3, మార్చి 2026, మంగళవారం

ప్రతిరోజూ పరీక్షయే CB

 ప్రతిరోజూ పరీక్షయే 

విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయితెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకు గలవాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత  సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా రోజు పాఠం రోజే చదివి అవగాహన  పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు

సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అవి ఏమిటో చూద్దాము

1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది 

తామాస ప్రవ్రుత్: తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే అవరోధంనీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు. నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఉరుమొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదుఅంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా 

రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా  రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలిసాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారునిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి  ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారం కానీ సాత్విక్ ఆహరం కాదు

తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంతవరకు తొందరగా నిద్రకు  ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు

ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి రెండిటి చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగులు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు చేసుకోవటం విలువైన ఆభరణాలు ధరించటం చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి సనానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు

తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి  ఉండటం. ఇది చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి

వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలని వ్యామోహం పెంచుకోకూడదు. శరీరానికి సంబంధించి నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లేకానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం

ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం  లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవుఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారుఅక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయివారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన రోజు సాగాడు. ఇక పొతే రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక  వేస్తున్నారు. శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయినీవు వారితో పోరాడ లేవుఅధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి

అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ కోవకు వస్తాయి ఇన్ని అవరోధాలను దాటితే కానీ నీవు సాధన చేయలేవు

సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహంనిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని విగ్న్యులు చెపుతారుకానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో  మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా

సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ప్రశ్నకు కూడా అవును అని  చెప్పలేము. రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారువారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు

నిజానికి సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా వుంది ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమేలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు

నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయివాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును  మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిఁ 

మీ 

భార్గవ శర్మ

 

 

కామెంట్‌లు లేవు: