3, మార్చి 2026, మంగళవారం

గ్రహణ ఆచరణ

 ✨గ్రహణ ఆచరణ లేదు

పగటిపూట చంద్రగ్రహణం ఉన్నందున ఎటువంటి ఆచరణ లేదు. కేవలం మోక్షస్నానం చేస్తే సరిపోతుంది.

అందువల్ల ఎవరూ గాబరా పడి శాంతి మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు.

🔅అహ్ని చాంద్రం న దర్శనం, రాత్రౌ న దర్శనం సౌరమ్ ।

అగోచరే తు నైవాస్తి స్నాన-దాన-జపాదికమ్ ॥

పగటిపూట చంద్రగ్రహణం దర్శనమవదు. అలాగే రాత్రిపూట సూర్యగ్రహణం దర్శనమవదు. కనుక కంటికి కనిపించని (అగోచరమైన) ఇటువంటి గ్రహణాలకు స్నానం, దానం, జపం, తపస్సు వంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు.

ఈ విషయమై ధర్మసింధు మరియు నిర్ణయసింధు గ్రంథాలలో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది:

🔅గ్రహణం న భవేత్ రాత్రౌ భానోః, చంద్రస్య చాహని |

తదదృష్టిర్న దోషాయ తస్మాత్ స్నానం న కారయేత్ ||

రాత్రిపూట సూర్యగ్రహణం ఉండదు, అలాగే పగటిపూట చంద్రగ్రహణం ఉండదు (అంటే కనిపించదు). అవి దర్శనమవకపోవడంతో ఎటువంటి దోషం లేదు. కాబట్టి ఆ సమయంలో గ్రహణస్నానం, సూతకాలు చేయకూడదు.

🔅స్పర్శకాలే యదా సూర్యః చంద్రో వా నైవ దృశ్యతే |

తదా న సూతకం ప్రోక్తం మునిభిః తత్త్వదర్శిభిః ||

గ్రహణ స్పర్శకాలంలో (ఆరంభ సమయంలో) సూర్యుడు లేదా చంద్రుడు కనిపించనట్లయితే, తత్త్వజ్ఞానులైన మునులు ఎటువంటి సూతకాన్ని విధించలేదు.

✨గ్రస్తోదయ

గ్రహణం పట్టి ఉన్నప్పుడే సూర్యుడు లేదా చంద్రుడు ఉదయిస్తే దాన్ని “గ్రస్తోదయ” అంటారు. అంటే మనకు గ్రహణ ఆరంభం కనిపించదు, కానీ మధ్య భాగం లేదా అంత్యం కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో సూర్యుడు/చంద్రుడు ఉదయించి దర్శనమైన క్షణం నుండి సూతకం ప్రారంభమవుతుంది. గ్రహణ మోక్షం (అంత్యం) అయిన తరువాత స్నానం చేయాలి.

అందువల్ల ఈ గ్రహణానికి సంబంధించిన ఆచరణ కేవలం మోక్షకాల స్నానం మాత్రమే.

పూజ – శాంతి – హోమ మొదలైన వాటితో మోసపోవద్దు. ప్రస్తుతం కొన్ని మాధ్యమాలలో దీనిని ఒక వ్యాపారంగా మార్చిన విషయం విచారకరం. అందుకే ఈ సూ1195010481చన ఇస్తున్నాము.

కామెంట్‌లు లేవు: