1, జూన్ 2026, సోమవారం

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*67. యస్త్వయాద్య కృతః ప్రశ్నో వరీయాంఛాస్త్రవిన్మతః*


*సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞ్యాతవ్యశ్చ ముముక్షుభిః*


*పదవిభజన :*

*యః + త్వయా + అద్య - కృతః - ప్రశ్నః + వరీయాన్ + శాస్త్రవిన్మతః - సూత్రప్రాయః + నిగూఢ + అర్థః + జ్ఞాతవ్యః + చ - ముముక్షుభిః*


*భావము :*

*శిష్యా ! నీవు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమమైనది. శాస్త్రపారంగతులచే సూత్రప్రాయమూ, నిగూఢార్థమూ అని కొనియాడబడినది. ముముక్షువులు తప్పక తెలుసుకోదగినది.*


*వివరణ :*

*అద్యః = ఇప్పుడు ; వరీయాన్ = ఎంతో శ్రేష్టమైనది*; 

*శాస్త్రవిన్మతః = మంచి శాస్త్రజ్ఞనము కలవారు మాత్రమే ఈ విధముగా ప్రశ్నించగలరు. శాస్త్ర పారంగతులచే పొగడబడినది ;*

*సూత్రప్రాయః = బంధమోచక సాక్షాత్కారము కలగటానికి ఏమేమి ప్రశ్నించాలో, అది అంతా కొద్దికొద్ది మాటలలో ప్రశ్నించబడినది.*

*నిగూఢార్థో = శబ్దం అల్పాక్షరమైనా, తెలుసుకొన వలసిన విషయమంతా దీనిలో నిగూఢమై ఉన్నదని భావము.*

*ముముక్షుభిః = ముముక్షువులందరూ తెలుసుకోవలసిన మార్గం చూపినవాడవని గురువుచే శ్లాఘింపబడినవాడు.*

*ఈ విధంగా మెచ్చుకుంటే, భక్తిశ్రద్ధలతో నిండిన మనస్సుగలవాడై, చెప్పిన విషయాన్ని శిష్యుడు వెంటనే గ్రహిస్తాడని గురువు యొక్క అభిప్రాయం.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: