14, మార్చి 2025, శుక్రవారం

గరుడ పురాణం_*10వ

 *గరుడ పురాణం_*10వ భాగం*


_*దేవపూజా విధానం - వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ:-*_


_రుద్రదేవా! ధర్మార్థకామమోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి:_


ఓం నమః సూర్యమూర్తయే ।

ఓం హ్రాం హ్రీం సః  సూర్యాయనమః ।

ఓం సోమాయ నమః ।

ఓం మంగలాయ నమః |

ఓం బుధాయ నమః ।

ఓం బృహస్పతయే నమః ।

ఓం శుక్రాయ నమః ।

ఓం శనైశ్చరాయ నమః ।

ఓం రాహవే నమః ।

ఓం కేతవే నమః |

ఓం తేజశ్చండాయ నమః ।


_ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి._


_*శివపూజను ఇలా చేయాలి :*_

_ఓం హ్రాం శివాయనమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం హ్రాం శివమూర్తియే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః!, ఓం హ్రీం శిరయే స్వాహా! ఓం హ్రూం శిఖాయై వషట్ / ఓం హ్రీం కవచాయ హుం | ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం హ్రః అస్త్రాయ నమః / అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత_


ఓం హ్రాం సద్యోజాతాయ నమః ।

ఓం హ్రీం వామదేవాయ నమః |

ఓం హ్రూం అఘోరాయ నమః ।

ఓం హ్రీం తత్పురుషాయ నమః ।

ఓం హౌం ఈశానాయ నమః ।

_అనే మంత్రాలతో ఆయన పంచముఖాలనూ పూజించాలి._


_*ఇలాగే విష్ణుదేవుని పూజించునపుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి. ఆ తరువాత*_


ఓం వాసుదేవమూర్తయే నమః|

ఓం అం ఓం నమోభగవతే వాసుదేవాయ నమః ।

ఓం ఆం ఓం నమోభగవతే సంకర్షణాయ నమఃl

ఓం అం ఓం నమోభగవతే ప్రద్యుమ్నాయ నమః | 

ఓం అః ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః ।


_*అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు*_


ఓం భూః ఓం నమోభగవతే వరాహాయ నమః |


ఓం నారాయణాయ నమః । ఓం తత్సద్ బ్రహ్మణే నమః | ఓం హ్రూం విష్ణవే నమః । 

ఓం క్రౌం నమోభగవతే నృసింహాయనమః । 

ఓం కంటం పంశం వైన తేయాయ నమః । 

ఓం జం ఖం రం సుదర్శనాయ నమః | 

ఓం ఖంఠంఫంషం గదాయై నమః । 

ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః । 

ఓం ఘం ఢం భం హం శ్రియై నమః । 

ఓం గండం వంసం పుష్యై నమః । 

ఓం ధం షం వంసం వనమాలాయై నమః । 

ఓం సం దం లం శ్రీ వత్సాయ నమః । 

ఓం ఠం చం భం యం కౌస్తుభాయ నమః |

ఓం గురుభ్యో నమః |

ఓం ఇంద్రాది భ్యోనమః ।

ఓం విష్వక్సేనాయ నమః । 

_*అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి.*_


_శంకర దేవా! విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీ దేవి ప్రముఖమైనది. ఆమెనూ మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి._


ఓం హ్రాం హృదయాయ నమః । ఓం హ్రీం శిరసే నమః ।

ఓం హ్రూం శిఖాయై నమః ।

ఓం హ్రీం కవచాయ నమః ।

ఓం హౌం నేత్రత్రయాయనమః ।

ఓం హ్రః అస్త్రాయ నమః ।


_*సరస్వతీ దేవి యొక్క యెనిమిది శక్తులైన శ్రద్దాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.*_


ఓం హ్రీం శ్రద్ధాయై నమః ।

ఓం హ్రీం బుద్ద్యై నమః |

ఓం హ్రీం కలాయై నమః ।

ఓం హ్రీం మేధాయై నమః |

ఓం హ్రీం తుష్యై నమః ।

ఓం హ్రీం పుష్యై నమః ।

ఓం హ్రీం ప్రభాయై నమః ।

ఓం హ్రీం మత్యై నమః ।


_*తరువాత క్షేత్రపాలునికీ, గురువుకీ, పరమ గురునికీ ఈ మంత్రాలతోపూజలు చేయాలి.*_


ఓం క్షేత్రపాలాయ నమః ।

ఓం గురుభ్యో నమః ।

ఓం పరమ గురుభ్యో నమః ।


_*తరువాత సరస్వతీదేవికి కమలవాసినీ రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.*_

కామెంట్‌లు లేవు: