14, మార్చి 2025, శుక్రవారం

ప్రియ బాంధ వా మేలుకో 9*

 *ప్రియ బాంధ వా మేలుకో 9*


ప్రియ బాంధవా మేలుకో అను శీర్షికన వచ్చే వ్యాసాలన్నీ అతి సాధారణ మరియు సామాజిక మౌలిక అంశాల పైననే సాగుతున్నవి, ఇవన్నీ ఎరుగని వారెవ్వరు అని సభ్యులు మధన పడవచ్చును. ఈ వ్యాసాల వలన ప్రత్యేకంగా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని గూడా సభ్యులు అభిప్రాయపడవచ్చును. 


సభ్యుల అభిప్రాయంలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలనుకున్నవారికి...భక్తి, ముక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, వేద, పురాణ ఇతిహాస, ఆధ్యాత్మిక, చారిత్రక, జ్యోతిష్య, వాస్తు, వ్యాకరణ, తర్క, మీమాంస, సాహిత్య, సంగీత, నాట్య శాస్త్ర, వైజ్ఞానిక, పరిశోధన లాంటి సవాలక్ష అంశాలుండగా, ప్రతి దినం వార్తలలో చూసే *తల బొప్పి కట్టే* అంశాలనే అమూలాగ్రంగా మళ్ళీ మళ్ళీ సభ్యులకు అందించడంలో *ఔచిత్యం మేమిటను* ప్రశ్న గూడా ఉత్పన్నంగావచ్చును. 


సభ్యులకు కుండే పాతిక, ముప్పది whatsapp గ్రూప్ లలో కాలక్షేప forward లు, video లను మినహాయిస్తే...

గత దశాబ్ద కాలంగా పెద్దలు సభ్యులకందించే... వేద, పురాణ, ఇతిహాస, భారత, భాగవత, రామాయణ కావ్య భాగాలు...మరియు జ్ఞానవంతులైన పెద్దలు సమకూర్చిన *త్రేతా, ద్వాపర యుగం నాటి జీవన విధానాలపై పరిశోధానాత్మక వ్యాసాల* లో ఒక్క *వైజ్ఞానిక వ్యాసాలు తప్ప* మిగతావన్ని కూడా ప్రజల వ్యక్తిగత జీవితాలపై మాత్రమే ప్రభావం చూపి, వారి వారి వ్యక్తిగత జీవన వైశిష్ట్యాలకు *మాత్రమే* తోడ్పడుతున్నాయని సామాజిక రచయితల విశ్లేషణ.


భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరములు, గణతంత్ర పాలన వచ్చి 76 సంవత్సరములు, ఇంకా ఎంత కాలం ప్రజలు ముఖ్యంగా మేధావులు...గిరి గీసుకుని తమ తమ *వ్యక్తిగత* వ్యాసంగాలకే పరిమితమై, కట్టుబడి ఉంటారు. సంఘ జీవులమైనందున *నీతిదాయక, పారదర్శక సమాజాన్ని ఏర్పర్చుకుందాము* అను భావన సర్వత్రా రావల్సి ఉన్నది. నేను, నా కుటుంబము, నా సంపద, నా క్షేమము మాత్రమే అను *స్వార్ధపుటాలోచనలకు చరమ గీతం* పాడవలసిన సమయం ఆసన్నమైనది. విశ్రాంత జీవనయానంలో ప్రవేశించిన మేధావులు తక్షణ కర్తవ్యులై *సాంఘీక, రాజాకీయ, దేశ ఆర్థిక క్షితికి కారణమయ్యే క్షుద్రులను చట్టం మరియు ప్రజా చైతన్యం ద్వారా క్రియా హీనులను, క్రియా శూన్యులను చేయాలి*. 


ప్రజా చైతన్యము మరియు ఐక్యతనే దుష్టులకు సింహ స్వప్నము.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: