14, మార్చి 2025, శుక్రవారం

రంగుల పండుగ ( హోళీ )*

 🌹🦜🙏🏽🦜🌹

  14.03.2025

     శుక్రవారం 


 *అంశం ..రంగుల పండుగ ( హోళీ )* 


 *తేటగీతి మాలికలు..* 


రంగురంగుల సంసృతిన్ రంగరించి

చెలిమియుప్పొంగ మిత్రుల చెంతజేరి

జాతియావత్తు హోళీని జరుపుకొనగ

సామరస్యము విరసిల్లు సంఘమందు !..


మనిషి మనుగడలోనున్న మర్మమిచట

వివిధ రంగుల భావముల్ విశదబరచి

మంచి చెడులను లెక్కించి మనసుపెట్టి

ధర్మపథమున బయనింప దారిజూపె!.


హంగు, రంగుల జీవన పొంగులోన 

పుట్టి మునుగగ తప్పదు ముందుముందు!

కాన, నొడలు దగ్గరబెట్టి కదలిసాగ

గతుకు, గుంతలఁ బడకుండ బ్రతుకుసాగు!!

......................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

కామెంట్‌లు లేవు: