16, ఫిబ్రవరి 2026, సోమవారం

నమశ్శివాయ.. సాంబాయ..*

 


*నమశ్శివాయ.. సాంబాయ..*

            *శాంతాయ.. పరమాత్మనే.*

                  ➖➖➖✍️


*సాంబా... అని పిలిస్తే చాలు... శివుడు వెంటనే కరిగిపోతాడు.* 


*మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...*


*”నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...*

*య ఇదం కీర్తయేన్నిత్యం* *శివసాయుజ్యమాప్నుయాత్”* 


*అనే మంత్రాన్ని ఉపదేశించారు.*


*ఇది శివపురాణంలో కూడా వస్తుంది.*


*ఇది చాలా గొప్ప మంత్రం.* 


*నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.*


*నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.*



*1). నమశ్శివాయ...*


*(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం.*

*శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.*


*అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం. పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.*



*2). సాంబాయ...*


*అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.*


*3). శాంతాయ...*


*ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం.*

*జీవితానికి కావలసింది కూడా శాంతమే.*

*"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే"*

*అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.*


*4). పరమాత్మనే నమః...*


*చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం..!*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: