14, మార్చి 2025, శుక్రవారం

లక్ష్మి జయంతి

 *లక్ష్మి జయంతి* 

శ్రీ లక్ష్మీ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం. శ్రీమద్భాగవతంలోని క్షీరసాగర మథనం ఘట్టంలో శ్రీలక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన ఉంది. క్షీరసాగర మథనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం.  

శ్రీమహాలక్ష్మీ దేవిని పూజిస్తే సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటుండదు. అందరూకోరేది లక్ష్మీదేవి కృపనే. మానవాళికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించే సిరుల తల్లి. విష్ణు పురాణం (వ్యాస విరచిత) ప్రకారం , లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. వీరికి ముందుగా పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ చేసిన తఫః ఫలంగా భ్రుగు మహర్షి, ఖ్యాతిలకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది. ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది.

శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజును శ్రీలక్ష్మి జయంతి జరుపుకోవాలి. సంవత్సరం 14వ తేదీ శుక్రవారం నాడు లక్ష్మి జయతి వచ్చింది. ఈ రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేయాలి. ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్నచోటనే లక్ష్మినివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజామందిరంలో శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో, గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం గంధం, కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి. గులాబీలు, తామరపూలు, మారేడు దళాలతో పూజిస్తూ శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి.ఐ విధంగా పూజ పూర్తి చేసుకొని ఉపవాస నియమములు పూర్తిచెయ్యాలి. పౌర్ణిమ ఘడియలు పూర్తి అయ్యేలోపు పూజ చెయ్యాలి. చింతా గోపీశర్మ సిద్ధాంతి. @9866193557

కామెంట్‌లు లేవు: