1, జూన్ 2026, సోమవారం

శ్రీమన్నారాయణీయము

  *శ్రీమన్నారాయణీయము*


*86వ దశకము - సాల్వాదుల వధ - భారత యుద్ధము - 11వ శ్లోకము*


*316. ధర్మౌఘం ధర్మసూనోరభిదధదఖిలం* 

*ఛందమృత్యుస్స భీ‌ష్మః*


*త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కలబ్రహ్మభూయమ్*


*సంయాజ్యాథాశ్వమేధైస్త్రిభిరతిమహితైర్ధర్మజం పూర్ణ కామం*


*సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే ! పాహి మాం సర్వరోగాత్*


*భావము :*

*స్వామీ ! భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణించేటట్లు తన తండ్రి వలన వరాన్ని పొంది వున్నాడు. అతడు ధర్మరాజునకు అంపశయ్యపై నుండియే అనేక ధర్మాలనెరిగించాడు. ఆతరువాత, పరమాత్మవైన నిన్ను చూస్తూ మిక్కిలి భక్తిచేత స్తుతించి, అతడు నీలో ఐక్యమొందాడు. తరువాత, నీవు ధర్మరాజుచే మహిమాన్వితములైన మూడు అశ్వమేధయాగాలను చేయించి, అతని కోరికలన్నీ తీర్చి, ద్వారకానగరానికి తిరిగివచ్చావు. అటువంటి గురువాయూరు పతీ ! నా రోగాలన్నింటినీ పోగొట్టి నన్ను రక్షించు.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: