2, ఏప్రిల్ 2026, గురువారం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 1 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣8️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *182 వ రోజు*                   

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


*చతుర్ధాశ్వాసం*```


సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలసి విరాటనగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించలేక పోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. 

గవాధ్యక్షుడు “ఉత్తరకుమారా! కుఱు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకు పడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి” అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమపరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్యపరాక్రమాల గురించి చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను రక్షించండి” అని ప్రార్ధించాడు.```


*ఉత్తరకుమారుని ప్రగల్భాలు*```


గవాధ్యక్షుని పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగి పోయాడు. 

"గవాధ్యక్షా! నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారథి లేడు కదా! అందుకని బాధగా ఉంది. సమర్ధుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య,అశ్వద్దామలను నేను చేసే యుద్ధంతో అర్జునిని తలపింప చేసి ఆలమందలను విడిపించకుంటే నాతండ్రి నాపరివారం నన్ను మెచ్చుతారా. ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకు పోతారు. వెంటనే తగిన సారథిని వెతకండి” అన్నాడు. 


ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తర కుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునిని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. 


అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుక పరచుకొనే సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి "నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యం ఉంది. పూర్వం అర్జునినికి సారథ్యం వహించి అతనికి ఖాండవ వనదహనంలో సహాయం చేసి అతని ప్రశంశలందు కున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు” అన్నాడు. 


ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుని “అమ్మా! మన రాకుమారుడు సారథి కొరకు వెతుకు తున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. ఖాండవ వన దహనంలోను ఇతర సమయాలలోను అర్జునునికి సారథిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి చెప్పు” అన్నది.

```           

              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: