ఓం
శారద సంధ్య ; సానుతల శాద్వల కోమల భూమి ; పక్షి సం
చారము మింటి త్రోవ కొనసాగుచు నుండె ; మృదంగ నిస్వన
స్పార లయాలనుబద్ద మృదంగ తరంగిణి పొంగె ; దివ్య మం
దార మధు స్రవంతిక విధాన - బరాబరి సేయ తుమ్మెదల్
సీ || ప్రకృతి వధూటిక పటునితంబ ములుగా
సికతాతలమ్మున చెన్నుమీర !
నవకళా కల్యాణి వివిధ సంపదలుగా
తరులతా కుంజ సంతతులు మెఱయ !
రమణీయ రసరమా లలితోరు కుచములై
పసిడిఛాయల గుండ్లు మిసిమిదేర
నృత్యసరస్వతీ నీలాల నెరికురుల్
సెలయేటి పాయలై చిందులాడ
రమ్య వనరమా నవరత్న రాగ చలిత
మంజు మంజీర మేఖల మధురమధుర
కంకణ స్వర్ణ కింకిణీ కల రవమ్ము
లీల - శుకపిక భ్రమర శారికలు పలుక.
'( నా అమలిన శృంగార కావ్యములోనిది ) బాబు దేవీదాస శర్మ '
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి