10, జూన్ 2026, బుధవారం

నిజం కనిపిస్తుంది

 *మనం అనుకుంటూ ఉంటాం మనవాళ్ళు ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని!


*కానీ ఇలలో ఎవరినెవరూ కూడా ఉద్ధరించేదేదీ ఉండదు.


*నిజానికి ఏ ఒక్కడూ వేరొకరికి హాని చేసేందుకు కానీ ఉద్ధరించేందుకు కానీ శక్తి గలవాడు కానేకాదు.


*కర్మఫలమే ఆ విధముగా అన్నింటికీ కారణమౌతుంది.


*మనం ఈ లోకంలోకి వచ్చినది మన కర్మఫలాన్ని అనుభవించడానికే తప్ప వేరెవరినో ఉద్ధరించడానికి కాదు.


*వేరే ఎవరూ మనలను కూడా ఉద్ధరించేది లేదు.


*ఈ విషయమై మనం భ్రమ చెంది భగవంతుని విడచిపెట్టి జన్మను భ్ర్రష్టపరచుకుంటున్నాం. 


*నిద్రలో చూసేది కేవలం కల్పితమే కదా!! నిద్ర నుండి మేల్కున్నపుడే నిజం కనిపిస్తుంది.

కనుక..

*ఇంతవరకునూ నిద్రించినది చాలు!. ఇకనైనా మేల్కొందాం. సత్యాన్ని గ్రహిద్దాం. సత్యనారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. జన్మను సార్థకం చేసుకుందాం. సుఖశాంతులతో జీవనం సాగిద్దాం.

.

కామెంట్‌లు లేవు: