16, ఫిబ్రవరి 2026, సోమవారం

వాగర్థావివ సంపృక్తౌ

  శ్లో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!


వాగర్థావివ = వాక్కు, అర్థముల వలె, సంపృక్తౌ = కూడియున్న

వారును, జగతః = ఈ జగత్తునకు, పితరౌ = తల్లి దండ్రులును

అయిన, పార్వతీ పరమేశ్వరౌ = పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ =

వాక్కుల, అర్థముల, ప్రతిపత్తయే = సంప్రాప్తి కొఱకు , వందే =

నమస్కరిస్తున్నాను.


అర్థం: మాటలు, వాని అర్ధముల ఙ్ఞానము కొరకు, వాటి వలెనే

ఎప్పుడూ కలిసియుండెడి, జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ

పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను.


మహాకవి కాళిదాసు 'రఘువంశం' కావ్యానికి మొదట ఈ

మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి

పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని

ఆ మహాకవి అన్నాడు. 

ఇదేవిధంగా శంకర భగవత్ పాదులు కూడా 'మాతా చ

పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ

స్వదేశో భువనత్రయమ్' అని ఒకచోట నిర్ధారించారు.

*సేకరణ*

కామెంట్‌లు లేవు: