🌹. చంద్రవిద్యా🌹
మనువు తరువాత శ్రీ విద్యను ఉపాసించిన వాడు చంద్రుడు.
కనుక ఈ శ్రీవిద్యను చంద్రవిద్యా అన్నారు. చంద్రునివి పదహారు కళలు అంటే షోడశ కళలు.
షోడశీ విద్య అనగా చంద్రవిద్యయే. అదే శ్రీవిద్య. సుధాంశుడు కనుక చంద్రుడు సోముడయ్యాడు.
తన అమృతధారలతో సృష్టిని పోషించేవాడు సోముడు.
స ఉమా, సోమ అని భావం. ఉమతో కూడిన శివుడు కూడా సోముడు.
కనుక శివుడు, ఉమా ఇద్దరి అంశా కలసిన శక్తి చంద్రుడు.
అందువలన చంద్ర విద్యా అంటే, శివ శక్తి సమ్మేళనం.
ఈ రెండూ కలిస్తేనే, సృష్టి, ఈ రెండూ కలిస్తేనే పూర్ణత్వం.
అటువంటి శివశక్తి సమ్మిళితమైన, ఆ చంద్రవిద్య కు వందనం. 🌹
🌹చంద్రమండలమధ్యగా 🌹
చంద్రుడంటే శివ శక్తి సమ్మేళనమైనప్పుడు, ఆ చంద్రమండలమే శ్రీ చక్రము.
ఆ శ్రీచక్రమధ్యంలో బిందురూపిణివలె అమ్మ దీపించుచున్నది.
అందుకే ఈ నామంలో అమ్మను చంద్రమండలమధ్యగా అన్నారు.
సహస్రారము చేరిన తరువాత శివ శక్తి సమ్మేళనము జరిగి షోడశకళలూ ప్రకాశవంతమవుతాయి.
అపుడు ఆ మండలం మధ్యలో శ్రీలలిత జ్వాజ్వల్యమానంగా దర్శనమిస్తుంది.
ఈ సర్వ జగత్తూ చంద్రాగ్నులచే నిండి వున్నది కనుక దీనిని అగ్నిషోమాత్మకం అంటారు.
శివుడు స్వయముగా తాను అగ్ని యొక్క శిరోభాగములో ఉంటే,
అమ్మవారు చంద్రుని యొక్క శిరోభాగములో వున్నదని చెపుతాడు.
శివుడు, శక్తి ఇద్దరూ కలిసి ఈ అగ్నిసోమములుగా జగత్తంతా వ్యాపించి వున్నారు.
చంద్రునిలో షోడశకళలూ అమ్మ నుంచి సంక్రమించినవే.
చంద్రమండలమే తానై, ఆ మధ్యలో విరాజిల్లుతున్న, ఆ చంద్రమండలమధ్యగ కు వందనం.🌹
🌹చారురూపా🌹
చారు అంటే, సుందరము, రమణీయము, లావణ్యము అని అర్ధం.
ఈ నామంలో అమ్మవారు అందమైన రూపము కలది అని చెప్పుకుంటున్నాం.
మనోహరమైన రూపము కలది ఆ శ్రీలలిత. ఆ రూప లావణ్యానికి అవధులు లేవు, పోలిక లేదు.
అటువంటి సుందర కమనీయమైన రూపము ఆ లలితాపరమేశ్వరిది.
చంద్రునికి అందము, ఆకర్షణ లలితాదేవి నుంచి వచ్చినవే.
ఒకసారి ఆ రాజరాజేశ్వరి ఆకర్షణకు లోనైన వారు తిరిగిపోలేరు.
ఒకసారి శ్రీవిద్య లోని మాధుర్యాన్ని, రమణీయతను రుచి చూచిన వారు అమ్మను వదలరు.
అందమైన లావణ్యలతిక, ఆ చారురూప🌹. చంద్రవిద్యా🌹

అందమైన లావణ్యలతిక, ఆ చారురూపఆపస్తంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు.
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు.
దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది.
ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.
సేకరణ కు వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹 కు వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి