☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విష్ణు సహస్రనామ స్తోత్రము*
*రోజూ ఒక శ్లోకం*
*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్లోకం (75)*
*సద్గతిః సత్కృతిః సత్తా*
*సద్భూతిః సత్పరాయణః ।*
*శూరసేనో యదుశ్రేష్ఠః* *సన్నివాసః సుయామునః ॥*
*ప్రతి పదార్థం:~*
*703) సద్గతిః : - సజ్జనులకు సరైన మార్గము చూపించు వాడు; సత్కార్యములు ద్వారా పొందదగిన వాడు.*
*704) సత్కృతిః : - మనోహరమైన, సత్ఫలితాలను ఇచ్చే, గొప్ప పనులు చేసేవాడు;*
*705) సత్తా - 'సత్' అయినవాడు. ఉనికి అనే భావానికి మూర్తి; తానొక్కడే అయినవాడు;*
*706) సద్భూతిః : - సజ్జనులకు, సాధువులకు సమస్త బంధువర్గము తానే అయినవాడు; గొప్ప యశస్సు, వైభవము కలవాడు; పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.*
*707) సత్పరాయణ: - సజ్జనులకు అండ అయినవాడు; సజ్జనులకు, తత్వవిదులకు పరమగతి అయినవాడు.*
*708) శూరసేనః : - గొప్ప శూరులు తన సేనగా కలవాడు; శూరత్వము గల సైనికులు గలవాడు.:*
*709) యదుశ్రేష్ఠ: - యాదవులలో శ్రేష్టుడు, గొప్పవాడు.*
*710) సన్నివాసః : - 'సత్' నకు నివాసం, 'సత్' యందు నివసించేవాడు; సజ్జనులకు సాధువులకు, నిలయమైన వాడు.*
*711) సుయామునః : - సజ్జనులైన యమునా తీర వాసులచే పరివేష్ఠింప బడినవాడు.*
*తాత్పర్యము:~*
*సత్పురుషులకు గతియగువాడును, గొప్ప కర్మలు చేసినవాడును, తానొక్కడు మాత్రమే ఉన్నవాడును, గొప్ప మంచి విభూతులతో నిండి ఉన్నవాడును, సత్పురుషులకు నిలయమైనవాడును, శూరులగువారు తన సేనలయందున్న వాడును, యాదవులందు శ్రేష్టుడును, సజ్జనులకు నివాసమైనవాడును, సజ్జనులైన యమునా తీర వాసులచే పరివేష్ఠింప బడినవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*
*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సూచన*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*మూల నక్షత్రం 3వ పాదం జాతకులు పై 75వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఓం నమో నారాయణాయ!*
*ఓం నమః శివాయ!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి