హోళి.. ఆనందకేళి...
సీ..
నిటలాక్షు నయనాగ్ని నిబిడమై నిలువంగ
కాముని దహనంబు కల్గెనేడు
ఆరుశత్రువులను నాలోభమోహముల్
క్రోధకామాదులన్ కూల్చెనేడు
స్వఛ్ఛమానసముల జాతిహర్షముతోడ
ఆనందమధురిమలయ్యె నేడు
రంగురంగులతోడ రమ్యరీతులతోడ
ఆటపాటలతోడ నలరెనేడు..
తేగీ..
అదియె కాముని పున్నమి యరయనేడు,
సుఖములెల్లెడ, బడయగ శోభగనుచు
శుభములెయ్యెడ,గనగాను సోకుమీర
హోళి పండుగ యలరారె నుత్సుకతగ ,
హోళి యానందకేళిరా!!ఉర్వినేడు..
.శుభాకాంక్షలతో....
రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి