ఓం శ్రీ మాత్రే నమః
3-3-26
హోళికా పర్వము
హోళీ పర్వము హేళికా యనునదే యుక్తంబుగా మానవుల్
కేళిన్ మిత్రుల తోడ సంబరములన్ క్రీడించుచున్ మైత్రి సం
బాళింపన్ గనుచున్ వసంతునికి ఆహ్వనమ్ములన్ పల్కి గా
నాలాపంబుల మన్మథున్ ప్రకృతి సమ్యక్ దృష్టి ప్రార్థింపనౌ ||1
వేసవిలో వసంత ఋతువే రమణీయము మానవాళికు
ల్లాసము గూర్చు నీ ప్రకృతి లాస్యములన్ తిలకింప చిత్తమం
దాసలు చుట్టుముట్టి పులకాంకురముల్ గను మేను ఇట్టి ఆ
వాసములన్ సృజించు భగవానుని అక్షరు లీలలెన్నెదన్ ||2
కాముడు జీవ కోటి యెద కామ్యపు కాంక్షల సృష్టి సేయు, ఆ
కామితముల్ కనన్ తగు వికారములన్ సృజియించు చుండినన్
కోమలమైన భావముల కూర్మి మనోరథ సిద్దిగా పరం
ధాముని ధర్మ బద్ధ సుపథమ్ముల వర్తిలు చుండగా వలెన్|| 3
మిత్రులందరికీ హోళీ మహోత్సవ పర్వ దిన శుభాకాంక్షలూ నమస్సులతో
మీ
డా.రఘుపతి శాస్త్రుల
విశ్రాంత ప్రాచార్యులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి