14, మార్చి 2025, శుక్రవారం

హోలీ

 హోలీ 

 ******             

రంగుల పండుగ హోలీ

రమ్య మైన పండుగ హోలీ!

వసంత రాణి నాహ్వానించే

వర్ణ భరిత సోయగం హోలీ!

ఇంద్ర ధనుస్సు లోని రంగులన్నీ

ఇల కురిసే రోజు హోలీ!

బృందావనమున కృష్ణుడు

రాధా సమేతుడై 

డోలోత్సవ క్రీడ లాడిన రోజు హోలీ!

అగ్ని పునీత హోలిక

పుడమి జనులచే 

పూజ లందెడు రోజు హోలీ!

భర్గుని చూపుకు కాముడు

భస్మమైన రోజు హోలీ!

కామ దహనము జరిగి

కాముని పున్నమయ్యెను హోలీ!

పండు వెన్నెలందు జనులు

వర్ణ భేదములు మరచి

పరవశమొందుచు

వసంత క్రీడలాడు రోజు హోలీ !

కృషి జీవుల అలసట దీర్చి

ఉల్లాసమును, ఉత్సాహమును

నింపే పండుగ హోలీ !

సహజ రంగులు వాడినచో

ఆరోగ్యము నిచ్చును హోలీ !!

     పల్లావఝల వెంకట శైలజ, విజయవాడ.

కామెంట్‌లు లేవు: