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నీడను ఇచ్చినట్లుగా, ఏదీ ఆశించకుండా పువ్వు పరిమళాలు అందించినట్లుగా మనిషి కూడా దూషణ, భూషణ, తిరస్కారాలు లెక్కచేయకుండా అందరికీ ప్రేమను పంచాలి. సర్వజీవుల్లోనూ దేవుడున్నాడనే సత్యాన్ని గ్రహించాలి. తన ప్రేమను తోటి జీవులకు,

మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా

పశుపక్ష్యాదులకూ ప్రేమను అందించాలి. ప్రేమే దైవి

దైవమే ప్రేమ అని విశ్వసించాలి.🙏


-✍️ జై శ్రీ రామ్

కంచెర్ల వెంకట రమణ 


⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

శ్రీ రామ జయ రామ జయజయ రామ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ గరుడ పురాణము

 శ్రీ గరుడ పురాణము (132)


జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన


ముందుగా నక్షత్రాల కుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.


కృత్తిక - అగ్ని

రోహిణి - బ్రహ్మ

మృగశిర - చంద్రుడు

ఆర్ధ్ర - రుద్రుడు

పునర్వసు - ఆదిత్య

పుష్య - తిష్యుడు

ఆశ్లేష - సర్పుడు

మఘ - పితృగణాలు

పూర్వఫల్గుని - భగుడు

ఉత్తరఫల్గుని - అర్యముడు

హస్త - సవిత

చిత్ర - త్వష్ట

స్వాతి - వాయువు

విశాఖ - ఇంద్రాగ్నులు

అనురాధ - మిత్రుడు

జ్యేష్ఠ - ఇంద్రుడు

మూల - నిరృతి

పూర్వాషాఢ - శివుడు

ఉత్తరాషాఢ - విశ్వేదేవులు

అభిజిత్ - బ్రహ్మ

శ్రావణ - విష్ణు

ధనిష్ఠ - వసువులు

శతభిష - వరుణుడు

పూర్వాభాద్ర - అజపాదుడు

ఉత్తరాభాద్ర - అహిర్బుధ్ని

రేవతి - పూష

అశ్వని - అశ్వనీకుమారులు

భరణి - యమధర్మరాజు

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*29-03-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.

---------------------------------------

వృషభం


స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి.

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ధన లాభం. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.

---------------------------------------

సింహం


ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

తుల


సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం


బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి. 

---------------------------------------

ధనస్సు


దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

మకరం


బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కుంభం


చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సాక్షియగుచున్నాడు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో|| 

*ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః*

*ఆత్మైవ రిపురాత్మనఃl*

*ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ*

*కృతస్యాపకృతస్య చll*


                      ~మహాభారతమ్


తా|| "మంచిపని చేసినా, చెడ్డపని చేసినా మానవుడు తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షియగుచున్నాడు.

( *కావున శుభములుకోరు మానవుడు సత్కర్మలనే ఆచరించాలి* )

అప్పిచ్చు వాడు

 🤔🤔🤔👏👏👏👍👍👍🤣🤣🤣


అప్పిచ్చు వాడు వైద్యుడు!

కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!

తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!

కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుడు!

బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు!

వండి పెళ్ళామును మెప్పిచ్చు వాడు అసలు మొగుడు!

మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు! 

ముప్పూటా స్విగ్గీ తెప్పిచ్చువాడు భార్యా బాధితుడు!

ఇంట్లో ఉండీ లేడని చెప్పిచ్చువాడు దేశ ముదురుడు!

పాటకు లిప్పిచ్చు వాడు కథానాయకుడు!                       

పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు మేటి రాతగాడు!

ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!

ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!

అపద తప్పిచ్చు వాడు భగవంతుడు!

కాలము తీరినంత పైకి రప్పిచ్చు వాడు యమకింకరుడు, 

కదరా సుమతీ! 😳


*(వెంకటాద్రి ఆధునిక తవికావళి)*

*సేకరణ: మన ఆత్మీయ సభ్యులు శ్రీ జె. శశిమోహన్ గారి పోస్టు.*

అద్భుతమైన జీవితాన్ని

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹. *పాఠశాల పేరు: *LIFE*

*(మనందరి జీవితం)*

😁😆🤣😁😆🤣😁


 తరగతి: *40వ తరగతి*

  *(విద్యార్థులందరూ 40 ఏళ్లు పైబడిన వారే)*


 *కోపం* - ప్రెజెంట్ సార్

 *EGO* - ప్రెజెంట్ సార్

 *ఈర్ష*- ప్రజెంట్ సార్

 *ద్వేషం*-ప్రజెంట్ సార్

 *పోరాటం* - ప్రెజెంట్ సార్

 *అసూయ* - ప్రెజెంట్ సార్

 *రిగ్రెట్* - ప్రెజెంట్ సార్

 *ఆందోళన* - ప్రెజెంట్ సార్

 *విసుగు* - ప్రెజెంట్ సార్

 *కోరికలు* - ప్రెజెంట్ సార్

 *కోరికలు చంపబడ్డాయి* - ప్రెజెంట్ సార్

 *నిరాశ* - ప్రెజెంట్ సార్

 *చికాకు* - ప్రెజెంట్ సార్

 *నెలవారీ EMI* - ప్రస్తుతం సార్

 *ఆఫీస్ టెన్షన్* - ప్రెజెంట్ సార్

 *ఫ్యూచర్ టెన్షన్* - ప్రెజెంట్ సార్

 *సమస్య* - ప్రెజెంట్ సార్

 *హర్డిల్స్* - ప్రెజెంట్ సార్

 *వర్రీస్* - ప్రెజెంట్ సార్

 *సమస్యలు* - ప్రెజెంట్ సార్

 *అనిశ్చితాలు* - ప్రెజెంట్ సార్

 *విమర్శ* - ప్రెజెంట్ సార్

 *అత్యాశ* - ప్రెజెంట్ సార్

 *అహంకారం* - ప్రెజెంట్ సార్

 *హాఫ్ నాలెడ్జ్* - ప్రెజెంట్ సార్

 *సంతోషం* -

 ??? ( నిశ్శబ్దం)

 *సంతోషం* -

 ???

 *సంతోషం* - గైర్హాజరు సార్

 *మనశ్శాంతి* - గైర్హాజరు సార్

 *కంటెంట్‌మెంట్* - గైర్హాజరు సార్

 *పూర్తి జ్ఞానం* - గైర్హాజరు సార్

 *విస్డమ్* -

 దారిలో సార్

 *ప్రేమ* - నిద్రపోతున్నాను సార్

 *ఆశ* - వదిలేస్తున్నాను సార్

 *హుషారు*- రావడం లేదు సార్

 *ఉత్సాహం*- ఉండడం లేదు సార్ 

 *ఓర్పు* - పోయింది సార్

 *ఉదారత* - పోగొట్టుకున్నాను సార్

 *నిజాయితీ* - లాస్ట్ సర్

 *కృతజ్ఞత* - లేదు సర్

 *నమ్మకం* - పోయింది సర్

 *విధేయత* - లాస్ట్ సర్


 ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి & సానుకూలమైనవి ఎందుకు లేవు?


 *క్లాస్ టీచర్:* - "ఎందుకంటే జీవితం యొక్క ఉద్దేశ్యం ఎప్పటికీ ఉండదు. అది నిర్ణయించబడిన వెంటనే, మార్గంలో ముళ్ళు గులాబీల రేకులుగా మారుతాయి."


 జీవితం జీవించడం చాలా సులభం, కానీ చాలామంది సాదాసీదాగా ఉండటాన్ని కష్టతరం చేస్తారు.


 " *టేక్* *ఇట్* *ఈజీ* *మేక్* *ఇట్* *ఈజీ*. .

*సేకరణ:- శ్రీ కె.వి. రమణ మూర్తి గారి పోస్ట్.*

 *అద్భుతమైన జీవితాన్ని గడపండి.😁😂😂😂

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 110*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*హోమ విధి - అగ్ని కార్య కథనము - 4*


పిమ్మట అర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోనిముద్ర చూపవలెను. అగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుంమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇధ్మవ్రశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీపాత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; లధోముఖములగా నున్న సృకస్రువములు. ప్రణీతయుందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. 


ప్రణీతను నీటితో నింపి, భగవద్థ్యానము చేపి, దానిని అగ్నికి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షీణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్నికుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధులను ఉంచవలెను. 


పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

శతరుద్రీయము-24*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-24*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ద్వితీయానువాకము - 6వ యజుస్సు*


*నమకనామాని : ఓం క్షేత్రాణాంపతయే నమః*


*నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః !*


సంసారమునకు మూలకారకుడును మరియు దానికి అంతమును కలుగజేయు వానికి నమస్కారము, జగత్తును రక్షించు ప్రభువునకు నమస్కారము.

 

*వివరణ :*

*భవస్యహేతి: 🔱*


*1. భవము అనగా ప్రేయోమార్గము* (సంసారము)♪. తిరిగి తిరిగి మనలను ఇక్కడకు ఈడ్చేటువంటి శక్తి♪. దానిని తొలగించువాడు ఈశ్వరుడు♪. 


భాగవతంలో ఒకచోట *“తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛా మ్యనుగ్రహమ్”* అని చెబుతారు♪. అనగా ఎవరు తన అనుగ్రహాన్ని కోరతారో వారి సంపదలను భ్రంశము చేయడం ద్వారా వారిని ముక్తి మార్గంవైపు నడిపిస్తాను అని♪.


హేతి అంటే ఆశ అని మనం ఇదివరకు తిరిగి గుర్తుతెచ్చుకుంటే ఇక్కడ ఆయన శ్రేయోమార్గమునకు లక్ష్యముగా మారి ప్రేయోమార్గమందలి మన బంధనాలను ఛేదించుతాడు♪.


మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు!

మామేవైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే!!

                     -భగవద్గీత 18-65 


మనస్సు నాలో ఉంచు! నా భక్తుడివి కా! నన్ను ఆరాధించు! నాకు నమస్కరించు. నన్నే పొందుతావు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞచేసి చెబుతున్నాను♪.


నమస్కారమునకు భగవానుడు ఎంత విలువనిచ్చాడో మనకు పై శ్లోకంలోని మొదటి పాదం చెబుతుంది♪. భగవద్గీత మొత్తంలో *“మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు”* అన్న పాదం మొత్తమూ రెండుసార్లు పునరుక్తి అయింది♪. 

                            -- (9-34, 18-65).


ఇచ్చట అర్జునునితో తనకు నమస్కరించమన్నట్లుగా (నమస్కురు) పరమాత్మ ఉపదేశించారు♪. పైగా సత్యమన్నట్లుగా నొక్కి పలికారు♪. 


ఇక్కడ సాధకుడు చేస్తున్నది అదే. *"భవస్య హేత్యై నమః”* అనగా “స్వామీ! నిస్సహాయతకు లోనయి ఈ సంసార వృక్షమందు చిక్కుపడి వున్నాను, నీకు నమస్కరించుచున్నాను” అని అర్థం♪.


*2. జగతాం పతయే నమః : 🔱*


జగత్తు అనగా నిరంతరం కదిలేది (గచ్ఛతి) అని స్థావరజంగమాత్మకమైనది అని అర్థములు వస్తాయి♪. సంసారము అనేది ప్రపంచము వున్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ సంసారమును ఛేదించు అస్త్రముగా ఆయన వున్నాడు♪. ఇది ఈ మనుష్య లోకమునకు సంబంధించిన విషయము♪. 


కానీ, మనం పురాణాలు చదువుతూ వుంటే దేవతలకు కూడా కష్టములు వస్తాయన్నట్లుగానూ వారిని రక్షించువాడు ఈశ్వరుడే అన్నట్లుగానూ మనకు అర్థమవుతుంది♪. కాబట్టి ఇక్కడ తననూ, దేవతలనుగూడా రక్షించు స్వామిగా సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు♪.


(రేపు....... 7 వ యజుస్సు                              


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0023 


*1-59*

*ఆర్ద్రాంత్ర తంత్రీ గహనో వికారీ పరిపాతవాన్‌* 

*దేహః స్ఫురతి సంసారే పోఽ పి దుఃఖాయ కేవలమ్‌* 


తడిసిన ప్రేగులు, నాడులచే భయంకరమైనదియు, అనేక వికారములతో గూడినదియు, క్షణభంగురము నగు దేహ మెయ్యది యీ ప్రపంచమున స్ఫురించుచున్నదో, అదియు కేవలము దుఃఖము కొరకే యగును.


*1-60*

*తాత సంతరణౌర్థేన గృహీతాయాం పునః పునః* *నావిదేహలతాయాం చ కస్య స్వాదాత్మభావనా*


మునీంద్రా! సంసారమను సముద్రమును దాటుటకై మరల మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమను నౌకయం దెవనికి ఆత్మ భావన యుండగలదు? (దేహము ఆత్మ (తాను) కాదనుట). 


*1-61*

*మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే* *మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ* 


మాహాత్మా! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె - నేను మాంసము, 

నరములు,ఎముకలచే నిర్మింపబడిన అదృఢ శరీరమునందున్నాను. ఇద్దానినుండి బయటపడు ఉపాయవాక్యమును వినే వీలు కలుగుటలేదు.


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 71-72*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।*

*నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।*


*భావము:* 

ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి, అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.

 

. 🍂🍃🍂🍃


*ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।*

*స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।*

 

*భావము:* 

ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వాదం

 వేద ఆశీర్వాదం. 




28, మార్చి 2024, గురువారం

నరాల్లో కణుతులు

 మెదడు నరాల్లో కణుతులు ఏర్పడి వచ్చు మూర్ఛలు కొరకు నివారణా యోగం - 


        వావిలి ఆకు రసం , కస్తూరి , వెల్లుల్లిపాయ రసం కలిపి ముక్కులో వేయుచున్న శాశ్వతంగా కణుతులు కరిగిపోయి మూర్చలు తగ్గిపోతాయి. 


మోతాదు 4 నుంచి 5 చుక్కలు . 


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నందనవనంతో సమానం.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥ *క్రోధో వైవస్వతోరాజా|*

      *ఆశా వైతరణీనదీ।*

       *విద్యా చ కామధుక్ ధేనుః|*

      *సంతుష్టో నందనంవనం॥*


               _- *నందనవనం* -_


భావం : 

కోపం యమునితో సమానం.

ఆశ వైతరణీనదితో సమానం.

విద్య కామధేనువతో సమానం.

సంతోషం నందనవనంతో సమానం.

{ *విద్య అనే "కామధేనువు పాలు" త్రాగిన జీవితం సుఖశాంతులతో గడుస్తుంది*....}

కర్మ సిద్ధాంతం

 కర్మ సిద్ధాంతం-19 (యమస్మృతిలోని కథ)

ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారు అని మనం వింటూ ఉంటాము. అయ్తే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా మనకు వెరొకరి కర్మ అంటుకుంటుంది. అందుకు సంబంధించిన కథ ఒకటి యమస్మృతిలో కనిపిస్తుంది.

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే గొల్ల అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. తన్ ప్రాణ రక్షణ కోసం చేస్తున్న పోరాటంలో పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు ఆ పెరుగును తన ఇంట పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులకు ఆహారంలో వడ్డించగా వారు మృత్యువాత పడ్డారు.

ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పు అని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు.

ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి.

చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. నివేదనకు భోక్తలు మరియు అథిదులకు పెట్టే అన్నం ముందే రుచి చూడరు. అది సహజ ధర్మం. అలా చూస్తే ఎంగిలి దోషం వస్తుంది. కనుక బ్రాహ్మణుడు తన ధర్మం నిర్వర్తించాడు. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి?

ఏమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు.

కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా (మరియు మనం చూడకుండా ఎవరో చెప్పింది విని) వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపములో భాగము మనకు పంచుతారు. ఇది యమధర్మరాజు చేసిన నిర్ణయము, శాస్త్రాము. కనుక గాలిమాటలు, పుకార్లు, చాడీలు చెప్పేవారు, ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకున్నవారు తస్మాత్ జాగ్రత్త! మీకు ఎవరి పాపం అంటుకుంటోందో ?! 

To be continued ....

27, మార్చి 2024, బుధవారం

Sr citizens in TIRUMAL


 

తుమ్ము శుభ సూచకం

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే । వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్” ।


తా𝕝𝕝 కూర్చునే సమయంలో..

పడుకునే సమయంలో..

దాన సమయంలో..

భోజన సమయంలో..

వస్త్ర సంగ్రహ సమయంలో..

వివాద సమయంలో..

వివాహ సమయంలో..


ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం.

జ్ణాపకశక్తి

 కాలానికి,కర్మకు జ్ణాపకశక్తి ఎక్కువ...ఎంత కాలం తర్వాత అయినా మనం చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు...నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడూ సందేహించకు...ఎందుకంటే అది నీ ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది...మేలు చేసిన వారికి కీడుచేసేవారు,భోజనం పెట్టిన వారిని దూషించేవారు,విద్య నేర్పినవారిని హేళన చేసేవారు,ఉపకారం తలపెట్టినవారికి అపకారం తలపెట్టేవారు,నాకు అన్నీ తెలుసు ఇక నేను నేర్చుకోవలసినది ఏమీలేదు అని అనుకునేవారు..."పరమ మూర్ఖులు"...దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది.గొప్ప వ్యక్తిత్వం గల వారు మౌనంగానే ఉంటారు.వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి...సాయంచేసే గుణంలోని పరమార్ధాన్ని గ్రహించి ఇతరులకు సహాయపడితే అంతులేని ఆత్మ సంతృప్తి మిగులుతుంది...

అంతర్ముఖులం

 *అంతర్ముఖులం కావాలి!*

                ➖➖➖✍️


*ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.*


*ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.*

*ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......*


*బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.*


*తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.* 


      *ఆ భక్తుడు సరేనన్నాడు.*


*ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.*


*ఆశ్చర్యం ......! దాని నుండి నిధి ఒక బయటపడింది.*


*వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.*


*అవన్నీ అతడి సొంతమయ్యాయి.*


*మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.*


*అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.*


*కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.*


*నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.*


*దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు.*


*అతడికి దేవుడు సమాధానం చెబుతూ...  “నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.”*


*”అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి!” అన్నాడు దేవుడు.*


*వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!*✍️

26, మార్చి 2024, మంగళవారం

Panchaag


 

గణపతి మనకు ప్రసాదించుగాక.

 ౭శ్లోకం:☝️

*ప్రారంభే లఘుశిఖరం*

  *జ్ఞానం మోదకసదృశం |*

*విస్తీర్ణం తు ప్రజానాయ*

  *ప్రజ్ఞాం దేహి గజానన ||*


భావం: జ్ఞానం మోదకం లాంటిది, మొదట్లో చిన్న శిఖరం (చివర) మాత్రమే కనిపిస్తుంది, నేర్చుకునే కొద్దీ అది విశాలమవుతుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సినది ఎంతో ఉందనిపిస్తుంది. అలాంటి అపారమైన జ్ఞానాన్ని పొందే ప్రజ్ఞని గజవదనుడైన గణపతి మనకు ప్రసాదించుగాక.🙏

అలాగే కర్మ

 ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా,


 భర్తగా,....


సంతానంగా,....


తల్లిదండ్రులుగా,....


మిత్రులుగా,....


 నౌకర్లుగా,....


ఆవులు,.... గేదెలు,.....కుక్కలు.....


 ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. 


ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,.....


మరణించడమో జరుగుతుంది.  


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే.....


 మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


-- మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా,.....


లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో.....


మన సంపాదనతో పోషించబడే భార్యగా,.....


 సంతానంగా,......


మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


-- ద్వేషం కూడా బంధమే....


పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా.....


 లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


-- మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి.....


ఈ జన్మలో శత్రువులుగానో,.....


 దాయాదులుగానో,......


ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి......


ఈ జన్మలో మిత్రులుగానో,......


సహాయకులుగానో ఎదురవుతారు. వి. ఎస్. మూర్తి 


ఉదాహరణకు ఒక జరిగినకథ:-


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర....


 అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు.


ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.


 కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ,


రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...


పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. VSM


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


ఒకసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,.....


ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే, 


పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు.


అప్పుడు మలయాళ స్వామి వారు *...


”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె.....


వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!” అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.


మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో,


 మర్యాదకో, కృతజ్ఞత గానో,


గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో....


 ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. 


కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం,


 పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం,....


ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  


అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో,...


 అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.


అలాగే కర్మ ఎంత పెద్దదైనా,....


 చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.


కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా......


అరుణాచలశివ 🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  -‌   ప్రతిపత్ - హస్త -‌‌ భౌమ వాసరే* (26.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మానవ శరీరం మాత్రం

 *శరీరం కర్మలు చేసే ఒక పరికరం*


*పునర్విత్తం పునర్మిత్రం* 

*పునర్భార్య పునర్మహి*

*ఏతత్సర్వంపునర్లభ్యం*

*న శరీరం పునఃపునః।।*


 🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 


🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      

         

🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.


🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 


పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*


అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.


 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.


 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.


 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.

ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.


 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.


జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.


పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.


*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*

ఉండేది ఒక్క *మనుష్యులకే.*


వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.

కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.


*అతిగా తిన్నా,*

*అతిగా ఆలోచించినా,*

*అతిగా సుఖించినా,*

*అతిగా దుఃఖించినా,*                    

*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*. 


ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 


కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

                                   

*దీనికి*

 

*సత్యం,* 

*ధర్మం*,

*శాంతి*,

*ప్రేమ,*

*అహింసలను*


 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*


*విస్తరాకు*


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 

బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.* తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.


*మనిషి జీవితం కూడ అంతే*

 *'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,


విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,


*విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన, తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*


*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""*     *జారవిడుచుకోకూడదూ* 


మల్లీ ,

ఇంకొకసారి,

ఎప్పుడో చేయవచ్చు

అనుకొని వాయిదా వేయకండి, 

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, *కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*


*ఎంత సంపాదించి ఏమి లాభం ?*


*ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?*


*మన చేత* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 

*మంచి జరిగితే,* 

*మన మానవ జన్మ సార్థకమయినట్లే ........*.👏🙏సర్వేజనా సుఖినోభవంతు🙏

25, మార్చి 2024, సోమవారం

Panchaag

 


శరీరంలో ధాతువులు

 శరీరంలో ధాతువులు విపరీత పరిమాణంలో వృద్ది చెందుట వలన కలుగు దుష్పరిమాణాలు - 


   మనిషి శరీరంలో అన్ని రకాల ధాతువులు సమానముగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అయ్యి ఉంటాడు. ఆయా ధాతువులు హెచ్చుతగ్గులు సంభవించినపుడు కొన్ని విపరీత పరిణామాలు సంభవించి శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఇప్పుడు మీకు ధాతువులు విపరీత పరిమాణంలో పెరుగుట వలన శరీరంలో కలుగు మార్పుల గురించి వివరిస్తాను.


 * రసధాతు వృద్ది లక్షణాలు - 


       గుండె యందు ఒకరకమయిన వికారం కలిగి వాంతి కలుగును. నోట నీరు కారుతుంది .


 * రక్తధాతు వృద్ది లక్షణాలు - 


        శరీరం ఎర్రబారుతుంది. నేత్రాలు ఎరుపెక్కుతాయి. రక్త సిరలు వంగినట్టుగా ఉంటాయి.


 * మాంసధాతు వృద్ది లక్షణాలు - 


        పిరుదులు , తొడలు, పెదవులు , గుహ్యభాగం , దౌడలు , చేతులు , పిక్కలు బాగా లావెక్కుతాయి. శరీరం బరువెక్కును.


 * మేధోదాతు వృద్ది లక్షణాలు - 


        శరీరం చమురు పూసినట్టు అవుతుంది . పొట్ట పక్క బాగాలు పెరిగిపోతాయి. దగ్గు వచ్చును. చిన్న పనిచేసినను అలసట వచ్చును. శరీరం నుండి చెడువాసన వచ్చును.


 * అస్థిధాతు వృద్ది లక్షణాలు - 


       కొత్త ఎముకలు పుడతాయి. మాములుగా ఉండవలసిన దంతాల కంటే ఎక్కువ దంతాలు జనిస్తాయి. వెంట్రుకలు , గోర్లు విపరీతంగా పెరుగుతాయి.


 * మజ్జాధాతు వృద్ది లక్షణాలు - 


       సర్వ శరీర అవయవాలు , నేత్రాలు బరువెక్కుతాయి. వ్రేళ్ల సందుల యందు తీవ్రంగా కురుపులు లేస్తాయి . 


 * శుక్రధాతు వృద్ది లక్షణాలు - 


       శుక్రం అధికంగా వెలువడును. శుక్రశ్మరీ అనురోగం వచ్చును. శుక్రశ్మరీ అనగా విపరీతంగా పెరిగిన శుక్రం రాయి వలే మార్పుచెంది శుక్రనాళాలలో అడ్డుపడి నొప్పి వచ్చును.


 * పురీషధాతు వృద్ది లక్షణాలు - 


       ఉదరం నందు వాయవు బందించబడి ఉబ్బరం కలుగును. శబ్దములు వెలువడును. ఉదరం నందు పోట్లు పుట్టును . ఉదరం బరువుగా ఉండును.


 * మూత్రవృద్ధి లక్షణాలు - 


       మూత్రస్రావం అధికం అగును. తరచుగా మూత్రవిసర్జన కు వెళ్లవలసి వస్తుంది. మూత్రాశయంలో పోటు మరియు మూత్రాశయం ఉబ్బినట్టు అగును.


 * స్వేదవృద్ధి లక్షణాలు - 


       అతిగా చెమట పట్టుట, చర్మం దుర్గంధం వచ్చును. చర్మం నందు జిల పుట్టును .


 * ఆర్తవవృద్ధి లక్షణాలు - 


        ఋతురక్తం అధికం అయ్యినచొ ఒక విధమైన బాధ కలుగును. రక్తం వృద్ది అవ్వడం చేత శరీరంలో వాతం సంచరించుటకు అవరోధం కలిగి శరీరాంగాలలో బాధ , పోటు జనించును. అలా విపరీతంగా స్రవించిన రక్తం దుర్గంధపూరితంగా ఉండును.


 * స్తనవృద్ధి లక్షణాలు - 


         స్థనములు విపరీతంగా లావు పెరుగుతాయి . పాలు అధికంగా స్రవించును . స్థనముల యందు తీపి మరియు పోటు కలుగును.


        పైన ధాతువులతోపాటు శరీర భాగాలలో అతివృద్ధి సంభవించినపుడు కలుగు సమస్యల గురించి వివరించాను. 


         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034