శా.రక్షం గూర్చు గరిష్ఠ సూక్తులను సంరంభమ్ముతోఁ జెప్ప నా
దక్షుల్ మాదు సమస్యలన్నిటిని సద్భావమ్మునం దీర్తురౌ
అక్షయ్యమ్మగు సంపదాళిగననౌ నంచున్ మదిన్ నమ్మినన్
భక్షింపం గన నెంచు మూర్ఖుల సహింపన్ భావ్యమా! భారతీ ! ౹౹ 83
చ.మతము సతమ్ము మానవుల మానస మందున నిల్చిపోయి యు
న్నతిని సమైక్యతన్ గన జనమ్ము ముదమ్మగు నర్థ సిధ్ధి నొం
ది తర తరమ్ములం బ్రగతిఁ దీర్చగ మేలగుఁ గాని క్రూరతన్
బ్రతి నిమిషమ్మునం బగలు ఱంపిల జేయ హితమ్మె భారతీ!౹౹84
(ఱంపిల జేయు=వ్యాపింప జేయు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి