*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*
*శ్లోకము - 07*
*నయంతీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే*
*సృజంతీ లౌహిత్యం నఖకిరణచంద్రార్ధఖచితా ।*
*కవీంద్రాణాం హృత్కైరవవికసనోద్యోగజననీ*
*స్ఫురంతీ కామాక్ష్యాః చరణరుచిసంధ్యా విజయతే ॥*
*భావము :*
*పద్మముల యొక్క కాంతిని తిరస్కరిస్తూ, కేవలము తన పాదనఖములనుండి అరుణారుణ కాంతులను ప్రసరింపచేస్తూ, కవుల మానస సరోవరములో కలువలను పూయిస్తూ, కామాక్షీ దేవి పాదముల కాంతులు ప్రకాశిస్తున్నాయి.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి