14, మార్చి 2025, శుక్రవారం

వర్ణాశ్రమ ధర్మములు

 వర్ణాశ్రమ ధర్మములు అని ఎప్పుడూ అంటూ ఉంటాము. వర్ణ ధర్మములు వేరు-ఆశ్రమ ధర్మములు వేరు, నాలుగు వర్ణాలుగా సమాజము వారి వారి స్వభావాలను బట్టి విభాగము చేసినది. ఎవరు ఎక్కడయినా ఉండవచ్చు. అక్కడ గుణమే ప్రధానము, అనేక సందర్భాలలో భగవంతుడైన కృష్ణుడు గుణ ధర్మ విభాగాలు చెప్పాడు. అందరికీ ఈ విషయము తెలిసినదే. బ్రాహ్మణునిలో శూద్రుడు ఉండవచ్చు. శూద్రునిలో బ్రాహ్మణుడు ఉండవచ్చు. గుణములను బట్టి ఎక్కడ ఎవరైనా ఉండవచ్చు. అక్కడ గుణమే ప్రధానము. 


కానీ, ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పడినది? అంటే, ఉదాహరణకు ఒక బ్రాహ్మణునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బ్రాహ్మణుడయే ప్రయత్నము చెయ్యాలి. దానిని పోగొట్టుకొనకూడదు. చిన్నప్పటి నుండి వానిని చట్టము frame లో బిగించి ఉపనయనాది సంస్కారములు చేసి, బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణునిగా తయారవటానికి, భ్రష్టుడు కాకుండా ఉండటానికి, మనము ప్రయత్నము చేస్తున్నాము. అయిన వాడు శూద్రుడు కావొచ్చు, రాక్షసుడు కావొచ్చు. 


సద్గురు శ్రీ శివానందమూర్తి గారు

సంగీత విద్య, పేజీ: 119

శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వరంగల్

కామెంట్‌లు లేవు: