14, మార్చి 2025, శుక్రవారం

శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం -

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     91వ దివ్యదేశము 🕉


🙏శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం -

తిరు నీర్మలై, 

 చెన్నై 🙏


⚜ ప్రధాన దైవం: నీర్‌వణ్ణన్ స్వామి

⚜ ప్రధాన దేవత: ఆణిమామలర్ మంగై తాయార్

⚜పుష్కరిణి: మణికర్ణిక పుష్కరిణి

⚜ విమానం:తోయగిరి విమానము

⚜ ప్రత్యక్షం: తొండమాన్ చక్రవర్తి, మార్కండేయుడు, భృగు మహర్షి.


🔔 స్థల పురాణం 🔔


💠 తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. ఇది వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది.


💠నీర్ మలై పర్వతముపై వెలసియున్న శ్రీ మహావిష్ణువు నాలుగు రీతులలో దర్శనమిచ్చును .

1. నిలిచియున్న మూర్తి 

2. ఆసీన మూర్తి

3. శయన మూర్తి

4. త్రివిక్రమమూర్తి 


💠 వాల్మీకి మహర్షి శ్రీ మహావిష్ణువును ఈ నాలుగు రీతులలో దర్శించుకొని పర్వతము దిగి క్రిందకు చేరినంతనే - శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా , శ్రీదేవి సీతాదేవిగా , ఆదిశేషుడు లక్ష్మణునిగా , శంఖచక్రములు భరతశతృఘ్నులుగా , విఘ్నేశ్వరుడు సుగ్రీవునిగా , గరుడుడు హనుమాన్‌గా దర్శనమిచ్చిరి . 

ఈ విధముగా అనేక రూపములలో దర్శించుకొని అర్చించుకొను భాగ్యమును పెరుమాళ్ మనకు అనుగ్రహించి యున్నాడు . 


💠తిరుమంగై ఆళ్వారు ఈ క్షేత్రాన్ని పెరుమాళ్ ను దర్శించుకొనుటకై వచ్చి , నీర్ మలై పర్వతము చుట్టు నీరు నిండి యుండిన కారణమున 6 మాసములు వేచి యుండి నీరు తగ్గిన తరువాత పర్వతము పైకి పోయి పెరుమాళ్ ను దర్శించుకొని సేవించెను .


💠 మూలవిరాట్ -

1. నిలిచియున్నమూర్తి తూర్పు ముఖముగా నీర్వళర్ పెరుమాళ్ భృగు మహర్షి , మార్కండేయ మహర్షి , వాల్మీకి , తొండై మానులకు ప్రత్యక్షము ; 

2. ఆసీన మూర్తి - నరసింహస్వామి . 3. శయనమూర్తి - ఆదిశేషునిపై దక్షిణ ముఖముగా రంగనాథుడు ( మాణిక్యశయనము ) , 

4. త్రివిక్రమ మూర్తి - త్రివిక్రమన్ . 


💠 పుష్కరిణిలు : 

నిలిచియున్న మూర్తికి కారుణ్య పుష్కరిణి ,

 శయన మూర్తికి క్షీర పుష్కరిణి , ఆసీన మూర్తికి స్వర్ణ పుష్కరిణి , త్రివిక్రమమూర్తికి సిద్ధ పుష్కరిణి

కలవు . 

  

💠 విమానములు :

 శ్రీరంగనాథునికి రంగ విమానము , నరసింహునికి శాంత విమానము , త్రివిక్రమునకు తోయగిరి విమానము గలవు .


💠తిరునీర్మలై ఆలయం ఒక చిన్న కొండపై ఉంది .


💠 ఈ దివ్య దేశాన్ని "తోయగిరి క్షేత్రం" అని కూడా అంటారు మరియు దీనిని "తోతాద్రి" అని కూడా అంటారు.

 తోయా అంటే "నీరు" మరియు అధిరి అంటే "పర్వతం" (మలై). 

కొండ చుట్టూ ఒకప్పుడు నీరు ఉండేది కాబట్టి, ఈ ప్రదేశానికి "తిరు నీర్మలై" అని పేరు పెట్టారు.  


💠ఇక్కడ ఈ ఆలయంలో, పాత మర్రి చెట్టు ఉంది. ధూమం అంటే "రాహు".

ధూమకేతు గణపతిగా పిలువబడే వినాయకుడు, ఈ చెట్టు కింద సప్తకానికతో పాటు కనిపిస్తారు. సంతాన హోమం..( బిడ్డ కోసం ప్రార్థిస్తున్న హోమం), భక్తులచే చతుర్థి రోజున మీరు రాహు కాలంలో ఈ గణపతిని పూజిస్తే, ఇక్కడ వినాయకుడిని ప్రార్థించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయని, పిల్లలు పుడతారు అని నమ్ముతారు. 


 

🙏 జై శ్రీమన్నారాయణ 🙏

కామెంట్‌లు లేవు: